Paper Leak Case: Minister Harish Rao Slams BJP After Bandi Sanjay Arrest - Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్‌ కేసులో పట్టపగలే దొరికిన దొంగ బండి సంజయ్‌: హరీష్‌ రావు

Published Wed, Apr 5 2023 12:42 PM | Last Updated on Wed, Apr 5 2023 1:01 PM

Paper Leak Case: Harish Rao Slams BJP After Bandi Sanjay Arrest - Sakshi

సాక్షి, మెదక్‌: రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ ఆటలాడుతోందని మంత్రి హరీష్‌ రావు ధ్వజమెత్తారు. పథకం ప్రకారమే బీజేపీ పేపర్‌ లీకులు చేస్తోందని మండిపడ్డారు. పేపర్‌ లీకేజీ వెనుక ప్రధాన సూత్రధారి, పట్టపగలే దొరికిన దొంగ బండి సంజయ్ అని ఆరోపించారు. టెన్త్‌ పేపర్‌ లీక్‌చేస్తున్న వారంతా బీజేపీ కార్యకర్తలేనని విమర్శించారు. బీజేపీ నేతలకు చదవు విలువ తెలియదని, పేపర్‌ లీక్‌ చేసిన ప్రశాంత్‌ బండి సంజయ్‌ అనుచరుడని తెలిపారు. అతనికి రాష్ట్ర, జాతీయ నేతలతో ప్రశాంత్‌కు సంబంధాలున్నాయన్నారు.

ఈ మేరకు మెదక్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో బుధవారం మాట్లాడుతూ.. ‘మంగళవారం మధ్యాహ్నం లేపర్‌ లీకయ్యిందని బీజేపీ ధర్నా చేసింది. సాయంత్రం పేపర్‌ లీక్‌ చేసిన వ్యక్తిని విడుదల చేయాలని ధర్నా చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. బీజేపీ కుట్రలను విద్యార్థి లోకం తిప్పికొట్టాలి. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి బీజేపీ నీచ రాజకాయాలు చేస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు. అధికారం కోసం బీజేపీ నేతలు ఎంతకైనా దిగజారుతారు. బీజేపీ కుట్రలను దేశం మొత్తం గమనిస్తోంది. బీజేపీ డ్రామాలు కేసీఆర్‌ దగ్గర నడవవు. తెలంగాణ సమాజానికి బీజేపీ క్షమాపణలు చెప్పాలి. 

ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని బండి సంజయ్‌కు పంపింది నిజమా కదా? బీజేపీ పథకం ప్రకారమే కుట్రలు చేస్తుంది. గుజరాత్‌లో 16 సార్లు లీకేజీ అయితే మోదీ, నడ్డా ఎందుకు మాట్లాడలేదు. బీజేపీ మతాన్ని రెచ్చగొడుతోంది. ఆ పార్టీని చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. చట్ట ప్రకారమే సంజయ్‌ను లోతైన విచారణ కోసం అరెస్ట్ చేశారు. బండి సంజయ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్ సభ స్పీకర్ రద్దు చేయాలి’ అని కోరారు.
చదవండి: బండి సంజయ్‌ అరెస్ట్‌.. కేటీఆర్‌ సంచలన కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement