
ఫొటోలో కనిపిస్తున్నది మామూలు చక్రమే అనుకుంటున్నారా? కానే కాదు, ఇది హైటెక్ చక్రం. దక్షిణ కొరియా టైర్ల తయారీ సంస్థ హ్యాంకూక్ దీనిని అధునాతన రోబోటిక్స్ పరిజ్ఞానంతో ప్రయోగాత్మకంగా రూపొందించింది. ఎంత అధునాతన వాహనాల చక్రాలైనా, ఒక పరిమితిలో మాత్రమే మలుపు తిరగగలవు.
అయితే, ఈ హైటెక్ చక్రం ‘ఓమ్ని డైరెక్షనల్’– అంటే, అన్ని దిశల్లోనూ క్షణాల్లో ఇట్టే తిరగగలదు. అంతేకాదు, మామూలు రోడ్ల మీదనే కాదు, ఎగుడు దిగుడు నేలలపైనా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సునాయాసంగా ఇట్టే ప్రయాణించగలదు.
అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మికంగా మలుపు తీసుకోవలసినప్పుడు, రోడ్డు విడిచి పక్కకు మళ్లాల్సినప్పుడు ఈ రోబోటిక్ టైరును చాలా సులువుగా కోరుకున్న దిశకు మళ్లించవచ్చు. ఫలితంగా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. భవిష్యత్తులో వాహనాలకు ఇలాంటి టైర్లు విస్తృతంగా వాడుకలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని హ్యాంకూక్ సంస్థ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment