Reduced flood
-
శాంతిస్తున్న గోదావరి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం: ప్రాణహిత, ఇంద్రావతి, శబరి తదితర ఉపనదులు, వాగు లు, వంకల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో సోమవారం గోదావరినదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ఉగ్రరూపం దాలి్చన గోదావరి శాంతిస్తుండటంతో తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్న ప్రవాహం 5.12 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన వరదను వచ్చినట్టుగా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి దిగువకు వదిలేస్తున్నారు.దానికి ఇంద్రావతి ప్రవాహం తోడవుతుండటంతో తుపాకులగూడెం(సమ్మక్క) బ్యారేజ్‌లోకి చేరుతున్న 8.56 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బ్యారేజ్‌లోకి 9.52 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద సోమవారంరాత్రి 9 గంటలకు నీటిమట్టం 42.90 అడుగులకు చేరుకుంది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం నుంచి అన్ని వైపులకు రాకపోకలు పునఃప్రారంభమ య్యాయి. కాగా ముంపు కాలనీ వాసులను సోమవారం సైతం పునరావాస శిబిరాల్లోనే కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం 11.78 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో స్పిల్ ఎగువన నీటిమట్టం 33.46 మీటర్లకు తగ్గింది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,50,084 క్యూసెక్కులు చేరుతుండగా.. 14,42,384 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
Delhi Floods: ఇంకా జల దిగ్బంధంలోనే ఢిల్లీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన యమునా నది శుక్రవారం కొంత శాంతించింది. నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినప్పటికీ పలు కీలక ప్రాంతాలు ఇంకా వరద ముట్టడిలోనే ఉన్నాయి. నది నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రీంకోర్టు, రాజ్‌ఘాట్ దాకా వరద నీరు చేరింది. యమునా నదిలో నీటమట్టం గురువారం 208.66 మీటర్లకు చేరుకోగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా 208.17 మీటర్లకు తగ్గిపోయింది. వరద ప్రవాహం ధాటికి దెబ్బతిన్న ఇంద్రప్రస్థ వాటర్ రెగ్యులేటర్‌ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరిశీలించారు. త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. ఈ రెగ్యులేటర్ దెబ్బతినడం వల్లే నదిలోని వరద ఇతర ప్రాంతాలకు వేగంగా విస్తరించింది. ఇసుక బస్తాలు, కంకరతో వరద ప్రవాహాన్ని ఆపేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, సైనిక జవాన్లు, ఢిల్లీ అధికారులు శ్రమిస్తున్నారు. నగరంలోని రోడ్లపై వరద నీరు ఇంకా తగ్గలేదు. రహదారులు చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లలను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. వాహనాలను అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం కొనసాగుతున్నాయి. వరదలో చిక్కుకుపోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శ్మశానాలు సైతం జలమయం కావడంతో అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా పలు శ్మశాన వాటికలను మూసివేసినట్లు నగర మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. వరదలపై ఆరా తీసిన ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కేంద్ర మోంశాఖ మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీలో వరద పరిస్థితిపై ఆరా తీశారు. మరో 24 గంటల్లో యమునా నదిలో ప్రవాహం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, అతి త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని మోదీకి అమిత్ షా వివరించారు. -
నాగార్జునసాగర్‌కు తగ్గిన వరదనీరు
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరదనీరు తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577.40 అడుగులకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇన్‌ఫ్లో నిల్, ఔట్ఫ్లోలలో 22వేల క్యూసెక్కుల నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రస్తుత నీటిమట్టం 12.5 టీఎంసీలు. ఔట్ ఫ్లో 7వేల క్యూసెక్కులు. భారీ వర్షాల కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో 300 ఎకరాల పంట నీటమునిగింది. -
నాగార్జునసాగర్‌కు తగ్గిన వరద
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరదనీరు తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577 అడుగులకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇన్‌ఫ్లో నిల్, ఔట్ఫ్లోలలో 29వేల క్యూసెక్కుల నీరు ఉంది. దాంతో సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. జనరేటర్లతో 2 యూనిట్ల ద్వారా 200 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.