‘త్వరలో టీ హబ్ రెండోదశ ప్రారంభం’ | Telangana to start work on T-Hub phase II | Sakshi
Sakshi News home page

‘త్వరలో టీ హబ్ రెండోదశ ప్రారంభం’

Published Sat, Nov 12 2016 12:56 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

‘త్వరలో టీ హబ్ రెండోదశ ప్రారంభం’ - Sakshi

‘త్వరలో టీ హబ్ రెండోదశ ప్రారంభం’

హైదరాబాద్: టీ హబ్ రెండో దశను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగిన టీహబ్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యువత ఆలోచనలు రెక్కలు తొడిగాయని.. టీహబ్ వల్ల ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరంలో ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, నాస్కామ్ చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement