భద్రాచలం/ధరూరు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో శుక్రవారం రాత్రికి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. గోదావరికి ఎగువన ఉన్న మహా రాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు కాళేశ్వరం, సమ్మక్క బ్యారేజీ వద్ద నుంచి పెరిగిన వరద గోదావరికి చేరుతుండగా నీటిమట్టం తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. గురు వారం రాత్రి 11 గంటలకు 48.10 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం ఉదయం 8గంటలకల్లా తగ్గి 46.90 అడు గులకు చేరింది.
దీంతో రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. కానీ ఆతర్వాత పెరుగుతూ రాత్రి 9:15 గంటలకు నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, వరదతో ముంపు గ్రామాల రైతులు పంట కాలం ఆలస్యమవుతుందని ఆందోళన చెందుతుండగా.. రహదా రుల పైకి నీరుచేరి ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రవాణా స్తంభించింది.
నిలకడగా జూరాల
జూరాల ప్రాజెక్టులో వరద నిలకడగా కొనసాగుతోంది. శుక్రవా రం రాత్రి 10 గంటలకు ప్రాజెక్టుకు 2,65,000 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 36 క్రస్టు గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వారా 2,30,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే 10 యూనిట్లలో విద్యుదుత్పత్తి కోసం 19,668 క్యూసెక్కులు, భీమా, నెట్టంపాడు, కుడి, ఎడమ కాల్వలకు కలిపి మొత్తం 2,53,290 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment