ఒప్పందం పత్రాలను మార్చుకుంటున్న కిరణ్ వివేకానంద,జయ్‌కృష్ణ .చిత్రంలో జయేష్ రంజన్, ఎరిక్ అలెగ్జాండర్
రాయదుర్గం: రాష్ట్రంలో టీ–హబ్ సెకండ్ ఫేజ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్‌లో సామాజిక ప్రభావ స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉబెర్ ఎక్సేంజ్‌తో టీ–హబ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంపై మంగళవారం రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు.
అందులో భాగంగా అన్ని సౌకర్యాలతో కూడిన టీ హబ్‌ను ఏర్పాటు చేశామని, దీన్ని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండవ దశ టీహబ్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. నిజామాబాద్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. ఉబెర్ ఏషియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఎంతో సంతోషానిచ్చిందన్నారు.
సామాజిక ప్రభావ స్టార్టప్‌ల కింద ఎంపిక చేసిన వాటికి మెంటరింగ్, ఫండింగ్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, టెక్నాలజీని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.ఎంపిక చేసిన టాప్ 20 స్టార్టప్ కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఉబెర్ ఇండియా పబ్లిక్ పాలసీస్ గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ కిరణ్ వివేకానంద, టీ హబ్ సీఈఓ జయ్‌కృష్ణ ఒప్పందంపై సంతకాలు చేశారు.