ప్రాణహిత, ఇంద్రావతి, శబరిలలో వరద తగ్గుముఖం
దీంతో భద్రాచలం వద్ద 42.90 అడుగులకు తగ్గిన నీటిమట్టం..మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగు లు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ఉగ్రరూపం దాలి్చన గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు.
దానికి ఇంద్రావతి ప్రవాహం తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజ్‌లోకి చేరుతున్న 8.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బ్యారేజ్‌లోకి 9.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారంరాత్రి 9 గంటలకు నీటిమట్టం 42.90 అడుగులకు చేరుకుంది.
దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమ య్యాయి. కాగా ముంపు కాలనీ వాసులను సోమవారం సైతం పునరావాస శిబిరాల్లోనే కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 11.78 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో స్పిల్ ఎగువన నీటిమట్టం 33.46 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,50,084 క్యూసెక్కులు చేరుతుండగా.. 14,42,384 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment