రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు): చిట్టి బుర్రల్లో ఆధునిక ఆలోచనలు మొలకెత్తాయి. స్పీడ్‌గా వెళ్తున్న ట్రైన్‌కు ట్రాక్‌పై ఏదైనా అడ్డంకి ఏర్పడితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సడన్‌గా ఆగిపోయే ఇంటెలిజెంట్ ట్రైన్ ఇంజిన్.. చిన్న బటన్ సహాయంతో నడిచేలా దివ్యాంగుల కోసం రూపొందించిన స్మార్ట్ వీల్ చైర్.. మనిషికి అవసరమైన వివిధ పనులు చేసి పెట్టే ఎనిమిది రకాల రోబోలు ఆవిష్కృతమయ్యాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రతిభకు అద్దంపడుతున్నాయి. పలువురి అభినందనలు అందుకున్నాయి. కాగా, ఇటీవల ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో నిర్వహించిన రోబోటిక్ వర్క్‌షాప్‌లో మూడు రోజుల పాటు 7, 8, 9, పది తరగతుల విద్యార్థులు శిక్షణ పొందారు. అనంతరం వారు రూపొందించిన వివిధ రకాల రోబోలను శనివారం ప్రదర్శించారు. వీటిలో స్మార్ట్ వీల్ చైర్, స్మార్ట్ షాపింగ్ ట్రాలీ, కెమెరాతో పనిచేసే స్పై రోబో, సెర్వింగ్ (ఆహార పదార్థాలు వడ్డించే) రోబో, అగ్రికల్చర్‌కు సంబంధించి హార్వెస్టింగ్ రోబో, ఇంటిలిజెంట్ ట్రైన్ ఇంజన్ తదితర ఎనిమిది రకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment