ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం పుత్రోత్సాహం కుదిపేసి ఉంటుంది. కుటుంబ ఆస్తుల పేరిట నోటికొచ్చిన లెక్కలు చెప్పిన పుత్రరత్నాన్ని చూసి... తాను రెండెకరాలతో మొదలెడితే తన వారసుడు రెండాకులు ఎక్కువే చదివాడని ఉప్పొంగిపోయి ఉంటారు. తాము చెప్పిందల్లా ప్రచారం చేయటానికి నాయక గణం, అనుకూల మీడియా ఉంటే ఉండొచ్చు. కానీ జనం సైతం దాన్ని పిచ్చిగా నమ్మేస్తారన్న ఈ తండ్రీకొడుకుల నమ్మకమే అన్నిటికన్నా హైైలైట్. మాట తప్పకపోవటమంటే ఏంటన్నది వీళ్లనే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో పదిహేనేళ్ల కిందట జూబ్లీ హిల్స్‌లో పాతిక లక్షలకు కొన్న భవనం... ఇపుడు యాభై కోట్లు పలుకుతున్నా చంద్రబాబు, లోకేశ్ బాబు ఇద్దరూ దాని విలువ పాతిక లక్షలనే చెబుతున్నారు.పాతికేళ్లు గడిచాకా దాని విలువ రూ.100 కోట్లు దాటేసినా వారు మాట తప్పరు.