Second
-
ప్రపంచంలోనే అతిపెద్ద, ఐకానిక్ స్టేడియం రెప్పపాటులో నేలమట్టం
మలేషియా నగరంలోని ఐకానిక్ షా ఆలం స్టేడియం చరిత్రలో కలిసి పోయింది. 80వేల సీటింగ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చి వేసింది. ఈకూల్చివేతకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా షేర్ చేసింది. అంతే ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.ఒకప్పుడు 80,000 మంది ప్రేక్షకుల సామర్థ్యమున్న ఈ స్టేడియం 30 ఏళ్ల నాటిది. 2020లో నిర్మాణ పరంగా సరిగ్గా లేదని ప్రకటించారు. దీని స్థానంలో 45వేల మంది సామర్థ్యంతో మలేషియా ప్రభుత్వం కొత్త, ఆధునిక స్టేడియంను నిర్మించాలని యోచిస్తోంది.Así derribaron el techo del Shah Alam Stadium de Malasia 🇲🇾Recordemos que este estadio esta en proceso de remodelación pic.twitter.com/lOBZayr7bE— Manytops Stadiums (@Manytops) September 19, 2024 ఈ స్టేడియం నిర్మాణం 1990 జనవరి 1న ప్రారంభం కాగా అధికారికంగా 1994, జూలై 16, ప్రారంభించారు. ఇది జాతీయ జట్టుకు హోమ్ స్టేడియంగా ఉండేది. -
నేడు యాదాద్రిలో యూనిట్–2 సింక్రనైజేషన్
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల రెండో యూనిట్‌కు బుధవారం కీలకమైన సింక్రనైజేషన్ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా యూనిట్‌కి సంబంధించిన జనరేటర్‌ను విద్యుత్ సరఫరా వ్యవస్థ(గ్రిడ్)కు అనుసంధానం చేసి పరీక్షిస్తారు. జనరేటర్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ గ్రిడ్ ఫ్రిక్వెన్సీ, వోల్టేజీ, ఫేజ్ యాంగిల్స్‌తో మ్యాచ్ అయితే సింక్రనైజేషన్ విజయవంతమైనట్టుగా ప్రకటిస్తారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి విద్యుత్ కేంద్రానికి చేరుకొని సింక్రనైజేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. సింక్రనైజేషన్ తర్వాత కమిషనింగ్, కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ) ప్రక్రియలను పూర్తి చేస్తేనే యూనిట్ నిర్మాణం విజయవంతంగా పూర్తయినట్టు భావిస్తారు. కమిషనింగ్లో భాగంగా ఎలక్రి్టకల్, మెకానికల్, కంట్రోల్ యూనిట్స్, ఇతర అన్ని విభాగాలు విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నాయా.. లేదా..అని పరీక్షిస్తారు. ఇందుకుగాను ఆయా విభాగాల పనులు సంపూర్ణంగా పూర్తి కావాల్సి ఉంటుంది. కమిషనింగ్ తర్వాత విద్యుదుత్పత్తి కొనసాగినా, విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయినట్టు భావించరు. పూర్తి స్థాపిత సామర్థ్యంతో నిరంతరంగా 72 గంటలపాటు యూనిట్లో విద్యుదుత్పత్తి జరిగితేనే సీఓడీ ప్రక్రియ విజయవంతమైనట్టు భావిస్తారు. ఈ క్రమంలో కొత్త విద్యుత్ కేంద్రంలో బయటపడే ఒక్కో లోపాన్ని సరిదిద్దుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఓడీ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశముంది. అక్టోబర్‌లో 2 యూనిట్లు పూర్తి కావాలి యూనిట్–1, యూనిట్–2లు అక్టోబర్ 24, యూనిట్–3 వచ్చే ఏడాది ఫిబ్రవరి, యూనిట్–4 మార్చి, యూనిట్ –5 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని యూనిట్లకు సింక్రనైజేషన్, కమిషనింగ్, సీఓడీ నిర్వహించాల్సి ఉంది. నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 4000(5 ్ఠ800) మెగావాట్ల యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి రూ.29,965 కోట్ల అంచనాలతో నిర్మాణ పనులు ప్రారంభించగా, తాజాగా వ్యయం రూ.34,543 కోట్లకు చేరింది. ఇప్పటివరకు రూ.27,486 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. వాస్తవానికి 2021 అక్టోబర్–2022 అక్టోబర్ మధ్యకాలంలో అన్ని యూనిట్లు పూర్తికావాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరిగింది. -
జైల్లో ఉన్న నిందితుడు మరో కేసులో ముందస్తు బెయిల్ కోరొచ్చు
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న నిందితుడు వేరొక కేసులో ముందస్తు బెయిల్ కోరవచ్చని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. వేరొక కేసులో అతను అరెస్టు కానంతవరకు దాంట్లో ముందస్తు బెయిల్ కోరడానికి అర్హుడేనని వివరించింది. ఒక కేసులో నిందితుడు కస్టడీలో ఉన్నాడనేది.. రెండో కేసులో అతని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సెషన్స్ కోర్టు, హైకోర్టులు నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. కస్టడీలో ఉన్నంతమాత్రాన మరో కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని చీఫ్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ‘అరెస్టు చేస్తారనే భయమున్నపుడు ముందస్తు బెయిల్‌ను కోరే హక్కును సీఆర్పీసీ సెక్షన్ 438 కలి్పంచింది. ప్రజాస్వామ్యదేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రాధాన్యతను గుర్తించడానికే ఈ సెక్షన్ ఉంది. 438 సెక్షన్‌కు ఆంక్షలను పెట్టకూడదు. అలాచేస్తే అది ఈ సెక్షన్ సారాంశానికి, చట్టం ఉద్దేశానికి వ్యతిరేకమే అవుతుంది’ అని పేర్కొంది. వివిధ హైకోర్టులు ఈ అంశంలో భిన్న వైఖరులు తీసుకోవడంతో సర్వోన్నత న్యాయస్థానం సోమవారం స్పష్టతనిచి్చంది. జైళ్లో ఉన్న నిందితుడు మరోకేసులో ముందస్తు బెయిల్‌ను కోరలేడని రాజస్తాన్, ఢిల్లీ, అలహాబాద్ హైకోర్టులు తీర్పులిచ్చాయి. బాంబే, ఒడిశా హైకోర్టులు ముందస్తు బెయిల్ కోరవచ్చని అభిప్రాయపడ్డాయి. ‘నిందితుడికి ముందస్తు బెయిల్ కోరే చట్టబద్ధమైన హక్కుని నిరాకరించడం తగదు. మొదటి కేసులో కస్టడీ నుంచి విడుదలయ్యే దాకా మరో కేసులో ముందస్తు బెయిల్ కోరలేరనడంలో అర్థం లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
భద్రాచలం వద్ద మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం/ధరూరు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో శుక్రవారం రాత్రికి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. గోదావరికి ఎగువన ఉన్న మహా రాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజీ వద్ద నుంచి పెరిగిన వరద గోదావరికి చేరుతుండగా నీటిమట్టం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. గురు వారం రాత్రి 11 గంటలకు 48.10 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం ఉదయం 8గంటలకల్లా తగ్గి 46.90 అడు గులకు చేరింది.దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కానీ ఆతర్వాత పెరుగుతూ రాత్రి 9:15 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, వరదతో ముంపు గ్రామాల రైతులు పంట కాలం ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతుండగా.. రహదా రుల పైకి నీరుచేరి ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రవాణా స్తంభించింది. నిలకడగా జూరాలజూరాల ప్రాజెక్టులో వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవా రం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టుకు 2,65,000 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 36 క్రస్టు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,30,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 19,668 క్యూసెక్కులు, భీమా, నెట్టంపాడు, కుడి, ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 2,53,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
IND vs AFG 3rd T20I: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’...
ఏమా ఉత్కంఠ... ఏమిటా మలుపులు... ఒక టి20 సమరం అభిమానులందరినీ కట్టిపడేసింది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో, అదీ అఫ్గానిస్తాన్‌తో పోరు ఏకపక్షం అనుకుంటే నరాలు తెగే పరిస్థితి వచి్చంది. 212 పరుగులు చేశాక భారత్ గెలుపు ఖాయమనిపించి నిశి్చంతగా ఉండగా... అఫ్గానిస్తాన్ మేమేమీ తక్కువ కాదన్నట్లుగా స్కోరు సమం చేసేసింది. ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలుతుందనుకుంటే అక్కడా ఇరు జట్లూ సమమే. చివరకు అంతా రెండో సూపర్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది... ఇక్కడ చివరకు పైచేయి సాధించిన టీమిండియా గట్టెక్కింది. తుది ఫలితంతో గెలుపు భారత్‌దే అయినా ఆఖరి వరకు అఫ్గాన్ చూపిన పోరాటపటిమ అసమానం. బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు తాము ఆడిన ఆఖరి సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల పోరును టీమిండియా 3–0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి టి20లో భారత్ రెండో ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించింది. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా... అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్ ఓవర్’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... రింకూ సింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు సాధించింది. గుల్బదిన్ (23 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గుర్బాజ్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీమ్ జద్రాన్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. శతక భాగస్వామ్యం... ఫరీద్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి... కోహ్లి తొలి బంతికి డకౌట్... అంతా నిశ్శబ్దం... ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే కూడా కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో తన తొలి బంతికే సామ్సన్ కూడా సున్నాకే అవుట్! ఐదో ఓవర్ మూడో బంతి ముగిసేసరికి టీమిండియా స్కోరు 21/4... అయితే రోహిత్, రింకూ భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109/4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి ఐదు ఓవర్లలో 22, 13, 10, 22, 36 స్కోర్లతో భారత్ ఏకంగా 103 పరుగులు సాధించింది. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ వీర విధ్వంసం ప్రదర్శించగా... 1 సిక్స్, 4 ఫోర్లతో రింకూ చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే శతకం అందుకొని అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలవగా... రింకూ ఖాతాలో రెండో అర్ధ సెంచరీ చేరింది. వీరిద్దరి దెబ్బకు అఫ్గాన్ కుదేలైంది. రోహిత్ తన శైలికి భిన్నంగా ఈసారి కొన్ని వైవిధ్యమైన షాట్లతో అలరించడం విశేషం. కరీమ్ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రోహిత్ 4, 6 (నోబాల్), 6 కొట్టగా... చివరి మూడు బంతుల్లో రింకూ 6, 6, 6 బాదాడు. అనంతరం అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీమ్ 66 బంతుల్లోనే 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. వీరు వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత గుల్బదిన్, నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి జట్టుకు విజయానికి చేరువగా తెచ్చారు. విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, అఫ్గాన్ 18 పరుగులు చేయడంతో స్కోరు సమమైంది. రిలీఫ్..! ‘ఏంటి వీరూ... లెగ్‌బై ఇచ్చావా, బ్యాట్‌కు అంత బలంగా బంతి తగిలింది... అసలే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి’... తను ఆడిన తొలి బంతి లెగ్‌సైడ్ దిశగా ఆడి బౌండరీని తాకగా, అంపైర్ లెగ్‌బై ఇవ్వడంతో అంపైర్ వీరేందర్ శర్మతో రోహిత్ అన్న మాట ఇది! అతని దృష్టిలో ఆ పరుగులు ఎంత విలువైనవో ఇది చెబుతుంది. నిజంగానే టి20ల్లో చాలా కాలంగా రోహిత్ ఫామ్ బాగా లేదు. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా 2022 నుంచి అంతర్జాతీయ టి20ల్లో ఈ మ్యాచ్‌కు ముందు 31 ఇన్నింగ్స్‌లలో అతను 3 అర్ధ సెంచరీలే చేశాడు. ఐపీఎల్లో కూడా అంతంతమాత్రంగానే ఆడాడు. ఇటీవలి పరిణామాలు సహజంగానే అతడిని ఇబ్బంది పెట్టాయి. ముంబై ఇండియన్స్ కెపె్టన్సీ పోవడంతో పాటు టీమిండియా కెపె్టన్సీపై కూడా సందేహాలు వచ్చాయి. అసలు వచ్చే టి20 వరల్డ్ కప్‌లో అతను ఆడతాడా అన్నట్లుగా కూడా చర్చ సాగింది. దానికి తోడు తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్. ఇలాంటి స్థితిలో ఈ ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించింది. అఫ్గాన్ మరీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా... ఇక్కడా విఫలమైతే పరిస్థితి ఇంకా జఠిలంగా మారేంది. ఈ నేపథ్యంలో సరైన లెక్కలతో చేసిన సెంచరీ రోహిత్‌కు ఊరటనిచి్చందనడంలో సందేహం లేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్ 4; రోహిత్ (నాటౌట్) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) ఫరీద్ 0; దూబే (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్ (సి) నబీ (బి) ఫరీద్ 0; రింకూ (నాటౌట్) 69; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22. బౌలింగ్: ఫరీద్ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్ 4–0–28–0, సలీమ్ 3–0–43–0, షరాఫుద్దీన్ 2–0–25–0, కరీమ్ 3–0–54–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీమ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) సుందర్ 50; గుల్బదిన్ (నాటౌట్) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబీ (సి) అవేశ్ (బి) సుందర్ 34; కరీమ్ (రనౌట్) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్ 5; షరాఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182. బౌలింగ్: ముకేశ్ 4–0–44–0, అవేశ్ 4–0–55–1, బిష్ణోయ్ 4–0–38–0, సుందర్ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్ 3–0–31–1. సూపర్ ఓవర్లలో ఇలా... ముకేశ్ వేసిన తొలి సూపర్ ఓవర్లో అఫ్గానిస్తాన్ 1 సిక్స్, 1 ఫోర్‌తో 16 పరుగులు చేసింది. ఛేదన లో రోహిత్ 2 సిక్స్‌లు కొట్టినా చివరకు భారత్ కూడా 16 పరుగులకే పరిమితమైంది. అవసరమైతే చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్ ఐదో బంతి తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి రింకూను పంపించాడు. అయితే ఆఖరి బంతికి యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్ 4, 6తో భారత్ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది. -
గుండ్లకమ్మ రెండో గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు
సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ అవినీతి, నిర్వహణ లోపంతో తుప్పుపట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు స్థానంలో అధికారులు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదివారం హుటాహుటిన స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేశారు. దీంతో ప్రాజెక్టులో 0.75 టీఎంసీలు కడలిపాలు కాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 1.1 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు. నీరు నిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. మిచాంగ్ తుపాను ప్రభావంవల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో గుండ్లకమ్మ వరదెత్తింది. ఈ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అప్పటికే తుప్పుపట్టిన రెండో గేటు 8న కొట్టుకుపోయింది. నిజానికి.. ఇలా కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేయాలంటే సాధారణంగా ప్రాజెక్టులో నీటిని ఖాళీచేస్తారు. డెడ్ స్టోరేజీ స్థాయికి నీటినిల్వ చేరాక.. వరద ప్రవాహం తగ్గాక స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేస్తారు. కానీ.. ప్రాజెక్టులో నీరునిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. సీఈ మురళీనాథ్‌రెడ్డి సారథ్యంలో అధికారులు శ్రమించి కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో ఒక్కో ఎలిమెంట్‌ను దించుతూ స్టాప్‌లాగ్ గేటును విజయవంతంగా ఏర్పాటుచేశారు. -
నేడు కాంగ్రెస్ రెండో జాబితాకు ‘సీఈసీ ఆమోదం’!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధ వారం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన జాబితాకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. ఇప్పటికే పొత్తులు సహా తుది జాబితాపై ఏఐసీసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. సీఈసీ సమావేశంలో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఒక స్పష్టత రానుంది. ఇప్పటివరకు కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరిద్దరి పేర్ల ను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల తర్వాత మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ శని, ఆది వారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ నివాసంతోపాటు కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ నేతల సమావేశమైనా పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలపై ఏకాభిప్రాయం రాలేదు. సీనియర్ నాయకులు పోటీకి సిద్ధమైన చోట అంతర్గత పోటీ ఉన్నందున స్క్రీనింగ్ కమిటీలో మరోసారి ఈ స్థానాల్లో పోటీకి సంబంధించి సమీక్ష జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు అడుగుతున్న స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థులు సిద్ధంగా ఉండటంతో ఏ స్థానాలు కేటాయించాలన్న అంశంపై కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ య్యాయని సమాచారం. కాగా, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరుగ నున్న సీఈసీ సమావేశం కీలకంగా మారింది. -
నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా పోలిక.. ప్రతిపక్షాలు ఫైర్
పాట్నా: బిహార్ సీఎం నితీష్ కుమార్‌ని మహాత్మాగాంధీతో పోలుస్తూ వెలువడిన పోస్టర్లపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఇలాంటి పోలికలు మహాత్మాగాంధీని అవమానించడమేనని ఆర్జేడీ విమర్శించింది. ఇది హేయమైన చర్య అని బీజేపీ మండిపడింది. పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. జనతాదళ్ (యునైటెడ్)కి చెందిన ఆయన పార్టీ సభ్యులు ఈ పోస్టర్లను అంటించారు. నితీష్ కుమార్ సమానత్వ కోసం పోరాడారని పోస్టర్లో కొనియాడారు. సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, మహాత్మాగాంధీ అనుసరించిన బాటలోనే ఆయన నడుస్తున్నారని జేడీ(యూ) నాయకులు పోస్టర్లలో పేర్కొన్నారు. నితీష్ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ వచ్చిన పోస్టర్‌పై ప్రతిపక్ష పార్టీలు ఫైరయ్యాయి. రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు శివానంద్ తివారీ మాట్లాడుతూ.. ఈ పోస్టర్ నితీష్ కుమార్ అభిమానులు అంటించి ఉండవచ్చు.. కానీ ఇలా మహాత్మా గాంధీని అవమానించవద్దని కోరారు. మహాత్మా గాంధీలాంటి వాళ్లు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి పుడతారని తివారీ అన్నారు. ఈ పోస్టర్లపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీతో నితీశ్ కుమార్‌ను పోల్చడం హేయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంటాల కృష్ణ అన్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు -
రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య!
యూపీలోని మీరఠ్‌లో సర్ఘన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన స్నేహితులతో కలసి తన 27 ఏళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య కోసం ఆ తండ్రి కిరాయి హంతకులకు రూ.5 లక్షలు చెల్లించాడు. ఆ తండ్రి ముందుగా తన కుమారుని చేత మద్యం తాగించాడు. తరువాత హత్య చేసి, మృతదేహాన్ని బాగ్‌పత్‌లోని హిండన్ నదిలో పడవేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ తండ్రిని, హత్యకు సహకరించిన మిగిలినవారిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే ఈ ఉదంతం ఛురా గ్రామంలో చోటుచేసుకుంది. కిరాయి హంతకులతో కుమారుడిని హత్య చేయించిన తండ్రి రిటైర్డ్ జవాను కావడం విశేషం. ప్రస్తుతం ఒక బ్యాంకులో గార్డుగా పనిచేస్తున్నాడు. తండ్రి (సంజీవ్ కుమార్) రెండవ వివాహం చేసుకోవడం కుమారునికి(సచిన్)ఇష్టం లేదు. ఈ నేపధ్యంలో తండ్రీకొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సంజీవ్.. అతని భార్య మునేష్ మధ్య గత 15 సంవత్సరాలుగా మనస్పర్థలు ఉండటంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. వారి 27 ఏళ్ల ఏకైక కుమారుడు తల్లి మునేష్‌తో పాటు ఉంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మునేష్ దేవి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపధ్యంలో కుమారుడు సచిన్ ఆమెను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు. కుమారుడు ఎంతసేపటికీ ఆసుపత్రికి రాకపోవడంతో అనుమానంతో తల్లి మునేష్.. కుమారుని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తండ్రి సంజీవ్‌పై అనుమానం కలిగింది. వెంటనే వారు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మొదట్లో తనకు తెలియదని బుకాయించినా, తరువాత తానే తన కుమారుడిని రూ. 5 లక్షలకు సుపారీ కుదుర్చుకుని హత్య చేయించానని ఒప్పుకున్నాడు. పోలీసులు సంజీవ్‌పై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు -
థాయ్‌లాండ్‌లో డబుల్
‘ఇస్మార్ట్ శంకర్’ (2019) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో రామ్ పొతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభించాం. ఈ షెడ్యూల్లో రామ్, నటుడు సంజయ్ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, కెమెరా: జియాని గియాన్నెల్లి. -
బిగ్ ట్విస్ట్.. మరోసారి శరద్ పవార్‌ను కలిసిన అజిత్ పవార్..
ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో అజిత్ పవార్ కలిసిన విషయం తెలిసిందే. అయితే అజిత్ పవార్ వరుసగా రెండోరోజు శరద్ పవార్‌తో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అజిత్ మాట్లాడుతూ.. కేవలం అశీస్సులు తీసుకోవడానికే శరద్ పవార్‌ను కలిశానని అజిత్ పవార్ చెప్పారు. #WATCH | NCP president Sharad Pawar arrives at Mumbai's YB Chavan Centre where Maharashtra Deputy CM Ajit Pawar and NCP MLAs of his faction are present to meet him. pic.twitter.com/hrx8S2mVTR — ANI (@ANI) July 17, 2023 ఏక్నాథ్ షిండే వర్గంతో చేతులు కలిపిన అజిత్ పవార్ మంత్రి పదవులు స్వీకరించిన అభ్యర్థులతో కలిసి నిన్ననే శరద్ పవార్‌ను కలిశారు. కాగా.. నిన్న ఆదివారం అయినందున కొంత మంది రాలేకపోయారని నేడు సమావేశం అనంతరం మాట్లాడారు. శరద్ పవార్ తమ అభ్యర్థనలను మౌనంగా విన్నారని, ఏమీ మాట్లాడలేదని అజిత్ పవార్ చెప్పారు. నేడు మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశం జరిగింది. అయితే.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే ఉంటామని తీర్మాణం చేయాల్సి ఉంది. ఆ తీర్మాణాన్ని స్పీకర్‌కు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ మరోసారి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఢిల్లీలో ఎన్డీయే నిర్వహించనున్న సమావేశానికి అజిత్ పవార్ రేపు వెళ్లనున్నారు. ఇటీవల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ సహా పలువురు నేతలు ఆదివారం ముంబైలో శరద్ పవార్‌ను కలిశారు. అయితే, శరద్ పవార్‌ను కలిసిన వారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ పాటిల్ తదితరులు ఉన్నారు. ఎన్సీపీని ఐక్యంగా ఉంచాలని కోరినట్టు పేర్కొన్నారు. ఇదీ చదవండి: NCP Leadership Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. పవార్ రియాక్షన్? -
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని..!
-
ఘనంగా యాంకర్ లాస్య రెండో కుమారుడి నామకరణం (ఫొటోలు)
-
ట్విటర్‌కు షాక్: ‘కూ’ దూకుడు, మస్క్‌కు నిద్ర కరువే!
న్యూఢిల్లీ: దేశీయ మైక్రోబ్లాగింగ్ యాప్ ‘కూ’ సంచలన నిర్ణయం తీసుకుంది. టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్ టేకోవర్ తరువాత యూజర్లు తగ్గిపోతున్నారన్న అంచనాల నేపథ్యంలో ట్విటర్‌కు ప్రత్యమ్నాయంగా అమెరికాలో పాగా వేసేందుకు కూ పావులు కదుపుతోంది. త్వరలోనే అమెరికాలో సేవలను ప్రారంభించనున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ వెల్లడించారు. నమ్మండి! ఇది మన క్షణం! రాక్ చేద్దాం. యూఎస్‌లో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ కూ గురించి తెలియజేయాలని కోరారు. స్వదేశీ యాప్ 50 మిలియన్ల డౌన్లోడ్లతో ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే రెండవ మైక్రోబ్లాగింగ్ యాప్‌గా అవతరించింది. ఇండియాతోపాటు పలు దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్న కూ యాప్ దాదాపు 10కిపైగా భాషల్లో అందుబాటులో ఉంది. ఇపుడిక కూ సేవలు త్వరలో అమెరికాలో పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి. మరోవైపు ట్విటర్ లాగా తాము ఎలాంటి వెరిఫికేషన్ ఎలాంటి ఫీజు వసూలు చేయమని ఇటీవల ప్రకటించడం గమనార్హం. (మస్క్ 13 కిలోల వెయిట్ లాస్ జర్నీ: ఫాస్టింగ్ యాప్‌పై ప్రశంసలు) కాగా మస్క్ నెలకు 8 డాలర్ల బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు నవంబరు 29 నుంచి ప్రారంభించనున్నారు. దీనికితోడు ట్విటర్‌ను మస్క్ టేకోవర్ చేసిన తరువాత, మార్పులు, చేర్పులు సంచలన నిర్ణయాలతో వివాదాస్పదంగా మారుతున్నారు. దీనికి తోడు చాలా దిగ్గజ సంస్థలు తమ యాడ్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేల్ అదిరే ఆఫర్లు -
గౌతమ్ అదానీ దూకుడు.. ఏకంగా బెజోస్‌కే ఎసరు
సాక్షి,ముంబై: భారతీయ బిలియనీర్, పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మరో పెట్టు పైకి ఎక్కారు. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఇటీవలి ర్యాలీతో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, సెప్టెంబర్ 16, 2022 నాటికి అదానీ నికర విలువ 155.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే అదానీ సంపద 5.5 బిలియన్లు లేదా దాదాపు 4శాతం పెరిగింది. (బెజోస్ మస్క్ సరే! అదానీ,అంబానీ సంపద మాట ఏంటి?) అమెజాన్ జెఫ్ బెజోస్‌ను అధిగమించి రెండో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని సాధించారు. ఫోర్బ్స్ రియల్ టైం డేటా ప్రకారం 273.5 బిలియన్ డాలర్లతో నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న టెస్లా సీఈవోన్ ఎలాన్ మాస్క్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇదీ చదవండి: బెజోస్ నుంచి మస్క్ దాకా,ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్ కాగా 2022ఏడాదిలో ఇప్పటివరకు అదానీ సంపద 70 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. ఈ సంవత్సరం తన నికర విలువ పెరిగిన ప్రపంచంలోని టాప్-10 సంపన్న వ్యక్తులలో ఒకరు మాత్రమే. ఈ ఏడది ఫిబ్రవరిలో ఆసియా ధనికుడిగా ముఖేశ్ అంబానీని అధిగమించారు. ఏప్రిల్‌లో సెంటి బిలియనీర్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ బిల్ గేట్స్‌ను గత నెలలో ప్రపంచంలోని నాలుగో సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆ తరువాత ఆసియాలోనే గ్లోబల్ రిచెస్ట్ పర్సన్స్ జాబితాలో మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాజాగా తన రికార్డును తానే అధిగమించి రెండో స్థానాన్ని సాధించిన తొలి ఆసియా కుబేరుడిగా నిలిచారు గౌతమ్ అదానీ. అంతేకాదు ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఫస్ట్ ప్లేస్చేరుకోవడం కూడా పెద్దకష్టమేమీ కాదని బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా గుర్తిస్తూ ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషల చట్ట సవరణ–2022కు సంబంధించి మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: మరో ముందడుగు.. విద్యలో గేమ్ ఛేంజర్! మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో ఉర్దూకు రెండో అధికార భాష హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఉర్దూకు రెండో అధికార భాషగా చట్టబద్ధత కల్పించింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లూ దీన్ని పూర్తిగా విస్మరించింది. మైనార్టీలు, ఉర్దూ ప్రేమికుల ఆవేదనను గుర్తించిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెండో అధికార భాషగా ఉర్దూకు స్థానం కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యకలాపాలు, ఉత్తర, ప్రత్యుత్తరాలను తెలుగుతో పాటు ఉర్దూలోనూ సాగించేలా సమాన హోదా కల్పించినట్టైంది. -
ఆహారం ‘వృథా’లో టాప్ టెన్ దేశాలివే..
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమ్మీద మనుషులందరికీ సరిపోయేంత ఆహారం ఉత్పత్తి అవుతున్నా అందరికీ అందని దుస్థితి. ఓ వైపు రెండు పూటలా తిండి దొరకనివారు కోట్లాది మంది ఉంటే.. మరోవైపు మరోవైపు కోట్ల మందికి సరిపడా ఫుడ్ వృథా అవుతున్న పరిస్థితి. అసలు పండించే దగ్గరి నుంచి వండాక పడేసేదాకా ఆహారం వృథాకు ఎన్నో లెక్కలున్నాయి. అవేంటో తెలుసుకుందామా? చదవండి: రోడ్డు పక్కన డబ్బుల సంచి.. కుర్రాడు చేసిన పనికి ఫిదా! ♦భూమ్మీద ఏటా ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో దాదాపు సగం మేర ఏదో ఓ రూపంలో వృథా అవుతూనే ఉన్నాయి. ♦మనుషులు తినేందుకు వీలుగా తయారు చేసిన/వండిన ఆహారంలో దాదాపు మూడో వంతు వరకు.. కిందపడిపోవడం/చెడిపోవడం/పడేయడం ద్వారా ఏటా సుమారు 1,300 టన్నులు వృథా అవుతోంది. ♦ఏటా ప్రపంచవ్యాప్తంగా వృథా అవుతున్న ఆహారంలో కనీసం పావు వంతును వినియోగించుకోగలిగినా.. సుమారు 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చట. ‘వృథా’.. రెండో పెద్ద దేశం ఆహారం ఉత్పత్తి కావడానికి ఎన్నో వనరులు అవసరం. మొక్కలకైతే పొలాలు, తోటలను సిద్ధం చేయడం నుంచి ఎరువులు, పురుగు మందులు, ఇతర ఖర్చులదాకా ఎంతో కావాలి. కోళ్లు, పశువులు, చేపలు వంటి వాటికోసం ఎంతో వ్యయం అవుతుంది. ప్రతిదానికి మానవ శ్రమ, కరెంటు, పెట్రోలియం ఉత్పత్తుల వాడకంతో లింకు ఉంటుంది. అందుకే అంతర్జాతీయంగా ఇలాంటి అవసరాలు, వ్యయాలన్నింటినీ ‘కర్బన ఉద్గారాల (గ్రీన్‌హౌజ్ గ్యాస్) విడుదల’తో లెక్కిస్తారు. దీని ప్రకారం.. వృథా అయ్యే ఆహారాన్ని లెక్కిస్తే.. ప్రపంచంలో చైనా తర్వాత మనది అతిపెద్ద దేశం అవుతుందట. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. ఆహారం వృథా విషయంలో రెండు భిన్నమైన కోణాలు ♦పంటలు పండించడం నుంచి రవాణా, మార్కెటింగ్, విక్రయం వరకు ఉన్న దశల్లో అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో వృథా ఎక్కువగా ఉంటోంది. పంటలు పండించడం, నిల్వ, ఇతర అంశాల్లో సరైన సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని ఐక్యరాజ్యసమితి తమ నివేదికలో పేర్కొంది. ♦వండిన, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం విషయంలో అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో వృథా చాలా ఎక్కువ. తమ సంపాదనలో ఆహారానికి అయ్యే ఖర్చు తక్కువగానే ఉండటం, ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం, అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటం వంటివి కారణమని పేర్కొంది. ♦యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లోని దేశాల్లో సగటున ఒక్కోవ్యక్తి ఏటా 100 కిలోల ఆహారాన్ని వృథా చేస్తారని అంచనా. ఇది ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలతో పోలిస్తే పదింతలు ఎక్కువ కావడం గమనార్హం. కోట్ల కిలోమీటర్ల మేర వృథా ఏటా భారీ ఎత్తున ఆహారం వృ«థా అవుతోంది కదా. మరి దానంతటినీ ఉత్పత్తి చేయడానికి వాడుతున్న భూమి విస్తీర్ణం ఎంతో తెలుసా?.. ఏకంగా 1.35 కోట్ల చదరపు కిలోమీటర్లు. -
మోదీ బర్త్ డే నాడు మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. రెండో డోసు శుక్రవారం వేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. ‘రెండో వ్యాక్సిన్ పూర్తి’ చెబుతూ రెండు ఫొటోలను కూడా పంచుకున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఒక్కరోజే ఏకంగా 2.25 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక చర్యలతో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు. అయితే అది కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ప్రధాని జన్మదినాన కేటీఆర్ వ్యాక్సిన్ వేసుకోవడం విశేషం. చదవండి: మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చదవండి: ఈటలకు మార్మోగిన చప్పట్లు: అమిత్ షా సభలో స్పెషల్ అట్రాక్షన్ Second jab done ✔️ #VaccinationUpdate pic.twitter.com/hfMVOZEV3T — KTR (@KTRTRS) September 17, 2021 -
దేశంలో కోవిడ్ రెండోవేవ్ మధ్యలో ఉంది: కేంద్రం
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్ రెండోవేవ్ మధ్యలో ఉందని కేంద్రం పేర్కొంది. కేరళలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. మొత్తం యాక్టివ్ కేసుల్లో కేరళలోనే సగం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పండగల నేపథ్యంలో సెప్టెంబరు, అక్టోబరులో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. టీకా తీసుకున్నా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశం మొత్తంమీద చూసుకుంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరగడంలో ఓనం వేడుకలు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇవీ చదవండి: సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి.. రెండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్ -
దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ రెండో మరణం నమోదు
భోపాల్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి రోజురోజుకి తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చేందుతుంది. అయితే, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇదే రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా రెండో మరణం సంభవించిందని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. కాగా, గడిచిన వారంలో 6 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. మధ్య ప్రదేశ్ నుంచి 1,219 నమునాలను సేకరించి జీనోమ్ సీక్వేన్సింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ డిసిజ్ కంట్రోల్(ఎన్సీడీసీ)కు పంపించారు. అయితే, దీనిలో 31 శాతం నమునాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్సీడీసీ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 6 డెల్డా వేరియంట్ కేసులలో భూపాల్‌లో 2 కేసులు, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్, అశోక్‌నగర్‌ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మన దేశంలో ఇప్పటి వరకు, 318 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయట పడ్డాయి. అదే విధంగా, యూకేలోని లండన్‌లో ఆల్ఫా వైరస్ రకానికి చెందిన 56 కేసులు నమోదయ్యాయి. చదవండి: దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం నమోదు -
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్డౌన్
-
తప్పు చేస్తే ‘సెకండ్ వేవ్’ ముప్పు
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. యూరప్‌లోని పలు దేశాలు ఇప్పుడు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. మరికొన్ని ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నాయి. మన దేశంలో కేసుల సంఖ్య తగ్గుతున్నా, కేరళ, ఢిల్లీ, ఒడిశా, హరియాణాలో ఒక శాతానికి మించి నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు మన దేశానికీ సెకండ్‌వేవ్ ముప్పుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అలాగే, ప్రపంచంలో సెకండ్వేవ్పైనా, ప్రస్తుత పరిస్థితిపైనా ప్రపంచ ఆరోగ్యసంస్థ విశ్లేషించింది. సెకండ్‌వేవ్‌ను నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది. మన తప్పిదాలతోనే ‘సెకండ్ వేవ్’ అలలాగా వైరస్ విరుచుకుపడటాన్నే ‘వేవ్’ అంటారు. కేసులు గణనీయంగా తగ్గాక మళ్లీ ఒక్కసారిగా వైరస్ విజృంభిస్తుందన్న మాట. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్.. అలా వస్తూనే ఉంటాయి. సైన్స్ జర్నల్ ప్రకారం ఒకసారి కరోనా వచ్చిన వారికి మళ్లీ వచ్చే అవకాశం 90 శాతానికిపైగా ఉండదు. ఫస్ట్ వేవ్‌లో కరోనా రానివారు నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్‌లో దాని బారినపడే ముప్పుంది. కరోనా వైరస్ ఇప్పుడెంత తీవ్రతతో ఉందో ఇకముందూ అదే తీవ్రతతో ఉంటుంది. జాగ్రత్తలు తీసుకున్నంత వరకు అదెవరికీ సోకే అవకాశం లేదు. అజాగ్రత్తతో వ్యవహరిస్తే మాత్రం సోకుతుంది. మాస్క్ పెట్టుకుంటే, భౌతికదూరం, శుభ్రత పాటిస్తే సెకండ్ వేవ్ రాదు. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా సెకండ్ వేవ్‌కు అతీతం కాదు. ఎటొచ్చీ మానవ తప్పిదాలతోనే అదొచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. బలమైన ప్రజారోగ్య వ్యవస్థ, ప్రజల సహకారంతోనే దీన్ని అధిగమించాలని చెబుతున్నారు. నిజానికి సెకండ్ వేవ్‌లో మరణాలు తగ్గాయి. మొదటి వేవ్‌లో పరీక్ష సామర్థ్యం, సన్నద్ధత లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు పరీక్షల సామర్థ్యం పెరగడంతో మరణాల రేటు తగ్గింది. యూకేలో 3 నెలల తర్వాత... యూకేలో వైరస్ తగ్గిన మూడు నెలల తర్వాత సెకండ్ వేవ్ వచ్చింది. యూరప్, అమెరికా, ఆసియా దేశాల్లో ఇప్పుడు సెకండ్ వేవ్ నడుస్తోంది. యూరప్‌లో మార్చిలోనే వైరస్ తీవ్రస్థాయికి వెళ్లింది. ఈ ఏడాది మార్చిలో ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో 66 శాతం యూరప్‌లోనే నమోదయ్యాయి. జూలై నాటికి అక్కడ 6 శాతానికి తగ్గాయి. ఆగస్టు నుంచి అక్కడ మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. అక్టోబర్ రెండో వారం నాటికి ప్రపంచంలో నమోదైన కేసుల్లో 46 శాతం కేసులు అక్కడే గుర్తించారు. అంటే ఆగస్టు చివరి నుంచే సెకండ్ వేవ్ మొదలై అక్టోబర్ చివరి నాటికి తీవ్రస్థాయికి వెళ్లింది. ప్రస్తుతం ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో 19 శాతం అమెరికాలో నమోదవుతున్నాయి. చైనాలోనూ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. గత వారంతో పోలిస్తే ఇప్పుడు 33 శాతం కేసులు పెరిగాయి. 44 దేశాలున్న యూరప్‌లో స్వీడన్, బెల్జియం, స్పెయిన్, ఐర్లాండ్ మినహా మిగతా అన్ని దేశాలు సెకండ్ వేవ్ బారినపడ్డాయి. దేశంలో 4 శాతం తగ్గిన కేసులు లాక్డౌన్ చివరి దశలో ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో మన దేశం వాటా 15%. జూన్‌లో క్రమంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దేశంలో జూలై చివరి నాటికి 22%, ఆగస్టు చివరి నాటికి 30%, సెప్టెంబర్ చివరికి 40% కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ తొలి వారంలో ప్రపంచంలో నమోదైన కేసుల్లో మన దేశం కేసుల వాటా 25%, రెండో వారంలో 15%గా ఉంది. ప్రస్తుతం మన దేశంలో కేసులు 4%, మరణాలు 12% తగ్గాయి. కేరళలో మాత్రం ప్రస్తుతం రోజుకు 1.6 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, ఒడిశా, హరియాణాలో ఒక శాతానికిపైగా పెరుగుతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మన దగ్గరా జనవరి రెండో వారం నాటికి సెకండ్ వేవ్ వస్తుందని అంచనా. పాజిటివిటీ రేటు ఆధారంగానే అంచనా కేసుల సంఖ్య ఆధారంగా కాకుండా పాజిటివిటీ రేటు ప్రకారం సెకండ్ వేవ్‌ను అంచనా వేయాలి. తక్కువ టెస్టులు చేసినందున మొదటి వేవ్‌లో తప్పిపోయిన కేసులు ఎక్కువ. యూరప్‌లో మొదటి వేవ్‌లో 14 మందికి కరోనా ఉంటే ఒకరినే గుర్తించారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం మన దేశంలో మొదట్లో 84 కేసులుంటే, ఒకటే గుర్తించగలిగాం. 83 మిస్సయ్యాయి. ఇప్పుడు పరీక్షలు ఎక్కువ చేస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సరాసరి పాజిటివిటీ రేటు 15 శాతం కాగా, మన దేశంలో అది 4.3 శాతంగా ఉంది. ప్రపంచంలో 13 లక్షల జన్యు విశ్లేషణలు ప్రపంచంలో దాదాపు అన్నిచోట్లా లాక్డౌన్ పూర్తిగా ఎత్తేశారు. యూరప్‌లో విద్య, రవాణా వ్యవస్థలపై ఆంక్షలను తొలగించారు. ప్రజలు గుంపులుగా బయటకు వస్తున్నారు. యువకుల నిర్లక్ష్యం వల్ల వైరస్ పెద్ద వారికి సోకుతోంది. చలికాలం ఎక్కువ.. వేసవిలో తక్కువనే తేడా లేకుండా వైరస్ దాడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించి 13 లక్షల జన్యు విశ్లేషణలు జరిగాయి. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటోందని ఇవన్నీ తేల్చాయి. అయితే, తీవ్రత తగ్గుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. సెకండ్ వేవ్ ప్రభావం తక్కువే మొదటి దశ కరోనా నుంచి జనంతో పాటు ప్రభుత్వాలు రిలాక్స్ అయ్యాయి. ఫస్ట్‌వేవ్.. సెకండ్ వేవ్.. ఏ దశలోనైనా వైరస్ అంతే తీవ్రత కలిగి ఉన్నా సెకండ్ వేవ్‌లో దాని ప్రభావం, మరణాలూ అంతగా ఉండవు. ఎందుకంటే వైరస్ లక్షణాలకు ఎలాంటి చికిత్స చేయాలనేది ఇప్పటికే తెలిసిపోయింది. ఆసుపత్రుల్లో వసతులు పెరిగాయి. యూరప్‌లో ఉన్నంత ప్రమాదం మన దేశానికి ఉండదు. వ్యాక్సిన్ ఉత్పత్తి జనవరి నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు వ్యాక్సిన్‌ను తీవ్ర ప్రభావిత ప్రజలకు ఇస్తారు. జూలై నాటికి ప్రపంచంలోని అందరికీ అందుతుంది. మార్చి వరకు జాగ్రత్తలు తీసుకుంటే సెకండ్ వేవ్‌ను ఆపేయొచ్చు. అయితే వ్యాక్సిన్ వచ్చే వరకు నిర్లక్ష్యం కూడదు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినంత మాత్రాన ప్రజలు నిర్లక్ష్యం చేయరాదు. టెస్టు కేవలం ఆ నిమిషం పరిస్థితిని మాత్రమే చెబుతుంది. కాబట్టి లక్షణాలుంటే అశ్రద్ధ చేయవద్దు. – డాక్టర్ కిరణ్ మాదల,క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ -
సంకెళ్లు వేయకుంటే సంకటమే!
దేశంలో పలుచోట్ల కోవిడ్ రెండో విజృంభణ (సెకండ్ వేవ్) గురించి మాట్లాడుతుంటే, దేశ రాజధాని ఢిల్లీ మూడో విజృంభణ గురించి కలవరపడుతోంది. అదీ శీతాకాలం మొదల య్యాక! అందుకే, అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ మూడు మాసాల కాలం వాయుకాలుష్యపు విషకౌగిట్లో బందీ అయి ఢిల్లీ తల్లడిల్లడం మనం కొన్నేళ్లుగా చూస్తున్నాం. ఈసారి, కోవిడ్–19 తోడవడం ఆందోళన కలిగిస్తోంది. ఫ్లూ తెగ వైరస్లు చలి వాతావరణంలో విజృంభించడం సహజం. కరోనా కూడా అంతే! మళ్లీ పెరిగి రోజూ అయిదువేలకు పైగా కరోనా కొత్త కేసులు ఢిల్లీలో తాజాగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఆరువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సరిగ్గా ఈ సమ యంలోనే ఢిల్లీ పొరుగు రాష్ట్రాల నుంచి పంట అవశేషాలు పొలాల్లో తగులబెట్టడంతో వచ్చే పొగమేఘాలు ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తుం టాయి. తగులబెట్టడాలపై నిషేధం విధించినా ఆగటం లేదు. వారంలో రానున్న ధీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల పుట్టే విష కాలుష్యం అదనం. అప్పుడు, అన్నీ కలిసి ఓ పెద్ద ‘గ్యాస్ చాంబర్’గా మారే ఢిల్లీలో సగటు మనిషి జీవనం దుర్భరంగా తయార వుతుంది. దేశాన్ని పరిపాలించే, పాలనను పర్యవేక్షించే, న్యాయ వ్యవస్థను నడిపించే.. ఇలా ఎన్నో రకాల ముఖ్యులు, అతి ముఖ్యు లుండే ఢిల్లీ పరిస్థితి ఏయేటికాయేడు దయనీయంగా మారుతోంది. ‘‘నాకు ఊపిరాడట్లేదు...!’’ అని దేశ రాజధాని గొంతెత్తి రోదించే పరి స్థితి. ఈ వాయుకాలుష్యపు సమస్య ఒక్క ఢిల్లీకే పరిమితం కాలేదు. ఢిల్లీ పరిసరాలతో పాటు ప్రధాన మెట్రో నగరాలకు క్రమంగా విస్తరి స్తోంది. గాలి నాణ్యతా సూచి (ఎక్యూఐ) ఈ రోజు, గురువారం లెక్కలు ఢిల్లీ (450, పీఎం10) లో ప్రమాదకరంగా ఉంటే, తర్వాత అధ్వానంగా నవీ ముంబయ్ (206, పీఎం2.5), ఓ మోస్తరుగా హైద రాబాద్ (150, పీఎం2.5–పీఎం10)లో నమోదయ్యాయి. బెంగళూరు (73, పీఎం10), చెన్నై (59, పీఎం2.5) పరవాలేదనిపించాయి. బాగ్ పాట్ (464), నొయిడా (457), గుర్గావ్ (443), ఆగ్రా (373)లలో కూడా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలోనే ఉంది. సత్వరం దీనికి విరుగుడు చర్యలు చేపట్టకపోతే పరిస్థితులు చెయిదాటిపోయే ప్రమాద ముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్య తీవ్రతను అంగీకరించడం, కారణాలు గుర్తించడం, చిత్తశుద్ధితో పరిష్కారాలకు యత్నించడం ముఖ్యం. నగరీకరణ అతిపెద్ద సవాల్ గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలతో పట్టణాలు, నగరాలు జనసమ్మ ర్ధంగా మారటం ప్రపంచమంతటా జఠిలమవుతున్న పర్యావరణ సమస్య. కిందటేడు లెక్కల ప్రకారం 55 శాతం ప్రపంచ జనాభా పట్టణాలు, నగరాల్లో ఉంది. 2050 నాటికి, ఇది మూడింట రెండొం తులకు చేరనుంది. 80 శాతం స్థూల జాతీయోత్పత్తి నగరాల నుంచే వస్తోంది. భారత్‌లో కూడా మూడింట రెండొంతుల స్థూల జాతీయో త్పత్తి నగరాలు, పట్టణాల నుంచేనని అధికారిక గణాంకాలు చెబుతు న్నాయి. ప్రణాళిక–నియంత్రణ లోపం, పౌర సదుపాయాలు జనా భాకు సరితూగేలా లేకపోవడం వల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతు న్నాయి. అతి ఎక్కువ జనాభా కలిగిన 20 ప్రపంచ నగరాల్లో అత్య ధికం భారత్, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాల్లోనే ఉన్నాయి. ఢిల్లీ కన్నా ఎక్కువ జనాభా ఈ భూమ్మీద ఒక టోక్యో లోనే ఉంది. బీజింగ్, షాంఘై, ఒసాకా, కైరో, ముంబై వంటివన్నీ ఆ తర్వాతే! అధిక జనసాంద్రత, నిరంతర నిర్మాణపు పనులు, రోడ్ల విస్తరణ, వాహనాలు వదిలే వ్యర్థాలు, ఔషధ ఇతర పరిశ్రమలు, వస్తోత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే వాయువుల వల్ల గాలి కాలుష్యం అసాధారణమై ఊపిరా డటం లేదు. ఢిల్లీలో ఇది మరింత ఎక్కువ. శీతాకాలం, సాయం సమ యాల్లో పౌరులు ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టమవుతోంది. ప్రమా ణాలకు మించి వాయుకాలుష్యపు స్థాయి హెచ్చినపుడు శాస్వసంబం ధమైన వ్యాధులు పెరుగుతున్నాయి. పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి జబ్బులున్న వారికది నరకప్రాయమే! కాలుష్యం ముఖ్యంగా కోవిడ్– 19 వైరస్ వ్యాప్తిలోనే కాకుండా ప్రతికూల ప్రభావంతో ఆరోగ్య సమస్యల్ని జఠిలం చేస్తోంది. ఢిల్లీ అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాయు కాలుష్యం వల్ల పలు జబ్బులు పెరగటమే కాకుండా మను షుల్లో రోగనిరోధక శక్తి తగ్గుతోంది. శ్వాసలో స్వచ్చమైన గాలి– ఆక్సిజన్ తగినంత లభించక కోవిడ్ రోగులు కోలుకునే అవకాశాలూ మందగిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ మన దేశంలో ఈ సంవత్సరం జనవరి చివర్లో వచ్చినందున శీతాకాలంలో అది చూపే ప్రభావం గురించి అంచనా దొరకటం లేదు. ఐరోపా దేశాలు, అమెరికాలో రెండో విజృంభణ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని, మనం జాగ్రత్తగా ఉండటం మంచిదని వైద్యులు, పాలకులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి ఐరోపా దేశాల్లో మొదటి పీక్ (మార్చి)తో పోల్చి చూస్తే రెండో విజృంభణలో కేసులు సంఖ్య మూడింతలు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) తాజాగా వెల్లడించింది. ఇతర ఇన్ఫ్లుయెంజా కేవల శ్వాసకోశ సంబంధ ఇబ్బందులే! కానీ, కరోనా శ్వాస ఇబ్బందులతో పాటు రక్తం గడ్డకట్టడం, గుండె పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి తీవ్ర నష్టాలు కలిగిస్తోంది. శీతాకాలంలో శ్రద్ధతీసుకోవాలని, మెట్రోల్లో మరింత జాగ్రత్త అవసరమని నిపుణులంటున్నారు. ఆర్డినెన్స్ రూపంలో కొత్త చట్టం ఢిల్లీలో గాలి స్వచ్ఛత–నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారం కింద కేంద్ర ప్రభుత్వం కొత్త అత్యయిక ఉత్తర్వు (ఆర్డినెన్స్) తెచ్చింది. జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీయార్)లో వాయుకాలుష్య కారకులయ్యే పరిశ్రమలు, ఇతర ఉత్పత్తి–సేవా సంస్థలకు నీరు, విద్యుత్తు సరఫ రాను నియంత్రించే, నిలువరించే అధికారాలు కల్పిస్తూ ఒక కమిషన్ ఏర్పాటు ఈ అత్యయిక ఉత్తర్వు వెనుక ఉద్దేశం. కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు 18 మంది సభ్యులుంటారు. వారిలో కార్యదర్శితో పాటు ముఖ్య మైన 8 శాఖలకు చెందిన ఉన్నతాధికారులుంటారు. సివిల్ ప్రొసీజర్ కోడ్–1973 కింద లభించిన వెసులుబాటుతో ఈ కమిషన్, కాలుష్య కారకులయిన వారికి లక్ష రూపాయల జరిమానా లేదా అయిదేళ్ల జైలు శిక్ష విధించే అధికారాలు కలిగి ఉంటుంది. నిజానికి రెండు దశాబ్దాల కిందటే, 1998లో, పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ (ఈపీసీఏ)– చట్టమొకటి తెచ్చారు. కోరలు లేక పెద్ద ప్రభావం చూపలేకపోయింది. దీపావళి సందర్భంగా ఢిల్లీలో పెద్ద మొత్తంలో టపాసులు కాల్చడం వల్ల వచ్చే వ్యర్థ వాయువులతోనూ గాలి కాలుష్యమౌతోంది. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈసారి దీపావళి టపాసులు కాల్చకూడదని ఒడిశా, పశ్చిమబెంగాల్‌తో పాటు ఢిల్లీ పొరుగునున్న హర్యానా, రాజ స్తాన్లలో ప్రభుత్వాలు నిషేధం విధించాయి. మీరేం చేస్తున్నారో చెప్పండని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) అడిగింది. ఢిల్లీ పొరుగునున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ (పశ్చిమ ప్రాంతం) రాష్ట్రాల్లో పంట అవశేషాల్ని పొలాల్లో తగులబెట్డం వల్ల ఢిల్లీ పైకి వచ్చే పొగ, పొగ మేఘాల నియంత్రణపై సుప్రీంకోర్టు, ఎన్జీటీలు పలుమార్లు నిర్దిష్ట ఆదేశాలిచ్చాయి. ఆదిత్య దూబే–భారత ప్రభుత్వం మధ్య నడిచిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి, ఈ సమస్య పరిష్కారం చూడమంది. జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలో ఏర్పరచిన ఈ కమిషన్ పలు సూచనలు చేసింది. ఇప్పుడీ కమిషన్ రద్దయి, దాని స్థానే అత్యయిక ఉత్తర్వుతో ఏర్పడ్డ తాజా కమిషన్ ఇకపై ఈ బాధ్యత నిర్వహిస్తుంది. ఒక్క దెబ్బతో రెండు పిట్టలు ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల వరిపంట నూర్పిళ్లయ్యాక పొలంలో మిగిలిన (కుదుళ్లు) గడ్డి అవశేషాల్ని రైతులు తగులపెడతారు. మను షులే అయితే వరి కుదుళ్లను నేలకు దగ్గరగా కోస్తారు. మరు పంటకు పొలం దున్నినపుడు అవి మట్టిలో కలిసి, ఎరువవుతాయి. 1980లకు ముందు ఇదే జరిగేది. కానీ, యంత్రాల ద్వారా నూర్పిళ్లు జరిపినపుడు అది వరి కుదుళ్లను నేల నుంచి దాదాపు 30 సెంటీమీటర్ల మేర వదిలి కోస్తుంది. బాస్మతి అయితే తప్ప ఆ మిగులు పశుగ్రాసంగా కూడా పనికి రాదు. దాన్ని మరో మారు కోయడం రైతుకు అదనపు ఖర్చు. వ్యయభారం తప్పించుకునేందుకు వాటిని తగులబెడతారు. ఇలా కాల్చడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్ గాల్లో కలిసి, తీవ్ర వాయుకాలుష్యానికి కారణమౌతోంది. అదొక పొగమేఘమై ఢిల్లీ వరకు విస్తరిస్తోంది. ఇంధన పరిశోధన సంస్థ (టీఈఆర్ఐ) అధ్యయనం ప్రకారం డబ్లుహెచ్‌వో అనుమతించిన కాలుష్యపరిమితి కన్నా 20 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తోంది. ఇంకోరకంగా చెప్పాలంటే, గడ్డి కాల్చడంతో అరవై రోజులపాటు వెలువడే ఈ కాలుష్యాలు, ఏడాది పాటు ఢిల్లీలో అన్ని వాహనాలు వెలువరించే కాలుష్యం కన్నా నాలుగయిదు రెట్లు అధికం! తామలా పంట అవశేషాలు కాల్చడం పర్యావరణ పరంగా ప్రమాదకరమని, ప్రభుత్వం నిషేధించిన తర్వాత అలా చేయడం భారత శిక్షాస్మృతి (సెక్షన్ 188) కింద నేరమని పాపం రైతులకు తెలియదు. వాయు (కాలుష్య నియంత్రణ) చట్టం–1981 కింద కూడా ఇది నేరమే! రైతుల్లో అవగాహన పెంచాలి. భారత పరి శ్రమల సమాఖ్య (సీఐఐ) చొరవతో పంజాబ్‌లో 2018లో 19 గ్రామాల్లో, మరుసటేడు 105 గ్రామాల్లో చేసిన ప్రత్యామ్నాయ చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. 1.83 లక్షల టన్నుల గడ్డిని కాల్చకుండా నిరోధించ గలిగారు. దీన్ని ప్రభావిత ఇతర రాష్ట్రాలన్నింటికీ విస్తరిం చాలి. అవగాహన పెంచి రైతల్ని సమాయత్తపరచాలి. వరికోత యంత్రాల్ని ఆధునీకరించడం, పంట అవశేషాల్ని మట్టిలోనే కలిపి ఎరువుగా మార్చడం వంటివి సత్ఫలితాలిస్తాయి. ఢిల్లీ కాలుష్యపీడ తొలగడమే కాకుండా రైతుల భూసారం పెరుగుతుంది. సహజంగా పంటకు సేంద్రియ ఎరువు లభిస్తుంది. మట్టిపై మంటల్లేక జీవవైవిధ్య రక్షణ జరుగుతుంది. భూగర్బజల మట్టాలూ పెరుగుతాయి. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే ప్రత్యామ్నాయ చర్యలకు... ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలు, సామాజిక బాధ్యత కింద కార్పొరేట్లు, స్వచ్ఛంద–పౌర సమాజ సంస్థలు, రైతులు సంఘటితం కావాలి. సంబంధీకులంతా చేయి చేయి కలిపితేనే.... వాయు కాలుష్యభూతం కట్టడి సాధ్యం. -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
సెకండ్ వేవ్: కరోనా మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ‘సెకండ్ వేవ్’ దడ మొదలైంది. అమెరికా, యూరప్ దేశాల్లో వైరస్ సెకండ్ వేవ్ సృష్టిస్తున్న ప్రకంపనలతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొదటి దశలో కరోనాను నియంత్రించినట్లుగానే రెండో దశను ఎదుర్కోవాలని నిర్ణయించింది. సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవ్వాలని ఇప్పటికే వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ అధి కారులకు దిశానిర్దేశం చేయగా, వాటిని అమలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు ప్రారంభిం చింది. ప్రజల్లో, వైద్యాధికారుల్లో కరోనా కట్టడిలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని పారదోలేందుకు ఉన్నతాధి కారులు నడుం బిగించారు. జిల్లాలపై ప్రత్యేక ఫోకస్..: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.42 లక్షలకు చేరుకుంది. తెలం గాణలో మార్చి 2 నుంచి మొదలైన కరోనా వ్యాప్తి, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఉధృతి తక్కువగా ఉండటం, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గడం, కోలుకునేవారి రేటు 92.12 శాతానికి చేరుకోవడంతో ప్రజల్లోనూ, యంత్రాంగంలోనూ కాస్తంత నిర్లిప్తత నెలకొం దన్న చర్చ జరుగుతోంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పడిపోవడంతో జనాల్లో కరోనా పట్ల గతంలో ఉన్నంత ఆందోళన లేదు. అయితే కరోనా పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తు న్నాయి. కరోనా పూర్తి నియంత్రణకు వచ్చే వరకు జాగ్రత్తలు తప్పదని చెబుతూనే ఉన్నారు. కానీ ఏమీ కాదన్న ధోరణి జనంలో ఏర్పడటంతో వైద్య, ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. పైపెచ్చు ఇప్పుడు చలికాలం మొదలైంది.. ఈ కాలంలో సీజనల్ ఫ్లూ వ్యాధులు, దానికి తోడు కరోనా విజృంభించే ప్రమాదం పొంచి ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. యూరప్, అమెరికా దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. కొన్ని దేశాల్లో లాక్డౌన్ కూడా అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేసింది. అందుకే జిల్లాలపై ఫోకస్ పెట్టింది. పరిస్థితిని అంచనా వేసి యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం నుంచి జిల్లాల్లో వైద్య ఉన్నతాధికారులు పర్యటన మొదలు పెట్టారు. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. కరోనా పరీక్షలు, చికిత్స చేసే ఆసుపత్రులను పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సెకండ్ వేవ్ రాకుండా చేపట్టాల్సిన ప్రణాళికను వారు వివరించారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకొని కరోనా కట్టడి చేయాలని సూచించారు. మరోవైపు డెంగీ, మలేరియా వంటి వంటి సీజనల్ వ్యాధులతోనూ కరోనా వచ్చే ప్రమాదం ఉందని, అటువంటి కేసులను గుర్తించాలన్నారు. ఇక కరోనాపై తాజాగా రూపొందించిన మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా తాజా మార్గదర్శకాలివే.. –సెకండ్ వేవ్ ప్రమాదం ఉన్నందున అవసరమైతేనే ఎవరైనా ఇంటి నుంచి బయటకు రావాలి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రాకపోవడమే శ్రేయస్కరం. –పండుగలు, శుభకార్యాలు ఏవైనా అందరూ ఒకేచోట చేరడం మంచిది కాదు. ఎవరికి వారే కుటుంబంలో జరుపుకోవాలి.. –చలికాలంలో డెంగీ, మలేరియా సహా ఫ్లూ జ్వరాలతో కలిపి కరోనా వచ్చే అవకాశముంది. కాబట్టి ఏమాత్రం లక్షణాలున్నా అశ్రద్ధ చేయొద్దు. –కరోనా లక్షణాలుంటే వెంటనే నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి. సాధారణ లక్షణాలుంటే వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండాలి. అటువంటివారు ఇంట్లో కనీసం 2 మీటర్ల దూరాన్ని పాటించాలి. –ఐసోలేషన్‌లో ఉండే గదికి గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. –ఎప్పటికప్పుడు జ్వరాన్ని చెక్ చేసుకోవాలి. శ్వాస సంబంధ సమస్యలు వస్తే తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలి. –ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. –ఆసుపత్రి నుంచి కోలుకొని ఇంటికి వెళ్లేవారు ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించకూడదు. –కూరగాయలు, పండ్లను బేకింగ్ పౌడర్ కలిపిన నీటితో కడగాలి. ఇంట్లో తయారుచేసిన సమతుల్య ఆహారం తీసుకోవాలి. –రోజుకు తప్పనిసరిగా 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలి. పసుపు వేసిన వేడి పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. –కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. –ఇంట్లో ఖాళీగా ఎవరూ కూర్చోకూడదు.. అంటే ప్రాణాయామం, ధ్యానం చేస్తుండాలి.. సంగీతం వినడం, టీవీ చూడటం, పుస్తకాలు చదవడమూ చేయాలి. కరోనా టెస్టుల పెంపు.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ టెస్టుల సంఖ్యను పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో మొబైల్ టెస్టింగ్ వాహనాలతో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా సంతలు, రైతుబజార్లు, బస్టాండ్లు, గ్రామీణ ప్రాంతాల్లోని పని ప్రదేశాల వద్దకే వెళ్లి టెస్టులు చేయాలని నిర్ణయించారు. సహజంగా చలికాలంలో అన్ని రకాల వైరస్లు విజృంభిస్తుంటాయి. ఇక కరోనా లాంటివి మరింత వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే రాబోయే మూడు మాసాలు అత్యంత కీలకమని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా ఐదారు మాసాలు సమయం పడుతుందని, అప్పటివరకు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు పాటించేలా చేయడమే తమ ముందున్న కర్తవ్యమని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకవైపు ప్రజల్ని చైతన్య పరుస్తూ.. మరోవైపు వారు భయపడకుండా, ఆందోళన చెందకుండా అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. -
హెచ్‌సీయూ దేశంలోనే 2వ అత్యుత్తమ వర్సిటీ
రాయదుర్గం: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) మరో ఘనత సాధించింది. ఇండియా టుడే–మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్(ఎండీఆర్ఏ) సర్వే నిర్వహించి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దేశంలో అత్యుత్తమ యూనివర్సిటీల్లో హెచ్‌సీయూ ద్వితీయ స్థానం సంపాదించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) మొదటిస్థానంలో నిలిచింది. దేశంలోని విశ్వవిద్యాలయాలను జనరల్ (ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్), సాంకేతిక, వైద్య, చట్టపరమైన నాలుగు విభాగాలుగా పరిశీలించారు. ఈ పరిశీలనలో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు అందించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 995 వర్సిటీలపై అధ్యయనం ఇండియా టుడే ఉత్తమ విశ్వవిద్యాలయాల సర్వే కోసం దేశంలోని 995 విశ్వవిద్యాలయాల జాబితాను రూపొందించింది. అందులో 155 జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలు కూడా ఉన్నాయి. వీటిల్లో హెచ్సీయూకు ద్వితీయ స్థానం పొందింది. ఇండియా టుడే నాలెడ్జ్ పార్టనర్ ఎండీఆర్ఏ చేత అనేక మైలురాళ్లను నిర్దేశించింది. ఆబ్జెక్టివ్ ర్యాంకింగ్ సమయంలో విశ్వవిద్యాలయాల అత్యంత సమగ్రమైన, సమతుల్యమైన పోలికలను అందించడానికి ఎండీఆర్ఏ 120 ప్లస్ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించింది. ఈ పనితీరే సూచికలుగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అందులో కీర్తి, పాలన, అకడమిక్, రీసెర్చ్ ఎక్స్‌లెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లివింగ్ ఎక్స్పీరియన్స్, పర్సనాలిటీ, నాయకత్వ అభివృద్ధి, కెరియర్ పురోగతి, ప్లేస్మెంట్ వంటి అంశాలలో సాధించిన ప్రగతి ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. దేశంలోని 30 నగరాల్లో 300 మంది ప్రతినిధులు(32 మంది వైస్చాన్స్లర్లు, 75 మంది డైరెక్టర్లు, 193 మంది సీనియర్ ఫ్యాకల్టీ/ప్రొఫెసర్లు/హెడ్లతో వర్చువల్ సర్వేను నిర్వహించారు. చివరకు 130 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్‌లను కేటాయించారు. పరిశోధకులు, గణాంక వేత్తలు, విశ్లేషకులు, సర్వే బృందాలతో కూడిన పెద్ద బృందం ఈ ప్రాజెక్టుపై 2019 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు పనిచేసి ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. టాప్‌లో నిలవడం.. పనితీరుకు నిదర్శనం పనితీరు మెరుగుపడడం, పరిశోధన రచనలకు గుర్తింపుగా హెచ్‌సీయూ దేశంలో ద్వితీయ స్థానం సాధించింది. 2017లో 5వ స్థానం, 2018లో 3, 2019లో 2, 2020లో మరోసారి 2వ స్థానాన్ని హెచ్‌సీయూ దక్కించుకుంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ గుర్తించడం, అత్యాధునిక మౌలిక సదుపాయాలతోపాటు నాణ్యమైన విద్య, పరిశోధనలను అందించడంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాం. దీంతో ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల లీగ్‌లోకి వెళ్లేలా సమష్టి కృషితో ముందుకు సాగుతాం. –ప్రొఫెసర్ పొదిలె అప్పారావు, హెచ్‌సీయూ వైస్ చాన్స్‌లర్