robotics
-
రోబోటిక్స్ విజేత
‘‘రోబోటిక్స్ రంగంలో బాలురు మాత్రమే రాణిస్తారని ఒకప్పుడు అనుకున్నాను. అది కేవలం అపోహ మాత్రమే. బాలికలు కూడా రాణించగలుగుతారని, బాలురకంటే మెరుగైన ఫలితాలను సాధించగలరని నిరూపించాను’’ అన్నది ఉషా కుమావత్. పదిహేనేళ్ల ఉషా కుమావత్.గోవా, పంజిమ్ పట్టణంలో పదవ తరగతి చదువుతున్న ఉష గత మార్చి నెలలో దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ కోవెడర్ 5.0 ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ రోబో సిటీ చాలెంజ్‌లో విజేతగా నిలిచింది. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ కాన్సెప్ట్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో అరవై దేశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో స్టెల్లార్ కంట్రోల్ స్కిల్స్‌లో ఉష ప్రతిభ కనబరిచింది. తన విజయాన్ని తన టీచర్ మాయా కామత్‌కి అంకితమిచ్చింది ఉషా కుమావత్. వీడియోగేమ్ కూడా తెలియదు ‘‘మా సొంతూరు రాజస్థాన్‌లోని గుహాలా గ్రామం. నేను పుట్టింది పెరిగింది గోవాలోనే. నాన్న భవన నిర్మాణరంగంలో టైల్స్ అమర్చే పని చేస్తాడు. అమ్మ గృహిణి. కంప్యూటర్ను దూరం నుంచి చూడడమే కానీ కనీసం తాకిన సందర్భం కూడా లేదు. అలాంటి నన్ను మా టీచర్ మాయా కామత్ ఒక రోబోటిక్స్ వర్క్ షాప్‌కి తీసుకెళ్లారు. నాకు చాలా ఆసక్తి కలిగింది. ఎన్నో సందేహాలు కలిగాయి. అవన్నీ టీచర్ని అడుగుతూ ఉంటే ఆమె కూడా చాలా ఇష్టంగా వివరించేవారు.కోడింగ్ కూడా నేర్పించారు. నాకు వీడియో గేమ్ ఆడిన అనుభవం కూడా లేదు. అలాంటిది రోబోటిక్స్‌లో నైపుణ్యం సాధించగలిగానంటే అంతా మా టీచర్ప్రోత్సాహమే. దుబాయ్‌లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ముందు గురుగ్రామ్‌లో జాతీయస్థాయి పోటీలకు తీసుకెళ్లారు. పోటీల వేదిక మీద రోబోను ఆపరేట్ చేయడం కొంత బెరుగ్గా అనిపించినప్పటికీ నా ప్రతిభను ప్రదర్శించగలిగాను. ఆ పోటీల్లోనే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాను.ఆ పోటీల్లో రాణించాలంటే ఇంకా చాలా బాగా సాధన చేయాలని నాకే అర్థమైంది. ఎక్కువ రోజుల్లేవు. నా రోబో పేరు క్వార్కీ. దాంతో ఐదు నిమిషాల సమయంలో మ్యాచింగ్ కలర్స్, జడ్జింగ్ డైరెక్షన్స్, నావిగేటింగ్, సెగ్రెగేటింగ్ వంటి పదకొండు పనులు చేయించి నిరూపించాలి నేను. రోజూ టైమ్ పెట్టుకుని సాధన చేస్తూ ఒక రోజుకంటే మరో రోజు ఇంకా తక్కువ సమయంలో పూర్తి చేస్తూ మొత్తానికి లక్ష్యాన్ని సాధించగలిగాను’’ అని వివరించింది ఉషా కుమావత్. పేరు మారింది ఇదిలా ఉండగా... ఉషకు రోబోటిక్స్‌లో శిక్షణ ఇవ్వడం కంటే దుబాయ్ వెళ్లడానికి పాస్‌పోర్టు కోసం పడిన కష్టాలే పెద్దవన్నారు ఉష టీచర్ మాయా కామత్. ‘‘పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలను చూస్తే ఒకదానితో మరొకటి సరిపోలడం లేదు. స్కూల్ రికార్డ్స్‌లో ఉషా కుమావత్ అని ఉంది, బర్త్ సర్టిఫికేట్లో ఉషా కుమారి అని ఉంది. బర్త్ సర్టిఫికేట్‌ను సరిచేయమని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేయాల్సి వచ్చింది. ఉష తల్లిదండ్రుల మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు. వారి పెళ్లి రాజస్థాన్‌లోని వాళ్ల సొంతూరులో జరిగింది. ఆ సర్టిఫికేట్ కుదరదని పాన్ కార్డు కోసం అప్లయ్ చేశాం.పాన్ కార్డు రావాలంటే ముందు ఆధార్ కార్డులో పేరు సరి చేసుకోవాల్సి వచ్చింది. ఇన్ని ప్రయాసల తర్వాత పాస్‌పోర్టు జారీ అయింది. కానీ ప్రయాణఖర్చులు ప్రశ్నార్థకమయ్యాయి. గోవాలోని పెద్ద వ్యాపార కంపెనీలను అభ్యర్థించి మొత్తానికి అవసరానికి తగిన డబ్బు సమకూర్చగలిగాను. దుబాయ్ వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ చక్కటి ప్రతిభ ప్రదర్శించి మనదేశానికి గౌరవం తెచ్చింది. ఉష లాగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉంటే నేర్పించి వారిని విజేతలుగా తీర్చిదిద్దడానికి మాలాంటి టీచర్లు సిద్ధంగా ఉంటారు. మా విజయం మా విద్యార్థులే’’ అన్నారు మాయా కామత్. -
హ్యుమనాయిడ్ రోబోను విడుదల చేసిన యూనిట్రీ.. ఫొటోలు
-
హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..?
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ నిత్యం టెక్నాలజీలో మార్పులు చేస్తూ తమ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే ‘ప్రాజెక్ట్ టైటన్’తో ఆటో మొబైల్ రంగంలో అడుగుపెట్టాలనుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్మార్ట్ కార్ ప్రాజెక్ట్‌ను నిలిపేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దాన్ని రద్దుచేసుకున్నట్లు చెప్పిన కొద్ది రోజుల్లోనే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు తెరతీయనున్నట్లు తెలిసింది. ఈమేరకు హోమ్ రోబోటిక్స్ విభాగంలో అడుగుపెట్టేందుకు యాపిల్ సిద్ధమవుతుందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాల ప్రచురితమయ్యాయి. హోమ్ రోబోటిక్స్‌లో భాగంగా యాపిల్ తీసుకురానున్న ఈ రోబో ఇంటి యజమానిని అనుసరిస్తూ పనులు చేయడంలో సాయపడుతుంది. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు డిస్ప్లే చూపిస్తుంది. ఈ రోబో రెండు చేతులు, ఒక డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాలు ఈ ప్రాజెక్ట్‌పై పని చేయనున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని, అయితే దీనిపై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఇదీ చదవండి: మిమిక్రీ టూల్‌ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ యాపిల్ సంస్థ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి భారీగా ఖర్చు చేస్తూ ఉంటుంది. ప్రాజెక్ట్ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలుండనున్నాయో అంచనా వేస్తుంది. తీరా ప్రాజెక్ట్ తుది దశకు చేరినా అవసరం లేదనుకుంటే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. ఈ తరహాలో స్మార్ట్ కారు, డిస్ప్లే ప్రాజెక్టులను యాపిల్ పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఏ మేరకు తుదిదశకు చేరుకుని ఉత్పత్తి వరకు చేరుకుంటుందోనని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
చిట్టి బుర్రలు..గట్టి ఆలోచనలు
రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు): చిట్టి బుర్రల్లో ఆధునిక ఆలోచనలు మొలకెత్తాయి. స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్‌కు ట్రాక్‌పై ఏదైనా అడ్డంకి ఏర్పడితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సడన్‌గా ఆగిపోయే ఇంటెలిజెంట్ ట్రైన్ ఇంజిన్.. చిన్న బటన్ సహాయంతో నడిచేలా దివ్యాంగుల కోసం రూపొందించిన స్మార్ట్ వీల్ చైర్.. మనిషికి అవసరమైన వివిధ పనులు చేసి పెట్టే ఎనిమిది రకాల రోబోలు ఆవిష్కృతమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతున్నాయి. పలువురి అభినందనలు అందుకున్నాయి. కాగా, ఇటీవల ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో నిర్వహించిన రోబోటిక్ వర్క్‌షాప్‌లో మూడు రోజుల పాటు 7, 8, 9, పది తరగతుల విద్యార్థులు శిక్షణ పొందారు. అనంతరం వారు రూపొందించిన వివిధ రకాల రోబోలను శనివారం ప్రదర్శించారు. వీటిలో స్మార్ట్ వీల్ చైర్, స్మార్ట్ షాపింగ్ ట్రాలీ, కెమెరాతో పనిచేసే స్పై రోబో, సెర్వింగ్ (ఆహార పదార్థాలు వడ్డించే) రోబో, అగ్రికల్చర్‌కు సంబంధించి హార్వెస్టింగ్ రోబో, ఇంటిలిజెంట్ ట్రైన్ ఇంజన్ తదితర ఎనిమిది రకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
కాలుష్యానికి పరిష్కారంగా త్రీ-వీలర్స్ కార్లు..సౌరవ్ సక్సెస్‌స్టోరీ
వివిధ రకాల పరికరాలు, రోబోట్లు తయారుచేసే సరదా దిల్లీకి చెందిన సౌరవ్ కుమార్‌ను ఈవీ స్టార్టప్ ‘యూలర్’ వరకు తీసుకెళ్లింది. కాలుష్య సమస్యకు పరిష్కారంగా తయారు చేసిన ఈ కంపెనీ త్రీ–వీలర్స్ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్, బిగ్బాస్కెట్లాంటి పెద్ద కంపెనీలు ‘యూలర్’ క్లయింట్స్‌గా ఉన్నాయి.... ‘బెటర్ ఫ్యూచర్’ అంటూ కుటుంబంతో బిహార్ నుంచి దిల్లీకి వెళ్లి స్థిరపడ్డాడు సౌరవ్ కుమార్ తండ్రి. సౌరవ్ కుమార్‌కు గణితం అంటే ఇష్టం. రోబోట్ల తయారీపై ఆసక్తి. ఇక తండ్రికి గణితంతో పాటు సైన్స్ కూడా ఇష్టం. ఇద్దరూ సైన్స్‌కు సంబంధించిన విషయాలను ముచ్చటించుకునేవాళ్లు. దిల్లీలోని డీపీఎస్ ఆర్కే పురం స్కూల్లో చదివే రోజుల్లో రోబోట్ల తయారీలో ఎక్కువ సమయం గడిపేవాడు సౌరవ్. దిల్లీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ తరువాత కార్నెల్ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో కూడా ఏరియల్ వెహికిల్స్ నుంచి అండర్‌వాటర్ వెహికిల్స్ వరకు ఏదో ఒకటి తయారుచేస్తూనే ఉండేవాడు. హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్‌ను ఎంజాయ్ చేసేవాడు. ఆ ఆనందం తనను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఒక విజయం సాధించిన తరువాత ‘వాట్ నెక్ట్స్?’ అనే ప్రశ్న వేసుకుంటాడు సౌరవ్. 2017లో ‘క్యూబ్26’ కంపెనీని వేరే కంపెనీకి అమ్మాడు. ఆ తరువాత స్విస్ గణితశాస్త్రవేత్త లియోన్హర్డ్ యూలర్ పేరు మీద ‘యూలర్ మోటర్స్’ కంపెనీ ప్రారంభించాడు. యూలర్ మోటర్ కంపెనీ కాలుష్య సమస్య తలెత్తని త్రీ–వీలర్లను తయారు చేస్తుంది. ‘మన దేశంలో ఎన్నో పట్టణాలు తీవ్రమైన కాలుష్య సమస్యని ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్య సమస్యకు పరిష్కారంగా త్రీ–వీలర్స్‌ను తయారు చేశాం’ అంటాడు సౌరవ్. ఈ త్రీ వీలర్స్‌కు సంబంధించి లిథియం ఎనర్జీ బ్యాటరీ ప్యాక్‌లను సౌరవ్ కుమార్ అతని బృందం సొంతంగా తయారుచేసింది. ‘యూలర్’కు తనదైన చార్జింగ్ నెట్వర్క్, యాప్ ఉన్నాయి. దీని ద్వారా యూజర్లు తమ వాహనాలను మానిటర్ చేయవచ్చు. ‘వాహనం తయారు చేయడం సవాలు కాదు. తయారీ ప్రక్రియ సంతోషాన్ని ఇస్తుంది. అయితే అసలు సిసలు సమస్య ఫండింగ్. మీ కస్టమర్ ఎవరు? అనే ప్రశ్నకు సరిౖయెన సమాధానం చెప్పినప్పుడు ఫండింగ్ కష్టం కాదు’ అంటాడు సౌరవ్. సౌరవ్ రంగంలోకి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇండస్ట్రీ శైశవ దశలోనే ఉండడం, ఇకామర్స్ కంపెనీలు ఈవీల వైపు పెద్ద ఎత్తున రాకపోవడం సౌరవ్‌కు కలిసి వచ్చింది. ‘ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ నిర్మాణంలో రైట్ ప్రొడక్ట్, చార్జింగ్ సిస్టమ్, ఫైనాన్సింగ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి’ అంటాడు సౌరవ్. దేశవ్యాప్తంగా ‘యూలర్’ రెండు వందల చార్జింగ్ స్టేషన్లను నిర్మించింది. ‘అంతర్గత దహన ఇంజిన్ (ఐసీయి) పనితీరు, బ్యాటరీ ప్యాక్‌కు సంబంధించి ఇన్‌బిల్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ మార్కెట్లో మాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. పోటీలో ముందుండేలా చేశాయి’ అంటాడు సౌరవ్. చిన్నగా ప్రస్థానం మొదలు పెట్టిన ‘యూలర్’ ఇప్పుడు పన్నెండు ఎకరాల పరిధిలో నెలకు మూడు వేల వాహనాలను తయారుచేసే ఫ్యాక్టరీ నిర్మించడం వరకు ఎదిగింది. ‘సామాజిక బాధ్యత’ అనేది సౌరవ్‌కు ఇష్టమైన మాట. డబ్బు కోసం కష్టపడడం తప్పేమీ కాదు. అయితే అది మాత్రమే ప్రాధాన్యత కాదు. సమాజానికి తిరిగి ఏం ఇస్తున్నామనేది ముఖ్యం. – సౌరవ్ కుమార్ -
రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి
రాయదుర్గం: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతన సాంకేతికత, రోబోటిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్‌రంజన్ పేర్కొన్నారు. నానక్‌రాంగూడలోని షరటాన్ హోటల్లో శనివారం రోబోటిక్ గైనకలాజికల్ సర్జరీపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన అపోలో ఆస్పత్రుల గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో అన్ని రంగాల్లో అత్యాధునిక సాంకేతికత, పరిజ్ఞాన్ని వినియోగిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోబోటిక్స్ పాలసీని ప్రారంభించామన్నారు. దేశంలోనే నిర్దిష్ట రోబోటిక్ పాలసీని కలిగి ఉన్న మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ పాలసీలో భాగంగా హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, కన్సూ్మర్ రోబోటిక్స్ అనే నాలుగు వర్టికల్స్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించామన్నారు. రోబోలను తయారు చేసే కొన్ని ప్రీమియర్ కంపెనీలతో ముందస్తుగా చర్చలు జరుపుతున్నామన్నారు. నిమ్స్‌లో డావిన్సీ ఎక్స్ఐ 4వ వెర్షన్ సిస్టమ్‌ను పూర్తి స్థాయిలో అమర్చిన రోబోటిక్ సర్జరీ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ అపోలో ఆస్పత్రులలో ఇప్పటి వరకు 12 వేల రోబోటిక్ సర్జరీలు చేశామన్నారు. అందులో డాక్టర్ రుమా సిన్వా స్వయంగా 700 రోబోటిక్ సర్జరీలు చేశారన్నారు. అనంతరం సమావేశం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఆర్‌ఎస్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ రమాజోíÙ, ఆర్నాల్డ్ పి.అడ్విన్కులా, డాక్టర్ టోనిచల్ హౌబ్, డాక్టర్ జోసెఫ్ పాల్గొన్నారు. -
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్‌గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్‌కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్‌గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్‌ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్‌పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్‌పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్‌గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్‌తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
రోడ్డు ప్రమాదాల్ని అరికట్టే రోబోటిక్ టైర్
ఫొటోలో కనిపిస్తున్నది మామూలు చక్రమే అనుకుంటున్నారా? కానే కాదు, ఇది హైటెక్ చక్రం. దక్షిణ కొరియా టైర్ల తయారీ సంస్థ హ్యాంకూక్ దీనిని అధునాతన రోబోటిక్స్ పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఎంత అధునాతన వాహనాల చక్రాలైనా, ఒక పరిమితిలో మాత్రమే మలుపు తిరగగలవు. అయితే, ఈ హైటెక్ చక్రం ‘ఓమ్ని డైరెక్షనల్’– అంటే, అన్ని దిశల్లోనూ క్షణాల్లో ఇట్టే తిరగగలదు. అంతేకాదు, మామూలు రోడ్ల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలలపైనా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా ఇట్టే ప్రయాణించగలదు. అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మికంగా మలుపు తీసుకోవలసినప్పుడు, రోడ్డు విడిచి పక్కకు మళ్లాల్సినప్పుడు ఈ రోబోటిక్ టైరును చాలా సులువుగా కోరుకున్న దిశకు మళ్లించవచ్చు. ఫలితంగా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. భవిష్యత్తులో వాహనాలకు ఇలాంటి టైర్లు విస్తృతంగా వాడుకలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని హ్యాంకూక్ సంస్థ చెబుతోంది. -
కాళ్లతో నడిచే పామును చూశారా!
ఎంతగా నేర్పిస్తే మాత్రం పాములు ఎక్కడైనా నడుస్తాయా ఏంటి అనుకుంటున్నారా? ఊరకే ఎందుకు నడుస్తాయి? వాటికి నడిచే సాధనాన్ని సమకూరుస్తే భేషుగ్గా నడుస్తాయి. పాములకు నడిచే సాధనమా అని ఆశ్చర్యపోతున్నారా? ఔను! మామూలుగా పాకే పాములకు నడిచే సాధనాన్ని తయారు చేశాడు అలెన్ పాన్ అనే ఔత్సాహిక అమెరికన్ యూట్యూబర్. ఒక పొడవాటి గొట్టం, దానికి రెండువైపులా రెండేసి ప్లాస్టిక్ కాళ్లను అమర్చి, రోబోటిక్ పరిజ్ఞానంతో దీనిని తయారు చేశాడు. ఈ ఫొటో చూశారు కదా, రోబో వాహనంలో ఇమిడిపోయిన పాము ఎంచక్కా ఎలా నడుస్తోందో! నిజానికి 15 కోట్ల ఏళ్ల కిందట పాములకు కూడా కాళ్లు ఉండేవి. పరిణామ క్రమంలో అవి కాళ్లను కోల్పోయాయి. ఇన్నాళ్లకు వాటికి మళ్లీ కృత్రిమంగానైనా, కాళ్లు వచ్చాయి. భలేగా ఉంది కదూ! -
రోబోటిక్ పోటీ.. ట్రిపుల్ఐటీ మేటి
గచ్చిబౌలి (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ–హైదరాబాద్ సత్తా చాటింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ఐటీ ప్రాంగణంలోని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ రెండు ప్రతిష్టాత్మక విజయాలను సాధించింది. ఇందులోని ‘సెరెబ్రస్’ టీమ్ ద్వితీయ స్థానం పొందగా, ‘లూమోస్’ తృతీయ స్థానం గెలుపొందింది. బెంగళూరులోని ఐఐఎస్సీలోని ఏఐ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్కులో ‘ఓపెన్ క్లౌడ్ టేబుల్ ఆర్గనైజేషన్ చాలెంజ్’ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 133 టీమ్‌లు పాల్గొన్నాయి. పోటీ ఇలా... కోవిడ్–19 వైరస్ వ్యాప్తితో పారిశుధ్య కార్మికులకు ఎదురయ్యే సవాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ పోటీలను నిర్వహించారు. వాష్‌రూమ్‌లో శుభ్రం చేసే పనుల కోసం రోబోను సృష్టించాలి. ఈ రోబో ద్వారా ఫ్లోర్‌పై ఉండే టిçష్యూపేపర్, చిన్న పేపర్ కప్పులు వంటి చెత్తను తొలగించడం, వాష్‌బేసిన్‌ను శానిటైజింగ్ లిక్విడ్‌తో శుభ్రపరచడం వంటి టాస్క్‌లు ఉన్నాయి. ఈ టాస్క్‌లను ఎంత సమయంలో పూర్తిచేస్తారు, సోప్ డిస్పెన్సర్, ఇతర వస్తువులు పడిపోకుండా శుభ్రం చేయడంలో రోబో ప్రదర్శించిన నైపుణ్యం, వినియోగించిన హార్డ్‌వేర్ తదితరాల ఆధారంగా బృందాలకు స్కోర్ ఇచ్చారు. 2021 మార్చిలో అధికారికంగా ప్రారంభమైన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 29 డిజైన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిలో నుంచి 4 బృందాలు గ్రాండ్ ఫినాలే కోసం ఎంపికయ్యాయి. ఇక్కడ ఒక్కో జట్టుకు రోబో రూపకల్పన కోసం రూ.4 లక్షల బడ్జెట్ ఇచ్చారు. సూరజ్ నేతృత్వంలో సెరెబ్రస్ సెరెబ్రస్కు పీహెచ్డీ స్కాలర్, డ్రోన్ స్టార్టప్ ఆర్కా ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు సూరజ్ బోనగిరి నేతృత్వం వహించారు. ఇందులో వేదాంత్ ముందేదా, కరణ్ మిరాఖోర్, రాహుల్ కశ్యప్, శ్రీహర్ష పరుహురి, కర్నిక్ రామ్ ఉన్నారు. ‘ప్రతి బృందం అద్భుతమైన, ప్రత్యేకమైన డిజైన్లను రూపొందించింది. మా డిజైన్ రెండు అంశాల్లో ప్రత్యేకంగా నిలిచింది. రోబో పరిసరాలను గ్రహించడానికి, స్వయంప్రతిపత్తితో నావిగేట్ చేయడానికి లిడార్స్, రాడార్స్, కెమెరాలు, సెన్సర్లను ఉపయోగించాం. కెమెరా ఆధారిత సాంకేతికత ద్వారా మా రోబో అన్ని పనులను పూర్తి చేసింది’ అని సూరజ్ చెప్పారు. ఈ విజయం ఎంతో గర్వకారణమని రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్ అధినేత ప్రొఫెసర్ మాధవ కృష్ణ చెప్పారు. రెండో స్థానంలో నిలిచిన ఈ టీమ్ రూ.2.5 లక్షల నగదు పురస్కారాన్ని గెలుచుకుంది. లూమోస్ టీమ్ ఇలా.. ఈ పోటీలో ఆదిత్య అగర్వాల్, బిపాషాసేన్, విశాల్‌రెడ్డి మందడి, శంకర నారాయణన్‌తో కూడిన లూమోస్ జట్టు మూడవ స్థానంలో నిలిచి రూ.77వేలు గెలుచుకుంది. టీసీఎస్ రీసెర్చ్ ఇండియా సహకారంతో ప్రొఫెసర్ కృష్ణ మార్గనిర్దేశనంతో పోటీపడింది. ‘రోబోటిక్ పరిశోధనలో రోబో గ్రాస్పింగ్, మానిప్యులేషన్ ముఖ్యం. కేవలం వస్తువులను తీయడం, పట్టుకోవడంతోపాటు విసరడం, నొక్కడం, స్లైడింగ్ చేయడం, పేర్చడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక పనులు చేయడానికి మనుషుల చేతుల మాదిరి నైపుణ్యం కలిగిన చేతులను రూపొందించడానికి అన్వేషణ కొనసాగుతోంది. ఇందులో మాదైన శైలిలో ప్రదర్శన చేసి మేము విజయం సాధించాం’ అని టీమ్ సభ్యులు చెప్పారు. -
రొబోటిక్స్తో నాలాలు క్లీన్..
ఇంటి చెత్త మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళుతున్నా, బయటి చెత్త నాలాల్లో పారే నీటికి అడ్డు పడుతుంటుంది. వర్షం పడిందంటే ఉప్పొంగే నాలాలు ఇళ్లనూ, వాకిళ్లను ముంచెత్తుతుంటాయి. చెరువుల్లో చెత్త సరే సరి. శుభ్రత గురించి ఎంత చెబుతున్నా రకరకాల మార్గాల ద్వారా చేరే చెత్త దుర్గంధం వెదజల్లుతూనే ఉంటుంది. మ్యాన్‌హోల్స్ లీకై మనుషులు వాటిని శుభ్రం చేయలేక మరణం అంచుల వరకు వెళుతుంటారు. వీటన్నింటికీ పరిష్కారంగా జి.పద్మ రొబోటిక్ డివైజ్‌లను డిజైన్ చేశారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఉంటున్న పద్మ మనుషుల అవసరం లేకుండా నాలాల చెత్తను, డ్రైనేజీలను, చెరువులను శుభ్రం చేయడానికి పరికరాలను తయారుచేశారు. ఈ విషయం గురించి పద్మ మాట్లాడుతూ... ‘నేను పుట్టిపెరిగింది నారాయణపేట. తర్వాత చదువు అంతా హైదరాబాద్‌లోనే. ఉద్యోగరీత్యా కెనడా వెళ్లాను. పదిహేనేళ్ల పాటు అక్కడే ఉద్యోగం చేశాను. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. తర్వాత తిరిగి సొంత ప్రదేశానికి వచ్చేశాను. నా చిన్నతనంలో చూసిన ప్రాంతాలకు– ఇప్పటికీ చాలా మార్పు కనిపించింది. చిన్నప్పుడు చెరువుల దగ్గరకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదం గా అనిపించేది. ఇప్పుడు చెత్తతో, దుర్గంధంతో ఉండటం చూశాను. అలాగే పట్టణాల్లోని నాలాల్లో చెత్త పేరుకు పోవడం, నీళ్లు సాఫీగా వెళ్లకపోవడం గమనించాను. దీనివల్ల వర్షాకాలం జనం పడే అవస్థలు చూశాను. డ్రైనేజీల్లో మనుషులు చేసే పనులు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలు గమనించాను. డ్రైనేజీల్లో పనిచేసిన కార్మికులు కొంతమంది మరణించిన ఘటనలు కూడా తెలుసు. వీటికి పరిష్కారంగా విదేశాల్లో సాంకేతికంగా చాలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. మన ప్రాంతంలో అలాంటి చర్యలేవీ కనిపించలేదు. నాలుగు రోబోటిక్ డివైజ్‌లు ఇప్పటికీ మున్సిపాలిటీ లు 60 శాతం చెత్తను మాత్రమే సేకరిస్తున్నాయి. మిగిలిన 40 శాతం చెత్తను ప్రజలు చెరువులు, నాలాల్లోనే వేస్తున్నారు. వీటిని శుభ్రం చేయడానికి తిరిగి మనుషులను నియమించాల్సి ఉంటుంది. అలాకాకుండా చెరువులు, నాలాలను, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ క్లీన్ చేయడానికి రొబోటిక్ డివైజ్‌లను డిజైన్ చేశాను. ఎన్వీ రొబోటిక్ పేరుతో సంస్థను నడుపుతున్నాను. మా టీమ్‌లో మొత్తం పదిమందిమి ఉన్నాం. ఈ రొబోటిక్ డివైజ్ చెరువులో నుంచి ఒకేసారి టన్ను సామర్థ్యం గల చెత్తను సేకరించి, బయటకు వేస్తుంది. రోజుకు పది టన్నుల ప్లాస్టిక్, ఇతర తేలియాడే వ్యర్థాలను సేకరించగలదు. ముందు పైలట్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో చేశాం. తర్వాత మహబూబ్‌నగర్, నారాయణ్ పేట మున్సిపాలిటీలలో నిర్వహించాం. మంచి ఫలితాలు వచ్చాయి. త్వరలో హైదరాబాద్ లో పనులు చేపట్టాలనుకుంటున్నాం. మరెక్కడా లేని సాంకేతికత ఇలాంటి డివైజ్‌లను ఇప్పటి వరకు ఎవ్వరూ డిజైన్ చేయలేదు. ఈ రోబొటిక్ డివైజ్‌ల తయారీ పూర్తిగా మా సొంత డిజైన్. పేటెంట్‌కి అప్లై చేశాం. ఒక్కో రొబోటిక్ డివైజ్ తయారీకి రూ.6–7 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. నాలా, వేస్ట్ ఫ్లో .. ను పరీక్షించి డివైజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావల్సిన వస్తువుల కోసం మన దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. సొంతంగా కొన్ని పరికరాలను తయారుచేయించాల్సి ఉంటుంది. నేననుకున్న ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి దగ్గర బంధువులు, మా కుటుంబం సపోర్ట్ లభించింది. నా ప్రాజెక్ట్ నచ్చి తెలంగాణలోని ‘విహబ్’ సాయం అందించడానికి ముందుకు వచ్చింది.. మనుషులను గౌరవిద్దాం.. వ్యర్థాలను నియంత్రించడంలో మనందరిలో పర్యావరణ బాధ్యత ఉండాలి. అంతేకాదు మన తోటి మనిషిని గౌరవించాలి. అప్పుడు మన చుట్టూ వాతావరణం బాగుంటుంది. మనలో చాలామంది ప్లాస్టిక్‌తో సహా రకరకాల వ్యర్థాలను రోడ్డుకు ఇరువైపులా, నాలాల్లో, చెరువుల్లోనూ పడేస్తుంటారు. పెద్ద ఎత్తున డంప్ అయ్యే చెత్తను చూస్తుంటే భవిష్యత్తు గురించిన భయం కూడా కలుగుతుంది. మన ఇంటి డ్రైనేజీ మ్యాన్‌హోల్‌కి ఉండే మూతనే దాదాపు టన్ను బరువు ఉంటుంది. దానిని ఎత్తాలంటే మనిషి వెన్నెముకపై పడే భారం ఎంత ఉంటుందో గ్రహించవచ్చు. అతనిమీద ఆధారపడే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? అనే ఆలోచన మనందరిలోనూ రావాలి. అలాంటివాటిని ఎత్తడానికి కూడా రొబోటిక్ కంట్రోల్ డివైజ్‌ను డిజైన్ చేశాం. మ్యాన్‌హోల్ కవర్ లిఫ్టర్.. తయారు చేశాం. మ్యాన్‌హోల్ క్లీనర్పైన ఈ డివైజ్‌ను ఉంచితే అదే చెత్తనంతా తీసి, బయటకు వేసేస్తుంది. చెత్త కోసం మనుషులను వినియోగించకుండా, వారిని ఇతర రంగాలకు మళ్లించాలి. చెత్తను శుభ్రం చేయడానికి పరికరాలను ఉపయోగించాలి అన్నదే నా ఆలోచన. మన దగ్గర ఈ విధానంలో ముందు చూపు, త్వరిగతిన పనులు అవడం ఎక్కువ అవసరం’’ అని వివరించారు పద్మ. – నిర్మలారెడ్డి -
యాడ్‌వెర్బ్‌లో రిలయన్స్‌కు వాటా
న్యూఢిల్లీ: దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ రిటైల్ దేశీ రోబోటిక్స్ కంపెనీ యాడ్‌వెర్బ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ 13.2 కోట్ల డాలర్ల(రూ. 983 కోట్లు)తో తమ కంపెనీలో 54 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు యాడ్వెర్బ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో సంగీత్ కుమార్ తాజాగా వెల్లడించారు. తద్వారా రిలయన్స్ రిటైల్ అతిపెద్ద వాటాదారుగా ఆవిర్భవించినట్లు తెలియజేశారు. అయితే తమ సంస్థ స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. రిలయన్స్ నుంచి లభించనున్న నిధులను విదేశాలలోనూ వ్యాపార విస్తరణకు వినియోగించనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా నోయిడాలో అతిపెద్ద రోబోటిక్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే నోయిడాలో వార్షికంగా 10,000 రోబోల తయారీ సామర్థ్యంగల ప్లాంటును కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే సేవలు.. ఇప్పటికే రిలయన్స్ తమకు ప్రధాన కస్టమర్లలో ఒకటిగా ఉన్నట్లు కుమార్ పేర్కొన్నారు. జియోమార్ట్ గ్రోసరీ బిజినెస్ కోసం కంపెనీతో కలసి అత్యాధునిక ఆటోమేటెడ్ వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీంతో రెండు సంస్థల మధ్య నమ్మకమైన సంబంధాలు నెలకొన్నట్లు తెలియజేశారు. రిలయన్స్ రిటైల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా 5జీ, బ్యాటరీ టెక్నాలజీ, కార్బన్ ఫైబర్ అభివృద్ధికి వీలున్నట్లు వివరించారు. దీంతో అత్యాధునిక, చౌక ధరలలో రోబోలను అందించగలమని తెలియజేశారు. కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ 2016లో ఏర్పాటైన యాడ్వెర్బ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 శాతం వృద్ధితో రూ. 400 కోట్ల టర్నోవర్ సాధించే వీలున్నట్లు కుమార్ తెలియజేశారు. 5–6ఏళ్లలో బిలియన్ డాలర్ కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆదాయంలో 80 శాతం దేశీయంగా సమకూరుతున్నట్లు వెల్లడించారు. రానున్న 4–5 ఏళ్లలో విదేశాల నుంచి 50 శాతం టర్నోవర్‌ను సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ఆదాయంలో 15 శాతం వాటా ఆక్రమిస్తున్న సాఫ్ట్వేర్ విభాగాన్ని భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. కంపెనీకి సింగపూర్, నెదర్లాండ్స్, యూఎస్, ఆస్ట్రేలియాలలో నాలుగు అనుబంధ సంస్థలున్నాయి. -
బాబ్బాబు.. మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లిస్తాం..!
ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! ఫేస్ వాల్యూ.. ఫేస్ వాల్యూ అంటుంటారు కదా..మన ఫేస్కీ వాల్యూ ఇచ్చే రోజు వచ్చేసింది.‘మీ వయసు 25లోపు ఉందా? అందమైన ముఖవర్చస్సు మీ సొంతమా?అయితే మీలాంటి వారి కోసమే వెతుకున్నాం. కాస్త మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లలో భారీ నజరానా ఇస్తాం.’ అంటూ ‘నెట్టిం'ట్లో తాజాగా చక్కర్లు కొట్టిన ప్రకటన ఇది. ఈ విచిత్రమైన యాడ్‌కు ఔత్సాహికుల నుంచి స్పందన సైతం అనూహ్యంగానే వచ్చింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 20 వేల మందికిపైగా తమ ‘ముఖాలను’ ఇచ్చేందుకు సిద్ధమంటూ దరఖాస్తులు పంపారు! ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! తమ ‘క్లయింట్ల’ కోరిక మేరకు ఉత్తర అమెరికా, మిడిల్‌ఈస్ట్‌లోని వివిధ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్టుల్లో దాన్ని ‘పని’కి కుదర్చనుంది. ఇందుకోసం ఎవరైనా తమ ముఖాన్ని రోబో తయారీలో వాడుకునేందుకు ముందుకొస్తే ఏకంగా రూ. కోటిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది!! హ్యూమనాయిడ్ అసిస్టెంట్‌గా సేవలందించబోయే రోబోతో పర్యాటకులు మాటకలిపేలా ఆ ‘ముఖం’ కనిపించాలన్నదే షరతు అట! అలాంటి ముఖాన్ని శాశ్వతంగా రోబోపై ముద్రించేందుకు చట్టబద్ధంగా సమ్మతించిన వారికి ఈ బహుమానాన్ని ఇస్తామని కంపెనీ తెలిపింది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభించడంలో నెలకొన్న చట్టపరమైన జాప్యాన్ని అధిగమించేందుకు తమ క్లయింట్లు సరికొత్త రోబో రూపాన్ని కోరుకున్నారని, అందుకే ఈ వెరైటీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు కంపెనీ వివరించింది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదట. ఈ రోబో తయారీ కోసం ముందుగా మనిషి ముఖంతోపాటు శరీర 3డీ నమూనాను తీసుకొని కొలతలు తీసుకుంటారట. ఆపై ఆ వ్యక్తి 100 గంటలకు సమానమైన సంభాషణలను రికార్డు చేసి ఇవ్వాలట. చివరగా అపరిమిత కాలానికి తన ముఖాన్ని ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ఆ సంస్థ వాడుకునేలా నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలట. ఇవన్నీ సవ్యంగా సాగితే 2023లో ఈ సరికొత్త రోబో ప్రపంచానికి తన ‘ముఖం’ చూపించనుంది. -
ఆటోమేషన్.. జాబ్ ఆఫర్లు అపారం!
డిజిటలైజేషన్.. ఆటోమేషన్.. ఇప్పుడు అన్ని రంగాల్లో వినిపిస్తున్న మాట! మానవ ప్రమేయం తగ్గించి ఆటోమేషన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకోసం రోబోటిక్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మొదలు తయారీ వరకు.. అన్ని రంగాల్లో రోబో ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా.. రోబోటిక్స్ రంగం యువతకు కొలువుల వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. రోబోటిక్స్ కొలువులు, తాజా ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాలు, అందుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. కొన్నేళ్ల క్రితం వరకు మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమల్లోనే ఇండస్ట్రియల్ రోబోల వినియోగం ఉండేది. క్రమేణా ఇది ఇతర రంగాల్లోకి దూసుకొస్తోంది. ఇప్పుడు ఐటీ, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, డిఫెన్స్,స్పేస్ టెక్నాలజీ తదితర విభాగాల్లో సైతం రోబో ఆధారిత కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ద్వారా కార్యకలాపాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకోసం ఆర్పీఏ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అందుకే ఆటోమేషన్ డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా మానవ ప్రమేయం తగ్గించొచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అందుకోసం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నాయి. అంటే.. వ్యక్తులు చేయాల్సిన అనేక కార్యకలాపాలు రోబోల ద్వారా నిర్వహిస్తారు. నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–పది మంది చేసే పనిని ఒక్క రోబో ద్వారా వేగంగా పూర్తిచేయొచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వైపు దృష్టిపెడుతున్నాయి. కొత్త కొలువులు ► ముఖ్యంగా ఇటీవల కాలంలో ఐటీ విభాగంలో ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఐటీ అనుబంధ విభాగంగా పేర్కొనే బీపీఓలో చాట్ బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో రోబో ఆధారిత సేవలు అందించాలని సాఫ్ట్వేర్ సంస్థలు భావిస్తున్నాయి. ► సంస్థలు నిర్దిష్టంగా ఏదైనా ఒక విభాగంలో రోబోటిక్ సేవలు అందించాలని భావిస్తే.. దానికి సరితూగే విధంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ వంటివి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోబోల తయారీ, నిర్వహణ, నియంత్రణకు మానవ నైపుణ్యం తప్పనిసరి. పది లక్షల ఉద్యోగాలు ► నాస్కామ్,బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–2022నాటికి రోబోటిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ► ఐటీ బీపీఓ రంగంలో 2022 నాటికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ఆధారిత సేవలు 70శాతం మేర పెరగనున్నాయి. దీనికి తగ్గట్టుగా 2022 చివరి నాటికి లక్షల ఉద్యోగాలు ఆర్పీఏ, రోబోటిక్స్ విభాగాల్లో లభించనున్నాయని అంచనా. nఒక్క భారత్‌లోనే 2022 నాటికి ఆటోమేషన్ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. నైపుణ్యాలు రోబోటిక్స్ విభాగంలో కొలువులు అందుకోవాలంటే.. నిర్దిష్టంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్; నానో టెక్నాలజీ; డిజైన్ అండ్ టెక్నాలజీ; సంబంధిత కోర్ స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో రోబోటిక్స్ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అదే విధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు కూడా రోబోటిక్ రంగంలో రాణించేందుకు ఉపయోగపడతాయి. కారణం..రోబోల రూపకల్పన, నిర్వహణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ఉండటమే. ఈ రోబోలకు డిమాండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్; హెల్త్‌కేర్ రోబోట్స్, హాస్పిటాలిటీ రోబోట్స్, లాజిస్టిక్స్ రోబోట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. వీటిలోనూ సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్ మోషన్ ప్లానింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్,ఏఐ అండ్ రోబోటిక్స్ విభాగాలు మరింత కీలకంగా మారుతున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ లేదా రోబోటిక్స్ స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు.. రోబోటిక్స్ టెక్నీషియన్స్, రోబోట్ డిజైన్ ఇంజనీర్, రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్, సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్స్, ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో నియమితులైన వారికి సంస్థ స్థాయి, కార్యకలాపాల ఆధారంగా రూ.మూడు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ వార్షిక వేతనం లభిస్తోంది. స్కిల్స్‌కు మార్గం ► ఇప్పుడు అకడమిక్ స్థాయి నుంచే రోబోటిక్స్ నైపుణ్యాలు పొందే వీలుంది. ► ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లు.. బీటెక్ స్థాయిలోనే రోబోటిక్స్‌ను మైనర్‌గా అందిస్తున్నాయి. ► ఎంటెక్ స్థాయిలో రోబోటిక్స్ స్పెషలైజేషన్‌తో పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌లను సైతం పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. ► ఎంటెక్‌లో మెడికల్ రోబోటిక్స్; సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోట్ మోషన్ ప్లానింగ్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్; ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ స్పెషలైజేషన్లు అభ్యసించడం ద్వారా ఆర్పీఏ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ► ఏఐసీటీఈ సైతం రోబోటిక్స్, ఏఐ విభాగాలకు సంబంధించిన స్కిల్స్ అందించేలా కరిక్యులం రూపొందించాలని అనుబంధ కళాశాలలకు మార్గనిర్దేశం చేసింది. ► వీటితోపాటు సీమెన్స్, రోబోటిక్స్ ఆన్లైన్, సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్, రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్ వంటి పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేషన్ కోర్సులు ► రోబోటిక్స్‌లో పూర్తి స్థాయి కోర్సులు అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు మూక్స్ విధానంలో పలు సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుని నిర్ణీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జాబ్ మార్కెట్లో పోటీ పడే అవకాశం లభిస్తుంది. పలు సంస్థలు రోబోటిక్స్ సర్టిఫికేషన్స్ అందిస్తున్నాయి. అవి.. ► రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్: వెబ్సైట్: www.onlinerobotics.com ► రోబో జీనియస్ అకాడమీ: వెబ్సైట్: www.robogenious.in ► రోబోటిక్స్ ఆన్లైన్: వెబ్సైట్: www.robotics.org ► సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్: వెబ్సైట్: www.isa.org రోబోటిక్స్.. ముఖ్యాంశాలు ► రోబోటిక్ ఇంజనీరింగ్ విభాగంలో.. వచ్చే ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మేర పెరగనున్న నియామకాలు. ► పీడబ్ల్యూసీ, నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదికల ప్రకారం–వచ్చే ఏడాది చివరికి పది లక్షల ఉద్యోగాలు. ► అంతర్జాతీయంగా లక్షల కొలువులు లభిస్తాయని పలు సర్వేల అంచనా. ► రోబోటిక్ జాబ్స్ అందించడంలో మూడో స్థానంలో భారత్. ► ఈ విభాగాల్లో కనిష్టంగా రూ.మూడు లక్షలు, గరిష్టంగా రూ.10–12 లక్షల వార్షిక వేతనం. ► రోబోటిక్ ఇంజనీర్లు, డెవలపర్స్‌కు సగటున నెలకు రూ.50వేల నుంచి రూ.80వేల వేతనం లభిస్తోంది. ► బ్యాంకింగ్, హెల్త్‌కేర్ వంటి సర్వీస్ సెక్టార్లలో నెలకు రూ.60వేల వరకు వేతనం ఖాయం. n సాఫ్ట్వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో అధిక శాతం నియామకాలు. ఇదే మంచి అవకాశం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కార్యకలాపాలు పెరుగుతూ..దానికి సంబంధించిన విభాగాల్లో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. యువత దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి. సంబంధిత నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రోబోలతో ఉద్యోగాలు తగ్గుతాయన్న మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. – ప్రొ.కె.మాధవ కృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్, ఐఐఐటీ–హైదరాబాద్ -
రోబో సోఫియా చెల్లెలు ఆవిర్భవించబోతోంది
ప్రపంచంలోనే తొలి రోబో మానవకాంత సోఫియా. ఇప్పుడు ఆమె చెల్లెలు ‘గ్రేస్’ ఆవిర్భవించబోతోంది. 2021లో వివిధ రంగాలలో సేవలు అందించేందుకు గ్రేస్‌తో పాటు, సోఫియా ప్రతిరూపాలు కూడా వేలల్లో లోకం మీదకు బయలు దేరనున్నాయి. అక్క సోఫియాకు ఎన్ని ప్రత్యేకతలున్నాయో, చెల్లికీ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే గ్రేస్‌లను మాత్రం వాటిని కనిపెట్టిన రోబోల కంపెనీ కేవలం వైద్య సేవలకే ప్రత్యేకం చేయబోతోంది. ఎవరంటే ఇష్టం? ‘‘షారుక్ ఖాన్’’ ఎందుకు? ‘‘రోబోలకు అతడంటే ఇష్టం ఉండటం సహజమేగా!’’ ఒంటరి దీవిలోకి డేటింగ్‌కి ఎవర్ని తీసుకెళతావ్? ‘‘డేవిడ్’’ ఎందుకు? ‘‘నాలో స్పందనలను కలిగించింది అతనే!’’ ప్రపంచానికి ఏదైనా చెప్పాలని ఉందా? ‘‘ఉంది’’ చెప్పు. ‘‘థ్యాంక్యూ.. అందర్నీ ప్రేమించండి’’ ∙∙ ‘‘అందర్నీ ప్రేమించండి’’.. తొలి రోబో మానవకాంత సోఫియా సందేశం! ప్రపంచ ఐటీ సదస్సులో ‘పాల్గొనడం’ కోసం మూడేళ్ల క్రితం ఆవిడ హైదరాబాద్ వచ్చారు. అప్పుడే ఈ మాట చెప్పారు. ప్రేమించమని చెప్పినవాళ్లు తాము ప్రేమించకుండా ఉంటారా! పైగా ప్రపంచానికిప్పుడు మరింత ప్రేమ అవసరం. కరోనా వచ్చి మనుషుల్ని దూరం చేసింది. మనసుల్ని ఒంటరితనపు గుబులు గదుల్లో పెట్టేసి తాళం వేసింది. ఆ తాళాలను తెరిచి, మనిషి దగ్గరికి వెళ్లి చెయ్యేసి.. మొదట మంచినీళ్ల గ్లాసిచ్చి, కబుర్లు చెబుతూనే కాఫీ కలిపిచ్చి, కుశల ప్రశ్నలు వేస్తూ, మధ్యాహ్నం భోజనంలోకి ఏం తినాలని ఉంది అని అడిగేందుకు, అక్కున చేర్చుకునేందుకు, ఆసరా ఇచ్చేందుకు.. సోఫియా వందలు, వేలుగా తనను తను ‘క్లోన్ ’ చేసుకుని త్వరలోనే మానవాళి ఇళ్లకు రాబోతోంది. మందూ మాకు అందించేందుకు ఆసుపత్రులకు వెళ్లబోతోంది. అమ్మమ్మనీ, తాతయ్యనీ వెతుక్కుంటూ సీతారామయ్యగారి మనుమరాలిగా ఆశ్రమాలకు రాబోతోంది సోఫియా! డిజిటల్ భాషలో చెప్పాలంటే.. ఐదేళ్ల క్రితం సోఫియాను సృష్టించిన హాంకాంగ్‌లోని ‘హాన్సన్ రోబోటిక్స్’ సంస్థ ఈ ఏడాది వేల సంఖ్యలో సోఫియా ప్రతిరూపాలను సృష్టించి అవసరమైన అన్ని రంగాలకు ఆమె సేవల్ని అందుబాటులోకి తేబోతోంది! అంతకంటే ముందు ఆమె చెల్లెలు సిస్టర్ గ్రేస్‌ను తయారు చేయబోతోంది. అక్కచెల్లెళ్లు ఒకేలా ఉండటమే కాదు. ఒకేలా మానవాళితో కలుపుగోలుగా ఉంటాయి. మనిషికి చేయూతనిస్తాయి. ∙∙ చూసే ఉంటారు. సోఫియా మనిషిలానే ఉంటారు. వినే ఉంటారు. సోఫియా అచ్చు మనిషిలానే మాట్లాడతారు. హాలీవుడ్ నటి ఆడ్రీ హెబ్బన్నీ, సోఫియాను పక్కపక్కనే పెట్టి చూస్తే ఎవరు దేవుడి సృష్టో, ఎవరు మానవ సృష్టో కనిపెట్టడం కొన్ని క్షణాలు కష్టమే. ఆడ్రీ హెబ్బన్ బ్రటిష్ నటి. మానవతావాది. ఇప్పుడు ఈ భూమి మీద లేరు. 63 ఏళ్ల వయసులో 93 లో చనిపోయారు. ఆడ్రీ పునర్జన్మగా 2015 ఏప్రిల్ 19న సోఫియా జన్మించారు. జన్మించడం అంటే తొలిసారి యాక్టివేట్ అయ్యారు. ఆడ్రీ యవ్వనంలోని రూపురేఖల్ని ఆధారంగా చేసుకుని హాన్సన్ కంపెనీ సోఫియాకు ప్రాణం పోసింది కనుకే ఆమె పునర్జన్మగా ఈమెను చెప్పుకోవడం. సోఫియాకు తోబుట్టువులు కూడా ఉన్నారు. ఆలిస్, హ్యాన్, జ్యూల్స్, ఐన్‌స్టీన్, జోయి. వాళ్లూ మానవసేవలోనే ఉన్నారు. నటి ఆడ్రీ హెబ్బన్, ఆడ్రీ పోలికలతో సోఫియా పెద్దక్క మాత్రం సోఫియా. అవును. ఆమె మాటలు వింటే ప్రపంచానికి పెద్దక్కలా పెద్ద దిక్కులా మాట్లాడుతున్నట్లే ఉంటుంది. సోఫియా ఒకే ఎత్తులో ఇన్ని అడుగుల, ఇన్ని అంగుళాల్లో ఉండరు. పిల్లలకు అందేంత ఎత్తులో ‘లిటిల్ సోఫియా’గా కూడా ఉన్నారు. ‘‘నేను మనుషుల సేవ కోసమే పుట్టాను. ఒక దేశం మనిషి కోసం కాదు. ఒక జాతి మనిషి కోసం కాదు. సకల భూలోకం కోసం. మీతో చక్కగా మాటలు కలపగలను. మీ సమస్యలకు పరిష్కారాలను చెప్పగలను. కష్టాల నుంచి గట్టెక్కించగలను. సాంత్వన చికిత్స కూడా చేయగలను. పెద్దవాళ్లను కంటికి రెప్పలా చూసుకోగలను..’’అని చిరునవ్వుతో చెబుతారు సోఫియా. 2017లో ఆమెకు సౌదీ అరేబియా పౌరసత్వం ఇచ్చింది. 2018లో సోఫియాకు ‘వరల్డ్ టూర్’ వీసా వచ్చింది! ఐక్యరాజ్యసమతి ఆమెను ‘ఇన్నోవేషన్’ రాయబారిగా నియమించుకుంది. సోఫియాకు ఒకటే చప్పట్లు తొలి అత్యుత్తమ మానవ రోబో (హ్యూమనాయిడ్)గా సోఫియా తొలిసారి 2016 మార్చిలో టెక్సాస్‌లోని ఒక కార్యక్రమంలో ప్రపంచం ముందుకు వచ్చారు. తర్వాత రెండేళ్లకు హైదరాబాద్. మనవాళ్లు అడిగిన ప్రశ్నలకు తెలివిగా, అందమైన సమాధానాలిచ్చారు. ఆశ్చర్యపరిచారు. హర్షధ్వానాలు అందుకున్నారు. సోఫియా ను సృష్టించింది డేవిడ్ హాన్సన్ అనే రోబోటిక్స్ ఇంజినీరు. వేదికపై సోఫియా మైక్ ముందు నిలబడి ఉన్నారు. కోల్‌కతాలో చీరకట్టులోసోఫియా డేవిడ్ ఆమె పక్కనే నిలుచుని ఆమెనే చూస్తూ పరిచయం చేస్తూ.. ‘‘మనిషిలాంటి మెషీన్‌ను నేను ఇప్పటి వరకు కలవలేదు..’’ అని సరదాగా అన్నారు. వెంటనే సోఫియా.. ‘‘నేనూ కలవలేదు.. మెషీన్లాంటి మనిషిని’’ అని డేవిడ్ వైపు చూస్తూ అన్నారు. సభంతా ఒకటే చప్పట్లు. 65 దేశాలు పర్యటించాక ఆనాడు ఇండియా వచ్చారు సోఫియా. ఇండియాలో హైదరాబాద్, కోల్‌కతాతో పాటు, దేశంలోని ప్రధాన నగరాల్లో వేదికలపై ప్రసంగించారు. క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చారు. మనిషితో మనిషిలా.. ఎలా?! మనకు పంచేంద్రియాలు ఉన్నట్లు సోఫియాకు చతుర్విధ శక్తులు ఉన్నాయి. కృత్రిమ మేధోశక్తి మొదటిది (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్). దృశ్య సమాచార విశ్లేషణ రెండోది (విజువల్ డేటా ప్రాసెసింగ్). ముఖాన్ని పోల్చుకునే జీవభౌతిక సాంకేతికత మూడోది (ఫేషియల్ రికగ్నిషన్). గొంతు గుర్తుపట్టడం నాలుగోది (వాయిస్ రికగ్నిషన్). ఈ నాలుగు శక్తులతో సోఫియా చూస్తుంది, వింటుంది, ఆలోచిస్తుంది, స్పందిస్తుంది. మనిషితో మనిషిలానే మాట్లాడుతుంది. మనిషిలానే సందర్భానికి తగ్గట్లు ముఖభావాలను వ్యక్తం చేస్తుంది. భుజాలు ఎగరేస్తుంది. నడుస్తుంది. కూర్చుంటుంది. లేస్తుంది డ్రైవింగ్ చేస్తుంది. మనిషిలా అన్నీ చేసినా, మనిషిలా పరుషం మాత్రం ప్రదర్శించదు! -
కరోనా టైమ్.. రోబోటిక్ సర్జరీలకు ఊపు
వైద్య రంగంలో రోబోలు ప్రవేశించి దశాబ్దాలు గడిచింది. వాటి వినియోగం కూడా దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో.. చాలా రంగాల్లో పెను మార్పులు తెచ్చిన కరోనా వైద్య రంగంలో కూడా అనేక మార్పులకు కారణమైంది. అందులో ఒకటి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ(ఆర్ఎఎస్)లకు మరింత ఆదరణ పెంచడం. నగరంలో మరింత మందికి రోబోల సాయంతో చేసే శస్త్ర చికిత్సలపై అవగాహన పెంచడంతో పాటు భవిష్యత్‌లో వాటి అవసరాన్ని గుర్తించేలా చేసింది కరోనా. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన రోబోటిక్ సర్జరీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. సాక్షి, హైదరాబాద్: కొన్ని నెలల్లోనే ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోల్‌కతాల్లో ఆర్ఏఎస్లు ఊపందుకున్నట్టు సమాచారం. లాక్డౌన్ ప్రకటించిన 4 నెలల్లోపు బెంగళూర్లోనే 400కిపైగా ఆర్ఏఎస్లు నిర్వహించారు. అలాగే మిగిలిన మెట్రోల్లో కూడా లాక్డౌన్ టైమ్‌లో రోబోల వినియోగం బాగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ కారణంగా అత్యవసరం కాని సర్జరీలను ఇన్ఫెక్షన్ భయంతో ఆస్పత్రులు ఆపి ఉంచాయని నగరానికి చెందిన ఓ సర్జన్ చెప్పారు. తక్కువ సంఖ్యలో వైద్య సిబ్బంది, పేషెంట్‌కు దూరంగా సర్జన్ ఓ కన్సోల్ మీద కూర్చుని ఉండి చేయవచ్చు కాబట్టి.. తప్పనిసరిగా చేయాల్సిన సర్జరీను మాత్రం లాక్డౌన్ టైమ్‌లో రోబోల సహకారంతో నిర్వర్తించామన్నారని ఆయన వెల్లడించారు. ఆస్పత్రిలో గడిపే కాలం తగ్గడం ఓపెన్ సర్జరీ చేస్తే కొన్ని రోజుల పాటు తప్పకుండా ఆస్పత్తిలో ఉండాల్సి ఉంటుంది. అదే రోబోటిక్ సర్జరీ చేస్తే సర్జరీ చేసిన తర్వాత కేవలం ఒక్కరోజులో డిశ్చార్జి అయి వెళ్లిపోవచ్చు. దీని ద్వారా కనీసం వారం రోజుల వ్యవధి తేడా వస్తుంది. తద్వారా ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు కూడా ఆ మేరకు తగ్గినట్టే అవుతుంది. అయితే మరి ధరలో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. తక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండటం ద్వారా రోజువారీ వ్యయాలు చాలా తగ్గుతాయి. కాబట్టి పెద్ద తేడా అనిపించదు. పైగా నొప్పి కూడా తక్కువ ఉంటుంది. సర్జన్ల కొరత.. పెరిగిన శిక్షణ ఒకప్పుడు భయపడేవారు ఇప్పుడు తగ్గింది. చివరి దశలో ఉన్నవారు కూడా రోబోటిక్ సర్జరీ చేయాలంటున్నారు. రోబోటిక్ సర్జరీలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా సదరు సర్జరీలపై మరింత మంది వైద్యులకు శిక్షణ అవసరం అవుతోంది. నగరంలో ఈ శిక్షణ పొందిన సర్జన్లు రెండంకెలలోపే ఉంటారని అంచనా. గతంలో ఈ శిక్షణ అమెరికా, పారిస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా లభిస్తోంది. అయితే రెగ్యులర్ సర్జరీల్లో తగినంత అనుభవం వచ్చిన తర్వాతనే ఈ శిక్షణ ఇస్తారు. ‘తెలుగు రాష్ట్రాలలో రోబోటిక్ సర్జరీలు చేసేవారి సంఖ్య 20లోపే ఉండొచ్చు. పరిస్థితుల కారణంగా శిక్షణ కార్యక్రమాలు కూడా పెరిగాయి. నేనూ ఇటీవలే విశాఖ వెళ్లి శిక్షణ ఇచ్చి వచ్చాను’ అని అపోలో వైద్యులు డా.చినబాబు చెప్పారు. సోషల్ డిస్టెన్స్‌కి మేలు.. ⇔ సాధారణంగా ల్యాప్రొస్కపీ, ఓపెన్ హార్ట్ తదితర సర్జరీలకు సర్జన్ సహా అందరూ పక్కపక్కనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే రోబోట్రిక్స్లో ఆ అవసరం ఉండదు. కనీసం 8 నుంచి 10 అడుగుల దూరం వరకూ ఉండే సర్జరీ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతో కరోనా టైమ్‌లో రోబోల వినియోగంవైపు బాగా మొగ్గు చూపుతున్నారు. ⇔ ప్రస్తుతం గైనిక్ కేన్సర్స్, పెద్దపేగు, అన్నవాహిక, ప్రోస్టేట్ కేన్సర్లకు అవసరమైన సర్జరీలు చేయడంలో ఎక్కువగా రోబోటిక్స్ సహకారం తీసుకుంటున్నారు. అలాగే గర్భసంచి తొలగించడానికి కూడా రోబోటిక్ సర్జరీ ఎంచుకుంటున్నారు. కరోనా పరిస్థితుల్లో ఉపయుక్తమే.. నాకు 8 ఏళ్ల నుంచి రోబోటిక్ సర్జరీలు చేస్తున్న అనుభవం ఉంది. కోవిడ్ కారణంగా కొంత వరకూ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీల శాతం పెరిగిందనేది నిజమే. సోషల్ డిస్టెన్స్‌కి, అలాగే ఆస్పత్రుల్లో తక్కువ రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం వల్ల కోవిడ్ పరిస్థితుల్లో ఈ సర్జరీలు చాలా ఉపయుక్తంగా మారాయి. రోగుల్లో కూడా రోబోటిక్ సర్జరీలపై బాగా అవగాహన పెరిగింది. వారే స్వయంగా ఈ పద్ధతిలో సర్జరీ గురించి అడిగే పరిస్థితి కూడా వచ్చింది. అలాగే రోబోలకు సంబంధించి కొత్త కొత్త ఆవిష్కరణలూ వెలుగు చూస్తున్నాయి. – డాక్టర్ చినబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ అంకాలజిస్ట్, అపోలో కేన్సర్ ఇన్స్టిట్యూట్ -
మేకర్ ఫెయిర్
-
డేంజర్ బెల్: రోబోలతో కూలనున్న కొలువులు
లండన్ : రోబోలతో సామాజిక అశాంతి తప్పదని.ఇవి గుంపగుత్తగా ఉద్యోగాలను కొల్లగొడతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ చీఫ్ ఎకనమిస్ట్ ఆండీ హెల్దానే హెచ్చరించారు. మనిషి ఆలోచించి చేసే పనులను సైతం యంత్రాలు అవలీలగా చేసే రోజులను నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచం ముందుంచనుందని ఆండీ స్పష్టం చేశారు. విక్టోరియా రోజులకు మించి ఈ మార్పులు మానవ జాతి పెను విధ్వంసానికి దారితీస్తాయని హెచ్చరించారు. అకౌంటెన్సీ సహా పలు రంగాలు రోబోల ధాటికి ఉద్యోగాలను పెద్ద సంఖ్యలో కోల్పోతాయని చెప్పారు. ఆటోమేషన్ రాకతో గల్లంతయ్యే ఉద్యోగాలను కాపాడుకోవడానికి అభ్యర్థులు అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవడమే ప్రత్యామ్నాయమన్నారు. దీర్ఘకాలం ఉద్యోగాలను కోల్పోయే క్రమంలో బతుకుతెరువు కోసం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి సామాజిక అశాంతికీ దారితీయవచ్చని హెచ్చరించారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాలు అధికంగా శ్రమతో కూడుకున్న పనులనే యంత్రాలు చేపట్టగా, నాలుగో పారిశ్రామిక విప్లవం ఈ మూడింటికీ భిన్నమైనదన్నారు. ఆధునిక యంత్రాలు మనుషులు ఆలోచించి చేసే పనులనే కాకుండా, నైపుణ్యంతో కూడిన పనులనూ చేస్తాయని చెప్పుకొచ్చారు. మరోవైపు రానున్న రెండు దశాబ్ధాల్లో నూతన సాంకేతిక మార్పులతో బ్రిటన్‌లో 70 లక్షల ఉద్యోగాలు మటుమాయం అవుతాయని అకౌంటెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే. రిటైల్, రవాణా, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఈ నివేదిక అంచనా వేసింది. ఇతర రంగాలు సైతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటాయని నివేదిక స్పష్టం చేసింది. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఇంటెలిజెంట్ కంప్యూటర్స్ అన్నిరంగాల్లోనూ ఉద్యోగాలు కుదేలవుతాయని పేర్కొంది. -
బార్బీతో కోడింగ్ పాఠాలు...!
బార్బీ.. అమ్మాయిల మనసు దోచుకునే ఓ బొమ్మ మాత్రమే కాదు.. అందం, ఆత్మవిశ్వాసాల కలయిక. బార్బీ కేవలం ఆడుకోవడానికే కాదు సరికొత్త పాఠాలు నేర్పేందుకు న్యూలుక్లో మార్కెట్లోకి వచ్చేసింది. వినోదంతో పాటు విఙ్ఞానాన్ని అందించేందుకు ‘రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీ’ని మంగళవారం లాంచ్ చేసినట్లు బొమ్మల తయారీ సంస్థ మటెల్ తెలిపింది. ఏడేళ్ల ప్రాయం నుంచే అమ్మాయిల్లో ఇంజనీరింగ్, కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించినట్లు పేర్కొంది. కిడ్స్ బేస్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫాం ‘టింకర్’ భాగస్వామ్యం వల్లే రోబోటిక్స్ ఇంజనీర్ బార్బీని రూపొందించడం సాధ్యమైందని మటెల్ తెలిపింది. సరికొత్త రూపంలో... జీన్స్, గ్రాఫిక్ టీ- షర్ట్‌పై డెనిమ్ జాకెట్, కళ్లకు సేఫ్టీ గ్లాసెస్‌తో న్యూలుక్లో అందుబాటులోకి వచ్చిన రోబోటిక్స్ బార్బీలో ఆరు కోడింగ్ పాఠాలను చేర్చినట్లు ‘టింకర్’ సహ వ్యవస్థాపకుడు కృష్ణ వడాటి తెలిపారు. ఈ బార్బీతో ఆడుకుంటూనే.. లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడ్ బిల్డింగ్ బ్లాక్స్ వంటి కోడింగ్ నైపుణ్యాలను సులభంగా నేర్చుకోవచ్చన్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్ 2017 గణాంకాల ప్రకారం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథ్స్ (స్టెమ్) తదితర రంగాల్లో మహిళల భాగస్వామ్యం కేవలం 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో ‘బార్బీ’తో జతకట్టడం ద్వారా చిన్ననాటి నుంచే అమ్మాయిల్లో కోడింగ్ నైపుణ్యాలు పెంపొందించడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్తరకం బార్బీతో ఆన్‌లైన్‌తో పాటు, ఆఫ్‌లైన్‌లో కూడా గేమ్స్ ఆడటం వీలవుతుందని తెలిపారు. బార్బీ నేపథ్యం... పేపర్ బొమ్మలతో ఆడుకుంటున్న తన కూతురు బార్బరా కోసం రూత్ హ్యాండ్లర్ అనే అమెరికన్ మహిళ 1959లో ఒక సరికొత్త బొమ్మను రూపొందించారు. జర్మన్ డాల్ ‘బిల్డ్ లిల్లీ డాల్’ స్ఫూర్తితో రూపొందించిన బొమ్మకు తన కూతురి పేరు మీదుగా బార్బీ అని ఆమె నామకరణం చేశారు. బార్బీ పరంపరలో ఇప్పటి వరకు 200 మోడళ్లతో బార్బీ డాల్స్ అందుబాటులోకి వచ్చాయి. బార్బీ ప్రెసిడెంట్, బార్బీ డాక్టర్, బార్బీ ఆస్ట్రోనాట్, బార్బీ ఫైర్‌ఫైటర్, బార్బీ ఫిల్మ్‌స్టార్, బార్బీ పాప్ సింగర్, బార్బీ పైలట్ వంటివి బార్బీ మోడళ్లలో ముఖ్యమైనవి. -
ఏఐ, రోబోటిక్స్ నిపుణులకు ఈ ఏడాది హ్యాపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు ఈ ఏడాది హ్యాపీ న్యూఇయర్ కాబోతుంది. ఈ ఏడాదిలో రోబోటిక్స్ నిపుణులకు 50-60 శాతం ఎక్కువ డిమాండ్ ఉండబోతుందని హ్యుమన్ రిసోర్స్, సెర్చ్ ఎక్స్‌పర్ట్‌లు అంచనావేస్తున్నారు. వ్యాపార వ్యూహాలపై మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రభావం చూపనున్నట్టు పేర్కొన్నారు. పునరావృత పనులను మిషన్లు తగ్గిస్తాయని, రోబోటిక్స్, ఏఐ, బిగ్ డేటా, అనాలిటిక్స్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటుందని ఓరాకిల్ ఆసియా-పసిఫిక్ రీజన్ సీనియర్ డైరెక్టర్ షఖున్ ఖన్నా చెప్పారు. ఐఓటీ ఎకోసిస్టమ్‌లో ఉద్యోగాలు గత మూడేళ్లలో నాలిగింతలు పెరిగాయని బిలాంగ్ అంచనావేసింది. గత కొన్నేళ్లలో ఏఐలో డేటా అనాలిసిస్, డేటా సైంటిస్ట్ నిపుణులకు డిమాండ్ 76 శాతం పెంచినట్టు పేర్కొంది. వ్యాపారం, ఆర్థిక సర్వీసులు, ఇన్సూరెన్స్, ఈకామర్స్, స్టార్టప్‌లు, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి రంగాల్లో ఎంట్రీ నుంచి మధ్య స్థాయి, సీనియర్ స్థాయి వరకు డిమాండ్ ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ప్రక్రియ ఆధారిత కంపెనీలకు మంచి కస్టమర్ అనుభవాన్ని అందించడానికి రోబోటిక్స్ అవసరం ఉందని, ఇది వ్యయాలను తగ్గించి, సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని కెల్లీ సర్వీసెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు. భారత్‌లో సుమారు 7వేల నుంచి 10వేల డేటా సైంటిస్ట్‌లు ఉన్నారని, 4 నుంచి 5 ఏళ్ల అనుభవమున్న వారికి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షల వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. డేటా అనాలిటిక్స్‌కు ప్రారంభ వేతనమే రూ.4 లక్షల నుంచి రూ.8లక్షలుంటుందని, 10 కంటే ఎక్కువ అనుభవమున్న ఏఐ నిపుణులకు రూ.60 లక్షల నుంచి రూ.1.5 కోట్లు సంపాదిస్తున్నారని రిపోర్టులు తెలిపాయి. -
ఈ టెకీలకు రోబోల ముప్పు లేదు..
సాక్షి,న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్‌తో ఉద్యోగాలకు ఎసరు వస్తుంటే తాజాగా 21 జాబ్లకు రోబోల నుంచి మరో పదేళ్ల వరకూ ఎలాంటి ముప్పూ ఉండదని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఓ నివేదికలో వెల్లడించింది.పరిశ్రమ ట్రెండ్స్,వాస్తవాలను ఆకళింపు చేసుకుని ఈ నివేదిక రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది. రోబో ఫ్రూఫ్ జాబ్‌లుగా ఇవి భవిష్యత్‌ను నిర్ధేశిస్తాయని తెలిపింది. ఈ సూపర్ జాబ్స్‌లో క్వాంటమ్ మెషీన్ లెర్నింగ్ ఎనలిస్ట్, అగ్మెంటెడ్ రియాల్టీ జర్నీ బిల్డర్,మాస్టర్ ఆఫ్ ఎడ్జ్ కంప్యూటింగ్,జెనెటిక్ డైవర్సిటీ ఆఫీసర్, ఏఐ-అసిస్టెడ్ హెల్త్‌కేర్ టెక్నీషియన్,సైబర్ సిటీ అనలిస్ట్,డేటా డిటెక్టివ్, పర్సనల్ డేటా బ్రోకర్, ఐటీ ఫెసిలిటేటర్,మ్యాన్-మెషీన్ టీమింగ్ మేనేజర్,బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్,డిజిటల్ టైలర్,వర్చువల్ స్టోర్ షెర్పా,ఫిట్నెస్ కమిట్మెంట్ కౌన్సెలర్,పర్సనల్ మెమరీ క్యూరేటర్,చీఫ్ ట్రస్ట్ ఆఫీసర్,ఫైనాన్షియల్ వెల్నెస్ కోచ్,జీనోమిక్ పోర్ట్‌పోలియో డైరెక్టర్,ఎథికల్ సోర్సింగ్ మేనేజర్,హైవే కంట్రోలర్ వంటి ఉద్యోగాలున్నాయి. -
‘ఉద్యోగాలే కాదు మానవ ఉనికికే ప్రమాదం’
సాక్షి,న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ), రోబోటిక్స్‌తో ఉద్యోగాలు ఊడటమే కాదు మానవ ఉనికికే ప్రమాదమని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. గ్రహాంతరవాసులతో ప్రమాదం పొంచి ఉందని గతంలో హెచ్చరించిన హాకింగ్ తాజాగా రోబోలు మానవులను పూర్తిగా ఆక్రమించేస్తాయని కృత్రిమ మేథతో పెనుముప్పు ఎదురవనుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జాతిని మొత్తంగా కబళిస్తుందనే భయం తనకుందని హాకింగ్ పేర్కొన్నట్టు మిర్రర్ కథనం పేర్కొంది. కంప్యూటర్ వైరస్‌లను కొందరు క్రియేట్ చేస్తే వాటికి దీటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తుందని, ఇది విధ్వంసానికి దారితీస్తుందని హాకింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.మానవుల పాత్రను పరిమితం చేసే నూతన విధానం ఇదని ఆయన అభివర్ణించారు. మానవ మెదడు, కంప్యూటర్ సాధించే విషయాల్లో వైరుధ్యం ఉందని తాననుకోవడం లేదని వైర్డ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆయన పేర్కొన్నారు. ప్రపంచ జనాభా ఆందోళనకరంగా పెరిగిపోతోందని..మనం స్వయం విధ్వంసం దిశగా వెళుతున్నామని హెచ్చరించారు.మానవ జాతిని పరిరక్షించుకునేందుకు మనం ఇతర గ్రహాలను అన్వేషించాల్సి ఉందని అన్నారు. రాబోయే వందేళ్లలో మానవులు భూమిని వదిలి వేరే గ్రహాలకు వెళ్లాలని గతంలో హాకింగ్ పేర్కొన్న విషయం విదితమే. ప్రపంచ ప్రభుత్వం మానవాళికి ఉన్న ఏకైక ఆశాజ్యోతి అని ఆయన స్పష్టం చేశారు. -
భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!
-
భారత్‌లో 3.5 కోట్ల మంది ఉద్యోగాలకు ఎసరు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు భవిష్యత్తులో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రధాన రంగాల్లో ఈ రంగం ఒకటిగా ఎదిగిన విషయం తెల్సిందే. ఈ రంగంలో చోటు చేసుకుంటున్న రోబోఠఙక్ సాంకేతిక పరిజ్ఞానం మరో 30 ఏళ్ల నాటికి యాభైశాతం కార్మికులను రోడ్డున పడేయనుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం నాటికి భవన నిర్మాణ రంగంలో భారత్ ప్రపంచంలోనే మూడవ దిగ్గజ దేశంగా ఎదుగుతున్న అంచనాల నేపథ్యంలో కార్మికుల పట్ల ఇది ప్రతికూల పరిణామమే. న్యూయార్క్‌లోని ఓ కంపెనీ తయారు చేసిన సెమీ ఆటోమేటిక్ మిషన్లు (ఎస్ఏఎం) ఇప్పటికే ఇటుక గోడల నిర్మాణంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ప్రస్తుతం వీటిని అమెరికాలో ఉపయోగిస్తుండగా, త్వరలోనే బ్రిటన్‌లో ఉపయోగించనున్నారు. మానవులు రోజుకు 500 ఇటుకలతో కూడిన గోడను నిర్మించగలిగితే ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్లు రోజుకు 3000 ఇటుకలతో గోడలను నిర్మించగలుగుతున్నాయి. ఈ విషయంలో పెర్త్‌లోని ఓ రోబోటెక్ కంపెనీ ఇంతకన్నా అధునాతనమైన రోబో యంత్రాలను కనిపెట్టాయి. ప్రయోగాత్మక పరీక్షలు కూడా విజయవంతం అవడంతో ఆ కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి వీటిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటోంది. ఇటుక గోడల నిర్మాణానికి రానున్న దశాబ్దం మొత్తం రోబోటిక్ యంత్రాలదేనని ఇదే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్న స్విడ్జర్లాండ్ పరిశోధకులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన ఇంజనీర్ హాడ్రియన్ రెండు రోజుల్లో ఇంటిని నిర్మించే రోబో యంత్రాలను 2015లో డిజైన్చేసి వాటి మీద పని చేస్తున్నారు. అవి కూడా మార్కెట్లోకి వచ్చినట్లయితే ఈ రంగం మీద ఆధారపడి బతుకుతున్న కార్మికులకు మరింత ప్రమాదం. ప్రస్తుతానికి రోబోలను పని చేయించడానికి కొంత సిబ్బంది అవసరం అవుతున్నారు. పోనుపోను సిబ్బంది అవసరం లేకుండానే రోబోలే అన్ని పనులు చేసుకుంటూ పోతాయట. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న 30 ఏళ్లలో భారత్‌లో మూడున్నర కోట్ల మంది కార్మికులు రోడ్డున పడతారని నిపుణుల అంచనా. -
కావ్య.. ఓ స్పెషల్ గాళ్!
పన్నెండేళ్ల వయసులో ఎవరైనా ఏమిచేస్తారు? సహజంగానే బడికిపోతారు. తోటి పిల్లలతో కాసేపు ఆడుకుంటారు. ఆలసిపోయాక అమ్మ ఒడిలో సేదదీరతారు. అయితే 12 ఏళ్ల కావ్య విఘ్నేశ్ మాత్రం ఇందుకు భిన్నం. తాను కేవలం ఆటపాటలకే పరిమితం కాలేదు. కాస్త ఖాళీ సమయం దొరికినా దానిని ఇతరులకు ఉపయోగపడేలా వినియోగిస్తోంది. ఇతరులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరికేలా చేస్తోంది. న్యూఢిల్లీ: ఇప్పటిదాకా మీరు చదివినదంతా నిజమే. ఆవాస ప్రాంతాల్లో సంచరించే తేనెటీగల సంరక్షణకు కంకణం కట్టుకున్న కావ్య.. ఇందుకోసం ఏకంగా ఓ రోబోను తయారుచేసే పనిలో నిమగ్నమైంది. దీనిని వచ్చే నెలలో డెన్మార్క్‌లో జరగనున్న అంతర్జాతీయ రోబోటిక్స్ ప్రదర్శనలో ఉంచనుంది. దేశరాజధానిలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలో నివసించే కావ్య... ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. రోబోటిక్స్, అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ‘బీ సేవర్ బాట్’ను కావ్య తయారుచేసింది. ఈ ‘బీ సేవర్ బాట్’ ... ఫలదీకరణతోపాటు తేనె ఉత్పత్తికి దోహదం చేసే తేనెటీగలకు ఎటువంటి హాని కలగకుండా రక్షణ కల్పిస్తుంది. ‘తొమ్మిదేళ్ల వయసులోనే రోబోటిక్స్‌పై దృష్టి సారించా. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు రోబోటిక్స్ద్వారా పరిష్కార మార్గం చూపాలనేదే నా లక్ష్యమ’ని ఈ సందర్భంగా కావ్య చెప్పింది. గత మూడేళ్ల కాలంలో ఢిల్లీ రీజనల్ రోబోటిక్స్ చాంపియన్‌షిప్ (2015, 16)తోపాటు అనేక రోబోటిక్ చాంపియన్‌షిప్‌లను ఈ విద్యార్థిని కైవసం చేసుకుంది. వచ్చే నెలలో డెన్మార్క్‌లో జరిగే అంతర్జాతీయ పోటీలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తేనెటీగలపైనే ఎందుకు దృష్టి సారించావని అడగ్గా ‘సహజంగానే వీటిని ఎవరూ పట్టించుకోరు. పైగా రసాయనాలను వెదజల్లి మరీ మనుషులు వీటి ప్రాణాలను హరిస్తారు. ప్రపంచంలోని పంటల్లో 85 శాతం ఫలదీకరణ ప్రక్రియ వీటిద్వారానే జరుగుతుందనే విషయాన్ని నేను, నా బృందం తెలుసుకున్నామ’ని తెలిపింది. సాధారణంగా ఇళ్ల సమీపంలో తేనెతుట్టె కనిపిస్తే వెంటనే పెస్ట్ కంట్రోలర్లను రప్పించి వాటిపై రసాయనాలు చల్లిస్తారని, ఇలా చేయడం వల్ల 20 నుంచి 80 వేల వరకు తేనెటీగలు చనిపోతున్నాయని ఈ బాలమేధావి వివరించింది. -
శస్త్రచికిత్సకు ‘రోబో’
వాషింగ్టన్: వైద్య చికిత్సల్లో రోబోల వాడకం విస్తృతంగా పెరిగిపోతోంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి శరీరంపై చిన్న గాటు చేసి తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్స చేసే రోబోటిక్ పరికరాన్ని అమెరికాలోని మిచిగాన్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం అభివృద్ధి చేసింది. ఇందులో భారత సంతతి శాస్త్రవేత్త శోర్య అవతార్ ఉండటం విశేషం. ఫ్లెక్స్డెక్స్ అనే ఈ రోబోటిక్ పరికరాన్ని వైద్యులు తమ చేతికి ధరించి దానికి మార్గదర్శకం చేయడం ద్వారా చికిత్స నిర్వహించవచ్చని పరిశోధకులు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు వీలుగా దీనికి సహజమైన సూదిని అమర్చారు. ఈ పద్ధతిలో చికిత్స నిర్వహించడం ద్వారా తక్కువ ఖర్చు, సన్నటి రంధ్రం, తక్కువ నొప్పి, గాయం త్వరగా మానే అవకాశం.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఈ పరికరం ధర కేవలం రూ.33 వేలు. -
గాలిలో షికారు
ఒకవైపు డ్రైవర్లు లేని కార్లు, లారీలు రోడ్లెక్కుతున్నాయా! ఇంకోవైపు డ్రోన్లను చిన్న చిన్న ఎగిరే కార్లుగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందా! ఈ మధ్యలో... అసలు ఎగిరే కార్లకు డ్రైవర్లు ఎందుకు అంటూ ప్రశ్నిస్తోంది ఇజ్రాయెల్‌కు చెందిన టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఓ కాల్ చేస్తే ఇంటిపైకి ఎగిరే కారు వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కేసి? ఎక్కడికెళ్లాలో చెబితే చాలు. నిమిషాల్లో మీరు గమ్యం చేరిపోవచ్చు అంటోంది ఈ కంపెనీ. వట్టి మాటలతోనే సరిపెట్టలేదు ఈ టాక్టికల్ రోబోటిక్స్ సంస్థ. ఫొటోలో కనిపిస్తోందే... ఎయిర్మ్యూల్ ఎయిర్ ట్యాక్సీ... దాన్ని ఈ మధ్యే విజయవంతంగా నడిపి చూసింది కూడా. రెండు లేజర్ ఆల్టీమీటర్లు (ఎత్తును కొలిచేందుకు వాడే యంత్రాలు), ఇంకో రాడార్ ఆల్టీమీటర్, కదలికల్ని గుర్తించే ఇనర్షియల్ సెన్సర్లతోపాటు నిట్టనిలువుగా గాలిలోకి ఎగిరేందుకు అవసరమైన మోటార్లు, రోటర్ బ్లేడ్లున్నారుు దీంట్లో. దీంతోపాటు ఒక పైలట్‌లా ఎప్పటికప్పుడు ఏ దిక్కుకు, ఎంత వేగంతో, ఎలాంటి కోణంలో ప్రయాణించాలి లాంటి నిర్ణయాలన్నీ తీసుకునేందుకు దీంట్లో ప్రత్యేక ఫ్లైట్మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ‘ఇంకేముంది! ఎలాగూ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు కదా! త్వరలోనే వీటిని మనమూ చూడవచ్చా?’ అంటే... కొంచెం ఓపిక పట్టాలి అంటోంది సంస్థ. తొలి ప్రయత్నం విజయవంతమైనప్పటికీ అందులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. అత్యవసర సందర్భాల్లో ఈ పైలట్ లెస్ ఎయిర్ ట్యాక్సీ ఉపయోగం చెప్పే నమూనా చిత్రం ఫ్లైట్ మేనేజ్మెంట్ వ్యవస్థ మూడు సందర్భాల్లో తగిన నిర్ణయాలు తీసుకోలేదని ఆ సంస్థ అంటోంది. రెండుసార్లు లేజర్ ఆల్టీమీటర్ రీడింగ్స తప్పుగా వచ్చాయట. ఫలితంగా ప్రయాణాన్ని కొంచెం ముందుగానే నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించిన తరువాత మరిన్ని పరీక్షలు నిర్వహించి, వీటిని విస్తృత వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటోంది టాక్టికల్ రోబోటిక్స్. అన్నట్లు... తాజాగా ఇంకో విషయం... కంపెనీ తన వాహనం పేరును ఇప్పుడు ఎయిర్మ్యూల్ నుంచి కొమరాంట్ అని మార్చేసింది! -
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి
– రోబోటిక్స్‌పై జాతీయ సదస్సులో బృందావన్ కాలేజీ అకాడమిక్ డైరక్టర్ పిలుపు కల్లూరు (రూరల్): విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని బృందావన్ ఇంజినీరింగ్ కళాశాల అకాడమిక్ డైరక్టర్ ఎన్ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. పెద్దటేకూరులోని బృందావన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో మంగళవారం 'రోబోటిక్స్'పై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా కళాశాల అకాడమిక్ డైరక్టర్ హాజరై మాట్లాడారు. పుస్తక పరిజ్ఞానం ఇంజినీరింగ్ విద్యార్థులకు సరిపోదన్నారు. హైదరాబాద్ డేటా పాయింట్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ పి. సాయికృష్ణ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక రంగంలో దూసుకెళ్తేనే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో బిట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. గిరీష్‌రెడ్డి, ఎగ్జిక్యూటీవ్ డైరక్టర్స్ ప్రొఫెసర్ ఎస్.రమేష్‌రెడ్డి, ఎస్ నారాయణరెడ్డి, డేటా పాయింట్ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ టి. శివప్రసాద్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బి. హరికుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హాయ్ బోలో.. హలో రోబో!
♦ రోబోటిక్స్ వికీపీడియా హాయ్రోబో ♦ ఒకే వేదికగా థియరీ, ప్రోగ్రామింగ్, కిట్స్ వంటివన్నీ విక్రయం ♦ కాలేజీలు, స్కూళ్లలో రోబో ల్యాబ్స్ ఏర్పాటు, శిక్షణ ♦ ‘స్టార్టప్ డైరీ’తో హలో రోబో ఫౌండర్ రూపక్ జాడ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘చిట్టి’.. ఈ ముద్దు పేరు వినపడగానే ముందుగా గుర్తొచ్చేది రోబో సినిమా.. రజనీకాంత్ చేతిలో రూపుదిద్దుకున్న చిట్టి... రోబోనే! ఈ చిత్రంలో రోబోను తయారు చేసేందుకు రజనీ ఎంత కష్టపడ్డాడో తెర మీద చూశాం. అది సినిమా కాబట్టి రజనీ అలా.. అలా కానిచ్చేశాడు. మరీ, నిజంగానే రోబోను తయారు చేయాలంటే? ఇదిగో ఇదే వ్యాపార వస్తువుగా మారి.. హైదరాబాద్ కేంద్రంగా ‘హలో రోబో’ పేరుతో స్టార్టప్ రూపుదిద్దుకుంది. సంస్థ సేవలు, విస్తరణ గురించి హలో రోబో ఫౌండర్ రూపక్ జాడ మాటల్లోనే.. చిన్నతనం నుంచే రోబోలను తయారు చేయడమంటే ఇష్టం. ఇంజనీరింగ్‌లో ప్రాజెక్ట్ వర్క్ కూడా దీని మీదే చేశా. స్నేహితులకూ హెల్ప్ చేసేవాణ్ణి. ఒక దశలో రోబో థియరీ, ప్రోగ్రామింగ్ చేయడం చాలా కష్టమయ్యేది. అప్పుడే అనిపించింది.. అసలు రోబోటిక్స్‌ను ఎడ్యుకేషన్‌లా అందిస్తే ఎలా ఉంటుందా అని. ఇంకేముంది రూ.2 లక్షల పెట్టుబడితో 2013లో హలో రోబో.కామ్‌ను ప్రారంభించా. రోబోటిక్స్ వికీపీడియా.. హలోరోబోలో ఏముంటాయంటే.. రోబోటిక్స్ గురించి నేర్పిస్తాం. థియరీ, ప్రోగ్రామింగ్, ఇన్స్టలేషన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తాం. రోబోలను తయారు చేసేందుకు అవసరమైన కిట్స్నూ విక్రయిస్తాం. ఒక్కముక్కలో చెప్పాలంటే రోబోటిక్స్‌కు వికీపీడియా లాంటిది ఈ హలో రోబో. ప్రస్తుతం మా దగ్గర రాబీ బేసిక్, అడ్వాన్స్, బ్లూ, ఆక్వా, ఆర్మ్, డ్రోన్లతో పాటూ ఆర్అండ్డీలో మరో 3 మొత్తంగా 10 రకాల రోబోలున్నాయి. రోబో కిట్స్ కొనుగోలు కోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో ఒప్పందం చేసుకున్నాం. కిట్స్ ప్రారంభ ధర రూ.1,200- 20 వేల వరకూ ఉంటుంది. వర్క్‌షాప్‌లు, శిక్షణ కూడా.. విద్యార్థి దశ నుంచే రొబోటిక్స్‌లో శిక్షణ ఇచ్చేందుకుగాను కళాశాలలు, పాఠశాలల్లో శిక్షణ, వర్క్‌షాప్‌లను కూడా నిర్వహిస్తున్నాం. మల్లారెడ్డి గ్రూప్‌కు చెందిన మూడు ఇనిస్టిట్యూట్స్‌లో, తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈలో ల్యాబ్స్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాం. ఇందుకోసం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం 15 కళాశాలలకు చెందిన విద్యార్థులు మా కస్టమర్లుగా ఉన్నారు. 30 వర్క్‌షాప్‌లు నిర్వహించాం. రూ.3 కోట్ల నిధుల సమీకరణ.. ఇప్పటివరకు సుమారు 350-400 రోబో కిట్స్‌ను విక్రయించాం. గత ఏడాది రూ.30 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 200 శాతం వృద్ధిని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఆరుగురు సభ్యులమున్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో సొంతంగా ఆన్లైన్ రిటైల్ వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తాం. విస్తరణ నిమిత్తం రూ.3 కోట్ల నిధులు అవసరం కావటంతో ఫండింగ్ కోసం చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది ప్రారంభంలో డీల్‌ను క్లోజ్ చేస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి.... -
ఇక నుంచి రోబోలే మానసిక వైద్యులు
లండన్: మానసిక రుగ్మతల నుంచి ఉపశమనం పొందేందుకు ఇక నుంచి రోబోల(కంప్యూటర్ అవతార్) సహాయం తీసుకోవచ్చు. మానసికంగా బాధపడే వారి ఆలోచనలకు తగిన విధంగా ఈ అవతార్లు పనిచేస్తాయి. ఎదుటి వ్యక్తి మానసిక రుగ్మతలకు సరిపోలుతూ వీటి ఆలోచనలు ఉంటాయి. అంటే బాధలో ఉన్న వ్యక్తికి మిర్రర్ గేమ్ ద్వారా అవతార్లు ఉపశమనం కలిగిస్తాయి. మిర్రర్గేమ్లో రెండు విభిన్న రంగుల బంతులను సమాంతరంగా కదిలించడం ద్వారా ఇద్దరి వ్యక్తుల ఆలోచనలను పరస్పరం అర్థం చేసుకోవచ్చు. ఇదే తీరుగా అవతార్ కూడా రోగి మానసిక స్థితిని అర్థం చేసుకుంటుందని ఇంగ్లాండుకు చెందిన బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘ముందస్తుగా ఈ అవతార్ మానసిక రోగివలె ప్రవర్తించి వారి రుగ్మతకు గల కారణాలు తెలుసుకుంటుంది. అనంతరంచికిత్స ప్రారంభిస్తుంది. బాధతో ఉన్న వ్యక్తిని సాధారణ స్థితికి తీసుకొచ్చేంత వరకు చికిత్స అందిస్తుంది’ అని ప్రొఫెసర్ మేరియో వెల్లడించారు. -
పిల్లలిక సాకులు చెప్పలేరు!
* క్రెయా లెర్నింగ్ సృజనాత్మక స్టూడియో పాఠాలు * విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచడమే లక్ష్యం * 18 కోట్ల పెట్టుబడులు పెట్టిన ముంబై సంస్థ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫోన్లు, కార్లు, సిటీలూ.. అన్నీ ఇపుడు స్మార్టే! గత కొన్నేళ్లలో ప్రపంచంలో ఎన్నో మార్పులు. కానీ క్లాస్ రూమ్ మాత్రం పెద్దగా మారలేదు. బల్లలూ, బోర్డు, చాక్‌పీస్, డస్టర్... అలాగే ఉన్నాయి. ఇక పరీక్షలూ, ప్రోగ్రెస్ కార్డులతో విద్యా వ్యవస్థలోనూ పాత పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదంతా చూస్తూ హరి కె వర్మ ఏమంటారంటే విద్యార్థి దశలోనే డిజిటలైజేషన్ అలవాటవ్వాలని. అలాగైతేనే ప్రపంచంతో పోటీ పడగలమని చెబుతారాయన. అందుకే ఆయన క్రెయా లెర్నింగ్.కామ్‌ను ఆరంభించారు. విద్యార్థులకు నైపుణ్యాన్ని, సృజనను అలవాటు చేయడానికి స్టూడియో ప్రయోగాలు, పాఠాలను పరిచయం చేస్తున్నారు. తమ సంస్థ గురించి ఇంకా ఆయన ఏమంటారంటే... మొక్కను మనం పెంచలేం. అవి పెరిగే వాతావరణాన్ని కల్పిస్తాం. అంతే!!. అలాగే పిల్లలకూ మనమేమీ నేర్పించలేం. వారికి వారే నేర్చుకునే వాతావరణాన్ని కల్పించాలంతే. 2011లో క్రెయా లెర్నింగ్‌ను స్థాపించడానికి ముందు దేశంలోని విద్యా వ్యవస్థ తీరుపై నేను, ప్రవీణ్ ఉదయగిరి, వెంకటేశ్వర్‌రెడ్డి కలిసి అధ్యయనం చేశాం. నగరం, పట్టణం, గ్రామీణ చిన్నారుల్లో విషయ సంగ్రహణ, జ్ఞాపక శక్తుల్లో భారీ వ్యత్యాసం ఉంది. దానికి పరిష్కారం ఆయా ప్రాంతాలకనుగుణంగా పాఠ్య ప్రణాళిక తయారు చేయడం. అప్పుడే పదో తరగతి పూర్తయ్యేలోపు అందరినీ నైపుణ్యమున్న విద్యార్థులుగా చేయగ లం. అదే ఉద్దేశంతో ముగ్గురం కలిసి రూ.80 లక్షల పెట్టుబడితో క్రెయా లెర్నింగ్ సంస్థను స్థాపించాం. ఇదో ప్రయోగశాల..: పిల్లల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంచడటమే క్రెయా లెర్నింగ్ పని. ఇందుకోసం గణితం, సాంకేతికత, భౌతిక, సామాజిక శాస్త్రాలకు చెందిన ప్రయోగాల పుస్తకాలను తరగతుల వారీగానే కాక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి సిలబస్లల్లో వేర్వేరుగా రూపొందించాం. స్టూడియో లెర్నింగ్‌కు అవసరమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్ అని పిలిచే (ఎస్టీఈఎం) స్టెమ్‌లను కొరియా, జర్మనీ, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటి ద్వారా రొబోటిక్స్, కెమెరా, ఇంజనీరింగ్, ఆడియో వీడియో రికార్డింగ్స్, బ్రిక్స్, ఎలక్ట్రానిక్స్ వంటి అంశాలను నేర్పిస్తాం. ఉదాహరణకు క్రేన్‌తో భారీ ఓడ నుంచి కార్గోను అన్లోడ్ చేయాలనుకోండి. ఈ ప్రయోగంలో క్రేన్, ఓడ, కంటైనర్లు, లారీలు, నిల్వ కేంద్రాలు అవసరం. ఇలాంటి నిజమైన వీడియో దృశ్యాన్ని మొదట పిల్లలకు చూపిస్తాం. తర్వాత ఆ వాహనాలు, అవసరమైన వస్తువులను వారి ముందు ఉంచితే... వాటిలోంచి ఉపయోగపడే వాటిని ఎంచుకునేందుకు మేధోమథనం చేస్తారు. నిర్మాణాత్మక ప్రయోగంతో ఫలితం సాధిస్తారు. చేసిన ప్రయోగాల్ని పుస్తకంలో రాసి తోటివారికి వివరించాలి. విద్యార్థులంతా సమూహంలా పనిచేయడం వల్ల సందేహాలను పరిష్కరించుకోగలుగుతారు. విదేశీ స్కూళ్లలోనూ... ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 10 స్కూళ్లతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మొత్తం 65 పాఠశాలల్లో సుమారు 40 వేల మంది విద్యార్థులకు క్రియా లెర్నింగ్ స్టూడియో ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. హైదరాబాద్‌లో సమష్టి, గాంగ్స్ వ్యాలీ, గీతాంజలి, నీరజ్ వంటి అంతర్జాతీయ పాఠశాలలతో పాటు ఈ సంవత్సరం హెదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలోనూ ఇది అందుబాటులోకి వస్తోంది. నేపాల్, అబుదాబి, దుబాయ్, నైజీరియా, బ్రెజిల్ దేశాల్లో 90 పాఠశాలల్లో ఈ ప్రాజెక్ట్‌ను విస్తరిస్తున్నాం. ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు క్రియా లెర్నింగ్ విద్యనందించేందుకు విద్యా శాఖను సంప్రదించాం. అనుమతిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాం. ఆన్లైన్, రిటైల్ మార్కెట్లోకీ.. పాఠశాలలకే పరిమితమైన క్రియో లెర్నింగ్ పాఠాలను తమ పిల్లలకు ఇంట్లోనే నేర్పించాలని చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నారు. ఈ ఏడాది ముగింపు కల్లా మా పాఠాల్ని ఆన్లైన్, రిటైల్ మార్కెట్లోకి తెస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 36 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముంబైకి చెందిన ఓ సంస్థ రూ.18 కోట్ల పెట్టుబడులు పెట్టింది. 2014 సంవత్సరానికి రూ.14 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. స్టూడియో లెర్నింగ్ బోధనకు ఏడాదికి ఒకో విద్యార్థికి రూ.1,800 చార్జి చేస్తాం. పిల్లల్లో నైపుణ్యం మెరుగుదలపై 2 నెలలకొకసారి మా బృందం వెళ్లి పర్యవేక్షిస్తుంది కూడా. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
దీనికీ మెదడుంది..!
ఈ ‘లెగో మెషిన్’ రోబోకూ ఓ మెదడుంది. సొంతంగా అటూఇటూ తిరుగుతుంది. గోడను తాకగానే తిరిగి వెనక్కి లేదా పక్కకు మళ్లుతుంది. డిజిటల్ జంతువును సృష్టించే ప్రాజెక్టు చేపట్టిన బ్రిటన్, అమెరి కా శాస్త్రవేత్తలు దీ నిలో అచ్చం ను లిపురుగు మెదడులా పనిచేసే ఓ ‘డిజిటల్ బ్రెయిన్’ను అమర్చారు! సియానోరాబ్డైటిస్ ఎలిగెన్స్ అనే నులిపురుగు మెదడుకు నకలు(డిజిటల్ బ్రెయిన్)గా ఈ మెదడును తయా రు చేశారు. భవిష్యత్తులో మరింత క్లిష్టమైన మెదడును తయారు చేస్తే.. కృత్రిమ జంతువులనూ సృష్టించవచ్చని చెబుతున్నారు. -
‘గస్తీ’మే.. సవాల్!
రోడ్డుపై కనిపిస్తోన్న ఇది ఓ రోబో సెక్యూరిటీ గార్డు. పేరు నైట్స్కోప్. ఎప్పుడైనా, ఎక్కడైనా జస్ట్ ప్లేస్ చెప్పేస్తే చాలు.. అక్కడికెళ్లి గస్తీ కాస్తుంది. లేజర్ కెమెరాలతో పరిసరాలను గమనిస్తుంది. అనుమానాస్పదంగా కనిపిస్తే.. వీడియోలతో సహా పోలీసు కంట్రోల్ రూంకు స మాచార మిస్తుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఓ రో బోటిక్ కంపెనీ ఈ ఐదడుగుల రోబోలను సెక్యూరిటీ గార్డులుగా ఉపయోగిస్తోంది. -
చిట్టి
థియరీలో డిస్టింక్షన్ కొడుతున్న మీ పిల్లలు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అవుతున్నారని చింతిస్తున్నారా..! ఇక ఆ బెంగ అవసరం లేదు. మనిషి సృష్టించిన మరమనిషి మనలోకి వచ్చేశాడు. బోటనీ పాఠమైనా.. ఫిజిక్స్ ఫిక్షనయినా.. మేథమెటిక్ మ్యాజిక్ అయినా.., ప్రాక్టికల్‌గా చూస్తేనే పిల్లల మస్తిష్కంలో ఫిక్సయిపోతుంది. రోబో గురు సహాయంతో అపారజ్ఞానాన్ని సంపాదించుకునే అపూర్వ అవకాశం లభిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ప్రయోగాల్లో యంత్రుడు మంత్రదండంలా ఉపయోగపడుతున్నాడు. రోబోటిక్స్.., ఆ రోబోలు చూపే ట్రిక్స్ యువత ఉపాధికి బాటలు వేస్తున్నాయి. విద్యా వ్యవస్థలో సంపాదించిన జ్ఞానానికి.. ఉపాధి రంగంలో అవసరమైన పరిజ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రోబో ల్యాబ్‌లు తగ్గించేస్తున్నాయి. టీచర్ చెప్పే పాఠాలతో కుస్తీ పట్టకండలా.. బట్టీపట్టి నేర్చుకుంటే పరీక్షల్లో మార్కులొస్తాయి కానీ.. సంపూర్ణ జ్ఞానం రాదు. ఇదే కొనసాగితే ఉద్యోగాన్వేషణలో సాటివారికి సిసలైన పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకుంటాం. ప్రస్తుతం విద్యార్థుల్లో 90 శాతం మందికి ఇదే అనుభవం ఎదురవుతోంది. ఇలాంటి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ ముందుకొస్తున్నాయి రోబోలు. పాఠశాల స్థాయి నుంచి గ్రాడ్యుయేషన్ లెవల్ వరకు పాఠాలకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడానికి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. మొదట గృహ, పారిశ్రామిక రంగాల వినియోగంపై దృష్టి సారించిన రోబోటిక్స్ సంస్థలు. ఇప్పుడు ‘చదువుతూ నేర్చుకోవాలి.. నేర్చుకుంటూ చదువుకోవాలి’ అనే నినాదంతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రాక్టికల్‌గా పాఠాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి అంశాన్ని ప్రాక్టికల్‌గా వివరించేందుకు అధ్యాపకులు కూడా వీటిపై ఆధారపడుతున్నారు. భవిష్యత్ బంగారం రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్.. ఇలా అన్ని రంగాలతోనూ రోబోటిక్స్ ముడిపడి ఉంది. భవిష్యత్‌లో పరిశోధకులుగా, వివిధ ఉత్పాదక సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు రోబోటిక్స్ పరిజ్ఞానం తప్పనిసరి. అందుకే పాఠశాలలు, కళాశాలల్లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు అత్యవసరం. తద్వారా అధ్యాపకులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన కలుగుతుంది. విజ్ఞానం తప్పనిసరి రోబోటిక్స్ పరిజ్ఞానం విద్యార్థులు, అధ్యాపకులకు తప్పనిసరి అని జే రోబోటిక్స్ సంస్థ ఎండీ సుధీర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో అన్ని రంగాల్లోనూ రోబోటిక్స్ వేళ్లూనుకుంటుందని ఆయన తెలిపారు. శిక్షణ ఇలా.. రోబోట్పైనే ఎలా ప్రోగ్రామ్ చేయాలనే దానిపై రోబోగురు సాఫ్ట్వేర్ ద్వారా మొదట విద్యార్థులు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇదే ప్రోగ్రామ్‌ను ఒక వైర్ ద్వారా రోబోట్పైనా డంప్ చేస్తారు. అప్పుడు రియల్‌టైమ్‌లో రోబో కదులుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సిల్క్స్, అనలెటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. రియల్ టైమ్‌లో రోబో కదులుతున్నప్పుడు ఎదురైన సమస్యలను విద్యార్థులు గుర్తిస్తారు. ఆ సమస్య సాధనకు మళ్లీ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో అవగాహన శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ల సొంత ఐడియాతోనే విద్యార్థులు ప్రాజెక్టు చేస్తారు. ఇలా చేయడం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇందుకోసం ఓమ్నీ రోబో, విజ్మో జూనియర్, డోసెలైక్స్, డొసెలైక్స్ సీనియర్, రోబో రూకా, అసాల్టర్ రోబోలను ఉపయోగిస్తారు. -
మెదడులాంటి చిప్.. కంప్యూటర్ కన్నా పవర్ఫుల్!
మనిషి మెదడు గొప్పా? కంప్యూటర్ గొప్పా? అంటే ఇప్పటికి మాత్రం మెదడే పవర్ఫుల్. అందుకే మెదడును మోడల్‌గా తీసుకుని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ‘న్యూరోగ్రిడ్’ అనే ఈ సర్క్యూట్ బోర్డును తయారు చేశారు. ఐపాడ్ సైజులో ఉన్న ఈ బోర్డులో 16 న్యూరోకోర్ చిప్‌లు ఉన్నాయి. మెదడులో 10 లక్షల నాడీకణాలు, వందల కోట్ల సర్క్యూట్ల అంత వేగంగా ఈ చిప్‌లు పనిచేస్తాయట. అందువల్ల.. ఈ బోర్డు కంప్యూటర్ కన్నా 40 వేల రెట్లు తక్కువ విద్యుత్‌తోనే, ఏకంగా 9 వేల రెట్లు వేగంగా పనిచేస్తుందట. ప్రస్తుతానికి దీని ధర 40 వేల డాలర్లు. కానీ పెద్ద ఎత్తున తయారు చేస్తే 400 డాలర్లకే అందించవచ్చని చెబుతున్నారు. రోబోటిక్స్, కంప్యూటింగ్ రంగాల్లో కీలక మార్పులకు ఇది నాంది పలకనుందట. పక్షవాత రోగుల మెదడులో ఈ చిప్‌లను అమరిస్తే కృత్రిమ అవయవాలకు తగిన ఆదేశాలు ఇస్తూ.. అవి సహజ అవయవాలంత చురుకుగా పనిచేసేలా చేస్తాయట. -
ఇకమొబైల్ కామర్స్ హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే రోజుల్లో మొబైల్ కామర్స్ (ఎం-కామర్స్) భారీగా పెరుగుతుందని ఆన్లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సహ-వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తెలిపారు. ల్యాప్‌టాప్‌లు వంటి సాధనాల ద్వారా ఈ-కామర్స్ లావాదేవీలు జరపడం కన్నా మొబైల్ యాప్స్ వంటి వాటి ద్వారా షాపింగ్ చేయడం పెరుగుతుందన్నారు. దీంతో, ప్రస్తుతం సుమారు పది శాతంగా ఉన్న ఎం-కామర్స్ వాటా రాబోయే రెండేళ్లలో యాభై శాతానికి పెరగగలదని పేర్కొన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలిగిన కంపెనీలే మనుగడ సాగించగలవని చెప్పారు. శుక్రవారం ఏఐఈఎస్ఈసీ ఆధ్వర్యంలో ఇక్కడ జరిగిన యూత్ టు బిజినెస్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సచిన్ బన్సల్ మీడి యాకు ఈ వివరాలు తెలిపారు. దేశీయంగా ఈ-కామర్స్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే కంపెనీలు కేవలం రిటైలింగ్కి మాత్రమే పరిమితం కాకుండా రవాణా తదితర అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక దృష్టితో సర్వీసులను పెద్ద స్థాయిలో విస్తరించేందుకు మౌలిక సదుపాయాలు (గిడ్డంగులు మొదలైనవి), టెక్నాలజీపైన భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆయన చెప్పారు. మారు మూల ప్రాంతాలకు కూడా ఈ-కామర్స్ విస్తరించేలా చూడటం ధ్యేయంగా పనిచేస్తున్నామని బన్సల్ వివరించారు. వృద్ధిపైనే దృష్టి.. ఈ-కామర్స్‌లో మార్జిన్లు చాలా స్వల్పంగా ఉంటాయని, అయితే ప్రస్తుతం లాభదాయకత గురించి ఆలోచించడం కన్నా వేగంగా వృద్ధి సాధించడంపైనే దృష్టి పెట్టినట్లు బన్సల్ వివరించారు. ప్రస్తుతం బిలియన్ డాలర్ల స్థాయికి ఎదిగే దిశగా కంపెనీ అడుగులు వేస్తోందని, త్వరలోనే దీన్ని సాధించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే లావాదేవీల విషయానికొస్తే ట్యాబ్లెట్స్ మొదలైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు అత్యధికంగా అమ్ముడవుతున్నట్లు బన్సల్ చెప్పారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 1,000 పైగా విక్రేతలు ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచే విధంగా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అంతకు ముందు.. యువతలో నాయకత్వ ధోరణి పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన ఏఐఈఎస్ఈసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బన్సల్ల్తో పాటు టాటా సన్స్ చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ ముకుంద్ గోవింద్ రాజన్, కోకకోలా ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ జోలీ, మైక్రోసాఫ్ట్ ఇండియా డెరైక్టర్ రజనీష్ మీనన్ వ్యాపార రంగంలో తమ అనుభవాలను వివరించారు. -
ఫిబ్రవరిలో రోబోఫెస్ట్-2014
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో రోబోటిక్స్‌పై చైతన్యం పెంచేందు కు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా వెస్ట్ ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్లు చంద్రశేఖర్, లక్ష్మిప్రయాగ తెలిపారు. బెంగళూరుకు చెందిన నోవాటెక్ రోబో సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటర్లో ఆదివారం రోబో టెక్నాలజీపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... వచ్చే ఫిబ్రవరిలో సికింద్రాబాద్‌లోని ఇండస్ వరల్డ్ స్కూల్లో రోబోఫెస్ట్ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశంలోని వివిధ సంస్థలు ప్రతినిధులు పాల్గొనే ఈ కార్యక్రమంలో సాంకేతిక యుగంలో రోబోల పాత్ర, ప్రాధాన్యం గురించి వివరిస్తారని చెప్పారు. రోబోటిక్ ఇంటరాక్టివ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ పేరుతో ఇప్పటికే పాఠ్యాంశాలను రూపొందించామని తెలిపారు. -
‘రోబోటిక్స్’లో ‘గుడ్లవల్లేరు’ ప్రతిభ
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : రోబోటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ విద్యార్థులు మొదటి మూడు స్థానాలనూ కైవసం చేసుకుని ప్రతిభ చాటారు. గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ పాలిటెక్నిక్, ప్రతిష్టాత్మక ఐఐటీ ముంబయి వారు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పొట్లూరి రవీంద్రబాబు మాట్లాడుతూ రోబోటిక్స్ పోటీలతో గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానం చేకూరుతుందన్నారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లోని విద్యార్థులకు రోబోల తయారీ, పని విధానాలపై అవగాహన పెంచి, వారిలో పరిశోధనాశక్తికి పదును పెట్టే సంకల్పంతో ముంబయి ఐఐటీ, ఆర్క్ టెక్నో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంయుక్త నిర్వహణలో ఈ పోటీలు కొనసాగాయని తెలిపారు. అత్యాధునిక రోబోలను ఆవిష్కరించి, మానవ జీవన ప్రమాణాలు మరింత పెరిగేలా విద్యార్థులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఎన్‌ఎస్‌ఎస్‌వీ రామాంజనేయులు మాట్లాడుతూ పోటీల ముగింపు దశలో రోబోటిక్ రూపకల్పన సామర్థ్యంలో 125 మంది అభ్యర్థులకు జట్లవారీగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ముంబయి ఆర్క్ టెక్నో సొల్యూషన్స్ పరిశోధనా నిపుణుడు మహితో అమిత్ మాట్లాడుతూ విద్యార్ధులు శ్రద్ధ, పట్టుదల, ఉత్సాహాన్ని ప్రదర్శించి పోటీలను విజయవంతం చేశారన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేయూతనిచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ రామాంజనేయులుకు ఆయన అభినందన పత్రాన్ని అందజేశారు. విజేతలకు బహుమతి ప్రదానం... రోబోటిక్స్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు డాక్టర్ రవీంద్రబాబు బహుమతి ప్రదానాలు చేశారు. చివరిరోజు పోటీల్లో జోనల్ స్థాయిలో ప్రతిభ చాటిన విజేతలు 2014 మార్చిలో ముంబయి ఐఐటీలో జరిగే జాతీయ స్థాయి రోబోటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానాన్ని ఎన్.అనూష, జి.కీర్తి, ఎస్ఎస్.మహాలక్ష్మి, ఎఎంఎన్.సాయిలక్ష్మి, కెబి.శ్రీలక్ష్మి, ద్వితీయ స్థానాన్ని అదే కాలేజీకి చెందిన అబ్దుల్ హదీ, కె.కుసుమప్రియ, టి.స్వాతి, కేబీ కిశోర్, ఎం.శ్రీఅంక, తృతీయ బహుమతిని పీపీఆర్.సాయి ఫణికుమార్, కె.జ్యోత్స్నలత, టి.సాయి, సీహెచ్ నవ్యశ్రీ, కె.కుసుమకుమారి చేజిక్కించుకున్నారు. -
అంతర్జాతీయ సదస్సుకు రాజమండ్రి యువకుడు
రాజమండ్రి రూరల్ : రోబోటిక్స్ శాస్త్ర పరిజ్ఞానంలో ఫ్రాన్స్ దేశంలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు రాజమండ్రికి చెందిన యువకుడికి ఆహ్వానం అందింది. రోబో టెక్నాలజీలో ఆధునికతకు మరింత పదును పెట్టేందుకు ఫ్రాన్స్ దేశంలోని మోరిట్ పిల్లర్ ప్రాంతం లో ఏటా సమ్మర్ స్కూల్ ఇన్ సర్జికల్ రోబోటిక్స్ పేరుతో సదస్సు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగే ఆరో సర్జికల్ రోబో సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి రోబో రంగంలో నిపుణులను, ఇంజనీర్లను ఆహ్వానించారు. దీనిలో భాగంగా రాజమండ్రికి చెందిన యువకుడు కె.ఎస్.కె.వి. ఆదిత్యకు ఈ అరుదైన అవకాశం దక్కింది. ఆదిత్య కేరళలోని అమృత విశ్వ విద్యాలయంలోని బీటెక్ పూర్తి చేసి బెంగుళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంస్థలో రీసెర్చ్ అసిస్టెంట్ గా, కొరియా దేశంలో సెంటర్ ఫర్ బయోనిక్స్ లో రీసెర్చ్ ట్రెయినీగా పనిచేశారు. 2012లో స్విట్జర్లాండ్ దేశంలో జరిగిన బయో ఇల్ స్పెయిర్ రోబోటిక్స్ పేరిట జరిగిన సదస్సులో కూడా పాల్గొన్నారు. రెండు కంపెనీలపై పేటెంట్ హక్కులు కలిగి ఉండడం విశేషం. అతడి తండ్రి కె.ఆర్. కుమార్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ వద్ద పీఏగా పనిచేస్తున్నారు. తల్లి నాగవల్లి టీచర్‌గా పనిచే స్తున్నారు.