చిట్టి | Robo training center | Sakshi
Sakshi News home page

చిట్టి

Published Mon, Jul 14 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

చిట్టి

చిట్టి

థియరీలో డిస్టింక్షన్ కొడుతున్న మీ పిల్లలు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అవుతున్నారని చింతిస్తున్నారా..! ఇక ఆ బెంగ అవసరం లేదు. మనిషి సృష్టించిన మరమనిషి మనలోకి వచ్చేశాడు. బోటనీ పాఠమైనా.. ఫిజిక్స్ ఫిక్షనయినా.. మేథమెటిక్ మ్యాజిక్ అయినా.., ప్రాక్టికల్‌గా చూస్తేనే పిల్లల మస్తిష్కంలో ఫిక్సయిపోతుంది.  రోబో గురు సహాయంతో అపారజ్ఞానాన్ని సంపాదించుకునే అపూర్వ అవకాశం లభిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ప్రయోగాల్లో యంత్రుడు మంత్రదండంలా ఉపయోగపడుతున్నాడు. రోబోటిక్స్.., ఆ రోబోలు చూపే ట్రిక్స్ యువత ఉపాధికి బాటలు వేస్తున్నాయి. విద్యా వ్యవస్థలో సంపాదించిన జ్ఞానానికి.. ఉపాధి రంగంలో అవసరమైన పరిజ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రోబో ల్యాబ్‌లు తగ్గించేస్తున్నాయి.
 
టీచర్ చెప్పే పాఠాలతో కుస్తీ పట్టకండలా.. బట్టీపట్టి నేర్చుకుంటే పరీక్షల్లో మార్కులొస్తాయి కానీ.. సంపూర్ణ జ్ఞానం రాదు. ఇదే కొనసాగితే ఉద్యోగాన్వేషణలో సాటివారికి సిసలైన పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకుంటాం. ప్రస్తుతం విద్యార్థుల్లో 90 శాతం మందికి ఇదే అనుభవం ఎదురవుతోంది. ఇలాంటి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ ముందుకొస్తున్నాయి రోబోలు. పాఠశాల స్థాయి నుంచి గ్రాడ్యుయేషన్ లెవల్ వరకు పాఠాలకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడానికి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి.  

మొదట గృహ, పారిశ్రామిక రంగాల వినియోగంపై దృష్టి సారించిన రోబోటిక్స్ సంస్థలు. ఇప్పుడు ‘చదువుతూ నేర్చుకోవాలి.. నేర్చుకుంటూ చదువుకోవాలి’ అనే నినాదంతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రాక్టికల్‌గా పాఠాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో  ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి అంశాన్ని ప్రాక్టికల్‌గా వివరించేందుకు అధ్యాపకులు కూడా వీటిపై ఆధారపడుతున్నారు.
 
భవిష్యత్ బంగారం

రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్.. ఇలా అన్ని రంగాలతోనూ రోబోటిక్స్ ముడిపడి ఉంది. భవిష్యత్‌లో పరిశోధకులుగా, వివిధ ఉత్పాదక సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు రోబోటిక్స్ పరిజ్ఞానం తప్పనిసరి. అందుకే పాఠశాలలు, కళాశాలల్లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు అత్యవసరం. తద్వారా అధ్యాపకులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన కలుగుతుంది.
 
విజ్ఞానం తప్పనిసరి
రోబోటిక్స్ పరిజ్ఞానం విద్యార్థులు, అధ్యాపకులకు తప్పనిసరి అని జే రోబోటిక్స్ సంస్థ ఎండీ సుధీర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో అన్ని రంగాల్లోనూ రోబోటిక్స్ వేళ్లూనుకుంటుందని ఆయన తెలిపారు.
 
శిక్షణ ఇలా..
రోబోట్‌పైనే ఎలా ప్రోగ్రామ్ చేయాలనే దానిపై రోబోగురు సాఫ్ట్‌వేర్ ద్వారా మొదట విద్యార్థులు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇదే ప్రోగ్రామ్‌ను ఒక వైర్ ద్వారా రోబోట్‌పైనా డంప్ చేస్తారు. అప్పుడు రియల్‌టైమ్‌లో రోబో కదులుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సిల్క్స్, అనలెటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. రియల్ టైమ్‌లో రోబో కదులుతున్నప్పుడు ఎదురైన సమస్యలను విద్యార్థులు గుర్తిస్తారు. ఆ సమస్య సాధనకు మళ్లీ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో అవగాహన శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ల సొంత ఐడియాతోనే విద్యార్థులు ప్రాజెక్టు చేస్తారు. ఇలా చేయడం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇందుకోసం ఓమ్నీ రోబో, విజ్మో జూనియర్, డోసెలైక్స్, డొసెలైక్స్ సీనియర్, రోబో రూకా, అసాల్టర్ రోబోలను ఉపయోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement