నల్గొండ: నాగార్జునసాగర్కు వరదనీరు తగ్గింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 577.40 అడుగులకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇన్ఫ్లో నిల్, ఔట్ఫ్లోలలో 22వేల క్యూసెక్కుల నీరు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు నల్గొండ జిల్లాలోని పులిచింతల ప్రస్తుత నీటిమట్టం 12.5 టీఎంసీలు. ఔట్ ఫ్లో 7వేల క్యూసెక్కులు. భారీ వర్షాల కారణంగా పులిచింతల ముంపు గ్రామాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో 300 ఎకరాల పంట నీటమునిగింది.