సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రహ్మణికి ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ తాతయ్యను వెన్నుపోటు పొడిచిందెవరు?’ ‘మీ తాతయ్యను చెప్పుతో కొట్టిందెవరు?’ ‘చంపిందెవరు?’.. వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారు?.. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతాంటూ బ్రహ్మణికి సవాల్ విసిరారు పోసాని.
బ్రాహ్మణి మాటలు వింటే జడ్జి మీద కూడా కేసులు పెట్టాలేమోనని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది కూడా ప్రజల కోసమే అంటే ఎలా అని పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను కొన్నది కూడా ప్రజల కోసమేనా అంటూ చరుకలంటించారు. అవినీతి పనులు చేస్తే ఎవరినైనా జైల్లోనే పెడతారని అన్నారు. చంద్రబాబు 17 సార్లు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకున్నాడని, దేశంలో ఎవరికీ ఇన్ని స్టేలు తెచ్చుకున్న చరిత్ర లేదని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపరుడని ప్రధాని మోదీనే చెప్పారని గుర్తు చేశారు.
చదవండి: Live: చంద్రబాబు కేసు అప్‌డేట్స్..
‘ఏ దిక్కైనా వెళ్లండి బాగుపడతారు. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి. దివంగత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచావు.. ఒప్పుకోవు. ఎన్టీఆర్‌ను చంపావు.. ఒప్పుకోవు. జైల్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఏడాదో.. ఏడాదిన్నరో ఉండొచ్చు కదా. జైల్లో ఉండి ర్యాలీలు, ధర్నాలతో నీకేం పని. దోమల మందు.. మంచి దోమ తెర కొనిపెడతా. రెండు ఏసీలు కొనిపెడతా తీసుకెళ్లి జైల్లో చంద్రబాబుకి ఇవ్వండి అన్నారు పోసాని.
నంది అవార్డులు గతంలో పంచుకునేవారని అందరికీ తెలుసు. ఆ కాంపౌండ్‌కు రెండు, ఈ కాంపౌండ్ కు రెండు వెళ్లేవి. ఎలా అంటే అలా పరిగెత్తేవి. నేను ఉన్నంతకాలం అర్హులకే నంది అవార్డులు వస్తాయి. నంది అవార్డులపై ప్రశ్నిస్తే అప్పటి పెద్దలు నన్ను బ్యాన్ చేశారు. నాకు టెంపర్ సినిమాకు నంది అవార్డు ఇస్తే రిజెక్ట్ చేశా. నిస్పక్షపాతంగా నంది అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. ఒక్క తప్పు చేసినట్లు చూపించినా రిజైన్ చేసి వెళ్లిపోతా ’ అని పోసాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment