
పొలిటికల్ ఎంట్రీపై నారా బ్రహ్మణి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ : తన రాజకీయ రంగప్రవేశంపై మంత్రి నారా లోకేశ్ సతీమణి నారా బ్రహ్మణి క్లారీటీ ఇచ్చారు. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, తన దృష్టి అంతా హెరిటేజ్ వ్యవహారాలపైనే అని ఆమె స్పష్టం చేశారు. ఉత్తర భారతదేశంలో అయిదు హెరిటేజ్ ప్రాజెస్ యూనిట్లు ప్రారంభించనున్నట్లు తెలిపారు. 2022 కల్లా హెరిటేజ్ రూ.6వేల కోట్ల టర్నోవరే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బ్రహ్మణి వెల్లడించారు. ప్రస్తుతం బ్రహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు.
కాగా బ్రహ్మణి రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున ఆమె పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మణి తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. అలాంటి ఆలోచన కూడా తనకు లేదని ఆమె వెల్లడించారు. దీంతో చాల కాలంగా బ్రహ్మణి రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడ్డట్టు అయింది.