సాక్షి, హైదరాబాద్: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వనమా.. హైకోర్టు ఆర్డర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన జలగం వెంకట్రావ్
మరోవైపు, సీఈవో వికాస్‌రాజ్‌ను జలగం వెంకట్రావు కలిశారు. సీఈవోకు హైకోర్టు తీర్పు కాపీని అందజేశారు. వనమాపై అనర్హత వేటుతో తనను ఎమ్మెల్యేగా గుర్తించాలి జలగం కోరారు.
కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. వనమా గెలుపుపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జలగం. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆస్తులు సక్రమంగా చూపించలేదనే అభియోగాలు ఉన్నాయి. వీటిని నిజమని తేల్చిన న్యాయస్థానం ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: కలసిరాని మంత్రి పదవి... ఎమ్మెల్యేగా గెలిచినా తప్పని తలనొప్పులు
అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకుగానూ రూ. 5 లక్షల జరిమానా సైతం విధించింది. ఇక డిసెంబర్ 12, 2018 నుంచి జలగం వెంకట్రావ్‌ను ఎమ్మెల్యేగా డిక్టేర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment