మెక్సికో తర్వాత మనమే!
అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ చెబుతున్న భారత్ మాటలు... అవాస్తవాలంటోంది ఓ తాజా సర్వే. ఎంతో విజ్ఞానవంతులుగా చెప్పుకుంటున్న భారతీయులు... మెక్సికో తర్వాత ప్రపంచంలో అత్యంత అమాయకులు, అజ్ఞానులని ఈ సర్వే తేల్చి చెప్పింది.
అసమానతలు, మహిళల ఉపాధి, మత సంబంధం లేని జనాభా, ఇంటర్నెట్ సదుపాయం వంటి అంశాలపై లండన్ ఆధారిత పరిశోధనా సంస్థ ఇప్ సోస్ మోరీ... 33 దేశాల్లో 25 వేలమంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో భారత్ ప్రధాన సమస్యలను కూడా తక్కువ అంచనా వేస్తున్నట్లు గుర్తించింది. అయితే మెక్సికో, భారత్ లు ఈ సమస్యలను అవాస్తవంగా పరిగణిస్తున్నాయని, ఐరిష్, దక్షిణ కొరియన్లు మాత్రం ఈ విషయంలో కచ్చితంగా ఉన్నారని సర్వే చెప్తోంది.
అభివృద్ధి చెందుతున్న దేశంగా చెబుతున్న భారత్.. మెక్సికో, సౌతాఫ్రికా, చిలీ వంటి దేశాల్లో మహిళలు నేటికీ ఉద్యోగం చేయాలంటే ఎంతో ఆలోచిస్తున్నారని, అలాగే రాజకీయాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం అట్టడుగుకు చేరిపోయిందని సర్వే పేర్కొంది. కొలంబియా, రష్యా, ఇండియా, బ్రెజిల్ దేశాలు మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నట్లుగా అవాస్తవాన్ని నమ్ముతున్నాయని సర్వే తెలిపింది. అలాగే గ్రామీణ జనాభా, ఇంటర్నెట్ యాక్సెస్ విషయంలోనూ భారత్ అవాస్తవాలను నమ్ముతోందని చెబుతోంది.