కశింకోట: ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ నుంచి మండలంలోని కన్నూరుపాలెం వద్ద బుధవారం రూ.900లు ఆరుగురు తస్కరించారు. బాధితురాలు స్థానికుల సాయంతో వారిని పట్టుకుంది. నగదు స్వాధీనం చేసుకుని నిందితులను పోలీసులకు అప్పగించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని సింగవరానికి చెందిన సారిపల్లి దేవుడమ్మ కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తోంది. కూరగాయలు కొనుగోలుకు కన్నూరుపాలెం వారపు సంతకు వెళుతూ ఆటో ఎక్కింది. అప్పటికే అందులో ఆరుగురు ఉన్నారు. దేవుడమ్మ కన్నూరుపాలెంలో ఆటో దిగింది. డ్రైవర్‌కు డబ్బులు ఇవ్వడానికి తాను డబ్బులు దాచుకునే చిక్కం(సంచి) చూడగా కనిపించలేదు. కూరగాయలు కొనుగోలుకు తెచ్చిన రూ.900లు మాయమవ్వడంతో లబోదిబోమంది.
దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పురుషులను స్థానికులు నిలదీయగా చిక్కం పడిపోతే బాలిక తీసిందంటూ నగదు ఉన్న దానిని బాధితురాలికి అప్పగించారు. ఆటోలోనివారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చే సింది. ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారు సంచార తెగలకు చెందిన చిల్లర దొంగలుగా గుర్తించారు. వీరు ప్రస్తుతం న ర్సీపట్నం వద్ద బొడ్డుపల్లిలో ఉంటున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
రూ.900లు తస్కరించబోయి...
Published Wed, Nov 4 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM
Advertisement
Advertisement