t hub
-
ఇంక్యుబేటర్లకు దన్ను
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడం, వాణిజ్య వాతావరణాన్ని మరింత విస్తరించడం ద్వారా అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్‌లు రాణించేలా ‘టీ హబ్’ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ) సహకారంతో టీ హబ్ ఫౌండేషన్ ‘బిజినెస్ ఇంక్యుబేషన్ మేనేజ్మెంట్, లీడర్షిప్ ప్రోగ్రామ్’ (బీఐఎంఎల్) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వివిధ సంస్థల్లో మేనేజ్మెంట్ అధిపతులుగా పనిచేస్తున్నవారికి ఇంక్యుబేషన్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణపై శిక్షణ ఇస్తారు. శిక్షణ, వాణిజ్య వ్యాపార సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంకేతిక, మార్కెటింగ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం వంటి అంశాల్లో సహకారం అందిస్తారు. ఇంక్యుబేషన్ వ్యవస్థలో పరివర్తనబీఐఎంఎల్ ద్వారా శిక్షణలో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయిలో ఇంక్యుబేషన్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మెంటార్లు, కార్పొరేషన్లు, విధాన నిర్ణేతలతో టీ హబ్‌కు ఉన్న విస్తృత నెట్వర్క్ ద్వారా భారతీయ ఇంక్యుబేటర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దే అవకాశాలు మెరుగవుతాయి.బీఐఎంఎల్ కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ఇప్పటికే టీ హబ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడులోని 15 సాంకేతిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఎడ్యుటెక్, క్రీడలు, టెక్నాలజీ, మేనేజెమెంట్ రంగాల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటును వేగవంతం చేయడమే బీఐఎంఎల్ ప్రోగ్రామ్ లక్ష్యమని టీ హబ్ వర్గాలు వెల్లడించాయి. -
టీ హబ్‌లో ఫ్రాన్స్ కాన్సులేట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్, బెంగళూరు కాన్సుల్ జనరల్ థెయిరి బెర్తెలోట్ బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అనువైన వాతావరణం తదితర అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు కాన్సుల్ జనరల్ బెర్తెలోట్కు వివరించారు. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ విశేషాలను పంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ది బెస్ట్ మ్యాన్ పవర్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫ్రాన్స్ కాన్సులేట్ హైదరాబాద్ కార్యాలయాన్ని త్వరలోనే టీ హబ్‌లో ప్రారంభించనున్నట్టు బెర్తెలోట్ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ ఇండియా అంబాసిడర్ రానున్నట్టు తెలిపిన ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఆహా్వనించారు. భేటీలో ఐటీ, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఉన్నారు. త్వరలోనే రాష్ట్రంలో టెలి పెర్ఫార్మన్స్ సంస్థల ఏర్పాటు ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ సంస్థ టెలి పెర్ఫార్మన్స్ ప్రతినిధులు మంత్రి డి శ్రీధర్ బాబుతో బుధవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఆ సంస్థ ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఐటీసీ కోహినూర్‌లో నిర్వహిస్తున్న ఇమ్మెన్సీవ్ ఈవెంట్‌కు అతిథిగా రావాలని ఆహా్వనించారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థలో 90 వేల మంది ఉద్యోగులు, ప్రపంచ వ్యాప్తంగా 95 దేశాల్లో 5 లక్షల మందికి పైగా ఉద్యోగులు 300 పైగా భాషల్లో పనిచేస్తున్నారని మంత్రికి తెలిపారు. త్వరలోనే హైదరాబాద్‌తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలుగా ఉన్న పలు జిల్లా కేంద్రాల్లో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మమతా లంబ మంత్రి శ్రీధర్‌బాబుకి వివరించారు. టెలీ పెర్ఫార్మన్స్ సంస్థ పెట్టుబడులకు, సంస్థ కార్యకలాపాలకు ప్రభుత్వం తరుపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ బాబు హామీనిచ్చారు. సమావేశంలో కంపెనీ ప్రతినిధులు శివ, ఫణింధర్ నల్లబెల్లి, స్వాతి పాల్గొన్నారు. -
దేశంలోనే వేగంగా హైదరాబాద్ ప్రగతి
మాదాపూర్: భారతదేశంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న నగరంగా హైదరాబాద్ గు ర్తింపు సాధించిందని, భవి ష్యత్తులో మరింత ప్రగతిని సాధిస్తుందనే నమ్మకం ఉందని మంత్రి కేటీ రామారావు అన్నారు. మాదా పూర్లోని హెచ్ఐసీసీలో గురువారం రాత్రి టీహబ్ ఆధ్వర్యంలో టీ–ఇన్నోవేషన్ సమ్మిట్ ‘గ్లాడియేటర్స్ ఆఫ్ మైండ్’ అనే అంశంపై రెండవ ఎడిషన్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మంత్రి కేటీరామారావు మాట్లాడుతూ కేవలం ఒక్క ఐటీ రంగంలోనే కాకుండా వ్యవసాయం, ఇతర రంగాలలో అనూహ్య ప్రగతిని సాధించిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపును సాధించిందన్నారు. 2014లో ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్లు ఉండగా 2023 మే నాటికి రూ.2.41 లక్షలకు పెరిగాయని, అదే విధంగా ఐటీ ఉద్యోగాల కల్పనలోనూ ఎంతో ప్రగతిని సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రకారం మలేషియా దేశంతో సమానం కాగా, విస్తీర్ణంలో సౌత్‌కొరియాతో సమానమని మంత్రి పేర్కొన్నారు. యాట కూర తిన్నాక....తోట కూర తింటే.. సోషల్ మీడియా స్టార్ మంత్రి మల్లారెడ్డి మా ట్లాడాక ఇక మాకు మాట్లాడేందుకు ఏమి ఉంటుందని.. ‘యాట కూర తిన్నాక తోటకూరన్న ప్రాధాన్యత లాగా ఉంటుందని. అదేవిధంగా క్రికెట్లో సూర్యకుమార్‌యాదవ్ బ్యాటింగ్ చేశాక స్లో ఆడే ఇండియన్ క్రికెటర్ ఆడితే ఎలా ఉంటుందో నేను మాట్లాడితే అలా ఉంటుందని కేటీఆర్ చలోక్తి విసురుతూ అందరినీ నవ్వించారు. కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, టీహబ్ సీఈఓ శ్రీనివాసరావు, సైయింట్ అధినేత బీవీమోహన్రెడ్డి పాల్గొన్నారు. -
లింగ పక్షపాతంపై ఐఏఏ సదస్సు.. ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ), ఇండియా చాప్టర్ ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లోని టీ-హబ్ వేదికగా 'జెండర్ సెన్సిటైజేషన్ ఇన్ మీడియా' అంశంపై సదస్సు నిర్వహిస్తోంది. 30 సెకన్ల TV ప్రకటన నుంచి నుంచి 3 గంటల సినిమాల్లో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయంపై చర్చించనున్నారు. పరిశ్రమలో లింగ పక్షపతాన్ని విచ్ఛిన్నం చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. 'వాయిస్ ఆఫ్ ఛేంజ్' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రిన్సిపల్ పార్ట్నర్గా సాక్షి మీడియా గ్రూప్, నాలెడ్జ్ పార్ట్నర్గా యూనిసెఫ్ వ్యవహరిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ అనేది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, మీడియాకు ప్రాతినిధ్యం వహించే ఏకైక ఏకీకృత ప్రకటనల వాణిజ్య సంస్థ. ఇందులో కార్పొరేట్, విద్యా అనుబంధ సంస్థలు, టాప్-10 దేశాలతో పాటు ప్రపంచవ్యప్తంగా 76 దేశాలకు చెందిన యువ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. 80 ఏళ్లుగా ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. -
ఉత్తమ ఇంక్యుబేటర్‌గా ‘టీ హబ్’
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో ఆవిష్కరణలకు మూల స్తంభంలా పనిచేస్తున్న ‘టీ హబ్’కు ‘బెస్ట్ ఇంక్యుబేటర్ ఇండియా’అవార్డు లభించింది. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఢిల్లీలో ‘నేషనల్ స్టార్టప్ అవార్డులు 2022’ను ప్రదానం చేశారు. టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరించారు. వివిధ రాష్ట్రాలు అవార్డుల కోసం పోటీ పడగా అవార్డు విజేతల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు చెందిన స్టార్టప్‌లు 33 శాతం విజే తలుగా నిలిచాయి. 17 రంగాల్లో 42 స్టార్టప్‌లు అవార్డులు సాధించగా కర్ణాటక 18, మహారాష్ట్ర 9, ఢిల్లీ 4, గుజరాత్ 3, ఉత్తరాఖండ్ 2, తెలంగాణ, ఒరిస్సా, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, హరి యాణా, అస్సాం ఒక్కో అవార్డును పొందాయి. జాతీయ స్థాయిలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా, టీ హబ్‌కు ఉత్తమ ఇంక్యుబేటర్ అవార్డు దక్కింది. టీ హబ్‌కు అవార్డు రావడంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హర్షం వ్యక్తం చేశారు. -
ఐటీ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే ఉందని, స్టార్టప్‌ల ఫలితాలను రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆర్థికంగా వృద్ధి చెందుతున్న భారతదేశంలో పెట్టుబడులు రాబ ట్టడం కష్టమైనదేమీ కాదని, స్టార్టప్‌లకు నిధులు సేకరణ ఇబ్బందికర అంశంకాదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని స్టార్టప్‌లకు మార్గదర్శనం చేసే లక్ష్యంతో డల్లాస్ వెంచర్ కేపిటల్(డీవీసీ), టీహబ్ శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఆరు వేలకుపైగా స్టార్టప్‌లు ఉన్నాయని, దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ను ప్రయోగించిన సంస్థ టీ హబ్‌లోనే పురుడు పోసుకుందని అన్నారు. డీవీసీ, టీహబ్ కలిసి డీవీసీ ఇండియా ఫండ్ ఏర్పాటు చేయడం హర్షణీయమని, రెండు ప్రముఖ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం తెలంగాణను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మరింత దోహదం చేస్తుందన్నారు. ఒప్పందంలో భాగంగా డల్లాస్ వెంచర్ ఫండ్ ద్వారా డీవీసీ హైదరాబాద్ స్టార్టప్‌లకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు. దేశంలో టెక్ స్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు రూ.350 కోట్లతో డీవీసీ ఇండియా ఫండ్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీవీసీ ఇప్పటికే భారత్‌లో అనేక స్టార్టప్ లను నెలకొల్పిందని వివరించారు. కార్యక్రమంలో డీవీసీ ఎండీ దయాకర్ పూస్కూర్, సహ వ్యవస్థాపకులు అబిదాలీ నీముచ్వాలా, శ్యామ్ పెనుమాక, గోకుల్ దీక్షిత్, కిరణ్ కల్లూరి, టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. స్టార్టప్‌లకు ఊతం డల్లాస్ వెంచర్ కేపిటల్ 2023లో స్టార్టప్‌లు తమ వాణిజ్య పరిధిని విస్తరించుకునేందుకు ఊతమివ్వడం ద్వారా వినియోగదారుల్లో విస్త తిని పెంచుకునేందుకు సహాయపడుతుంది. దీని కోసం ప్రస్తుతమున్న స్టార్టప్‌లతోపాటు కొత్తగా ఏర్పాటయ్యే స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తుంది. టీ హబ్ సహకారంతో వృద్ధి చెందే సామర్థ్యమున్న వినూత్న స్టార్టప్‌లను గుర్తించి అంతర్జాతీయ మార్కెట్ లో విస్తరించేందుకు అవసరమైన వినూత్న సాంకేతికత, మౌలిక వసతులు, బృంద సామర్థ్యం పెంపుదల తదితరాల్లో డీవీసీ మార్గదర్శనం చేస్తుంది. -
హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్‌ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్– 2లో స్టార్టప్‌లు నెలకొల్పేందుకు తాజాగా వంద వరకు దేశ, విదేశీ సంస్థలు క్యూ కట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే సుమారు 200 అంకుర సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం విదితమే. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు,కృత్రిమ మేథ,సైబర్‌సెక్యూరిటీ తదితర రంగాలతో పాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఐటీ శాఖ ఈహబ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా దాదాపు రెండువేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. స్టార్టప్‌లకు కేరాఫ్.. ► టీహబ్– 2 కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని.. ప్రపంచంలోనే రెండోదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీ హబ్ మొదటి దశను ఐఐఐటీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నెలకొల్పారు. ► స్టార్టప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకే చోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ సూపర్‌హిట్.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతమైంది. హబ్‌లో గత ఏడేళ్లుగా 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ, విదేశాల్లో పని చేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవ, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. ► ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమోడే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. ఐటీ బూమ్‌కు దోహదం.. టీహబ్ ఒకటి, రెండో దశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత వృద్ధి సాధించేందుకు ఈ హబ్‌లు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్‌కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
టీ–హబ్‌ను సందర్శించిన ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ కేంద్రం నగరంలోని టి–హబ్‌ను 40 మంది రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. టి–హబ్‌లోని పలు ఇన్నోవేషన్ హబ్‌లైన వి–హబ్, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), రీసర్చ్, ఇన్నోవేషన్స్ సర్కిల్ ఆఫ్ తెలంగాణ (రిచ్), ఇమేజ్, తదితర కేంద్రాలను, వారు రూపొందించిన ఆవిష్కరణలను ఐఏఎస్ అధికారులు ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ.. టి–హబ్ ఇప్పటివరకు వందకు పైగా ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లను అందించిందని, స్టార్టప్‌లు, ఇతర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ వాటాదారులపై ప్రభావం చూపుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు టి–హబ్‌ను సందర్శించినవారిలో ఉన్నారు. -
TS: ట్రిపుల్ ఐటీలో టీ-హబ్
భైంసా (ముధోల్): బాసర ట్రిపుల్ ఐటీలో సమస్య లన్నింటినీ పరిష్కరిస్తామని.. విద్యార్థులు ఆవిష్కర ణలపై దృష్టిపెట్టేలా టీ–హబ్‌ను ఏర్పాటు చేస్తా మని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చారు. ‘తక్కువ జనాభా ఉన్న అమెరికా ఉత్పత్తులు చేస్తుంటే ఎక్కువ జనం ఉన్న మనం ఇంకా ఉద్యోగాలు చేయాలన్న ఆలోచనలోనే ఉంటు న్నాం. విద్యార్థులు ఆవిష్కరణల కోసం ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. త్వరలోనే 1,000 కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. సోమవారం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్‌ఐటీని మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఇంద్ర కరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లతో కేటీఆర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. అనంతరం మాట్లాడారు. హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను ఎంతమంది చూశారని కేటీఆర్ విద్యా ర్థులను ప్రశ్నించారు. అలా బాసర ట్రిపుల్‌ఐటీలోనే టీ–హబ్ ఏర్పాటు చేసుకుందామన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో మామూలుగా ఉద్యోగాలు చేయడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఉద్యోగాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకోకుండా.. కొత్త ఆవిష్కరణలు, పరిశ్రమల ఏర్పాటు ఆలోచనలు చేయాలని సూచించారు. అలాంటి ఆలోచనలున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. హాస్టల్ కష్టాలు నాకూ తెలుసు తాను చదువుకున్నప్పుడు 70శాతం జీవితం హాస్టల్లోనే గడిచిందని, హాస్టల్ కష్టాలు తనకూ తెలుసని మంత్రి కేటీఆర్ చెప్పారు. ట్రిపుల్ ఐటీలో సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో ఔట్‌డోర్ మినీ స్టేడియాన్ని 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామని.. 50 అదనపు మోడల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నవంబర్‌లో విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. ఇన్చార్జి వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్‌కుమార్ ఇక్కడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని విద్యార్థులకు సూచించారు. ట్రిపుల్ ఐటీ న్యూమెస్‌లో తాను వెళ్లిన బాత్రూం తలుపులు సరిగా పడలేదని.. ఇలాంటి ఇబ్బందులన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. రెండు నెలల తర్వాత విద్యా మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి మళ్లీ వస్తానన్నారు. క్యాంపస్‌ను కాపాడుకోవాలి 10 వేల మంది ఉండే ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మించడం, ప్రారంభించడం సులువైన పని అని.. కానీ వాటి నిర్వహణే ప్రధాన సమస్య అని, వీటిని పద్దతిగా ఉంచే క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పరిశుభ్రతకు జపాన్, సింగపూర్లలో ఇచ్చే ప్రాధాన్యతపై తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నెలలో ఒకరోజైనా శ్రమదానం చేసి.. 272 ఎకరాల్లో ఉన్న క్యాంపస్ పరిసరాలను శుభ్రంగా, చెత్తా చెదారం లేకుండా చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఉద్యమ స్ఫూర్తి నచ్చింది ట్రిపుల్ ఐటీలో విద్యార్థులంతా శాంతియుతంగా చేసిన ఉద్యమ స్ఫూర్తి తనకు బాగా నచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గాంధీజీ సత్యాగ్రహం తరహాలో.. తమ సమస్యల పరిష్కారం కోసం ఎండావానలకు వెరవక వారం పాటు విద్యార్థులు చేసిన పోరాటం బాగుందని కొనియాడారు. తాను విద్యార్థుల ఆందోళనను ప్రతిరోజు చూశానని.. ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులను పిలవకుండా విద్యార్థులే ఎస్జీసీ ఏర్పాటు చేసుకుని, ఉద్యమించడం నచ్చిందని అభినందించారు. -
టీహబ్–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు
సాక్షి, హైదరాబాద్: ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా రాయదుర్గంలో నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్–2లో సుమారు 200 అంకుర సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించినట్లు తెలిసింది. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాలతోపాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. జూన్ నెలలో ఐటీ శాఖ ఈ హబ్‌ను ప్రారంభించిన విషయం విదితమే. సెప్టెంబరు తొలి వారం నుంచి పలు సంస్థలు ఇక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించినట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా సుమారు రెండు వేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. టీహబ్–2 ప్రత్యేకతలివే.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతం కావడంతో టీహబ్–2 ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ► ఈ కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని..ప్రపంచంలోనే రెండవదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. ► కాగా గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీహబ్ మొదటిదశను ఐఐఐటీ–హైదరాబాద్,ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్,నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నెలకొల్పారు. ► స్టారప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు,ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకేచోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. ► అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్‌లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ స్ఫూర్తితో.. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన టీహబ్ మొదటి దశ ప్రయోగం విజయవంతమైంది. తొలిదశ టీహబ్‌లో ఏడేళ్లుగా ఇందులో 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడుపోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ,విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్,హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతికసహకారం అందిస్తున్నాయి. ఈ హబ్‌ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్‌షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్‌లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్‌లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమో డే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. (క్లిక్: బీవీఆర్ మోహన్ రెడ్డి ‘ఇంజనీర్డ్ ఇన్ ఇండియా’) ఐటీ భూమ్..హైహై టీహబ్ ఒకటి, రెండోదశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్‌లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత పురోగమించేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. (క్లిక్ చేయండి: పండక్కి కొత్త బండి కష్టమే!) -
t-hub: ఆవిష్కరణల వాతావరణానికి టీహబ్ ఊతం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా కచ్చితమైన ఫలితాలు సాధించేలా ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహిస్తున్న ‘టీ–హబ్’... కార్పొరేట్ సంస్థల్లో నిరంతరం ఆవిష్కరణలు జరిగేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆవిష్కరణల వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వరుస రోడ్ షోలు, సదస్సులు నిర్వహిస్తోంది. ‘ఇనో– కనెక్ట్’పేరిట మంగళవారం బెంగుళూరులో రోడ్ షో నిర్వహించగా 22న చెన్నైలో రోడ్ షోతోపాటు వచ్చే నెల 18, 19 తేదీల్లో ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’ నిర్వహిస్తారు. దీనికి ప్రపంచ నలుమూలల నుంచి 500కుపైగా ఆహ్వానితులు, 50కి మందికిపైగా ప్రముఖులు హాజరుకానున్నారు. ఆర్థికరంగం వేగంగా మార్పులకు లోనవుతున్న ప్రస్తుత వాతావరణంలో వాణిజ్యాన్ని బలోపేతం చేయడం, కొత్త సాంకేతికతలను వినియోగించుకోవడం, ఎంట్రప్రెన్యూర్షిప్ సంస్కృతిని నిర్మించడమే లక్ష్యంగా ఢిల్లీలో ‘కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సు’జరుగుతుందని టీ హబ్ వర్గాలు వెల్లడించాయి. కార్పొరేట్ సంస్థల చీఫ్ ఎక్స్‌పీరియెన్స్ ఆఫీసర్లు(సీఎక్స్‌వో), చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్లు(సీఐవో), ఎంట్రప్రెన్యూర్లు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ, విద్యారంగ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఆవిష్కరణల వృద్ధి వ్యూహం, డిజైన్, ఎమర్జింగ్ టెక్నాలజీ తదితరాలపై చర్చ జరగనుంది. ‘మారుతున్న ప్రపంచంలో ఆధునిక థృక్పథాన్ని అలవరుచుకునేందుకు, కొత్త వాణిజ్య వ్యూహాలు రూపొందించేందుకు ఢిల్లీలో జరిగే సదస్సు దోహదం చేస్తుంది’ అని టీ హబ్ సీఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. -
టిహబ్‌లో డిప్లోమాటిక్ ఎన్రిచ్ కార్యక్రమంలో కేటీఆర్
-
హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ వృద్ధికి ఓపెన్ డేటా సెంటర్లు బూస్టప్ ఇస్తున్నాయని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,423 డేటా సెంటర్లుండగా నగరంలో సుమారు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, నెట్వర్క్ అభివృద్ధితోపాటు వివిధ రకాల సేవల అనుసంధానం, డిజిటల్, సాఫ్ట్‌నెట్ సేవలను అందించేందుకు ఈ కేంద్రాలు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఐటీ రంగానికి కేరాఫ్‌గా నిలిచిన గ్రేటర్ సిటీలో టీఎస్ఐసీ, వీహబ్, టీహబ్, టీవర్క్స్, టాస్క్ తదితర సంస్థల ద్వారా స్టార్టప్‌లను ఇతోధికంగా ప్రోత్సహించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు బాటలు వేస్తున్నట్లు పేర్కొన్నారు. టీ ఫైబర్‌కు కేంద్రం అనుమతి లిభించడంతో డిజిటల్ సేవలు మరింత విస్తృతం కానున్నాయని తెలిపారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 17,328 కి.మీ. మార్గంలో కేబుల్ లైన్ ఏర్పాటైనట్లు తెలిపారు. మరో ఐదు వేల కిలోమీటర్ల మేర కేబుల్‌ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. నలుచెరుగులా విస్తరణకు చర్యలు.. నగరం నలుచెరుగులా ఐటీ వృద్ధికి ఐటీ శాఖ చర్యలు ప్రారంభించింది. తాజాగా కండ్లకోయ గేట్‌వే ఐటీ పార్క్ విస్తీర్ణాన్ని 6 లక్షల చదరపు అడుగుల నుంచి 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంచింది. త్వరలో ఈ పార్క్ నిర్మాణం మొదలు కానుంది. కాగా ఈ పార్క్‌కు సమీపంలో 35 ఇంజినీరింగ్, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు 30 ఎంబీఏ కాలేజీలతో పాటు పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. నగరంలో నలు చెరుగులా టెకీలు ఐటీ ఉ ద్యోగాలు చేసేలా నలువైపులా ఐటీ పార్కులు నిర్మించేందుకు ఐటీ శాఖ చర్యలు చేపట్టడం విశేషం. టాప్ కంపెనీలకు చిరునామా.. ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం విదితమే. అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పింది. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 1500 వరకు ఉన్న చిన్న,పెద్ద, కార్పొరేట్ కంపెనీల్లో సుమారు 7.78 లక్షల మంది ఉపాధి పొందుతున్న విషయం విదితమే.(క్లిక్: కొత్త స్మార్ట్ఫోన్లు ఎందుకు పాడవుతాయో తెలుసా?) ఏటా పెరుగుతున్న ఎగుమతులు.. గ్రేటర్ పరిధిలో 2014 నుంచి ఐటీ బూమ్ క్రమంగా పెరుగుతోంది. విశ్వవ్యాప్తంగా పేరొందిన దిగ్గజ ఐటీ, బీపీఓ, హార్డ్‌వేర్, కేపీఓ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఏటా రూ. 1.83 లక్షల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2026 నాటికి ఏటా రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటతాయని ఐటీ వర్గాలు అంచనా వేస్తుండడం విశేషం. (క్లిక్: హైదరాబాద్ పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే..) -
నైపుణ్యంతోనే అవకాశాల్లో ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఉపాధికల్పన అత్యంత సవాల్‌గా మారుతోందని, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత నిరంతరం నైపుణ్యసాధనపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని టీ హబ్ ఆవరణలో పరస్పర అవగాహన ఒప్పందాల మార్పిడి, కాలేజీ యాజమాన్యాలతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా ‘భాగస్వామ్యాల ద్వారా ఉపాధి కల్పన పెంపు’అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ ప్రసంగించారు. టాస్క్, దాని భాగస్వాములు అందిస్తున్న నైపుణ్య శిక్షణను ఉపయోగించుకుని తెలంగాణ యువత ఉపాధి పొందాలని సూచించారు. రాష్ట్రంలో వెల్లువలా వస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌లో 780 కాలేజీలు నమోదైనట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు టాస్క్ ద్వారా 6.53 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణతోపాటు మరో 14,338 బోధకులను కూడా తయారు చేశామన్నారు. ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు టాస్క్ కార్యకలాపాలు విస్తరించామని, త్వరలో మరికొన్ని పట్టణాల్లో కూడా టాస్క్ కార్యకలాపాలు చేపట్టనున్నామని చెప్పారు. కాగా, బుధవారం నైపుణ్యశిక్షణకు సంబంధించి టాస్క్‌తో 26 సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. వీటిలో ఎల్ అండ్ టీ హెచ్ఎంఆర్ఎల్, ‘కూ’ఇండియా, మెంటార్ టు గెదర్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. టాస్క్ సంస్థ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ సంస్థ సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు వీలుగా యువతలో సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. 27 సంస్థలు టాస్క్‌తో గతంలో కుదుర్చుకున్న ఎంవోయూలను రెన్యువల్ చేసుకున్నాయి. గూగుల్ కెరియర్ సర్టిఫికేషన్ స్కాలర్షిప్లను కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ‘కూ’ డెవలప్మెంట్ సెంటర్ తొలి దేశీ చాటింగ్ అప్లికేషన్ అయిన ’కూ’ కొత్త డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, ’కూ’ సంస్థల మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. పలు భారతీయ భాషల్లో చాటింగ్‌కు వీలు కల్పించే ఈ సోషల్ మీడియా వేదికతో కలసి ప్రభుత్వం తెలుగుభాష వాడకాన్ని ప్రోత్సహించనుంది. ’కూ’ లాంటి సంస్థలతో కలిసి ప్రభుత్వ సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయొచ్చని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. డిజిటల్ మాధ్యమాల్లో స్థానిక భాషలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలన్న భావనకు ‘కూ’కట్టుబడి ఉందని, హైదరాబాద్‌లో ఏర్పడే డెవలప్మెంట్ సెంటర్ ఈ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని ’కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ అన్నారు. -
T-Hub: అంకుర సంస్థలకు ‘సింగిల్ విండో’
ఎన్నో సరికొత్త ఆలోచనలు చేయగల, అధునాతన ఉత్పత్తులను రూపొందించగల సత్తా మన యువతలో ఉంది. వారి ఆలోచనలు ఆచరణలోకి తెచ్చే ప్రోత్సాహం వారికి అవసరం. ఈ ప్రోత్సాహాన్ని అందించాలనీ, ఔత్సాహిక యువతను వ్యాపారవేత్త లుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనీ తెలంగాణ ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను ప్రారంభించింది. ఒక ఆలోచనతో వస్తే... దానిని ఆచరణలోకి తేవడం, వస్తువు లేదా సర్వీస్‌గా మల్చడం టీ–హబ్ ఉద్దేశ్యం. ఇది స్టార్టప్‌ల జమానా. ఒక విజయవంతమైన స్టార్టప్‌ను స్థాపించాలనే పట్టుదల చాలామందికి ఉంటుంది. కానీ, ఇందుకు కావాల్సిన ప్రోత్సాహం, సదుపాయాలు, పెట్టుబడి, మార్గనిర్దేశం ఉండదు. ఇది గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్ ద్వారా... ఒక ఆలోచనను అమలు చేయడానికి కావాల్సిన పెట్టుబడి పెట్టించడం, ఎలాంటి పద్ధతులను ఆచరించాలో అవగాహన కల్పించడం, మార్కెట్లోకి తీసుకెళ్లడం, నిపుణుల సలహాలు ఇప్పించడం, స్ఫూర్తి నింపడం, అవసరమైన నైపుణ్యత కలిగిన మానవ వనరులను అందివ్వడం వంటివి చేస్తోంది. ఇక ఒక స్టార్టప్ స్థాపించడానికి పాటించాల్సిన నియమ నిబంధనలపై సూచనలు ఇవ్వడం, స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి కావాల్సిన భాగస్వామ్యాన్ని కల్పించడానికీ ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఈ ఏడేళ్లలో దాదాపు పదకొండు వేల స్టార్టప్‌లకు టీ–హబ్ సహకారాన్ని అందించింది. వీటిల్లో 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. టీ–హబ్ నుంచి 3 స్టార్టప్‌లు యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ) కంపెనీలుగా ఎదిగాయి. మరో 8 కంపెనీలు సూని కార్న్ (త్వరలో యూనికార్న్‌గా మారనున్న) కంపెనీలుగా వృద్ధి చెందాయి. టీ–హబ్‌ను మరింత విస్తృతం చేయడానికి గానూ తెలంగాణ ప్రభుత్వం ‘టీ–హబ్ 2.0’ను నిర్మించింది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఏర్పాటైన టీ–హబ్ కంటే ఇది దాదాపుగా ఐదు రెట్లు పెద్ద ప్రాంగణం. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు నెలకొని ఉన్న హైదరాబాద్ ఐటీ హబ్ మధ్యలోని రాయదుర్గంలో రూ. 700 కోట్లతో ‘టీ–హబ్ 2.0’ నిర్మాణం జరిగింది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త టీ–హబ్‌ను ఘనంగా ప్రారంభించారు. మొత్తం 3.14 ఎకరాలలో 5.82 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, 3.62 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నిర్మించిన టీ–హబ్ 2.0 ప్రపంచం లోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్. ఇప్పటివరకు ప్యారిస్‌లోని ‘స్టేషన్ ఎఫ్’ ప్రపంచంలో అతిపెద్ద ఇన్నొవేషన్ క్యాంపస్‌గా ఉండేది. 2 వేల స్టార్టప్‌లకు ఆశ్రయం ఇవ్వగల సామర్థ్యం ఉన్న 10 అంతస్తుల భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇంతకాలం ట్రిపుల్ ఐటీలో ఉన్న టీహబ్ కార్యకలాపాలన్నీ ఇప్పుడు ఈ కొత్త భవనంలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ బెంగళూరు, ఢిల్లీ, ముంబయిలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ కార్యాలయాలు కూడా టీ–హబ్‌లోనే ఏర్పాటవుతున్నాయి. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్టార్టప్ ఇండియా, అటల్ ఇన్నొవేషన్ మిషన్ సెంటర్ కార్యాలయాలూ ఇక్కడే ఉంటాయి. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కూడా ఉంటుంది. ప్రపంచాన్ని మార్చే, భవిష్యత్తు ఉన్న వాటిగా భావిస్తున్న బ్లాక్ చెయిన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి వాటికి టీ–హబ్‌లో ప్రాముఖ్యం ఇస్తున్నారు. దీన్ని మరింత విస్తృతం చేయాలనేది కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన. ఇందుకుగానూ రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి నగరాల్లోనూ టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. (క్లిక్: ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!) - డాక్టర్ ఎన్. యాదగిరిరావు అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ -
పొంటాక్‌తో టీ–హబ్ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ఆధారిత స్టార్టప్‌లకు ఊతమివ్వడం ద్వారా దేశంలోని ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహమిచ్చేందుకు ‘టీ–హబ్’మరో కీలక అడుగు ముందుకేసింది. బ్రిటన్, అమెరికా, భారత్, కెనడాలో ఆవిష్కరణల నిధిని సమకూర్చడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పొంటాక్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో టీ–హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, పొంటాక్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రేమ్ పార్థసారథి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఏడాది పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా టీ–హబ్ కొత్త భవన్లో పొంటాక్ నూతన శాఖ ఏర్పాటుకు వీలుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. టీ–హబ్‌లో పురుడు పోసుకునే స్టార్టప్‌లను యూకే మార్కెట్‌తో అనుసంధానం చేసేందుకు వీలుగా పొంటాక్ టీ–హబ్‌తో కలిసి నిధులు సమకూరుస్తుంది. యూకే, భారత్‌లో స్టార్టప్‌లు మరింత వృద్ధి, మరిన్ని నిధులకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని శ్రీనివాస్‌రావు తెలిపారు. పొంటాక్ ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని, ఈ ఏడాది చివరిలోగా మరో ఐదు కంపెనీల్లో పెట్టుబడులు పెడతామని ప్రేమ్ పార్థసారథి వెల్లడించారు. పొంటాక్ అనుబంధ కంపెనీలు మైనీబో, మాక్స్బైట్ ద్వారా స్థానికంగా రాబోయే రోజుల్లో 5వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. -
టీటా ఆధ్వర్యంలో బోనాలు
మాదాపూర్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్ 2లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆదివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్‌కుమార్ మక్తాల మట్లాడుతూ దేశీయ, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలవాలని ఆకాంక్షిస్తూ 21 బోనాలను మాదాపూర్‌లోని చిన్నపెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద సమర్పించినట్లు తెలిపారు. పోతురాజుల నృత్యాలు, తొట్టెల ఊరేగింపు, కోలాటాల మధ్య బోనాలను అమ్మవారికి సమర్పించినట్టు తెలిపారు. టీహబ్2 నుండి సైబర్ వద్ద ఉన్న దేవాలయం వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శాంతతౌటం, టీహబ్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మనం దేశానికే రోల్ మోడల్
దేశాన్ని ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలిపేలా.. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం యువతకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను అందించడం చాలా కీలకం. యువత ఇక్కడి సవాళ్లతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ పోటీ పడాలని అనుకుంటోంది. ఆ ఆకాంక్షను ముందుగా అర్థం చేసుకుని భారత్‌ను ప్రపంచ పటంపై ప్రత్యేకంగా నిలపాలనే అంశాన్ని తొలుత గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎంటర్ప్రెన్యూర్, టెక్నాలజీ సామర్థ్యమున్న భారత్‌ను నిర్మించడమే మా లక్ష్యం. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: స్టార్టప్‌ల వాతావరణాన్ని, యువతలో అత్యుత్తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ‘టీ–హబ్’ను ఏర్పాటు చేశామని.. ఇది దేశానికే రోల్ మోడల్ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మూలస్తంభాలుగా నిలిచే తర్వాతి తరం స్టార్టప్‌లను పెంచడమే తమ లక్ష్యమని.. రెండో దశ ద్వారా రాష్ట్రంతోపాటు దేశానికి స్టార్టప్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు వస్తుందని చెప్పారు. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ–హబ్ రెండో దశను సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. రూ.400 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లోని మాదాపూర్–రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా ఈ టీ–హబ్ 2.0ను నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రపంచస్థాయి సంస్థను సృష్టించాం.. ‘‘ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన కొద్దిరోజులకే ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించాం. అందులో భాగంగా 2015లో ఏర్పాటైన టీ–హబ్‌ను విస్తరిస్తూ అత్యంత పెద్దదైన టీ–హబ్ రెండో దశను ప్రారంభించాం. స్టార్టప్‌ల వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ప్రారంభించిన టీ–హబ్ ఇప్పుడు దేశానికే రోల్ మోడల్‌గా మారింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఇన్నోవేషన్లను ప్రోత్సహించేందుకు టీ–హబ్ రూపంలో ప్రపంచ స్థాయి సంస్థను సృష్టించగలిగాం. ప్రగతిశీల స్టార్టప్ విధానం ద్వారా కార్పోరేట్లు, విద్యాసంస్థల మధ్య ఫలవంతమైన భాగస్వామ్యం ఏర్పడింది. టీ–హబ్ ఏర్పాటు ద్వారా ఎంటర్ప్రెన్యూర్లకు అవసరమైన వీ–హబ్, టీ–వర్క్స్, టాస్క్, రిచ్, టీఎస్ఐసీ వంటి సోదర సంస్థల ఏర్పాటుకు బాటలు పడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చేలా.. టీ–హబ్ తొలిదశ ద్వారా 2 వేలకుపైగా స్టార్టప్‌లకు ఊతమివ్వడంతోపాటు 1.19 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయి. వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో స్టార్టప్‌లను అనుసంధానం చేయడంలో టీ–హబ్ ఎనలేని పాత్ర పోషించింది. ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టీ–హబ్ రెండో దశ తొలిదశ కంటే ఐదు రెట్లు పెద్దది. టీ–హబ్‌తో ప్రపంచంలో పది అగ్రశ్రేణి స్టార్టప్ వాతావరణం కలిగిన ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచింది. నిధులను రాబట్టడంలో ఆసియాలోని 15 అగ్రశ్రేణి స్టార్టప్ వాతావరణాల్లో తెలంగాణకు చోటు దక్కింది. 2021లో తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్ విలువ 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. తెలంగాణ స్టార్టప్‌లు మన ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఐటీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమోటివ్ రంగాలకు తోడ్పాటును అందిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశుధ్యం, పర్యావరణం వంటి సామాజిక రంగాలకు సంబంధించిన ఉత్పత్తుల రూపకల్పన, ఆయా రంగాల్లో సమస్యలకు పరిష్కారాలనూ కనుగొన్నాయి. తెలంగాణ స్టార్టప్, ఇన్నోవేషన్ పాలసీ వంటి ప్రగతిశీల విధానాల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. టీ–హబ్ 2.0 సదుపాయాన్ని దేశ యువతకు అంకితం చేస్తున్నాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, సైయంట్ సంస్థ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 21 యూనికార్న్‌లు, పలు స్టార్టప్ సంస్థల ప్రతినిధులను సీఎం కేసీఆర్ సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మర్రి జనార్దనరెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, పెద్ద సంఖ్యలో వివి« ద కంపెనీలు, స్టార్టప్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు. టార్చ్ అందుకుని.. కలియతిరిగి టీ–హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇన్నోవేషన్ టార్చ్ (కాగడా)ను అధికారులు సీఎం కేసీఆర్‌కు అందించగా.. టీ–హబ్ 2.0 నమూనాను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ–హబ్ ప్రాంగణమంతా కేసీఆర్ కలియదిరిగారు. వివిధ అంతస్తుల్లో ఏర్పాటు చేసిన కార్యాలయాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. పైఅంతస్తులో కారిడార్‌లో నడుస్తూ నాలెడ్జ్ సిటీ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అంకుర సంస్థల ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులు పనిచేయడానికి, చర్చించుకోవడానికి ఏర్పాటు చేసిన వర్క్ స్టేషన్లు, మీటింగ్ హాళ్లనూ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న మంత్రి కేటీఆర్, అధికారుల బృందాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. దేశ విదేశాల్లోని ఐటీ కేంద్రాలను తలదన్నేలా భవనాలు, ఏర్పాట్లు ఉన్నాయని ప్రశంసించారు. మౌలిక వసతులు మరింత పెంచండి టీ–హబ్ రెండో దశ భవనం, ఏర్పాట్లు, ఇన్నోవేషన్ సెంటర్లను పరిశీలించిన సందర్భంగా అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. రోజురోజుకు పెరుగుతున్న సాంకేతికత, ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా.. సామాన్య ప్రజల జీవితాలు పురోగమించేందుకు తోడ్పడేలా అంకుర సంస్థలు కృషి చేయాలని, ఆ దిశగా టీ–హబ్ ప్రోత్సాహం అందించాలని ఆదేశించారు. భవిష్యత్తులో హైదరాబాద్ ఐటీ రంగం పురోగతి మరింతగా పెరుగుతుందని, దానికి అనుగుణంగా మౌలిక వసతులను పెంచడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇక పోలీసు శాఖలో సాంకేతికతను మరింతగా మెరుగుప ర్చుకునేందుకు, సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు టీ–హబ్‌తో సమన్వయం చేసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డికి సూచించారు. -
స్టార్టప్‌లకు జోష్.. కమాన్ అంటున్న టీ హబ్ 2.O
-
టీ హబ్ 2.O ప్రారంభించిన సీఎం కేసీఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ ఫేజ్ 2ను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో ఈ ఇన్నోవేషన్ సెంటర్‌ను రాయదుర్గంలో నిర్మించింది. ఇందులో రెండు వేలకు పైగా స్టార్టప్‌లను నిర్వహించుకునే వీలుంది. టీ హబ్ 2 మొత్తం 3.14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనంలో మొత్తం 10 అంతస్థులు ఉన్నాయి. జులై ఒకటి నుంచి ఇందులో స్టార్టప్‌లు తమ ఆపరేషన్స్ ప్రారంభించనున్నాయి. చేయూత టీ హబ్ 2 ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. భారత్ లో స్టార్టప్ ఏకో సిస్టం కి అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర స్టార్టప్ పాలసీ కార్పొరేట్‌కి, ఎంటర్ప్రెన్యూర్ లకి సహాయపడేలా ఈ టీ హబ్‌కి రూపకల్పన చేశామన్నారు. కలిసి పనిచేస్తూ ఒకరికి ఒకరు సహాయం అందించుకోవాలని సూచించారు. రోల్ మోడల్ దేశంలో టీ- హబ్ రోల్ మోడల్ గా నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఫేజ్ వన్‌లో నిర్మించిన టీ-హబ్ కంటే ఇది ఐదు రెట్లు పెద్దదని సీఎం తెలిపారు. టీ హబ్ 2 రాకతో టాప్ టెన్ గ్లోబల్ సిస్టం లో తెలంగాణ ఉందని సీఎం వెల్లడించారు. ఆటోమొటివ్, ఫార్మా, అగ్రి, డిఫెన్స్ సిస్టం లలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కేటీఆర్‌కి అభినందనలు తెలంగాణ లో ఐటీ అభివృద్ధి కి కృషి చేస్తున్న ఐటీ మినిష్టర్ కేటీఆర్ కి నా అభినందనలు తెలిపారు సీఎం కేసీఆర్. ఇకపై విద్యాశాఖని మరింత ముందుకు తీసుకెళ్తామని కూడా చెప్పారు. ఇందుకోసం తమ వంతు సహాకారం అందివ్వాలని ఐటీ ప్రతినిధులను ఆయన కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: T-Hub 2.0 Hyderabad: అతిపెద్ద ఇంక్యుబేటర్ టీహబ్పై రతన్ టాటా స్పందన -
28న టీ–హబ్ రెండో దశ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రం ‘టీ–హబ్’రెండో దశను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. రాయదుర్గంలోని టీ–హబ్ భవనంలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీ–హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రసంగాలు, చర్చాగోష్టులు ఉంటాయి. డ్రాయిన్ బాక్స్, మీషో, స్విగ్గీ, ప్రిస్టిన్‌కేర్, డెలివరీ వంటి యూనికార్న్ సంస్థలు, సిక్వోయా క్యాపిటల్, యాక్సెల్, కలారీ క్యాపిటల్స్ వంటి వెంచర్ క్యాపిటలిస్టు సంస్థలు, సాప్, మారుతి సుజుకీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు టీ–హబ్ రెండో దశ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 2016లో టీ–హబ్ రెండో దశకు శంకుస్థాపన చేయగా 2020 నాటికి అందుబాటులోకి వస్తుందని భావించారు. అయితే కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో నిర్మాణం ఆలస్యం అయింది. ఇటీవల పనులు పూర్తి కావడంతో ఈ నెల 28న ప్రారంభించేందుకు ఐటీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
టి హబ్‌కు స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆవిష్కరణల వాతావరణానికి దిక్సూచిగా ఉన్న ‘టి హబ్’కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్’ పథకానికి ఎంపికైంది. కేంద్ర పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) ఈ పథకం కింద అర్హత కలిగిన స్టార్టప్‌లకు రూ.5 కోట్లు విడుదల చేస్తుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న స్టార్టప్‌ల ఆవిష్కరణలకు ఊతమిచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయిలో స్టార్టప్‌లు రాణించేలా వాటికి అవసరమైన అన్ని వసతులు సమకూర్చడంపైనే తాము ప్రధానంగా దృష్టి పెడుతున్నట్టు టి హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు. (క్లిక్: 2 గంటల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..) స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్‌కు అర్హత కలిగిన స్టార్టప్‌లను ఎంపిక చేసేందుకు ఇంక్యుబేటర్ సీడ్ మేనేజ్మెంట్ కమిటీ (ఐఎస్ఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్టు టి హబ్ ప్రకటించింది. రిచ్ డైరక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, ఫ్రెష్‌వర్క్స్ కో ఫౌండర్ కిరణ్ దరిసి, మైగేట్ వ్యవస్థాపక బృందం సభ్యుడు వింగ్ కమాండర్ ఆంథోని అనిష్‌తో పాటు పలువురు పెట్టుబడిదారులు, ఎంట్రప్రెన్యూర్లు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఐఎస్ఎంసీలో సభ్యులుగా ఉంటారు. మూడేళ్ల వ్యవధిలో 15 స్టార్టప్‌లకు ఈ పథకం ద్వారా టి హబ్ నిధులు అందజేస్తుంది. ఆసక్తి ఉన్న స్టార్టప్‌లు సీడ్‌ఫండ్ స్టార్టప్ ఇండియా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని టి హబ్ సీఈవో సూచించారు. (క్లిక్: పాస్‌పోర్టు అపాయింట్మెంట్ల కుదింపు) -
ఇక స్టార్ట్..‘అప్’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఏడేళ్ల క్రితం స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా పురుడు పోసుకున్న టీ–హబ్ ప్రస్తుతం నూతన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారిందని టీ–హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్‌రావు అన్నారు. కరోనా సంక్షోభంతో ఏర్పడిన పరిస్థితుల నుంచి స్టార్టప్‌లు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునే వాతావరణం సృష్టిస్తామన్నారు. టీ–హబ్ ద్వారా ఇప్పటివరకు 1,800కుపైగా స్టార్టప్‌లకు తోడ్పాటు లభించగా సుమారు రూ. 2,300 కోట్ల మేర నిధుల సమకూరాయన్నారు. టీ–హబ్ రెండో దశ వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో సంస్థ ప్రస్థానం, భవిష్యత్ ప్రణాళికలపై శ్రీనివాస్‌రావు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► స్టార్టప్‌లకు అవసరమైన పని ప్రదేశాన్ని (వర్క్ స్పేస్) అందుబాటులో తెచ్చే లక్ష్యంతో ఏర్పాటైన టీ–హబ్ తర్వాతి కాలంలో వాటికి అవసరమైన మార్కెటింగ్, నిధులు, సలహాదారులు, మార్గదర్శకులు, నైపుణ్యం, ప్రోత్సాహం తదితరాలను అందించేలా కార్యకలాపాలను విస్తరించింది. ► ఉద్యోగాల కల్పనలో స్టార్టప్‌లదీ కీలకపాత్ర. ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్‌లు కేవలం రెండు వేలుకాగా ఇప్పుడు ఆరు వేలకుపైగా ఉన్నాయి. ఈ పురోగతిలో టీ–హబ్ కీలక పాత్ర పోషించింది. ► ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), వాటికి వాణిజ్య రూపం (ఇంక్యుబేషన్) ఇవ్వ డంలో టీ–హబ్ నాయకత్వ స్థానంలో ఉంది. 29 రాష్ట్రాల్లో 356 ఇంక్యుబేటర్లు ఉన్నా టీ–హబ్ మాత్రమే రోల్‌మోడల్‌గా ఉంది. Ü ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, సైబర్ భద్రత, సోషల్ మీడియా, బ్లాక్‌చెయిన్, రవాణా, ఏఐ వంటి 14 రంగాల్లో స్టార్టప్‌లు వాణిజ్య స్థాయికి ఎదుగుతున్నాయి. ► స్టార్టప్‌లకు కావాల్సిన మార్కెట్, నిధులు, మార్గదర్శకులు, నైపుణాన్ని అందించడమే టీ–హబ్ ప్రధాన లక్ష్యం. పెద్ద కంపెనీలకు స్టార్టప్‌లను చేరువ చేయడం కూడా మా లక్ష్యాల్లో భాగం. ► హైదరాబాద్ స్టార్టప్‌లకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుతోంది. స్థానిక స్టార్టప్‌లకు భారీ పెట్టుబడులు సాధిం చేందుకు యాక్టివ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్‌తో మాట్లాడుతున్నాం. ► నైపుణ్యం, పెట్టుబడి, ప్రభుత్వం, మార్కెటింగ్‌ను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీ–హబ్‌తోపాటు వీ–హబ్, టాస్క్, టీఎస్ఐసీ సంస్థలు పనిచేస్తుండగా 300కుపైగా వెంచర్ క్యాపిటలిస్టులు కూడా ఉన్నారు. స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు స్టేట్ ఇన్నోవేషన్ పాలసీలో భాగంగా ప్రభుత్వం ప్రారంభించిన టీ–ఫండ్ ద్వారా త్వరలో రూ. 15 కోట్లు అందుబాటులోకి వస్తాయి. ► టీఎస్ఐసీ భాగస్వామ్యంతో కరీంనగర్, ఖమ్మం వంటి పట్టణాల్లోనూ త్వరలో టీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. ► యువతకు చేరువయ్యేందుకు టీ–ట్రైబ్, కిక్ స్టార్ట్, లాంచ్పాడ్ అనే కార్యక్రమాలు రూపొందించాం. ► లాంచ్పాడ్ ద్వారా 30 కాలేజీల నుంచి 50 మంది విద్యార్థుల చొప్పున ఎంపిక చేసుకొని వారికి స్టార్టప్‌లపై శిక్షణ ఇస్తాం. కొన్ని కాలేజీల్లో ఉన్న ఈ–సెల్స్ ద్వారా కిక్‌స్టార్ట్ ప్రోగ్రామ్ కింద ఉపాధ్యాయుల సహకారంతో ఆవిష్కర్తలను గుర్తిస్తాం. టై, సీఐఐ, వీ–హబ్తోనూ క లసి రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణ వాతావరణం కల్పన దిశగా ముందుకు సాగుతాం. ►ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న టీ–హబ్ మొదటి దశలో 160 స్టార్టప్‌లు ఇంక్యుబేట్ అవుతుండగా రెండో దశ ద్వారా 3.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 800కుపైగా స్టార్టప్‌లు ఒకేచోట సిద్ధమయ్యేలా వసతులు సమకూరుస్తాం. ► నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో ప్రస్తుతం టీ–హబ్ నాలుగో స్థానంలో ఉన్నా ఎంత వేగంగా దీన్ని సాధించామన్నది కూడా ముఖ్యమే. రాష్ట్రంలోని ప్రగతిశీల ప్రభుత్వం, మౌలిక వసతులు, నైపుణ్యం తదితరాల మూలంగా తప్పకుండా తొలి స్థానానికి చేరుకుంటాం. -
గ్లోబల్ స్టార్టప్‌ల సరసన టీహబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీ హబ్ అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది.లండన్ సాంకేతిక వారోత్సవాల్లో (టెక్ వీక్) భాగంగా స్టార్టప్ జీనోమ్, గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్షిప్ నెట్వర్క్ సంయుక్తంగా గ్లోబల్ స్టార్టప్ ఇకోసిస్టమ్ రిపోర్ట్–2021 (జీఎస్‌ఈఆర్)ను విడుదల చేశాయి. జీఎస్‌ఈఆర్ నివేదికలో ఆసియా స్టార్టప్‌ల ఫండింగ్ కేటగిరీలో టీహబ్ 20వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 140 ఇకోసిస్టమ్లు కలుపుకుని మొత్తంగా 280 ఎంట్రప్రెన్యూర్ ఆవిష్కరణలు, 30 లక్షలకు పైగా స్టార్టప్‌లను లోతుగా పరిశీలించి జీఎస్‌ఈఆర్ నివేదికను రూపొందించారు. ఖండాలు, దేశాలు, ప్రాంతాలవారీగా సమాచారాన్ని సేకరించి ఈ నివేదికను తయారు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారి నియామకాల్లో 15వ స్థానం, ఫండింగ్, పేటెంట్లు, ఆవిష్కరణల్లో ఆసియాలో 30వ స్థానంలో టీహబ్ నిలిచింది. దీంతో టీ హబ్ సీఈవో రవి నారాయణ్ హర్షం వ్యక్తం చేశారు. -
మారుతీ మొబిలిటీ చాలెంజ్: పది లక్షలు మీ సొంతం..!
న్యూఢిల్లీ: రవాణా, వాహనాలకు సంబంధించిన కొత్త తరం టెక్నాలజీలను ఆవిష్కరించే దిశగా ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) కొత్తగా మొబిలిటీ చాలెంజ్ పోటీలను ఆవిష్కరించింది. హైదరాబాద్‌కు చెందిన టీ–హబ్‌తో కలిసి దీన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. దేశవిదేశాలకు చెందిన సిరీస్ ఎ స్థాయిలోని స్టార్టప్‌లు మొదలుకుని యూనికార్న్‌ల స్థాయి సంస్థలు ఇందులో పాల్గొనవచ్చని వివరించింది. మారుతీ ఇప్పటికే మెయిల్ (మొబిలిటీ, ఆటోమొబైల్ ఇన్నోవేషన్ ల్యాబ్) పేరిట స్టార్టప్‌ల కోసం ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. కొత్తగా ఆవిష్కరించిన మొబిలిటీ చాలెంజ్ .. ప్రత్యేకంగా ప్రారంభ దశలోని, పూర్తి స్థాయిలో విస్తరించిన స్టార్టప్‌ల కోసం ఉద్దేశించినది. ఎంపికైన స్టార్టప్‌లకు మారుతీ, టీ–హబ్ నుంచి తోడ్పాటు లభిస్తుంది. గెలుపొందిన రెండు సంస్థలకు చెరి రూ. 10 లక్షల నగదు బహుమానం కూడా ఉంటుంది. చదవండి: మే నెలలో భారీగా తగ్గిన వాహన విక్రయాలు -
కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు
సాక్షి, హైదరరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారిందన్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు “ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన ‘నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం ద్వారా ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి ముందువరుసలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. పల్లెలకు ఇంటర్నెట్.. విప్లవాత్మక మార్పులు పల్లెలకు ఇంటర్నెట్ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపుగా తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని కేటీర్ వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా వారిని నైపుణ్య శిక్షణలో భాగస్వాములు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌ని ‘స్టార్టప్ క్యాపిటల్’గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్టప్ సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణం అయ్యిందన్నారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్‌ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. (చదవండి: ప్రపంచం చూపు మన వైపు) వ్యాపారానికే కాక వ్యవసాయానికి ప్రాధాన్యత భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ దిశగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటు దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పోల్చిచూస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఉన్నత ప్రమణాలు నెలకొల్పామన్నారు. దేశంలోని 24 గంటలపాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి సైతం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతు బంధు, రైతు బీమా రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతాంగంలో వ్యవసాయం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపారు కేటీఆర్. (చదవండి: ఇంటింటికీ ఇంటర్నెట్ ) తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలనే దేశంలోనే అత్యధికంగా సాగు నమోదు అయిందన్నారు కేటీఆర్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 36 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రైతాంగానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో తనదైన శైలితో ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
మార్చి నాటికి టీ హబ్–2!
సాక్షి, సిటీబ్యూరో: స్టార్టప్‌లకు అడ్డాగా మారిన హైదరాబాద్‌లో టీహబ్– 2వ దశ భవనం ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానుంది. దేశంలో అతిపెద్ద స్టార్టప్‌ల ల్యాబ్ (ఇంక్యుబేటర్)ఇదేనని ఐటీశాఖ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 9 అంతస్తులు..3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈభవనం రూపుదిద్దుకుంటోంది. ఏకంగా వెయ్యి స్టార్టప్ కంపెనీలకు ఈ భవనం నిలయం కానుంది. సుమారు నాలుగువేల మంది సాంకేతిక నిపుణులు తమ సృజనకు పదునుపెట్టే వేదికగా ఈ భవనాన్ని రాయదుర్గంలో ఇంచుమించు మూడెకరాల సువిశాల విస్తీర్ణంలో ఐటీశాఖ నిర్మిస్తోంది. అత్యాధునిక హంగులతో దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్ నిర్మాణ శైలిని పోలిన రీతిలో మరో అధునాతన భవంతి నిర్మాణం జరుగుతోంది. బయటి నుంచి చూసే వారికి ప్రధాన కేంద్రం నుంచి నాలుగు పిల్లర్లు.. వేలాడే రెండు స్టీలు దూలాలతో ఈ భవనం నిర్మించినట్లు..వేలాడే భవంతిలా కనిపించనుంది. సుమారు 9 అంతస్తుల్లో ..60 మీటర్ల ఎత్తు...90 మీటర్ల పొడవున నిర్మిస్తోన్న ఈ భవన నిర్మాణం పనులు వడివడిగా జరుగుతున్నాయి. రెండులక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం...మరో మూడు లక్షల అడుగులమేర సువిశాలమైన పార్కింగ్ సదుపాయంతో సుమారు రూ.276 కోట్ల అంచనావ్యయంతో ఈ భవన నిర్మాణ పనులను చేపట్టారు. గత ఆరునెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో అంకురపరిశ్రమలతోపాటు,ఇంక్యుబేషన్ల్యాబ్..ఉపాధికల్పన వంటి అంశాల్లో నాలుగు వేల మంది పనిచేసేందుకు వీలుగా విశాలమైన అంతస్తులను నిర్మించనున్నారు. పిల్లర్లపై వండర్ బిల్డింగ్.. టీహబ్ రెండోదశ భవంతి అత్యాధునిక ఇంజినీరింగ్ డిజైన్లు,సాంకేతికత ఆధారంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ శైలి ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఈ భవన నిర్మాణంలో నాలుగు పిలర్ల ఆధారంగా ఒక పునాది..గ్రౌండ్‌ఫ్లోర్..దానిపై 9 అంతస్తుల మేర స్టీలు భవంతిని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనుల్లో 9 వేల మెట్రిక్‌టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, మరో 2500 టన్నుల రీఇన్ఫోర్స్ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో కాంక్రీటు నిర్మాణం 25 వేల క్యూబిక్ మీటర్లు కావడం విశేషం. నిర్మాణం సమయంలో పునాదిని 6500 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు నిర్మాణాన్ని 26 గంటల సమయంలో పూర్తిచేయడం ఇంజినీరింగ్ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ నిర్మాణ పనుల్లో 25 మంది నిపుణులైన ఇంజినీర్లు..200 మంది నైపుణ్యంగల కార్మికులు పాల్గొంటున్నారు. ఒక్కో అంతస్తుకు ఓ ప్రత్యేకత... గ్రౌండ్‌ఫ్లోర్: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది. చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట సేదదీరేందుకు విశాలమైన పచ్చికబయలు, తగిన సౌకర్యాల కల్పన ఈ ఫ్లోర్ సొంతం. మొదటి అంతస్తు: విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టే నిర్మాణ శైలి, ఇంక్యుబేషన్ కేంద్రం దీని ప్రత్యేకత. భవనంలో జరిగే మొత్తం రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. రెండో అంతస్తు: అద్భుతమైన 3డి చిత్రాలతో ఆలోచనలను ఆవిష్కరింపజేసే ప్రయోగస్థలాన్ని తలపిస్తుంది. సమావేశమందిరాలు,చర్చా ప్రాంగణాలు ఇందులో ఉంటాయి. 3,4వ అంతస్తులు: అంకురపరిశ్రమలు, ఐటీ, బీపీఓ, కెపిఓ,సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాల ఏర్పాటు, సమావేశాలు, చర్చల నిర్వహణకు అవసరమైన హంగులుంటాయి. ఆకుపచ్చని మొక్కలు, హరితతోరణంతో ఆరోగ్యకరమైన, వినూత్న ఆలోచనలు..వాటి ఆచరణలో పెట్టేందుకు అనువైన పరిస్థితులుంటాయి. 5వ అంతస్తు: ప్రశాంతతకు చిహ్నంగా నిలిచే అటవీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్నచిన్న కాలిబాటలు..నీటి సెలయేర్లు..అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం ఏర్పాటుచేస్తారు. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవనుందీ అంతస్తు. 6,7,8,9వ అంతస్తులు: వివిధ రకాల కార్యాలయాలు,అంకురపరిశ్రమలు ఏర్పాటుచేసుకోవచ్చు. ఉద్యోగులకు ఆనందాన్ని,ఆహ్లాదాన్ని,ఆరోగ్యాన్ని పంచేందుకు అవసరమైన వసతులుంటాయి. ఉద్యోగులకు ఆటవిడుపు.. ఇన్డోర్గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్లు, ఫుడ్ కోర్టులు, కేఫెటేరియాలు ఇందులో ఉంటాయి. 3డి నిర్మాణ శైలి.. ఈ భవన నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజినీరింగ్ ప్రమాణాలు, ప్రపంచంలోకెల్లా అత్యున్నత మైనవి కావడంతో ఈ భవనాన్ని 3డి నిర్మాణంగా భావిస్తున్నారు. ఈ భవన రూపకల్పన, నిర్మాణ విశ్లేషణను ‘ఈటీఏబీఎస్ వి 15.2.2’ అనే నూతన సాఫ్ట్వేర్ ప్రోగ్రాం ద్వారా రూపొందించారు. నిర్మాణ ప్రమాణాల విషయానికి వస్తే ఐఎస్ 456–2000 ప్రమాణాల ప్రకారం బీమ్‌లు, ఆర్సీసీ గోడలు, స్తంభాలను రూపకల్పన చేశారు. భూకంపాలను తట్టుకునేస్థాయిలో ఐఎస్ 1893–2002 ప్రమాణాల ప్రకారం నిర్మించారు. ఈ స్టీలు భవంతి భూకంపాలు, వరదలకు సైతం చెక్కుచెదరని సాంకేతికతతో నిర్మిస్తున్నారు. గురుత్వాకర్షణ బలాలను సైతం ఈ భవంతి తట్టుకుంటుంది. అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనుండడం విశేషం. -
టీహబ్.. ఇంక్యుబెటర్
సాక్షి, హైదరాబాద్:బుర్జ్ దుబాయ్ మాదిరిగా మన నగరంలోనూ ఓ బుర్జ్ రూపుదిద్దుకుంటోంది. అదే టీ–హబ్ 2వ దశ భవనం. ఇది అంకుర పరిశ్రమల స్వర్గధామంగా నిలవనుంది. ఈ భవంతి మార్చి 2020 నాటికి పూర్తి కానుంది. దేశంలో అతిపెద్ద స్టార్టప్‌ల ల్యాబ్(ఇంక్యుబేటర్) ఇదేనని ఐటీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వెయ్యి స్టార్టప్ కంపెనీలకు ఇది ఆలవాలం కానుంది. 4 వేల మంది సాంకేతికనిపుణులు తమ సృజనకు పదును పెట్టే వేదికగా ఈ భవనాన్ని హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గంలో సుమారు మూడెకరాల విస్తీర్ణంలో ఐటీ శాఖ నిర్మిస్తోంది. బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిలో.. దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్ నిర్మాణశైలిని పోలినరీతిలో ఈ అధునాతన భవంతి నిర్మాణం సాగుతోంది. బుర్జ్ దుబాయ్ నిర్మాణపనుల్లో పాలుపంచుకున్న తిరుచ్చి(కేరళ)కి చెందిన ఎవర్ శాండీ కంపెనీ ప్రతినిధులే టీహబ్ రెండోదశ భవన నిర్మాణంలోనూ పాల్గొంటుండటం విశేషం. బయటి నుంచి చూసేవారికి ప్రధాన కేంద్రం నుంచి 4 పిల్లర్లు, రెండు స్టీలు దూలాలతో వేలాడే భవంతిలా కనిపించనుంది. 9 అంతస్తుల్లో 60 మీటర్ల ఎత్తు, 90 మీటర్ల పొడవున దీనిని నిర్మిస్తున్నారు. రెండు లక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం, మరో మూడు లక్షల అడుగుల పార్కింగ్ సదుపాయంతో సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టారు. ఆరునెలలుగా పనులు వేగంగా జరుగుతున్నాయి. అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభ 6,500 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీటు పునాది నిర్మాణాన్ని 26 గంటల సమయంలో పూర్తి చేయడం ఇంజనీరింగ్ రికార్డు అని నిపుణులు చెబుతున్నారు. ఈ భవన నిర్మాణంలో చేపట్టిన వినూత్న విధానాలు, ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలు, ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైనవి. దీనిని 3డి భవనంగా భావిస్తున్నారు. ఈ భవంతి భూకంపాలు, వరదలకు సైతం చెక్కుచెదరని విధంగా నిర్మిస్తున్నారు. గురుత్వాకర్షణ బలాలను సైతం ఈ భవంతి తట్టుకుంటుంది.అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతస్తుకో ప్రత్యేకత గ్రౌండ్ ఫ్లోర్: వీక్షకులకు స్వాగతం చెబుతున్నట్టుగా ఉంటుంది.చక్కటి ఆహ్లాదకరమైన ఆకుపచ్చని గోడలు, ప్రకృతి రమణీయ హరిత దృశ్యాలు, ప్రవేశ ద్వారం, ఆరుబయట పచ్చికబయలు, పలు సౌకర్యాలు మొదటి అంతస్తు: విజ్ఞానానికి, వినూత్నమైన ఆలోచనలకు అద్దం పట్టే నిర్మాణశైలి, ఇంక్యుబేషన్ కేంద్రం దీని ప్రత్యేకత. భవనంలో జరిగే మొత్తం రాకపోకలను వీక్షించేందుకు వీలుగా ప్రత్యేకమైన తెర ఉంటుంది. రెండోఅంతస్తు: అద్భుతమైన 3డి చిత్రాలతో ఆలోచనలను ఆవిష్కరింపజేసే ప్రయోగస్థలాన్ని తలపిస్తుంది. సమావేశ మందిరాలు, చర్చా ప్రాంగణాలు ఉంటాయి. 3, 4వ అంతస్తులు: అంకుర పరిశ్రమలు, ఐటీ, బీపీవో, కేపీవో, సేవారంగానికి చెందిన వివిధ కార్యాలయాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన హంగులు.. ఆకుపచ్చని మొక్కలు. హరితతోరణంలా ఉంటుంది. 5వ అంతస్తు: అటవీప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. చిన్న, చిన్న కాలిబాటలు.. నీటి సెలయేర్లు.. అభిప్రాయాలు, ఆలోచనలు పరస్పరం పంచుకునేందుకు అనువైన వాతావరణం. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవనుందీ అంతస్తు. 6, 7, 8, 9వ అంతస్తులు: వివిధ రకాల కార్యాలయాలు, అంకుర పరిశ్రమలు. ఉద్యోగులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచేందుకు అవసరమైన వసతులు. ఇన్డోర్గేమ్స్, జిమ్‌లు, క్యాంటీన్లు, ఫుడ్ కోర్టులు, కెఫెటేరియాలు కొలువుదీరుతాయి. -
హబ్.. హిట్ హౌస్‌ఫుల్!
సాక్షి, హైదరాబాద్: టీ హబ్ అంకుర పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. అద్భుతాలకు వేదిక అయింది. స్టార్టప్స్ స్పీడప్ అయ్యాయి. లోకల్ అంకుర పరిశ్రమలు గ్లోబల్ స్థాయిని అందుకున్నాయి. ప్రపంచ ఐటీ విపణిలో తనదైన వాటాను సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఏటా సరాసరి వంద స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకుంటున్నాయి. సాంకేతిక ఫలాలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ఐటీ, బ్యాంకింగ్, సేవా, బీపీవో, కేపీవో, ఇన్సూరెన్స్ రంగాల్లో వినియోగదారులకు అందించే సేవలను అత్యంత సరళతరం చేయడం ద్వారా టీ హబ్ అద్భుతాలు సృష్టిస్తోంది. విదేశీ మారకద్రవ్యాన్ని భారీస్థాయిలో ఆర్జించడం ద్వారా ఉపాధి, వాణిజ్య రంగాల్లో శరవేగంగా పురోగమిస్తోంది. నాలుగేళ్ల టీ–హబ్ ప్రస్థానంలో సుమారు 450 కంపెనీలు ఇక్కడే ‘ఇంతింతై వటుడింతై’ అన్న చందంగా ఎదిగి కోట్లాది రూపాయల టర్నోవర్ సాధించినట్లు టీ–హబ్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సుమారు 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెలిసిన ఈ భవనంలో ప్రస్తుతం 170 అంకుర పరిశ్రమలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 870 మంది సాంకేతిక నిపుణులు తమ మేధస్సు, సృజనకు పదును పెడుతుండటం విశేషం. ఇందులో అంకుర పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులు మరో ఏడాదిపాటు నిరీక్షించక తప్పనివిధంగా హౌస్‌ఫుల్ అయింది. టీ–హబ్ అంటే.. అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే నిపుణులను, కార్పొరేట్ కంపెనీలను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన ఆవిష్కరణలను సాకారం చేయడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను గచి్చ»ౌలిలో ఏర్పాటు చేసింది. స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలనుకునే సాంకేతిక నిపుణులకు టీ–హబ్ ఓ దిక్సూచిగా మారిందని నాస్కామ్ తాజా నివేదికలో పేర్కొంది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్‌లు దేశ, విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ, బీపీవో, కేపీవో, సేవా, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. అద్భుతాలు సృష్టించిన టీ–హబ్ స్టార్టప్లివే.. ఎనీటైమ్లోన్.ఐఎన్: నాన్‌బ్యాంకింగ్ ఆర్థిక సంస్థగా పేరొందిన ఈ సంస్థ గతేడాది ఆర్బీఐ నుంచి లైసెన్స్ పొందింది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, చిన్న పరిశ్రమలకు ఆర్థికదన్ను అందిస్తోంది. మైగేట్: ఈ సంస్థ 8.8 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. లూప్ రియాల్టీ అండ్ అప్నోవేషన్ టెక్నాలజీ: హెచ్డీఎఫ్ డిజిటల్ ఇన్నోవేషన్ అవార్డును గెలుపొందింది. గ్లామ్‌ఈగో: ఈ సంస్థ ప్రారంభంలోనే నాలుగుకోట్ల రూపాయల బ్రాండ్ క్యాపిటల్ సాధించింది. పేమ్యాట్రిక్స్: ఈ సంస్థ వంద కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. డొనేట్‌కార్ట్: ఈ సంస్థ రూ.257 కోట్ల టర్నోవర్ సాధించింది. పల్స్యాక్టివ్స్టేషన్స్: ఈ సంస్థ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ఐటీ పరిశ్రమలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. స్టాట్విగ్ గెట్స్: ఈ సంస్థ హెల్త్‌కేర్ రంగంలో చేసిన ఆవిష్కరణలకు యూనిసెఫ్ ప్రశంసలు పొందింది. గాయం మోటార్స్: ఈ సంస్థ ఫోర్బ్స్ ఏసియా–30 సంస్థల జాబితాలో చోటు సంపాదించింది. హగ్ ఇన్నోవేషన్స్: నాస్కామ్ సంస్థతోపాటు లండన్ మేయర్ ప్రశంసలు పొందింది. ఈ ఏడాది చివరలో టీ–హబ్ రెండోదశ టీ–హబ్ మొదటిదశ విజయవంతం కావడంతో ఈ ఏడాది చివరలో మాదాపూర్‌లో 5.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ రెండోదశ భవనాన్ని నిర్మిస్తున్నారు. పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ భవనంలో సుమారు వెయ్యి అంకుర పరిశ్రమలకు చోటు కలి్పంచేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ టీ–హబ్‌లో పురుడుపోసుకునే స్టార్టప్ కంపెనీలకు అంతర్జాతీయ ప్రమాణాలతో సాంకేతిక శిక్షణను అందించేందుకు ఉద్దేశించిన ల్యాబ్ 32 ప్రోగ్రాం అద్భుత ఫలితాలనిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా వందలాది కంపెనీలకు సాంకేతిక అంశాలతోపాటు ఆర్థికంగా, వాణిజ్యపరంగా కలిసొచి్చంది. ఇదేస్ఫూర్తిని కొనసాగిస్తాం. –రవినారాయణ్, సీఈవో, టీహబ్ -
హైదరాబాద్‌కు మరో 15 విదేశీ దిగ్గజాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీలు ఐటీ రంగం రూపాన్ని మార్చేస్తుండటంతో ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు విదేశీ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఐటీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న హైదరాబాద్‌ను ఇందుకు వేదిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు 10 విదేశీ దిగ్గజాలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. ‘‘ఇవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఖరారు కాకుండా వెల్లడించకూడదన్న (నాన్ డిస్‌క్లోజన్) నిబంధనల కారణంగా వాటి పేర్లను వెల్లడించలేం. కాకపోతే వీటిద్వారా రూ.15వేల కోట్ల పెట్టుబడులు, 75వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’’ అని ఐటీ విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 150కిపైగా భారీ, మధ్య తరహా కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేశాయని, టీ హబ్ ఏర్పాటుతో భారీగా స్టార్టప్‌లు వచ్చాయని చెప్పారాయన. కాగా అమెరికాకు చెందిన రెండు ఫాస్ట్‌ఫుడ్ కంపెనీలు ఇక్కడ అతిపెద్ద టెక్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి చేస్తున్న ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు కూడా విశ్వసనీయంగా తెలిసింది. వీటితో పాటు అంతర్జాతీయంగా పేరొందిన ఆటోమొబైల్ కంపెనీ తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని త్వరలోనే ఇక్కడ ఏర్పాటు చేయనుంది. మరోవంక కొరియాకు చెందిన కార్ల విడిభాగాల తయారీ సంస్థ హ్యూందాయ్ మొబిస్ భారీ క్యాంపస్‌ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నట్టు సెప్టెంబరులో ప్రకటించింది. 20 ఎకరాల్లో రానున్న ఈ ఫెసిలిటీ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఐటీలో 4.75 లక్షల మంది... తెలంగాణలో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో 2018 జూన్ నాటికి 4.75 లక్షల పైచిలుకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో గడిచిన ఏడాదిలో చేరినవారు 43,417 మంది. గత నాలుగేళ్లలో ఐటీలో దాదాపు 1.5 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలొచ్చాయనేది సంబంధిత వర్గాల మాట. ఇక ఐటీ ఎగుమతులు 2013–14లో రూ.52,258 కోట్లుంటే, నాలుగేళ్లలో రూ.93,442 కోట్లకు ఎగిశాయి. నాస్కాం గణాంకాల ప్రకారం ఐటీ ఎగుమతులు దేశంలో సగటు 7–9% నమోదైతే.. తెలంగాణలో ఇది 9.32 శాతం. 2020 నాటికి ఎగుమతులు రూ.1.20 లక్షల కోట్లు దాటుతాయని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. టీఎస్ ఐపాస్‌తోనే: కేటీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యంగా రాష్ట్రాన్ని మార్చామని కేటీఆర్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు భౌగోళిక సానుకూలతలున్నాయి. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో టీఎస్ ఐపాస్ వంటి వినూత్న పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను తీసుకురావడం దీనికి తోడయింది. దీంతో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులొచ్చాయి. మున్ముందు కూడా ఈ అనుకూల వాతావరణాన్ని కొనసాగిస్తాం. మరిన్ని పెట్టుబడులను రప్పించి ఉద్యోగావకాశాలు పెంచుతాం. రానున్న సంవత్సరాల్లో తెలంగాణ మరింత వేగంగా పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న నమ్మకం నాకుంది’ అని చెప్పారాయన. -
టీ–హబ్ మైల్స్టోన్
సాక్షి, సిటీబ్యూరో: అంకుర పరిశ్రమల స్వర్గధామం.. గ్రేటర్‌కు మణిహారమైన ‘టీ–హబ్’ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. కెనడాకు చెందిన ప్రతిష్ఠాత్మక కెనడా డిజిటల్ మీడియా నెట్వర్క్ (పబ్లిక్–ప్రైవేట్ ఇన్నోవేషన్ హబ్)తో టీ–హబ్ కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నగరంలో ఇక కెనడా ‘క్లీన్టెక్నాలజీ’అందుబాటులోకి రానుంది. ప్రధానంగా కాలుష్య ఆనవాళ్లు లేకుండా వివిధ రకాల పరిశ్రమల్లో ఉత్పత్తుల పెంపునకు ఈ క్లీన్ టెక్నాలజీ దోహదం చేయనుంది. మరోవైపు బయో టెక్నాలజీ, హెల్త్‌కేర్, సాఫ్ట్వేర్, బిజినెస్ టు బిజినెస్ తదితర రంగాల్లో ఆధునిక సాంకేతికత రానుంది. దీని ఆధారంగా మెరుగైన ఉత్పత్తులు, లక్ష్యాలు, సేవలను పొందడమే ధ్యేయంగా కెనడా అంకుర పరిశ్రమలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనుంది. ఈ ఒప్పందంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సమక్షంలో ఇటీవల టీ–హబ్– డిజిటల్ మీడియా నెట్వర్క్ సంస్థల మధ్య సంతకాలు జరిగినట్లు టీ హబ్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. కెనడా అంకుర పరిశ్రమలకు ఆహ్వానం బయో టెక్నాలజీ, క్లీన్ టెక్నాలజీ, బిజినెస్ టు బిజినెస్ తదితర రంగాల్లో కెనడాలో విశేషంగా కృషి చేస్తున్న అంకుర పరిశ్రమలను మన నగరానికి ఆహ్వానించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కెనడియన్ డిజిటల్ మీడియా నెట్వర్క్(సీడీఎంఎన్)కు అనుబంధంగా పనిచేస్తున్న 26 సంస్థలను టీ– హబ్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే బ్రిడ్జి ప్రోగ్రాంకు ఆహ్వానించినట్లు టీహబ్ ప్రతినిధులు తెలిపారు. ఇందుకోసం ఇటీవలే ఆసక్తిగల కంపెనీల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 15 వరకు ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆయా రంగాల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేసే సంస్థలకు మన దేశంలో మార్కెట్ అవకాశాలను చూపడంతో పాటు ఇక్కడి పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని టీహబ్ సీఈఓ జేజే కృష్ణన్ తెలిపారు. కెనడా నుంచి మెరుగైన సాంకేతికతను పొందడంతో పాటు ఇక్కడి చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహంకల్పించడం, నూతన అంకుర పరిశ్రమలకు జీవం పోయడమే తమ ధ్యేయమన్నారు. ప్రధానంగా నిలకడగల అభివృద్ధి సాధన, హెల్త్‌కేర్ రంగంలో మరింత పురోగతి సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. నూతన అంకుర పరిశ్రమల రాకతో ఉద్యోగవకాశాలు పెరగుతాయని, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతుందన్నారు. కెనడా కంపెనీల ఎంపిక ఇలా.. టీ–హబ్‌లో అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకున్న కంపెనీలను.. వారి ప్రతిభ, గతంలో చేపట్టిన ప్రాజెక్టుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఎంపికైన కంపెనీలకు గచ్చిబౌలిలోని టీ–హబ్ క్యాటలిస్ట్ భవనంలో 75 రోజుల పాటు వర్చువల్ శిక్షణ ఇస్తారు. మరో మూడు వారాలు దేశంలో ఆయా రంగాల్లో ఉన్న మార్కెట్ అవకాశాలు, వాణిజ్య అంశాలపై అవగాహన కల్పిస్తారు. దేశంలోని పలు నగరాల్లో మార్కెట్ మీటింగ్స్‌ను సైతం నిర్వహిస్తారు. టీ–హబ్ చరిత్ర ఇదీ.. తెలంగాణా ప్రభుత్వం 2015లో టీ–హబ్‌ను ఏర్పాటు చేసింది. అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకున్న నిపుణులను, కార్పొరేట్ కంపెనీలను, పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నూతన ఆవిష్కరణలను సాకారం చేయడం దీని లక్ష్యం. అంతేగాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సైతం పెంచనున్నారు. ఇప్పటికే ఈ హబ్‌లో దేశ, విదేశాలకు చెందిన 350 అంకుర పరిశ్రమలు పురుడు పోసుకున్నాయి. స్టార్టప్ కంపెనీలు పెట్టాలనుకునే నిపుణులకు టీ–హబ్ దిక్సూచీగా మారిందని నాస్కామ్ తాజా నివేదికలో పేర్కొనడం విశేషం. -
హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇంక్యుబేటర్!
సాక్షి, హైదరాబాద్: డిఫెన్స్ ఇంక్యుబేటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఐటీ మంత్రి కేటీ రామారావు తెలిపారు. నగరంలో ఉన్న రక్షణ ఎకో సిస్టమ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ గతంలో రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందించారు. నగరంలోని టీహబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేసేందుకు సానుకూలత తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్) పథకంలో భాగంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా ఉన్నామని కేంద్ర మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ పథకంలో రక్షణ, ఏరోస్పేస్ రంగంలోని పరిశోధనలను ప్రోత్సహించేందుకు, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్, ఆయా రంగాల్లో వ్యక్తిగత పరిశోధన చేసే వారికి, పరిశోధన సంస్థలకు, విద్యార్థులకు కేం ద్రం ప్రత్యేకంగా నిధులు సమకూర్చే అవకాశం ఉంటుందని నిర్మలాసీతారామన్ తెలిపారు. టీహబ్ కేంద్రంగా డిఫెన్స్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రమంత్రి సానుకూల స్పం దనపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రక్షణ, ఏరోస్పేస్ రంగాలను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించిందని, ఈ రంగంలో హైదరాబాద్‌కు కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమయ్యిందన్నారు. నగరంలో డిఫెన్స్ ఇంక్యు బేటర్‌ను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న ఎకో సిస్టం మరిం త బలోపేతమవుతుందని అన్నారు. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తా మని కేటీఆర్ తెలిపారు. టీహబ్ రెండో దశ భవనంలో డిఫెన్స్ ఇంక్యుబేటర్‌కు స్థలాన్ని కేటాయించనున్నట్లు వివరించారు. దీంతో రక్షణ రంగంలో పరిశోధనలకు ప్రోటోటైపింగ్, నైపుణ్య శిక్షణ సేవలను అందించేందుకు దోహదపడుతుందని మంత్రి తెలిపారు. -
రోబో పోలీస్‌ను ప్రారంభించిన ఐటీ సెక్రటరీ
-
చార్జ్ తీసుకున్న'రోబో పోలీస్'
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సర కానుకగా హైదరాబాద్‌లో రోబ్ పోలీస్ విధుల్లో చేరనుంది. పోలీసు విభాగంలో లేటెస్ట్ సాంకేతిక విధానాలతో రూపొందించిన రోబో పోలీస్‌ను తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ రోబో డిసెంబర్ 31 నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టులో విధులు నిర్వహించనుంది. టీ-హబ్‌లో స్టార్టప్ కంపెనీగా ప్రారంభమైన 'హెచ్ బోట్స్' రోబోటిక్స్ కంపెనీ పోలీస్ రోబోను రూపొందించింది. ఈ రోబో పోలీసు అన్ని విషయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదులు తీసుకుని కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది.అనుమానితులను, బాంబులను గుర్తిస్తుంది. దుబాయ్‌లో వీల్స్ కదిలే రోబో పోలీసు విధులను నిర్వహిస్తుండగా.. ఇక్కడ దానికి భిన్నంగా నడిచేలా పోలీస్ రోబోను ‘హెచ్ బోట్స్’ రూపకల్పన చేసింది. ప్రపంచంలోనే రెండవ పోలీస్ రోబోగా గుర్తింపు పొందనున్న దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్టు రూపకర్తలు తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో రోబో సేవలు విస్తరించాలని భావిస్తున్నారు. 31 నుంచి నగరంలో రోబో పోలీస్ -
మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రత్యేకంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘వీ–హబ్’ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ‘విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ (డబ్ల్యూఈ)–హబ్ (వీ–హబ్)’గా దీనిని పిలుస్తామని చెప్పారు. దీంతోపాటు మహిళా పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులు పెట్టేందుకు రూ.15 కోట్లతో ‘టీ–ఫండ్’ పేరిట కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నిధుల నుంచి ఒక్కో పరిశ్రమలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రభుత్వం జరిపే కొనుగోళ్లలో 20 శాతం వస్తువులను సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేయాలన్న నిబంధన ఉందని.. ఈ 20 శాతంలో కనీసం నాలుగో వంతు వస్తువులను తప్పనిసరిగా మహిళల పరిశ్రమల నుంచే సేకరించాలన్న నిబంధన తీసుకొస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా మూడు పారిశ్రామికవాడలు ఉన్నాయని.. మహిళలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో పెట్టుబడి రాయితీలు, ప్రోత్సహకాలు అందిస్తోందని చెప్పారు. వారికి మరింత చేయూత అందించాలనే తాజా నిర్ణయాలను తీసుకున్నామని పేర్కొన్నారు. గురువారం జీఈఎస్ సదస్సు ముగింపు సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్‌లతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. టీ–హబ్ తరహాలోనే.. జీఈఎస్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె, సలహాదారు ఇవాంకా తదితరులు టీ–హబ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారని కేటీఆర్ గుర్తుచేశారు. టీ–హబ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యూబేటర్గా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారని.. అదే విధంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘వీ–హబ్’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికా వంటి దేశాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వాలు నిధులు సహాయం చేయాల్సిన అవసరం ఉండదని.. భారత్‌లో మాత్రం పరిస్థితులు వేరని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జీఈఎస్‌కు 140 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని... తనతో మాట్లాడిన వారంతా సదస్సు ఏర్పాట్లు, చర్చాగోష్ఠులు చాలా బాగున్నాయని ప్రశంసించారని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన జీఈఎస్ సదస్సుల్లో అత్యంత విజయవంతమైన సదస్సు ఇదేనని పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీ, ఇవాంకాలతో పాటు సదస్సు నిర్వహణకు సహకరించిన నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సదస్సు ద్వారా అమెరికా–భారత్‌ల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. స్టార్టప్‌లతోనే కొత్త ఉద్యోగాలు ఫోర్బ్స్ జాబితాలోని భారీ పరిశ్రమలు ఇకముందు అదనంగా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తాయని తాను అనుకోవడం లేదని... కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ద్వారానే కొత్త ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ చెప్పారు. జీఈఎస్ సదస్సు ద్వారా ఔత్సాహిక, యువ పారిశ్రామికవేత్తలకు ఎంతో ప్రయోజనం కలిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రాధాన్యతాంశాలుగా తీసుకుంటోందని చెప్పారు. భారత దేశమంటే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై అనే నాలుగు మెట్రో నగరాలే కాదని.. వాటి వెలుపల హైదరాబాద్ వంటి అందమైన భారతదేశం ఉందని ప్రకటించారు. జీఈఎస్ వంటి ఎన్నో కార్యక్రమాలను హైదరాబాద్ నిర్వహించగలదన్నారు. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చేపట్టిన ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ప్రచారోద్యమం వెనుక కీలకంగా ఉన్న అమితాబ్‌కాంత్.. హైదరాబాద్‌లో పర్యాటకానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారని చెప్పారు. మరో సిలికాన్ వ్యాలీ హైదరాబాద్ ప్రపంచానికి హైదరాబాద్ నగరం మరో సిలికాన్ వ్యాలీ అని జీఈఎస్ సదస్సు చాటిచెప్పిందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ ప్రశంసించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణతో పాటు భారత్‌లో కొత్త పరిశ్రమల స్థాపన, స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు ఊపు వస్తుందని చెప్పారు. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయన్నారు. గురువారమే దేశ జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయని.. గత త్రైమాసికంలో దేశం 6.3 శాతం వృద్ధి సాధించడం శుభ సూచకమని పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయంలో వృద్ధిరేటు 5.7 శాతమేనని.. దేశం తిరిగి వృద్ధి బాటలో పయనిస్తోందని గణాంకాలు సూచిస్తున్నాయని అమితాబ్‌కాంత్ చెప్పారు. దక్షిణాసియాలో తొలిసారిగా నిర్వహించిన జీఈఎస్‌కు సహకరించిన అమెరికా, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ, ఇవాంకా, కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, నిర్మలా సీతారామన్‌లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. జీఈఎస్ ముగింపు సెషన్లో యూఎస్ కాన్సుల్ జనరల్ క్యాథరీన్ హడ్డా, కేటీఆర్, జయేశ్ రంజన్ తదితరులు -
టీ–హబ్ స్ఫూర్తితో ఢిల్లీలో ఇంక్యుబేటర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని టీ–హబ్‌ను ఆదర్శంగా తీసుకుని ఢిల్లీలో కూడా త్వరలో ఒక ఇంక్యుబేటర్‌ను ఏర్పా టు చేస్తామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తమతో టీ–హబ్ అనుభవాలు పంచుకోవాలని కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఆయనకు వివరించారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఐటీ పరిశ్రమలో నెలకొని ఉన్న అనిశ్చితిని తొలగించి పరిశ్రమకు కొత్తఊపు తీసుకొచ్చేందుకు టీ–హబ్ పేరుతో ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. టీ–హబ్‌లో భాగస్వాములు అయ్యేందుకు తెలంగాణ వారికే కాకుండా ఇతర రాష్ట్రాల వారికీ అవకాశం కల్పించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి టీ–హబ్ మంచిపేరు తీసుకొచ్చిందని, దీంతో నగరంలో స్టార్టప్ పరిశ్రమల ఏర్పాటు పెరిగిందని తెలిపారు. ఫలితంగా యువత ఆశలకు గొప్ప ఆలంబన దొరికిందన్నారు. టీ–హబ్ గురించి తాము విన్నామని, అందుకే పరిశీలించడానికి వచ్చామ ని సిసోడియా అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఐటీ తదితర రంగాల్లో ప్రగతి సాధించిందని ప్రశంసించారు. ఢిల్లీ లోని ఉన్నత విద్యా సంస్థలు, పరిశ్రమల వర్గాలను ఇంక్యుబేటర్ ఏర్పాటులో భాగస్వాములు చేసుకోవాలని కేటీఆర్ సూచిం చారు. గేమింగ్, యానిమేషన్, డేటా అనా లిటిక్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలకు సం బంధించి ప్రత్యేకంగా రూపొందించిన విధానాలను కేటీఆర్ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. టెక్నాలజీని అందిపుచ్చుకున్నతెలంగాణ: సిసోడియా తెలంగాణ ప్రభుత్వం టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగుతోందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కితాబిచ్చారు. అనంతరం టీ–హబ్ సందర్శనకు వెళుతూ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో సిసోడియా ముచ్చడించారు. తెలంగాణ ఏర్పాటు చేసిన టీ–హబ్ అద్భుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తామని, తెలంగాణ సహకారం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పటికీ అభివృద్ధి చెందుతోందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. ‘హైదరాబాద్ వాతావరణం బాగుంది. ఢిల్లీలో ఆకాశాన్ని చూసే అవకాశం లేదు. ఇక్కడ ఆ అవకాశం కలిగింది. రాజకీయాల్లో ఆప్, టీఆర్ఎస్ కలసి పనిచేసే విషయాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్తాం’ అని సిసోడియా పేర్కొన్నారు. -
పాలమూరులో ఐటీపార్క్.. గద్వాల్లో హ్యాండ్లూమ్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్ సత్ఫలితాలను ఇస్తోందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 25 కార్పోరేట్ సంస్థలతో టీహబ్ భాగస్వామ్యం ఏర్పర్చుకుంది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక భద్రత కల్పిస్తుందని అన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని.. టీహబ్ -2 ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా మారనుందని ఆయన తెలిపారు. అదేవిధంగా చేనేత కార్మికులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,270 కోట్లు కేటాయించామని కేటీఆర్ వెల్లడించారు. చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని. గద్వాలలో త్వరలో హ్యాండ్లూమ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని స్టార్టప్ సంస్థలు తమ ఆలోచనా సరళిని మార్చుకోవాలని.. కేవలం సమస్య పరిష్కరించడమనే స్థాయికి పరిమితం కాకుండా బహుళజాతి స్థాయికి చేరాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రభావవంతంగా వివరించే కళను తెలుసుకోవాలని సూచించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ–హబ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా విస్తరిస్తామని ప్రకటించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఇండియా ఎకనమిక్ సదస్సులో భాగంగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. స్టార్టప్‌లు నిలదొక్కుకోవడం కోసం ప్రారంభ దశలో ప్రభుత్వాలు నిర్వహించాల్సిన పాత్రను వివరించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం టీ–హబ్‌ను స్థాపించింది. దేశంలోనే అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ఇది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తోంది. దాని ద్వారా మార్గదర్శనం, పెట్టుబడులు, మార్కెటింగ్, ప్రభుత్వ తోడ్పాటు అందుతున్నాయి. సామాన్యులు ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారం కనుక్కునేలా స్టార్టప్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశాన్ని కల్పించింది. ఆర్టీఏ ఎం–వాలెట్ ఆ విధంగా పుట్టుకొచ్చిందే. టీ–హబ్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా విస్తరిస్తాం. సాధారణంగా ఆలోచనలు మొగ్గలోనే తెగిపోతుంటాయి. కానీ టీ–హబ్‌లోకి సృజన కలిగిన వాళ్లు ఆలోచనతో వచ్చి ఉత్పత్తులను సృష్టిస్తారు..’’అని కేటీఆర్ చెప్పారు. నిధులే కాదు.. మౌలిక వసతులు ఉండాలి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్టార్టప్ ఇండియా కార్యక్రమంపై స్పందించాలని పలువురు కోరగా.. కేవలం నిధులు సమకూరిస్తే సరిపోదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వ్యవస్థాపకతను ప్రభుత్వం సృష్టించలేదని, అది ప్రైవేటు రంగం నుంచి రావాలని చెప్పారు. ప్రభుత్వాలు మాత్రం మౌలిక వసతులను, వేది కలను సమకూర్చాలన్నారు. గొప్ప ఆలోచనలకు కార్యరూపమిచ్చేందుకు వీలుగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. స్టార్టప్ ఇండియా తరహాలోనే చిన్నారులు సృజనాత్మక ఆవిష్కరణలు సాధిం చేందుకు ప్రోత్సాహకరంగా వేదికలు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాన్యులు పడే ఇబ్బందులను వివరించి వాటికి పరిష్కారాలు కనుక్కోవాలని సూచించారు. పారిశ్రామికవేత్తలతో భేటీ ఎకనమిక్ సదస్సులో పాల్గొనడానికి ముందు కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. గోద్రెజ్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆది గోద్రెజ్, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్, రెన్యూ పవర్ చైర్మన్ సుమన్ సిన్హా, యూఎస్ఐబీసీ సీనియర్ డైరెక్టర్లు జై, అభిషేక్ కిషోర్, అవ్వాడ గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, ఎస్ఏపీ హనా ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ అధ్యక్షుడు కె.దిలీప్‌కుమార్, లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, వెల్స్పన్ ఇండియా సీఈవో దీపాలి గోయెంకా, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఎండీ కజునోరి కోనిషి తదితరులతో సమావేశమై... తెలంగాణలో పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకు గల అనుకూలతలను వివరించారు. ఈ సందర్భంగా పోచంపల్లి చేనేత వస్త్రాలు, హస్తకళాకృతులను పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ బహూకరించారు. -
టీహబ్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి
హైదరాబాద్: మాదాపూర్‌లో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టీ హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నోవర్టిస్ సాఫ్ట్వేర్ కంపెనీ సమీపంలో జరుగుతున్న టీ హబ్ నిర్మాణ పనుల్లో సోమవారం రాత్రి సెల్లార్ పునాది గోడ కూలి జియాఉల్ అన్సారీ అలియాస్ సోను(22), దిలీప్‌కుమార్ యాదవ్(40)లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వీరితోపాటు గాయపడిన ఇతర కార్మికులు చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారు బిహార్‌కు చెందినవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘త్వరలో టీ హబ్ రెండోదశ ప్రారంభం’
హైదరాబాద్: టీ హబ్ రెండో దశను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో శనివారం జరిగిన టీహబ్ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యువత ఆలోచనలు రెక్కలు తొడిగాయని.. టీహబ్ వల్ల ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా నగరంలో ఇంక్యుబేషన్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, నాస్కామ్ చైర్మన్ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో టీ–హబ్ రెండో దశ
రాయదుర్గం: రాష్ట్రంలో టీ–హబ్ సెకండ్ ఫేజ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్‌లో సామాజిక ప్రభావ స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉబెర్ ఎక్సేంజ్‌తో టీ–హబ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంపై మంగళవారం రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు. అందులో భాగంగా అన్ని సౌకర్యాలతో కూడిన టీ హబ్‌ను ఏర్పాటు చేశామని, దీన్ని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండవ దశ టీహబ్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. నిజామాబాద్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. ఉబెర్ ఏషియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఎంతో సంతోషానిచ్చిందన్నారు. సామాజిక ప్రభావ స్టార్టప్‌ల కింద ఎంపిక చేసిన వాటికి మెంటరింగ్, ఫండింగ్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, టెక్నాలజీని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.ఎంపిక చేసిన టాప్ 20 స్టార్టప్ కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఉబెర్ ఇండియా పబ్లిక్ పాలసీస్ గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ కిరణ్ వివేకానంద, టీ హబ్ సీఈఓ జయ్‌కృష్ణ ఒప్పందంపై సంతకాలు చేశారు. -
నాలుగేళ్లలో అగ్రగామిగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో తెలంగాణను వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఒకరోజు ముంబై పర్యటనలో భాగంగా మంత్రి పలువురు వ్యాపార దిగ్గజాలను కలిశారు. ఫోర్త్ ఇంజక్షన్, బ్లో మౌల్డింగ్ అండ్ పీఈటీ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 600 మంది ప్లాస్టిక్, పెట్రో కెమికల్, ప్యాకేజింగ్ రంగాల పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. తెలంగాణలో ఆయా పరిశ్రమలకున్న అవకాశాలను వివరించారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పెస్, రక్షణ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉంచేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. టీ హబ్, నూతన పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి అంశాలు ఈ రంగాల్లో ముందుకు వెళ్లేం దుకు దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా నిరంతర విద్యుత్ సరఫరా, టీఎస్ ఐపాస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుదల వంటి అంశాలతో దేశంలోనే పెట్టుబడులకు అత్యుత్తమ స్నేహపూరిత వాతావరణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న ల్యాండ్‌బ్యాంకు పెట్టుబడులకు మరో అదనపు ప్రయోజనమని మంత్రి తెలిపారు. వంద ఎకరాల్లో సుల్తాన్‌పూర్‌లో మొదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రెండో దశలో మూడు వందల నుంచి 500 ఎకరాల్లో ప్లాస్టిక్ సిటీని మెదక్ నిమ్జ్ పార్కులో ఏర్పాటు చేస్తామని అన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాల గురించి పరిశ్రమల ప్రతినిధులకు మంత్రి వివరించారు. మంత్రి ప్రజెంటేషన్‌పై పారిశ్రామికవేత్తలు అభినందనలు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌ను కలిసిన మంత్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్‌ను మంత్రి కేటీఆర్ ముంబైలో గురువారం కలిశారు. ఎంఎస్ఎం ఈ సెక్టార్‌లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్‌కు వివరించారు. పలు ఎంఎస్ఎంఈ రంగ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఈ పరిశ్రమలను ఆదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలను వివరించి పలు సూచనలను తీసుకున్నారు. -
గో-బిజ్తో టీహబ్ ఒప్పందం
హైదరాబాద్: అమెరికాలోని ‘ఐ హబ్’లతో తెలంగాణ ‘టీ హబ్’ను అనుసంధానం చేసేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం కాలిఫోర్నియాతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. సంయుక్త ఆవిష్కరణలు, ప్రత్యామ్నాయ ఇంధనంలో పరస్పర సహకారం, పర్యావరణ సాంకేతికత, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పారిశ్రామిక రంగం, వాణిజ్య ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి రంగం తదితరాలపై ఇరు ప్రాంతాల నడుమ ఒప్పందం కుదిరింది. సిలికాన్ వ్యాలీ, తెలంగాణ నడుమ వినూత్న ఆలోచనల మార్పిడికి.. కాలిఫోర్నియా ఒప్పందంతో కొత్తమార్గం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐ హబ్‌లతో అనుసంధానం రెడ్డింగ్ మొదలుకుని సాన్‌డీగో వరకు సుమారు 15 ప్రముఖ ఐహబ్‌లు.. అమెరికాలోనే అతి పెద్ద ‘గో-బిజ్ ఇన్నోవేషన్ నెట్వర్క్’గా ఏర్పడ్డాయి. ప్రస్తుత ఒప్పందం ద్వారా గో బిజ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌తో టీ హబ్ అనుసంధానమవుతుంది. తద్వారా టీ హబ్‌లోని తమ భాగస్వామ్య సంస్థలు, కంపెనీలతో కాలిఫోర్నియాలోని ఐ హబ్‌లు వినూత్న ఆలోచనలను పంచుకునేందుకు వీలవుతుంది. -
టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టి-హబ్‌కు చేరుకున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఉదయం తొలుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో గంటా 20 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టి-హబ్‌కు చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. తారకరామారావు, ఇతర ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు ఘన స్వాగతం పలికారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి, రాష్ట్రం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులను పెంచే లక్ష్యంతో టి-హబ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. హబ్ విశేషాలను మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు సత్య నాదెళ్లకు వివరించారు. ఆ వివరాలను ఆయన ఆసక్తిగా విని తెలుసుకున్నారు. -
టి-హబ్‌లో సత్య నాదెళ్లకు ఘనస్వాగతం
-
హై ఫై సెల్ఫీ...
టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా గురువారం గచ్చిబౌలిలో టీ హబ్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ఈసందర్భగా మంత్రి కేటీఆర్, రతన్టాటాలతో సెల్ఫీ దిగుతున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు.. -
టీ హబ్‌ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ : ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు తెలంగాణ ఐటీ శాఖ కేటీఆర్ మంగళవారం టీ-హబ్‌ను ప్రారంభించారు. ఈ హబ్ ద్వారా 15వందల మంది వ్యాపారవేత్తలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఐఎస్బీ, నల్సార్ యూనివర్సిటీ,నార్ కామ్‌లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారు వ్యాపార మెళకువలు కూడా నేర్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఈ టీ-హబ్ ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. -
యువ వ్యాపారుల కోసం టీ-హబ్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించే దిశగా ఈ ఏడాది ఆఖరు నాటికి టీ-హబ్ పేరిట ప్రత్యేకంగా ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. సాంకేతిక నైపుణ్యాలు ఉన్న వారు వ్యాపార మెళకువలు కూడా నేర్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన వివరించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ట్రిపుల్ ఐటీ, నల్సార్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఐఎస్బీలో టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ కోర్సును ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. హైసియా, ట్రిపుల్ ఐటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ఐఎస్బీలో ఆగస్టు 30, 31లో స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహిస్తుందని కేటీఆర్ చెప్పారు. ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ సలహాదారు హెచ్‌కే మిట్టల్, పలువురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.