jayeshranjan
-
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యలో తగ్గనున్న సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సిలబస్‌ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ మార్గదర్శకాలు వచ్చాక పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. బుధవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్‌రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కేంద్రం మార్గదర్శకాలు ముందుగా వస్తే అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని, లేదంటే రాష్ట్రంలో ముందుగా ఆన్లైన్లో పాఠాలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని, ఆ తరువాత కరోనా పరిస్థితిని బట్టి ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉన్నందున వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌లో కాలేజీలు తెరిచినా హాస్టళ్లు తెరవద్దని, భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. కాలేజీల ప్రారంభంతోపాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబ«ంధించి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అవసరమైతే ఆ తరువాత ముఖ్యమంత్రితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
త్వరలో టీ–హబ్ రెండో దశ
రాయదుర్గం: రాష్ట్రంలో టీ–హబ్ సెకండ్ ఫేజ్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్ పేర్కొన్నారు. గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్‌లో సామాజిక ప్రభావ స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉబెర్ ఎక్సేంజ్‌తో టీ–హబ్‌ల మధ్య కుదిరిన ఒప్పందంపై మంగళవారం రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్‌లకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు. అందులో భాగంగా అన్ని సౌకర్యాలతో కూడిన టీ హబ్‌ను ఏర్పాటు చేశామని, దీన్ని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు తెలిపారు. నగరంలో రెండవ దశ టీహబ్‌ను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు. నిజామాబాద్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు. ఉబెర్ ఏషియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ఎంతో సంతోషానిచ్చిందన్నారు. సామాజిక ప్రభావ స్టార్టప్‌ల కింద ఎంపిక చేసిన వాటికి మెంటరింగ్, ఫండింగ్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, టెక్నాలజీని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.ఎంపిక చేసిన టాప్ 20 స్టార్టప్ కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనంతరం ఉబెర్ ఇండియా పబ్లిక్ పాలసీస్ గవర్నమెంట్ అఫైర్స్ హెడ్ కిరణ్ వివేకానంద, టీ హబ్ సీఈఓ జయ్‌కృష్ణ ఒప్పందంపై సంతకాలు చేశారు.