
త్వరలోనే తాత కాబోతున్న హీరో
టాలీవుడ్ హీరో, అనంతపురం జిల్లా హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరలోనే తాత కాబోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి భార్యాభర్తలన్న విషయం తెలిసిందే. వారికి త్వరలోనే తొలి సంతానం కలగబోతోంది.
చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాలు బ్రాహ్మణి సీమంతం వేడుకను కూడా చాలా ఘనంగా నిర్వహించాయి. కాగా, ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన బాలకృష్ణ.. తాను తాత కాబోతున్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. మనవలు, మనవరాళ్లు వస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంటుందని, తాను తొందర్లోనే తాత అవుతున్నానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.