రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్‌లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు.
నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్‌ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment