బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. కేవలం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ లో చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ , నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బాలయ్యకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు' అని తమన్ అడిగారు. అందుకు సమాధానంగా వారిద్దరినీ చాలా గారాబంగానే పెంచానంటూ ఆయన అన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి మణిరత్నం నుంచి వచ్చిన సినిమా ఛాన్స్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. 'గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్‌గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను. నా ముఖం అంటూ సమాధానమిచ్చి వెళ్లిపోయింది.
అవునూ.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్లీ చెప్పాను. ఫైనల్‌గా తనకు అలాంటి ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే, తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ నటించేది. ఆ సమయంలో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తుంది. ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మిణికే' అని బాలయ్య అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ సంగీతం అంటే చాలా ఇష్టమని అదే వేదికపై బాలకృష్ణ అన్నారు. దర్శకులలో బాబీ, బోయపాటి శ్రీను ఇద్దరూ ఇష్టమేనని ఆయన తెలిపారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలో జరగనుంది. అక్కడే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment