High Court Hearing On Bandi Sanjay Lunch Motion Petition - Sakshi
Sakshi News home page

బండి సంజయ్ చేసిన తప్పేంటి?.. అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు

Apr 6 2023 2:44 PM | Updated on Apr 6 2023 3:06 PM

Hih Court Hearing On Bandi Sanjay Lunch Motion Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్‌ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 41ఏ నోటీసు ఇవ్వకుండా సంజయ్‌ను అరెస్ట్‌ చేశారంటూ.. హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్‌ రద్దుపై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు. న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌.. గురువారం మధ్యాహ్నం విచారణ జరిపారు. 

కరీంనగర్ నుంచి వరంగల్‌కు బండి సంజయ్‌ను  తీసుకెళ్లేందుకు 300 కిలోమీటర్లు తిప్పారని ఆయన తరపు న్యాయవాది రామ్‌చంద్రరావు కోర్టుకు తెలిపారు. బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేపర్‌ బయటకు వచ్చాక వాట్సాప్‌లో సర్క్యూలేట్‌ చేశాడే తప్ప.. పేపర్‌ లీకేజీలో అతని ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించింది.  క్వశ్చన్‌ పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చిన తర్వాత అది లీకేజ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని తెలిపింది.

ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌.. బండి సంజయ్ పేపర్ లీకేజీలో కుట్రదారుడు అన్న విషయం తేలిందన్నారు. ప్రశాంత్‌కు, సంజయ్‌కు మధ్య టెలిఫోన్‌ సంభాషణ జరిగిందని, కానీ ఆయన ఇంకా తన ఫోన్‌ను ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది.

అయితే ఇప్పటికే కింది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌వ వేశామని.. దానిపై ఈరోజే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని న్యాయవాది రామచంద్రరావు తెలిపారు. శనివారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కింది కోర్టులో బెయిల్‌ రాకుంటే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.
చదవండి: ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌.. కారణం ఇదే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement