dubious
-
అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ
Stop Adani BY Citizens held a protest in Sri Lankas: శ్రీలంక విద్యుత్ బోర్డు చీఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలతో రాజుకున్న గొడవ కాస్త ముదిరి పెనువివాదంగా మారింది. ఆయన.. మన్నార్ జిల్లాలోని ఎనర్జీ ప్రాజెక్టుని అదానీ గ్రూప్‌కి ఇచ్చేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని, ఆ విషయాన్ని స్వయంగా రాజపక్స చెప్పారంటూ.. అనుచితన వ్యాఖ్యలు చేశాడు. ఐతే ఆ తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం, పదవికి రాజీనామ చేయడం అయిపోయనప్పటికీ ఆ వివాదం కార్చిచ్చులా రాజుకుంటోంది. ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో నిరసనకారులు అదాని గ్రూప్‌కి మన్నార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ని ఇవ్వొద్దంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స చీకటి ఒప్పందంతో అదానీ గ్రూప్‌కి ఇచ్చేయాలనకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకనే ఎటువంటి పోటీ బిడ్డింగ్ ప్రక్రియ జరపకుండా అదానీ గ్రూప్‌కి ఈ ప్రాజెక్ట్‌ని కట్టబెట్టేందుకే ఈ అసంబంధమైన ఒప్పందం చేసుకున్నారంటూ నిరసనకారుల విరుచుకుపడ్డారు. ఈ మేరకు శ్రీలంకలోని కొంతమంది నినరసకారులు స్టాప్ అదానీ అంటూ... సోషల్ మీడియా వేదికగా కూడా అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు. ఈ మేరకు నిరసకారలు మాట్లాడుతూ..."మేము పునరుత్పాధకతను వ్యతిరేకించడం లేదని స్థిరమైన పర్యావరణం కోసం పాటుపడుతున్నాం . ఇంధన ప్రాజెక్టుల పోటీ బిడ్డింగ్ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ప్రాజెక్టుల కారణంగా మా దేశ సహజ నిల్వలు క్షీణిస్తున్నాయి. పైగా పర్యావరణానికి ముప్పు కలిగించే చీకటి ఒప్పందాలను మేము అనుమతించలేం. ప్రస్తుతం శ్రీలంక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి కచ్చితమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ అవినీతికి మాత్రం తావివ్వం అని నిరసనకారులు నొక్కి చెప్పారు". ఈ క్రమంలో అదానీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ..."శ్రీలంకలో పెట్టుబడుల పెట్టడంతో మా ఉద్దేశం పొరుగు దేశ అవసరాలను తీర్చడమే కాకుండా బాధ్యతాయుతమైన కార్పొరేటర్‌గా ఇరు దేశాల మధ్య భాగస్వామ్య సంబంధాలు పెంపొందింప చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాం. అయినా ఈ సమస్య శ్రీలంక పార్లమెంట్‌లోనే పరిష్కరింపబడినప్పటికీ... ఇది ఒక పెను వివాదంగా మారడం మమల్ని చాలా నిరాశకు గురిచేసింది." అని చెప్పారు. ఐతే ఈ ఆరోపణలపై భారత్ స్పందించకపోవడం గమనార్హం. (చదవండి: సారీ.. ఏదో భావోద్వేగంలో భారత ప్రధాని పేరు చెప్పా!. ఆరోపణల్లో నిజం లేదు) -
రూ. 100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌పై ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల వరకూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. రమేష్‌కు చెందిన నిర్మాణ రంగ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ రూ.74 కోట్ల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారిమళ్లించినట్టు, రూ.25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నట్టు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. ఐటీ అధికారులు ఈనెల 12న హైదరాబాద్‌లోని కంపెనీ కార్యాలయంలో, కడపలో ఎంపీ రమేష్ నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన మీదట సీఎం రమేష్ డైరెక్టర్‌గా ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ పలు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులను దారిమళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు ఐటీ వర్గాలు గుర్తించాయి. గత ఆరేళ్లుగా రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎడ్కో (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.12 కోట్లు చెల్లించినట్టు గుర్తించారు. అయితే రికార్డుల్లో పేర్కొన్న నాలుగు చిరునామాల్లో ఆ కంపెనీ ఆనవాళ్లు లభించలేదని ఐటీ శాఖ రూపొందించిన నివేదిక వెల్లడించింది. ఎడ్కోతో జరిపిన కరస్పాండెన్స్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెంట్ సాయిబాబు ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహించినట్టు గుర్తించారు. ఎడ్కో స్టాంప్, సీల్ ఆయన వద్ద ఉన్నట్టు గుర్తించడంతో నిధుల దారిమళ్లింపునకే దీన్ని వాడుకున్నట్టు తెలుస్తోందని నివేదిక పేర్కొంది. ఇక రూ. 25 కోట్ల బిల్లులకు సంబంధించి కంపెనీ డైరెక్టర్ కానీ, అకౌంటెంట్ కానీ సంతృప్తికర సమాధానాలు ఇవ్వలేదని తెలిపింది. స్టీల్ సరఫరాదారుల నుంచి రూ. 12.24 కోట్లు వసూలైనట్టు కంపెనీ చూపగా, నగదు లావాదేవీల్లో వివరణ లేదని పేర్కొంది. ఢిల్లీ సబ్‌కాంట్రాక్టర్ ఎన్‌కేజీ కన్స్ర్టక్షన్స్కు రూ 6 కోట్లు చెల్లింపులు జరపగా దానికి సరైన బిల్లులు చూపలేకపోయారని నివేదిక తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు బ్యాంకుల నుంచి రుణంగా పొందిన రూ. 2.97 కోట్లను కంపెనీకి చెందిన కొందరు వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్టు ఐటీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఆక్ స్టీల్స్, బీఎస్కే సంస్థలచే స్టీల్ కొనుగోళ్లకు సంబంధించి రూ 25 కోట్ల బిల్లులను అనుమానాస్పదమైనవిగా గుర్తించిన ఐటీ శాఖ వీటిని పరిశీలిస్తోంది. ఇక రికార్డుల్లో చెల్లింపులుగా చూపిన రూ. 8.4 కోట్ల మొత్తానికి సరైన వివరణ ఇవ్వలేదని, రమేష్ నివాసం నుంచి రూ. 13 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడులపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సీఎం రమేష్‌ను ప్రశ్నించగా, వీటిపై నన్ను అడగవద్దని, ఐటీ అధికారులనే అడగాలని బదులిచ్చారు. టీడీపీ నేతల బుకాయింపు రాజకీయ కక్ష సాధింపుతోనే ఐటీ దాడులు నిర్వహించారని సీఎం రమేష్‌పై ఐటీ దాడుల సందర్భంగా టీడీపీ నానా హంగామా చేసింది. సీఎం రమేష్ సైతం తనపై రాజకీయ కక్షతోనే దాడులు చేపట్టారని ఆరోపించారు. కేంద్ర సహాయ మంత్రిగా పార్లమెంటరీ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఐటీ శాఖకు రమేష్ ఇచ్చిన నోటీసుల ఫలితంగానే సోదాలు జరిగాయని కూడా టీడీపీ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులకు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ సైతం ఆరోపించారు. గతంలో సుజనా చౌదరి ప్రస్తుతం సీఎం రమేష్‌లపై ఐటీ దాడులే ఇందుకు సంకేతమని చినబాబు అప్పట్లో ఆరోపించారు. -
అనుమానాస్పద డిపాజిట్లపై త్వరలో చర్యలు!
-
ఆ 18 లక్షల్లో సగం మందిపై అనుమానమే!
• నోట్ల రద్దు అనంతర డిపాజిటర్లపై ఐటీ శాఖ • మార్చి 31 తరువాత చర్యలు ఉంటాయని సూచన న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 9 లక్షల మంది అకౌంట్లు అనుమానాస్పదంగా ఉన్నాయని ఐటీ శాఖ తెలిపింది. ఆయా అకౌంట్ హోల్డర్లు అందరిపై కొత్త పన్ను క్షమాభిక్ష పథకం–పీఎంజీకేవై ముగిసిన తర్వాత (మార్చి 31) చర్యలు ఉంటాయని కూడా పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం అకౌంట్లలో రూ.5 లక్షల దాటి రద్దయిన నోట్లు డిపాజిట్ అయిన మొత్తాలకు సంబంధించి ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కింద 18 లక్షల మందికి ఐటీ శాఖ ఈ–మెయిల్, ఎస్ఎంఎస్ సందేశాలను పంపుతూ సమాధానాలను కోరిన సంగతి తెలిసిందే. దీనికి తుది గడువు ఫిబ్రవరి 15తో ముగిసింది. వీరిలో దాదాపు 5.27 లక్షల మంది అసెస్సీలు ఫిబ్రవరి 12వ తేదీ నాటికే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఎస్ఎంఎస్, ఈ–మెయిల్స్‌కు ఎటువంటి చట్టబద్దతా ఉండదు. దీంతో అనుమానాస్పద డిపాజిట్‌దారులకు మళ్లీ తగిన చట్టబద్దమైన నోటీసులు జారీ చేసి ఐటీ శాఖ వివరణ కోరనుంది. నల్లకుబేరులకు ఆఖరి క్షమాభిక్ష పథకం పీఎంజీకేవై మార్చి 31న ముగిసిన తర్వాత, అనుమానాస్పద డిపాజిట్ దారులపై సైతం ఐటీ చర్యలకు సిద్ధమవుతోంది. -
4.17 లక్షల కోట్లు.. అనుమానాస్పదం
నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లపై సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర • 18 లక్షల మంది అకౌంట్ల పరిశీలన... న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తరువాత దాదాపు 18 లక్షల మంది సుమారు రూ.4.17 లక్షల కోట్ల అనుమానాస్పద డిపాజిట్లు చేసినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర గురువారం నాడు తెలిపారు. ‘‘ఆదాయపు పన్ను శాఖ వద్ద ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం... సంబంధిత వ్యక్తుల్లో 13 లక్షల మందికి నేడు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ప్రశ్నలను పంపడం జరిగింది. మిగిలిన 5 లక్షల మందికి శుక్రవారం ప్రశ్నలను పంపుతాం’’ అని బడ్జెట్ సెమినార్ అనంతర విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పైన పేర్కొన్న 18 లక్షల మంది డేటానే కాకుండా, మరో 10 లక్షల మంది డేటానూ ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. సీబీడీటీ స్వచ్ఛ ధన్ అభియాన్ (ఆపరేషన్ క్లీన్ మనీ) కింద వీరందరి డేటాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. పన్నుల ఎగవేతదారులను గుర్తించి, వారిపై చర్యలకు సీబీడీటీ తగిన చర్యలను అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. అనుమానాస్పద డిపాజిట్లకు సంబంధించి సీబీడీటీ నుంచి ఈ–మెయిల్స్ అందుకున్నవారు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని ఈ వారం మొదట్లోనే చైర్మన్ చంద్ర స్పష్టం చేశారు. వీరందరూ తమ ఆదాయాలకు, డిపాజిట్లకు సంబంధించి లెక్కలు చెప్పాల్సిందేనని పేర్కొన్నారు. మార్చి నాటికి రిటర్న్స్ సమర్పించాల్సిందే! పన్ను అసెస్మెంట్లను త్వరితం చేయాల్సిన నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక ప్రతిపాదనలు చేసింది. దీనిప్రకారం, అసెస్మెంట్ ఇయర్లో మార్చి ముగిసేనాటికి పన్ను చెల్లింపుదారులు తప్పనిసరిగా అన్ని ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఐటీ రిటర్న్స్, రివైజ్డ్ రిటర్న్స్ ప్రక్రియ మొత్తం మార్చినాటికి పూర్తవ్వాలని ఫైనాన్స్ బిల్లు 2017కు సంబంధించి ఒక మెమోరాండంలలో రెవెన్యూ శాఖ పేర్కొంది. రిటర్న్స్ ఫైలింగ్‌లో ఆలస్యం అయితే, ఇందుకు కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆదాయపు పన్ను శాఖ ప్రతిపాదించింది. ఆదాయం రూ. 5 లక్షల లోపు అయితే ఈ ఫీజు రూ.1,000గా ఉంది. ఆపైన రూ.5,000గా ఉంది. జూలై తరువాత, డిసెంబర్ లోపు అయితే ఈ మొత్తం ఫీజు చెల్లించాలి. ఫైలింగ్ డిసెంబర్ దాటితే రూ.10,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాత కేసులపైనా ఐటీ దృష్టి నల్లకుబేరులు, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం తాజాగా ఆదాయ పన్ను చట్టంలో తాజాగా సవరణలు చేసింది. దీని ప్రకారం లెక్కల్లో చూపని ఆస్తులు, డిపాజిట్లు రూ. 50 లక్షలపైగా విలువ చేసేవి.. ఐటీ సోదాల్లో బైటపడిన పక్షంలో అధికారులు పదేళ్ల క్రితం నాటి ఐటీ రిటర్న్‌లను కూడా పునఃపరిశీలించవచ్చు. ఇప్పటిదాకా ఆరేళ్ల దాకా మాత్రమే ఉండగా.. దీన్ని పదేళ్లకు పొడిగించినట్లు సుశీల్ చంద్ర తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఇందుకు సంబంధించిన సవరణ అమల్లోకి రానుంది. దీంతో అసెస్సీకి సంబంధించి 2007 నాటి ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి, నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్లో మీ ఖాతాలు సరిచూసుకోండి న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారులను గుర్తించడానికి నవంబర్ 8 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత సేకరించిన సమాచారాన్ని.. తమ వద్ద ఉన్న సమాచారంతో ఐటీ శాఖ సరిచూస్తోంది. ఇందులో భాగంగా పన్ను చెల్లింపుదారులు నోట్ల రద్దు తర్వాత తమ ఖాతాల్లో నగదు జమల మొత్తాన్ని ఆన్లైన్లో సరిచూసుకోవాలని, ఒకవేళ తేడాలుంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది. ఖాతాదారుల ఇబ్బందులు తొలగించడానికి, అలాగే వారికి సహాయం చేయడానికి ఐటీ శాఖ యూజర్ గైడ్‌ను అందుబాటులో ఉంచింది. ఖాతాల్లో నగదు జమల సమాచారాన్ని incometaxindiaefiling. gov. in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పాన్ నంబర్‌తో దీనిని సరిచూసుకోవచ్చని తెలిపింది. వెబ్‌సైట్‌లోని ‘కాంప్లియన్స్’ విభాగంలోని ‘2016 క్యాష్ ట్రాన్సాక్షన్స్’ లింక్‌లో గతేడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకూ చేసిన లావాదేవీల సమాచారం ఉంచింది. తన ఖాతా నంబర్ పాన్‌కు సంబంధించినది అని పన్ను చెల్లింపుదారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతా కనుక పాన్‌కు సంబంధించినది కాకపోతే సంబంధిత ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఆదాయపన్ను కార్యాలయానికి వెళ్లకుండానే నగదు జమ వివరాలను వెబ్సైట్లోనే వివరించేలా ఆ శాఖ చర్యలు తీసుకుంది. -
మెక్సికో తర్వాత మనమే!
అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ చెబుతున్న భారత్ మాటలు... అవాస్తవాలంటోంది ఓ తాజా సర్వే. ఎంతో విజ్ఞానవంతులుగా చెప్పుకుంటున్న భారతీయులు... మెక్సికో తర్వాత ప్రపంచంలో అత్యంత అమాయకులు, అజ్ఞానులని ఈ సర్వే తేల్చి చెప్పింది. అసమానతలు, మహిళల ఉపాధి, మత సంబంధం లేని జనాభా, ఇంటర్నెట్ సదుపాయం వంటి అంశాలపై లండన్ ఆధారిత పరిశోధనా సంస్థ ఇప్ సోస్ మోరీ... 33 దేశాల్లో 25 వేలమంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో భారత్ ప్రధాన సమస్యలను కూడా తక్కువ అంచనా వేస్తున్నట్లు గుర్తించింది. అయితే మెక్సికో, భారత్ లు ఈ సమస్యలను అవాస్తవంగా పరిగణిస్తున్నాయని, ఐరిష్, దక్షిణ కొరియన్లు మాత్రం ఈ విషయంలో కచ్చితంగా ఉన్నారని సర్వే చెప్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా చెబుతున్న భారత్.. మెక్సికో, సౌతాఫ్రికా, చిలీ వంటి దేశాల్లో మహిళలు నేటికీ ఉద్యోగం చేయాలంటే ఎంతో ఆలోచిస్తున్నారని, అలాగే రాజకీయాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం అట్టడుగుకు చేరిపోయిందని సర్వే పేర్కొంది. కొలంబియా, రష్యా, ఇండియా, బ్రెజిల్ దేశాలు మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నట్లుగా అవాస్తవాన్ని నమ్ముతున్నాయని సర్వే తెలిపింది. అలాగే గ్రామీణ జనాభా, ఇంటర్నెట్ యాక్సెస్ విషయంలోనూ భారత్ అవాస్తవాలను నమ్ముతోందని చెబుతోంది. -
రూ.900లు తస్కరించబోయి...
కశింకోట: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుంచి మండలంలోని కన్నూరుపాలెం వద్ద బుధవారం రూ.900లు ఆరుగురు తస్కరించారు. బాధితురాలు స్థానికుల సాయంతో వారిని పట్టుకుంది. నగదు స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులకు అప్పగించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సింగవరానికి చెందిన సారిపల్లి దేవుడమ్మ కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. కూరగాయలు కొనుగోలుకు కన్నూరుపాలెం వారపు సంతకు వెళుతూ ఆటో ఎక్కింది. అప్పటికే అందులో ఆరుగురు ఉన్నారు. దేవుడమ్మ కన్నూరుపాలెంలో ఆటో దిగింది. డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వడానికి తాను డబ్బులు దాచుకునే చిక్కం(సంచి) చూడగా కనిపించలేదు. కూరగాయలు కొనుగోలుకు తెచ్చిన రూ.900లు మాయమవ్వడంతో లబోదిబోమంది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పురుషులను స్థానికులు నిలదీయగా చిక్కం పడిపోతే బాలిక తీసిందంటూ నగదు ఉన్న దానిని బాధితురాలికి అప్పగించారు. ఆటోలోనివారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చే సింది. ఎస్ఐ ఎం.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారు సంచార తెగలకు చెందిన చిల్లర దొంగలుగా గుర్తించారు. వీరు ప్రస్తుతం న ర్సీపట్నం వద్ద బొడ్డుపల్లిలో ఉంటున్నట్టు ఎస్ఐ తెలిపారు.