PRACTICAL
-
సగం కోర్సు ఇంటర్న్ షిప్ లే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు మొదలు పెట్టింది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్ద డమే లక్ష్యంగా సిలబస్‌లో మార్పులు చేయాలని సంకల్పించింది. డిగ్రీ కోర్సుల్లోనూ మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా కొత్త సిలబస్ రూపకల్పనకు ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసింది. కొత్త సిలబస్‌లో ఫీల్డ్ అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.తరగతి గది బోధనను 50 శాతానికే పరిమితం చేసి.. మిగతా 50 శాతం కోర్సు కాలమంతా ఇంటర్స్‌షిప్‌లకు కేటాయించాలని భావిస్తున్నారు. ఇంటర్న్‌షిప్‌లు కూడా పేరెన్నికగన్న సంస్థల్లోనే చేయాలన్న నిబంధన తీసుకురాబోతున్నట్లు అధికారులు తెలిపారు. సామాజిక అవగాహనకు కూడా కొత్త సిల బస్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్ కోర్సు ల్లో సీట్లు పెరుగుతుండటంతో ఐటీ కంపెనీల్లో వృత్తి పరమైన అనుభవానికి పెద్ద పీట వేయా లని భావిస్తున్నారు.ఆయా సంస్థలతో కాలేజీ లు అవగాహన ఒప్పందాలు చేసుకోవడం తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా బోధనా ప్రణాళికను సమగ్రంగా మార్చాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. పోటీకి తగ్గట్టుగా డిగ్రీ కోర్సులుసంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో కాంబినేషన్ కోర్సులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిలబస్‌పై అధ్యయనానికి నియమించిన కమిటీలకు మండలి సూచించింది. ప్రస్తుతం డిగ్రీ ఆర్ట్స్ కోర్సుల్లో 30 శాతం, సైన్స్ కోర్సుల్లో 20 శాతం సిలబస్‌ను మార్చాలని నిర్ణయించారు. ఏటా అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా కొత్త సిలబస్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని సిలబస్‌ను రూపొందిస్తున్నారు.డిగ్రీ విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలు (ఫీల్డ్ వర్క్స్), ప్రాజెక్టు రిపోర్టులు రూపొందించడాన్ని తప్పనిసరి చేయాలని మండలి నిర్ణయించింది. ఆర్థిక రంగంలో ఈ–కామర్స్ శరవేగంగా దూసుకుపోతుండటంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. వీటిని గుర్తించి, నివారణ మార్గాలను కనుగొనేటమే లక్ష్యంగా డిగ్రీ బీకాం కోర్సుల్లో సైబర్ నేరాలపై పాఠ్యాంశాలను చేర్చబోతున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించే విధంగా డిగ్రీ కోర్సులు రూపొందించాలని భావిస్తున్నారు.మార్చి నాటికి సిలబస్‌పై సమగ్ర అధ్యయనంఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల సిలబస్ మార్పు ను వేగంగా పూర్తి చేయా లని కమిటీలను కోరాం. 2025 మార్చి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ను అమల్లోకి తేవాలన్నది లక్ష్యం. – ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్. -
ఎన్ఈపీతో ‘ప్రాక్టికల్’ బోధన
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. అఖిల భారత ఉపాధ్యాయుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ కొత్త జాతీయ విద్యా విధానంతో (ఎన్ఈపీ) బోధనలో సమూల మార్పులు వస్తాయని చెప్పారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలు చూసీ బట్టీ పట్టడమే ఉండేదని కానీ ఈ కొత్త విద్యావిధానం ప్రాక్టికల్ లెర్నింగ్‌పై దృష్టి పెట్టిందని అన్నారు. దీనిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రాథమిక విద్య విద్యార్థులకు వారి వారి మాతృభాషలోనే ఉండాలని అప్పుడే విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు వెలికి వస్తాయని చెప్పారు. మన దేశంలో ఆంగ్ల భాషలో బోధనకే అధిక ప్రాధాన్యం ఉందని ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించడానికి ఇష్టపడుతున్నారని ప్రధాని చెప్పారు. దీని వల్ల గ్రామాల్లోని ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారికి సరైన అవకాశాలు రావడం లేదన్నారు. ఎన్ఈపీతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రధాని మోదీ వివరించారు. ప్రభుత్వ పథకాల్లో వివక్షకు తావు లేదు గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ ప్రారంభోత్సవంతో పాటు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వ పథకాల్లో కుల, మత వివక్షకు తావు లేదని అర్హులైన అందరికీ అవి చేరుతున్నాయని చెప్పారు. నిజమైన లౌకికవాదం ఉన్న చోట వివక్ష కనిపించదని అన్నారు. అందరూ సంతోషంగా ఉండడానికి కృషి చేయడం కంటే మించిన సామాజిక న్యాయం మరోటి లేదని అభిప్రాయపడ్డారు. 70% మంది మహిళల సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ఒక పనిముట్టులా నిలిచిందని ప్రభుత్వ పథకాలన్నీ నూటికి నూరు శాతం లబ్ధి దారులకు చేరేలా చర్యలు చేపట్టామన్నారు. -
పరీక్షా కాలం
ఏలూరు సిటీ : ఇంటర్మీడియెట్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తొలిసారిగా ప్రాక్టికల్ పరీక్షలు సైతం జంబ్లింగ్ విధానంలో జరగనున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిశాక.. పక్షం రోజుల్లోనే ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోని సైన్స్ ల్యాబ్‌లను సందర్శించి.. అక్కడి పరిస్థితులను ముందుగానే పరిశీలించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఈనెల 28న ఎథిక్స్ అండ్ హ్యుమన్ వేల్యూస్, 31న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 21,925 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3నుంచి 22వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 61 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీల్లో 29, ఎయిడెడ్ కళా శాలల్లో 11, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 21 కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి 5గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. బైపీసీ విద్యార్థులు 4,662 మంది, ఎంపీసీ విద్యార్థులు 17,263 మంది కలిపి 21,925 మంది ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సి ఉంది. పబ్లిక్ పరీక్షలకు 104 కేంద్రాలు ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 104 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రభుత్వ కాలేజీలు 29, ఎయిడెడ్ కళాశాలలు 14, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 3, ప్రైవేట్ విద్యాసంస్థలు 58 ఉన్నాయి. ఫస్టియర్ విద్యార్థుల్లో జనరల్ 33,499 మంది, ఒకేషనల్ 4,011 మంది ఉన్నారు. సెకండ్ ఇంటర్లో జనరల్ విద్యార్థులు 32,211 మంది, ఒకేషనల్ విద్యార్థులు 3,516 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. జిల్లాలో 194 జూనియర్ కాలేజీలు, 60 ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. పరీక్షలకు అంతా సిద్ధం ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షా కేంద్రాలు ఉన్న కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ల్యాబ్‌లు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చాం. విద్యార్థులు సైన్సు ల్యాబ్‌లను ముందుగానే పరిశీ లించుకునే అవకాశం కల్పించాం. ఈనెల 19న కలెక్టరేట్లో ఇంటర్ విద్యామండలి కమిషనర్‌తో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని 61 పరీక్షా కేంద్రాల ప్రిన్సిపల్స్ విధిగా హాజరుకావాలి. – ఎస్ఏ ఖాదర్, ఆర్ఐవో -
ఇంటర్ విద్యకు కాంట్రాక్టు సెగ
► 16 రోజులుగా విధులు బహిష్కరించిన కాంట్రాక్టు లెక్చరర్లు ► దగ్గర పడుతున్న పరీక్షలు విద్యార్థుల్లో ఆందోళన నర్సీపట్నం/పాడేరు: కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె ప్రభావం ఇం టర్ విద్యార్థులపై పడింది. పదేళ్ల క్రితం కాంట్రాక్టు ప్రాతిపదికన విధుల్లో చేరిన లెక్చరర్లు అప్పటి నుంచి నేటికీ అదే విధానంలో కొనసాగుతున్నారు. తమను పర్మినెంట్ చేయాలని గతంలో పలుమార్లు వీరంతా ఆందోâýæన చేపట్టిన సమయంలో నేతలు ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలు కాలేదు. చివర కు తాడో పేడో తేల్చుకోవాలని భావించిన లెక్చరర్లు ఎట్టకేలకు ఈ నెల 2 నుంచి సమ్మె నోటీసు ఇచ్చి విధులు బహిష్కరించా రు. 16 రోజులుగా వివి ధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వ కళాశాలల్లో ఇటువంటి పరిస్థితి నెల కొన్న నేపథ్యంలో తరగతులు అన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి 1 నుంచి థియరీ పబ్లిక్ పరీక్షలు జరగనున్నా యి. ఈ దశలో లెక్చరర్లంతా సమ్మె చేపట్టడంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు లేదు. స్తంభించిన తరగతులు జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 36 ఉన్నాయి. ఈ కళాశాలల్లో 18 వేల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. 138 ప్రభుత్వ లెక్చరర్లు, 305 కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తూ విద్యాబోధన కొనసాగిస్తున్నారు. కొ న్ని కళాశాలల్లో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన వారంతా కాంట్రాక్టు లెక్చరర్లతోనే కొనసాగిస్తున్నారు. కళాశాల ల కు రాకుండా ఆందోâýæన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాడోపేడో తేల్చుకుంటాం గతంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లందర్నీ పర్మినెం ట్ చేసి, జీతాలు పెంచాలి. దీనిపై అప్పటికే ఆందోâýæనలు చేయడంతో ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. దీన్ని తక్షణమే పరిష్కరిం చని పక్షంలో విధుల్లో చేరే ప్రసక్తి లేదు. –శర్మ, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాబోధన కుంటుపడుతోంది కాంట్రాక్టు లెక్చరర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల తరగతుల నిర్వహణ కష్టంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే దీని ప్రభావం విద్యాబోధనపై పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని తక్షణమే వీరి సమస్యలను పరిష్కరించాలి. –జి. చిన్నారావు, జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ -
ప్రాణం తీసిన ప్రాక్టికల్స్
వికారాబాద్ రూరల్: కాలేజీలోని ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేస్తుండగా అస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం వెలుగుచూసింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారానికి చెందిన రాజ్‌కుమార్ కూతురు శిరీష(20) పట్టణంలోని ఎస్ఏపీ డిగ్రీ కళాశాలలో మైక్రోబయోలజీ రెండో సంవత్సరం చదువుతుంది. శుక్రవారం కాలేజీలో ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థిని రసాయనాలతో ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా రసాయనాలు ముక్కులోకి వెళ్లడంతో శిరీష అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వైద్యం కోసం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విద్యార్థిని శనివారం మృతి చెందింది. -
పరీక్షల సీజన్ ఆరంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: పరీక్షల సీజీన్ ఆరంభమైంది. ఇంటర్మీడియెట్ రెండో ఏడాది సైన్స్ విద్యార్థులకు నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకు జిల్లాలోని 117 కేంద్రాల్లో జరగనున్న ఈ ప్రాక్టికల్స్‌కు 17,506 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తొలి విడతగా 34 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ నిర్వహణకు బోర్డు సమ్మతించింది. అయితే తొలి విడతగా జరగనున్న పరీక్ష కేంద్రాలన్నీ ప్రైవేటు కళాశాలే కావడం గమనార్హం. రోజుకు రెండు విడతలగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ప్రారంభమైన అర్ధగంట వరకు మాత్రమే ఆలస్యంగా హాజరైనవారిని అనుమతిస్తారు. ఒక్కో బ్యాచ్‌లో గరిష్టంగా 20 మంది కనిష్టంగా 10 మంది విద్యార్థులకు తక్కువ కాకుండా చర్యలు చేపట్టారు. కేంద్రాలపై ప్రత్యేక నిఘా పరీక్షలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు బోర్డుతోపాటు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆర్ఐవో పాపారావుతోపాటు డెక్ కమిటీ సభ్యులు ఎస్.ఈశ్వరరావు, ఐ.శంకరరావు, జి.వి.జగన్నాథరావు, హైపవర్ కమిటీ సభ్యులు బి.మల్లేశ్వరరావులు ఇప్పటికే నియామకమయ్యారు. వీరితోపాటు మరోరెండుప్రత్యేకంగా ఫ్లయింగ్ క్వాడ్ బృందాలను, మరోక ప్రత్యేక పరిశీలకుడిని నియమించారు. ‘జంతర్ మంతర్’ అస్త్రాలు సిద్ధం! ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్ ఇస్తుండటంతోపాటు పాత పద్ధతి (నాన్‌జంబ్లింగ్)లోనే పరీక్షలు జరుగుతుండటంతో జంతర్ మంతర్ అస్త్రాలకు కళాశాలలూ వ్యూహాలు రచించినట్లు వందతులు వస్తున్నాయి. తనిఖీలకు వచ్చే అధికారులతోపాటు డిపార్ట్మెంటల్ అధికారులను, ఎగ్జామినర్లను బుట్టలో వేసి, శతశాతం మార్కులకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఎతుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో గోప్యంగా ఒప్పందాలు జరుగుతున్నట్టు భోగట్టా. -
రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రభుత్వం ముందుగా ప్రకటించినట్టుగా పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో కాకుండా, సాధారణ విధానంలోనే జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్‌బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 154 పరీక్షా కేంద్రాలు.. జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 64 కేంద్రాలు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో సాధారణ పద్ధతిలోనే ప్రాక్టికల్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో పరీక్షా కేంద్రాల సంఖ్య 154కు చేరింది. అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రాక్టికల్స్‌కు 26,309 మంది విద్యార్థులు..జిల్లాలో 316 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 26,309 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలు రాయనున్నారు. నాలుగు స్పెల్‌లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి స్పెల్‌లో భాగంగా 46 పరీక్షా కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో స్పెల్‌లో ఐదు రోజుల వంతున ఈ నెల నాలుగో తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్‌బోర్డు సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ పరీక్షా కేంద్రాల వద్ద తనిఖీ నిర్వహిస్తారు. ‘గంటా’పథంగా చెప్పినా.. వెనుకడుగు.. ఐదేళ్లుగా జంబ్లింగ్ విధానంలోనే ప్రాక్టికల్స్ నిర్వహిస్తామంటూ విద్యాశాఖ మంత్రులు ప్రకటించి, చివరి నిమిషంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ ఏడాది కూడా విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అదే బాట పట్టారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ ‘జంబ్లింగ్’ తంతును ‘సాక్షి’ గతేడాది డిసెంబర్ రెండో తేదీన ‘ప్రయోగం ఫలిస్తుందా?’ అని, ఈ ఏడాది జనవరి 12న ‘జంబ్లింగ్ ఉన్నట్టా.. లేనట్టా? శీర్షికలతో కథనాలు ప్రచురించింది కూడా. అధికారుల సమయం, శ్రమ వృథా : జంబ్లింగ్ కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి ఆయా కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలనే విషయమై చేపట్టిన సమీక్షా కార్యక్రమాలతో ఇంటర్‌బోర్డు అధికారుల సమయం వృథా అయ్యింది -
ఎక్కడివారు అక్కడే..!
విజయనగరం అర్బన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు జంబ్లింగ్ విధానం మళ్లీ వాయిదా పడింది. ఈ విధానాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలు ఈ ఏడాదీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి చివరికి వాయిదా వేయించాయి. దీంతో విద్యార్థులకు తాము చదివే కళాశాలలోనే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితంగా కళాశాలలో ప్రయోగశాలలు ఉన్నా, లేకు న్నా.. పరికరాలు లేకపోయినా, అసలు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు మాత్రం పూర్తిస్థాయిలో పడే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి 100 కళాశాలల్లో పరీక్షా కేంద్రాల జిల్లాలో 171 కళాశాలలు ఉంన్నాయి. వీటిలో 22 ప్రభుత్వ, 5 ఎయిడెడ్ కళాశాలలు, 16 ఆదర్శ పాఠశాలలు, 10 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, మిగిలినవి ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాక్టికల్స్ నిర్వహణకు కేవలం 70 కళాశాల్లో మాత్రమే పూర్తిస్థాయిలో వసతులు ఉన్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు కొన్ని అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. పాత పద్ధతిలోనే ప్రాక్టిల్ నిర్వహించాలనే నిర్ణయంతో 100 కళాశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఈ నెల 4వ తేదీ నుంచి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు రాయనున్న 14,176 మంది జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్కళాశాలలోద్వితీయసంవత్సరసైన్స్విద్యార్థులు14,176మందిప్రయోగపరీక్షలకహాజరుకానున్నారు.ఎంపీసీవిద్యార్థులు5,452మంది, బైపీసీ విద్యార్థులు 4,666 మంది ఉన్నారు.ప్రైవేట్ విద్యార్థులకు సవాల్ ప్రయోగ పరీక్షలు ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు సవాలుగా మారనున్నాయి. అపార్టుమెంట్లలోని ఇరుకు గదుల్లో ఎక్కువగా ప్రైవేట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ థియరీ నిర్వహించేందుకే గదులు చాలడం లేదు. ఇక ప్రయోగాలు ఎక్కడ చేయిస్తారని స్వయంగా ఓ అధ్యాపకుడే విచారం వ్యక్తంచేశారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమయ్యే పిప్పెట్, బ్యూరెట్, టెస్ట్ ట్యూబ్ (పరీక్ష నాళిక) పరికరాలు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 90 శాతం మందికి తెలియవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అరకొరగా అయినా ప్రయోగశాలలు ఉన్నాయి. విజయనగరంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో కొన్నేళ్లుగా ల్యాబ్ లేదు. ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయితే చాలు మార్కులు వచ్చేస్తాయని ఆ విద్యా సంస్థ యాజమాన్యం విద్యార్థులకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు అధికారులను ‘మేనేజ్’ చేస్తూ వస్తున్నారు. ప్రాక్టికల్స్‌లో మార్కుల పేరుతో కొన్ని యాజమన్యాలు అదనంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. -
జంబ్లింగ్ వద్దు
అవనిగడ్డ : జబ్లింగ్ విధానాన్ని నిరసిస్తూ దివిసీమలో విద్యార్థిలోకం కదంతొక్కింది. ర్యాలీలు నిర్వహించారు. తహశీల్దార్ కార్యాల యాల ముందు ఆందోళనలు చేశారు. అవనిగడ్డలో ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాల సైన్స్ విద్యార్థులు సోమవారం ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. జంబ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. కళాశాల కరస్పాండెంట్ దుట్టా ఉమామహేశ్వరరావు, పలువురు విద్యార్థులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానాన్ని ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ వంటి ఏ కోర్సులోనూ లేని జంబ్లిం గ్ ఇంటర్ సైన్స్‌లోనే ప్రవేశపెట్టడం దురదృష్టకరమన్నారు.పరీక్షల సమయంలో జంబ్లింగ్ విధానాన్ని ప్రకటించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్ వెన్నెల శ్రీనుకు వినతి పత్రం అందజేశా రు. కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లిలో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ చల్లపల్లిలో అన్ని జూనియర్ కళాశాలల విద్యార్థులూ ఆందోళన నిర్వహించారు. శ్రీశారదా సన్‌ఫ్లవర్, విజయా జూనియర్, శ్రీవిజయక్రాంతి జూనియర్ కళాశాలల విద్యార్థులు ముందుగా ఆయా కళాశాలల నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలల కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్ యార్లగడ్డ శివప్రసాద్, ఎ. కోటేశ్వరరావు, అబ్దుల్ రహీం, కె. పూర్ణానందదాస్, దుట్టా శివరాంప్రసాద్ మాట్లాడుతూ సైన్స్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే జంబ్లింగ్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4న నుంచి ప్రాక్టికల్స్ జరుగనున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కోడూరులోఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విధానంలో నూతనంగా ప్రవేశపెట్టిన జంబ్లింగ్ పద్ధతిని రద్దు చేయాలంటూ స్థానిక మారుతీ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయకపోతే ఆందోళన ఉధృతం చేయాల్సి వస్తుందని పలువురు విద్యార్థులు హెచ్చరించారు. కోడూరు ప్రధాన రహదారుల వెంట ర్యాలీ నిర్వహించి తరగతులను బహిష్కరించారు. కళశాల అధినేత దుట్టా శివరామప్రసాద్, అధ్యాపకులు ఓంవీరాంజనేయులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
'ఇంటర్ జంబ్లింగ్' పై సర్కార్ పునరాలోచన
-
జంబ్లింగ్ వద్దు...
-
వైఎస్ఆర్ జిల్లాలో రోడ్డెక్కిన విద్యార్థులు
-
మాట వినలేదని మార్కుల్లో కోత
ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ హైదరాబాద్: తన మాట వినలేదని ముగ్గురు మెడిసిన్ విద్యార్థులకు ఓ ప్రొఫెసర్ ప్రాక్టికల్స్‌లో కోత విధించినట్లు బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ నిర్వాకం వల్ల ఓ విద్యార్ధిని సూపర్‌స్పెషాలిటీ సీటును కోల్పోయింది. దీంతో బాధితులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ కళాశాలలోని ముగ్గురు విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురైంది. వారికి థియరీ మార్కుల్లో మంచి పర్సెంటేజీ సాధిం చినా... ప్రాక్టికల్స్కొచ్చేసరికి అనుత్తీర్ణులయ్యారు. 300 మార్కులకు కేవలం 127 మార్కులే వేశారు. ఇందులో ఓ విద్యార్థినికి జాతీయస్థాయి సూపర్ స్పెషాలిటీ పరీక్షలో సీఎంసీ వెల్లూర్‌లో డీఎం న్యూరాలజీ విభాగంలో ఏపీ నుంచి ఈమె ఒక్కరికే సీటొచ్చింది. కానీ సీటును కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై హెల్త్వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డా.రవిరాజుకు ఫిర్యాదు చేశారు. -
ప్రాక్టికిల్స్
ఇంటర్, డిగ్రీ ప్రయోగాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రయోగాత్మక పద్ధతిలో బోధిస్తే ఎలాంటి విద్యార్థులకైనా సులువుగా అవగాహన ఏర్పడుతుంది. అంతేకాదు... పరిశోధనల రంగం వైపు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు ప్రయోగాలు దోహదం చేస్తారుు. అలాంటి ప్రయోగాలు జిల్లాలో ప్రాక్టి‘కిల్స్’గా మారుతున్నారుు. జిల్లాలో విద్యాశాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇంటర్మీడియట్లో గానీ... డిగ్రీలో గానీ ఎవరూ ‘ప్రాక్టికల్’గా ఆలోచించడం లేదు. ప్రయోగశాలలు, పరికరాల కొరత.. వసతుల లేమి.. తక్కువగా ఉన్న సైన్స్ విద్యార్థుల సంఖ్య వెరసి ప్రయోగశాలలు నిష్ర్పయోజనంగా మారడంపై ‘సాక్షి’ ఫోకస్.. ఎంసెట్‌లో ప్రవేశాలకు ఇంటర్ వార్షిక పరీక్షల మార్కుల వెయిటేజీ ఉంది. ఇందులోనూ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత కీలకం... మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాక్టికల్స్‌పై ఏళ్లకేళ్లుగా చిన్నచూపే మిగులుతోంది. పలు కళాశాలల్లో ప్రయోగశాలలు (ల్యాబ్‌ల), పరికరాల కొరత పీడిస్తుండగా... వసతుల లేమి వేధిస్తోంది. మరికొన్ని కాలేజీల్లో సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో తూతూమంత్రంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సర్కారుతోపాటు ప్రైవేట్ కాలేజీల్లోనూ ఇదే తంతు కొనసాగుతుండడం గమనార్హం. సంవత్సర పరీక్షలు సమీపిస్తేనే ప్రయోగాలు చేరుుంచడం జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులకు అలవాటుగా మారింది. ఫిబ్రవరి 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నారుు. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి 16,183 మంది ఎంపీసీ... 8,689 మంది బీపీసీ... మొత్తం 24,872 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నిష్ర్పయోజనంగా మారిన ప్రయోగాలపై ‘సాక్షి’ ఫోకస్.... ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో నిర్లక్ష్యం విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్లో బీపీసీ, ఎంపీసీ గ్రూప్‌కు సంబంధించి సైన్స్ విద్యార్థులకు బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది. సబ్జెక్టుల వారీగా ప్రథమ సంవత్సరంలో కొన్ని ప్రాక్టికల్స్ చేరుుంచాలి. కానీ, ఎక్కువ శాతం ప్రభుత్వ కాలేజిల్లో విద్యార్థులకు ప్రాక్టిల్స్ చేయించడం లేదు. మొత్తం సెకండియర్లోనే చేయిస్తున్నారు. అదీ... వార్షిక పరీక్షలు సమయానికి రెండు మూడు నెలల ముందు ఒక్కో సబ్జెక్టులో ముఖ్యమైన ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ శాతం ల్యాబ్స్ ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ ఫీజులతోప్రయోగ పరికరాలు, కెమికల్స్‌ను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పలు ప్రభు త్వ కాలేజీల్లో పరికరాలు కొనుగోలు చేశారు... ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని కాలేజీల్లో సరియైన వసతులు లేక ప్రాక్టికల్స్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా... ఈ ఏడాది 30 కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, ల్యాబ్ వసతులు సరిగా లేకపోవడంతో 13 కాలేజీలకు చెందిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడెక్కడ.. ఎలా.... హసన్‌పర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కొంత కాలం హైస్కూల్లోనే నడిపారు. ఇప్పుడు కొత్తభవనం అందుబాటులోకి వచ్చింది. కానీ, ల్యాబ్ వసతి లేదు... పరికరాలు లేవు. ఈ మేరకు ఆ కాలేజీ సైన్స్ విద్యార్థులకు హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తీసుకొచ్చి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ఇలా సుమారు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతోంది. గీసుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సైన్స్ విద్యార్థులకు సరిపడా వసతులు లేవు. దీంతో సంగెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. జనగామ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లోనే కొనసాగుతోంది. సైన్స్ గ్రూప్‌లో తక్కువ మంది విద్యార్థులుండడంతో తరగతి గదిలోనే వీలునుబట్టి విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయిస్తుంటారు. పరీక్షలకు మాత్రం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను కేంద్రంగా కేటాయించారు. మో‘ఢల్’ స్కూళ్లు... జిల్లాలో 29 మోడల్ స్కూళ్లల్లో ఇంటర్ విద్యార్థులు ఉండగా... ల్యాబ్ సౌకర్యాలు అంతంతమాత్రమే. కొన్నింటిలో ప్రధానంగా విద్యుత్, నీటి సౌకర్యం లేదు. మరి కొన్నింటిలో సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆరు మోడల్ స్కూళ్ల (ములుగు ఘనపూర్, బచ్చన్నపేట, డోర్నకల్, చెన్నారావుపేట, గీసుకొండ, కేసముద్రం)ను ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలుగా కేటాయించారు. ఎరుుడెడ్... జిల్లాలో ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు ఏడు ఉండగా... నాలుగింటిని ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ‘ప్రైవేట్’లో అక్టోబర్, నవంబర్లోనే.. జిల్లాలో 242 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. ఇందులో ఎక్కువ శాతం కాలేజీల్లో ల్యాబ్ పరికరాలు ఉన్నారుు. కానీ... పరీక్షలు సమీపిస్తున్న సమయంలో అక్టోబర్, నవంబర్‌లో కొంతమేర ప్రాక్టికల్స్‌ను చేయిస్తున్నారు. డిగ్రీ కళాశాలల్లో.... ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్ జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా.... కొన్నింటిలో ల్యాబ్ వసతులు లేక సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జ్ఞానం అందకుండా పోతోంది. రంగశారుుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే కొనసాగుతోంది. బీఎస్సీ సైన్స్ విద్యార్థులు 16 మంది మాత్రమే ఉన్నారు. వీరికి హన్మకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. మరిపెడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా జూనియర్ కాలేజీలోనే నడుస్తోంది. ఇక్కడ కొన్ని గదుల్లో, మరో చోట కొన్ని గదుల్లో డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం కలిపి 60 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. వీరికి ల్యాబ్ వసతి లేదు. తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని కొన్ని గదుల్లో నడిపిస్తున్నారు. సైన్స్‌లో 30మంది విద్యార్థుల వరకే ఉన్నారు. ల్యాబ్ వసతి లేదు. పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా జూనియర్ కళాశాలలోనే అసౌకర్యాల నడుమ షిఫ్ట్ సిస్టంలో కొనసాగిస్తున్నారు. 50 మంది విద్యార్థుల వరకు సైన్స్ విద్యార్థులున్నారు. సమస్యల నడుమ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలోనే పాలిటెక్నిక్‌ను కూడా కొనసాగిస్తుండడం కారణం. -
కా‘లేజి’ ప్రాక్టికల్స్
ఖమ్మం: ఇంటర్ విద్య జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. ప్రయోగశాలలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇరుకు గదుల్లో ఒక మూలన విద్యార్థులు, మరో మూలన సైన్ల్యాబ్ పరికరాలు దర్శనమిస్తున్నాయి. పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధనోపకరణాలను ఉపయోగించుకోవాల్సిన అధ్యాపకులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. పలు కళాశాలల్లో సైన్స్ పరికరాలు బయటకు తీసిన పాపాన పోవట్లేదు. ఇంటర్మీడియెట్ పూర్తవుతున్న కనీసం పిప్పెట్, బ్యూరెట్, స్క్రూగేజీ, వెర్నియర్ కాలిపస్ అంటే తెలియని విద్యార్థులున్నారంటే అతిశయోక్తి కాదు. తరగతి గదిలోనే సైన్స్ పరికరాలు ఉండటంతో కొన్ని కళాశాలల్లో ఆకతాయి విద్యార్థులు వాటిని పగులగొడుతున్నారు. కొన్ని కాలేజీల్లో చెట్లకింద ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కొన్నింటిలో సైన్స్‌ల్యాబ్‌లు శిథిలావస్థకు చేరాయి. కాలేజీల్లో కొనసాగుతున్న మొక్కుబడి ప్రాక్టికల్స్‌పై ‘సాక్షి’ మంగళవారం పరిశీలన జరిపింది. బూజుపడుతున్న పరికరాలు జిల్లాలో సగానికి పైగా కళాశాలల్లో బోధనోపకరణాల ఆధారంగా బోధన జరగడం లేదని తేలింది. కొన్ని కాలేజీల్లో ప్రయోగశాలల తలుపులు తీసిన దాఖలాలే లేవు. పరికరాలు, రసాయనాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. జిల్లాలో 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ఎంపీసీలో మొదటి సంవత్సరం 825 మంది. ద్వితీయ సంవత్సరంలో 990 మంది, బైపీసీ ప్రథమ సంవత్సరం 1,292 మంది, ద్వితీయ సంవత్సరం 1,204 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు మొత్తం 2,194 మంది ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరు కావాలి. కానీ వీరిలో సగం మంది ఇప్పటివరకు ల్యాబ్‌లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ఇక ప్రాక్టిక ల్స్ ఎలా చేయాలని విద్యార్థులు వాపోతున్నారు. తరగతి గదిలోనే ప్రయోగశాలలు బాటనీ, జువాలజీ ల్యాబ్స్‌లో జంతు కళేబరాలు, అవశేషాలు, స్పెసిమెన్స్ విద్యార్థులకు చూపించాలి. ఆకు, కాండం అంతర్నిర్మాణం తెలుసుకునేందుకు మైక్రోస్కోప్‌లు వినియోగించాలి. రసాయనశాస్త్రంలో లవణ విశ్లేషణ, మూలకాలు, లవణాల ఘనపరిమాణం గురించి తెలియాలంటే రసాయనాలు కావాలి. వీటిలో కొన్ని ప్రమాదకరమైన యాసిడ్స్ ఉంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక ల్యాబ్స్ ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ జిల్లాలోని ఖమ్మం నయాబజార్, శాంతినగర్ కళాశాలలతోపాటు ఇతర ప్రాంతాల్లో తరగతి గదుల్లోనే ప్రయోగ పరికరాలు ఉన్నాయి. వైరా కళాశాలలో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లకు ఒక గది, బాటనీ, జువాలజీలకు కలిపి ఒక గదిని కేటాయించారు. కొత్త సిలబస్‌కు సంబంధించిన చార్టులూ ఏర్పాటు చేయలేదు. రసాయనాలు, పరికరాలు కొరతగా ఉన్నాయి. ఏన్కూరు కళాశాలలో ప్రత్యేకంగా ల్యాబ్ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట ప్రయోగాలు చేస్తున్నారు. కొన్నిసార్లు యాసిడ్స్ మీద పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కారేపల్లి ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులు లేరు. పినపాక నియోజకవర్గం అశ్వాపురంలో ల్యాబ్‌లు లేవు. అవసరమైనప్పుడు భారజల కర్మాగారం కళాశాలకు తీసుకెళ్లి ప్రయోగాలు చేయిస్తున్నారు. మణుగూరు, పినపాక, గుండాలలో ల్యాబ్‌లు ఉన్నా వాటిలో సరైన సౌకర్యాలు లేవు. బూర్గంపాడులో ప్రయోగశాల భవనం కురుస్తుండటంతో వాటిలో పరికరాలు దెబ్బతిన్నాయి. కొత్తగూడెంలో ప్రయోగశాల గదుల నిర్మాణం కోసం రూ.29 లక్షలు మంజూరు చేశారు. 2013 జనవరిలో ఆరుగదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. బిల్లులు రాలేదని సంబంధిత కాంట్రాక్టర్ గదుల నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలోని బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి కొతులు ప్రవేశించి సైన్స్‌ల్యాబ్ పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి. కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలలను శిథిలావస్థ భవనంలో నిర్వహిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులోబీరువాల్లో ల్యాబ్ పరికరాలను భద్రపరచాల్సి వస్తోంది. లక్షలు వెచ్చించినా ప్రయోగాలు శూన్యం.. లక్షలు వెచ్చించినా ప్రభుత్వ కళాశాలల్లో సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. 2012 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ సిద్ధార్థజైన్ సైన్స్ పరికరాల కొనుగోలు కోసం ప్రయత్నించారు. కళాశాలల విద్యార్థుల సంఖ్యను బట్టి కళాశాలకు రూ. లక్ష నుంచి రెండు లక్షల మేరకు గ్రాంట్స్ విడుదల చేశారు. ఆ నిధులతో దాదాపు అన్ని కళాశాలల అధ్యాపకులు ప్రయోగశాలల పరికరాలు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించి బిల్లులు తీసుకున్నారు. అదే సంవత్సరం కాలేజీల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10వేల చొప్పున విడుదల చేశారు. ఈ నిధులు ఖర్చు చేసినట్లు రికార్డులు ఉన్నా.. కొనుగోలు చేసిన వస్తులు మాత్రం సగం కూడా కనిపించకపోవడం గమనార్హం. ఈ సంవత్సరం కూడా ఒక్కో కళాశాలకు రూ. 37,000 ప్రభుత్వం విడుదల చేసింది. వీటినైనా సక్రమంగా ఖర్చు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ప్రయోగం మిథ్య
‘సైన్స్ ప్రగతికి మూలం.... మానవ జాతికి విజ్ఞానశాస్త్ర ఆవిష్కరణలే ప్రధానం...విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా ప్రయోగపూర్వక బోధనలు కావాలి... ‘సామాన్యు’డిని సైతం అత్యున్నత స్థానాలకు చేర్చగలిగే సత్తా సైన్స్కుంది’. ఇలా ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, వక్తలు తరచు సైన్స్ఫేర్లు, ఎగ్జిబిషన్లు, ఇతర వేదికల్లో ప్రయోగ విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగిస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రయోగం ‘కళ’యే గానీ ప్రయోగాల బోధన ‘కల’గా మిగిలిపోతున్నది. జూనియర్ కాలేజీల్లో కరువైన ల్యాబ్‌లు * విద్యార్థులకు అందని ప్రయోగ విజ్ఞానం * మార్కుల స్కోరింగ్‌కే ఉపయోగపడుతున్న ప్రాక్టికల్స్ * ప్రైవేటు కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షలకు అదనపు వసూళ్లు నల్లగొండ అర్బన్ : పెరుగుతున్న సాంకేతికత సైన్స్ వినియోగాన్ని విస్తృతం చేసింది. దీనివల్ల ప్రయోగ పరిజ్ఞానం ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా మారుతోంది. ప్రయోగాలపై అవగాహన కలిగించాలన్నా, శాస్త్రీయంగా బోధించాలన్నా ఆయా విద్యాసంస్థల్లో ప్రయోగశాలలుండాలి. కానీ జిల్లాలో చాలా జూనియర్ కాలేజీల్లో ల్యాబ్‌ల వసతి కరువైంది. దీంతో ప్రాక్టికల్స్ (ప్రయోగాల) బోధన కలగా మిగిలిపోతున్నది. చాలా కాలేజీల్లో సైన్స్ విద్యార్థులకు, ఆర్ట్స్ వారికి తేడా లేకుండా పోతోంది. వారైనా, వీరైనా థియరీ చదువులకే పరిమితమైపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగపాఠాలు మ్యాథ్స్, సైన్స్ విద్యార్థులు ఇంటర్ మార్కుల్లో బాగా స్కోర్ చేసేందుకు ఉపయోగపడడం తప్ప వారిలో ప్రయోగ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నది శూన్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చాలావరకు ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో పరీక్షలకు కొన్ని రోజుల ముందు తాత్కాలికంగా ప్రయోగశాలలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ఒకటి రెండు ప్రయోగాలు చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు వచ్చే చీఫ్ (సీఎస్)లు డిపార్ట్మెంటల్ అధికారులను మచ్చిక చేసుకుంటే సరి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ప్రాక్టికల్ పరీక్షలు ఏటా ఓ తంతుగా ముగించేస్తున్నారు. ‘ఇన్స్పైర్’ కానట్లే... విజ్ఞానశాస్త్రంలో నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించాలనే ఆశయంతో సైన్స్‌పై ఆసక్తిని పెంచి బాల్యం నుంచే సృజనాత్మకతను వెలికితీసే ప్రయోగాల వైపు ఆకర్శించేందుకు హైస్కూల్ స్థాయిలో ప్రవేశపెట్టిన ‘‘ఇన్స్పైర్’’ అక్కడి వరకే పరిమితమైపోతున్నది. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం ప్రతి ఆప్షనల్ సబ్జెక్టులో 40 తరగతులుంటాయి. ప్రథమ సంవత్సరంలో 20, ద్వితీయ సంవత్సరంలో 20 ప్రయోగాల చొప్పున చేయించాలి. థియరీతోపాటు ప్రాక్టికల్ తరగతులను ప్రత్యేకంగా నిర్వహిం చాలి. కానీ జిల్లాలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీల్లో వీటి ఊసే ఉండట్లేదు. పరీక్షల సమయంలో కొద్ది రొజుల ముందు మొక్కుబడిగా ‘సెలక్టెడ్’ అంశాలపై ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లాలో 246 జూనియర్ కాలేజీల్లో... జిల్లా వ్యాప్తంగా 299 జూనియర్ కాలేజీల నిర్వహణకు అనుమతి ఉంది. కానీ అడ్మిషన్లు లేకపోవడం, తదితర కారణాలతో 53 కాలేజీలు మూతపడ్డాయి. మిగతా 246 కాలేజీలే నడుస్తున్నాయి. వాటిల్లో 30 ప్రభుత్వ, 4 ఎయిడెడ్, 13 రెసిడెన్షియల్ కాలేజీలు, 33 మోడల్ స్కూళ్లతోపాటు 166 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీల్లో ఇంటర్ విద్యనందిస్తున్నారు. ల్యాబ్‌లు ఇతర అన్ని సౌకర్యాలుంటేనే కాలేజీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలి. కానీ 75 శాతానికిపైగా ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగశాలలకు సరైన వసతిలేదు. నిబంధనల ప్రకారం సౌకర్యాలు లేవు, అయినా ఆయా కాలేజీలకు ప్రాక్టికల్ సెంటర్లు కేటాయిస్తున్నారు. పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. బ్రహ్మాండమైన మార్కులుపడుతూనే ఉన్నాయి. విశేషమేమంటే ల్యాబ్‌ల వసతి ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరిట్ మార్కులతో సీట్లు పొందిన విద్యార్థులకంటే, 10వ తరగతిలో అంతంత మాత్రం గ్రేడ్ పాయింట్లతో పాసై ప్రైవేటు కాలేజీల్లో చేరిన వారికి ల్యాబ్‌లు లేకున్నా బైకిబై (నూరుశాతం) ప్రాక్టికల్ మార్కులొస్తున్నాయి. నల్లగొండలోని ఓ జాతీయ బ్యాంక్ భవనంపై ఉన్న జూనియర్ కాలేజీలో రెండేళ్ల క్రితం ల్యాబ్‌ల వసతి లేకున్నా ప్రాక్టికల్ సెంటర్ కేటాయించారని ఫిర్యాదులొచ్చాయి. పరీక్షలెలా నిర్వహిస్తున్నారని తనిఖీకి వెళ్లినవారు గేటుకు తాళం వేసి ఉండటంతో ఖాళీగా వెనుదిగాల్సి వచ్చింది. ఈ యేడు ప్రాక్టికల్స్‌కు 29588 మంది విద్యార్థులు... ఈ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలను 2015 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఇందుకు 128 కాలేజీల్లో సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 8564 మందిపై బైపీసీ విద్యార్థులు కాగా 21024 మంది ఎంపీసీ విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. చాలా ప్రైవేటు కాలేజీల్లో పూర్తిస్థాయి సామగ్రి, ల్యాబ్‌లు లేకున్నా సెంటర్లు కేటాయించే జాబితాలో ఉంచి ఇంటర్ బోర్డుకు ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ప్రయోగశాలలు కాదు కనీసం ప్రయోగాలకు అవసరమయ్యే టేబుళ్లు, ఇతర పరికరాలు కూడా లేనట్లు తెలిసింది. పరీక్షల సమయంలో సినిమా సెట్టింగుల మాదిరిగా అప్పటికప్పుడు తరగతి గదిని ప్రయోగ గదిగా మార్చి టేబుళ్లు వేసి రెడీమేడ్‌గా లభించే కెమికల్స్, ఇతర ఎగ్జిబిట్లు, చార్ట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ర్యాంకుల తారుమారు... ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ కల్పిస్తుండటంతో ప్రాక్టికల్ మార్కులు కీలకంగా మారాయి. పలువురి విషయంలో ఈ మార్కులతో ర్యాంకులు తారుమారైన ఉదంతాలున్నాయి. రాత పరీక్షల్లో 60 శాతం మార్కులు పొందలేక పోయిన వారు కూడా ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కులు పొందగలుగుతున్నారు. దీంతో ఎంసెట్ ర్యాంకులపై ప్రభావం పడుతున్నది. ప్రాక్టికల్స్ మార్కులకున్న మార్కుల ప్రాధాన్యతనుబట్టి పలు ప్రైవేటు కాలేజీల వారు తమకు అనుకూలమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించుకునేందుకు ‘అన్ని’ విధాలా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టికల్స్ కోసం విద్యార్థుల నుంచి రూ.100 ఫీజు వసూలు చేయాల్సి ఉండగా ఈ ఏడాది కొన్ని కాలేజీల్లో రూ.1000 నుంచి రూ.4 వేల దాకా వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. వీటితో కార్యాలయం వారిని మేనేజ్ చేయడంత పాటు సీఎస్, డీఓలకు నజరానాలిచ్చి పిల్లలకు కావాల్సిన మార్కులు వేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ప్రాక్టికల్‌కు ప్రాధాన్యమివ్వాలి : నెమ్మాది ప్రకాశ్‌బాబు, ఆర్ఐఓ నల్లగొండ అన్ని కాలేజీల్లో ప్రాక్టికల్ తరగతులకు ప్రాధాన్యమివ్వాలి. ఒక విద్యా సంవత్సరంలో కనీసం 30 నుంచి 40 క్లాసులకు బ్యాచ్‌ల వారీగా వారానికో క్లాస్ తీసుకోవాలి. ఫస్టియర్‌లో కూడా ప్రాక్టికల్స్ చేయించాలి. కాకపోతే ప్రాక్టికల్ పరీక్షలు ద్వితీయ సంవత్సరంలోనే ఉంటాయి. మొక్కుబడిగా నిర్వహించే కాలేజీలను తనిఖీ చేస్తాం. కొన్ని కాలేజీల్లో పరీక్షలకు ముందు ల్యాబ్‌ల తలుపులు తెరుస్తారనేది మా దృష్టిలో కూడా ఉంది. పరీక్షలకు ఫీజును ఎక్కువ వసూలు చేయరాదు. తల్లిదండ్రులు మా దృష్టికి తేవాలి. -
క్యాంపస్ అంబాసిడర్స్ - చలమలశెట్టి సురేఖ
ఉన్నత విద్య కోసం ప్రతి ఏటా విదేశాలకు వెళ్లే భారతీ య విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ కోవలోనే యూఎస్ లోని రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు చలమలశెట్టి సురేఖ. యూఎస్ విద్య, క్యాంపస్ ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా.. ప్రవేశాలు ఫాల్, స్ప్రింగ్‌లో: క్యాంపస్‌లో దాదాపు 200 మంది వరకు భారతీయ విద్యార్థులున్నారు. అమెరికా విద్యార్థులు భారతీయ విద్యార్థులతో స్నేహంగా ఉంటారు. క్యాంపస్‌లో జాతివివక్షత లేదు. అలా ఎవరైనా ర్యాగింగ్ చేస్తూ దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ప్రవేశాలు ప్రతి ఏటా వేసవిలోనూ, శీతకాలంలో ఉంటాయి. పరీక్ష విధానం కోర్సు, ప్రొఫెసర్ల ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. మిడ్ టర్మ్, ఫైనల్ ఎగ్జామ్స్ లేదా ప్రాజెక్ట్ వర్క్‌తోపాటు వీక్లీ టెస్టులు, క్విజ్, క్లాస్రూమ్ ఎక్సర్‌సెజైస్ కూడా ఉంటాయి. క్యుములేటివ్ గ్రేడ్ పా యింట్ ఏవరేజ్(సీజీపీఏ)ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. యూఎస్ విద్యా విధానం ప్రత్యేకం: మిగిలిన దేశాలతో పోలిస్తే యూఎస్ విద్యావిధానం ప్రత్యేకంగా ఉంటుంది. విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లభిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా టెక్నికల్ హబ్‌గా ఉన్న దేశం అమెరికా. థియరీ కంటే ప్రాక్టికల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రాబ్లం సాల్వ్డ్ లెర్నింగ్‌తో ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. కరిక్యులం, బోధ న కూడా పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటుంది. లేబొరేట రీలు అత్యాధునికంగా అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. నిష్ణాతులైన ఫ్యాకల్టీ: హాస్టల్ వసతి కూడా ఉంది. అమెరికన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. చాలాచోట్ల భారతీయ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆహారం విషయంలో ఆందోళన అనవసరం. ఫ్యాకల్టీ అంతా కూడా వారివారి సబ్జెక్టులలో డాక్టరేట్ చేసినవాళ్లే. అంతేకాకుండా ఎంతో అనుభవజ్ఞులు. ఇండియన్ సొసైటీ ఉంది: నేను ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. యూఎస్కొచ్చే భారతీయ విద్యార్థుల కు సహాయం చేయడానికి ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. వీరు విద్యార్థులు విమానం దిగిన దగ్గర నుంచి యూనివర్సి టీలో చేరేవరకు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఎంచుకున్న కోర్సును బట్టి ఫీజులుంటాయి. ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షల స్కోర్ తప్పనిసరి: అమెరికాలో చదవాలను కునేవారు ఆయా కోర్సులకు అనుగుణంగా శాట్/జీఆర్ఈ/ టోఫెల్/ఐఈఎల్టీఎస్/జీమ్యాట్ వంటి పరీక్షల్లో మంచి స్కోర్ సాధించాలి. ఇందుకోసం రెండేళ్ల ముందుగానే తమ సన్నాహాలు ప్రారంభించాలి. ఆయా టెస్టులకు సంబంధించి ఎన్నో వెబ్‌పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకోవాలి. ఆయా అంశాలను వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. దరఖాస్తు ఇలా: యూనివర్సిటీ వెబ్సైట్ (www.wright.edu) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ సర్టిఫికెట్లు, రికమండేష న్స్ లెటర్స్, రెజ్యూమే, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, పని అనుభవం వివరాలతో దరఖాస్తు చేయాలి. తర్వాత వీసాకు దరఖాస్తు చేసుకో వాలి. అప్లికేషన్‌తో పాటు అకడమిక్ సర్టిఫికెట్లు, యూఎస్‌లో ప్రవే శం లభించినట్లు కన్ఫర్మేషన్ లెటర్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఐ-20, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ సమర్పించాలి. వీసా ఆఫీసర్‌తో మాట్లాడేటప్పుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ ఉండాలి. -
ఆర్భాటం కాదు ఆచరణ కావాలి
మనుబోలు: జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం ప్రకటించిన ఐదు అంశాలపై ప్రచార ఆర్భాటం కాకుండా ఆచరణ అవసరమని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని బద్దెవోలు, కొలనకుదురు గ్రామాల్లో శుక్రవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ పేదల జీవన విధానంలో మార్పు రాకుండా పేదరికంపై గెలుపు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి సరిపడా ఉపాధ్యాయులు, మౌలిక వసతులు కల్పించకుండా బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించినందువల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సబ్సిడీపై ఎరువులు, రుణాలు, సాగు నీటి వసతి, మద్దతు ధర తదితర సదుపాయాలు కల్పించకుండా పొలం పిలుస్తోంది అంటూ ఆర్భాటంగా రైతు సదస్సులు నిర్వహించినందువల్ల ప్రయోజమేమిటని ప్రశ్నించారు. పారిశుధ్యానికి నిధులు కేటాయించకుండా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యమన్నారు. పింఛన్లను రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచడం శుభ పరిణామమన్నారు. అయితే దీని సాకుతో వేలాది మంది అర్హులైన పేదల పింఛన్లు తొలగించడం అన్యాయమన్నారు. అర్హులైన వారందరికి తిరిగి పింఛన్లు అందజేయాలని అధికారులకు సూచించారు. ప్రతి పక్షంలో ఉన్నందున తాను విమర్శలు చేయడం లేదని ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తామని, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వారి ప్రతినిధిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకటించిన కార్యక్రమాలన్నిటినీ చిత్తశుద్ధితో ప్రణాళికాబద్దంగా చేసినప్పుడే జన్మభూమి కార్యక్రమానికి సార్థకత ఉంటుందన్నారు. అలా కాకుండా ప్రచారార్భాటంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే పార్టీ పరంగా ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు. బద్దెవోలు రోడ్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రత్యేకాధికారి సత్యనారాయణ, ఎంపీడీఓ హేమలత, ఏఓ శేషగిరి, నాయకులుదనుంజయరెడ్డి, విజయ్‌రెడ్డి, మన్నెమాల సుధీర్‌రెడ్డి, సాయిమోహన్‌రెడ్డి, చేవూరి ఓసూరయ్య, మారంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నారపరెడ్డి కిరణ్‌రెడ్డి, వెందోటి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. -
సెలవుకు సెలవేనా?
ట్రాఫిక్ విభాగంలో మొదలు పెడతామన్న అధికారులు మూడు నెలలైనా ఆ ఊసేలేదు సిబ్బంది కొరతతో వెనకడుగు పోలీసు సిబ్బందిలో నైరాశ్యం సాక్షి, సిటీబ్యూరో: వారాంతపు సెలవు... దశాబ్దాలుగా పోలీసుల కల ఇది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నల్లగొండ జిల్లా పోలీసులు ప్రయోగాత్మకంగా ఈ కలను సాధ్యం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అదే స్ఫూర్తితో హైదరాబాద్‌లోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామని... ట్రాఫిక్ విభాగంలో ముందుగా మొదలు పెడతామని అధికారులు హామీ ఇచ్చారు. మూడు నెలలవుతున్నా దాని ఊసే లేదు. సిబ్బంది కొరతతో నగరంలో ఇది అమలు కావడం లేదు. కొత్త వారిని నియమిస్తే గానీ ఇది సాధ్యం కాదని సిబ్బంది అంటున్నారు. ఆగస్టు 15 నుంచి వీక్లీ ఆఫ్ అమలు చేస్తారనే ప్రచారంతో సిబ్బందిలో ఆశలు రేకెత్తాయి. ఆ గడువు దాటిపోయినా అందుకు సంబంధించి ఎటువంటి కదలికలు లేకపోవడంతో వారిలో నైరాశ్యం నెలకొంటోంది. వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే... జంట పోలీసు కమిషనరేట్లలో ట్రాఫిక్, సివిల్, ఏఆర్ విభాగాల్లో వారాంతపు సెలవు అమలు కావాలంటే సుమారు 7,603 మంది సిబ్బందిని కొత్తగా నియమించాలి.ప్రస్తుతం నగర కమిషరేట్ పరిధిలో ట్రాఫిక్‌లో హోంగార్డులతో కలిపి 3,057 మంది పని చేస్తుండగా, సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్)లో 8,698 మంది ఉన్నారు. సైబరాబాద్‌లో 990 మంది ట్రాఫిక్‌లో పని చేస్తుండగా, సివిల్, ఏఆర్‌లో 5,700 మంది విధులు నిర్వహిస్తున్నారు. నగర కమిషనరేట్‌కు ప్రస్తుతం ట్రాఫిక్, సివిల్, ఏఆర్ లకు కలిపి 4,603 మంది కావాల్సి ఉంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ట్రాఫిక్, సివిల్, ఏఆర్‌లకు కలిపి సుమారు 3 వేల మంది సిబ్బంది కావాల్సి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పని భారం తగ్గుతుంది. నగరంలో ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది... ఉండాల్సింది ఉన్నది ఖాళీలు 1795 1167 628 భర్తీ కావలసిన పోస్టులు: 26 మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుళ్లు, 582 మంది కానిస్టేబుళ్లు ట్రాఫిక్‌లో హోంగార్డులే ఎక్కువ నగర ట్రాఫిక్ విభాగంలో పోలీసు సిబ్బంది కంటే అధికంగా హోం గార్డులు పని చేస్తున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో అదనపు పోలీసు కమిషనర్, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు కలిసి మొత్తం 1167 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి తోడుగా హోంగార్డులు 1890 మంది పని చేస్తున్నారు. నగర ట్రాఫిక్ విభాగానికి మరో 900 మంది సిబ్బంది వస్తేగానీ వారాంతపు సెలవు సాధ్యం కాదు. హోంగార్డులు, కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ రాకపోవడంతో అరకొరగా ఉన్న సిబ్బంది పైనే పనిభారం పడుతోంది. ట్రాఫిక్ సిబ్బంది పని వేళలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి 10 గంటల వ రకు సిబ్బంది రెండు షిప్టులలో విధులు నిర్వహిస్తున్నారు. ఓ కానిస్టేబుల్ ఈ రోజు మొదటి షిప్టులో డ్యూటీ చేస్తే అదే కానిస్టేబుల్ మరుసటి రోజు రెండో షిఫ్టు చేయాల్సి ఉంటుంది. ఇక సిటీ సివిల్, ఏఆర్ పోలీసు విభాగంలో 12,401 పోస్టులకు గాను 8,698 మంది మాత్రమే ఉన్నారు. సైబరాబాద్‌లో ట్రాఫిక్ విభాగంలో హోంగార్డులతో సహా ప్రస్తుతం 990 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంత మంది ఉండాలి అనే లెక్కలు లేవు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం మరో వెయ్యి మంది వరకు ఉంటేనే వీక్లీఆఫ్‌లతో పాటు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలవుతుంది. సివిల్, ఏఆర్‌లో కలిపి ప్రస్తుతం సుమారు 5,700 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అదనంగా హోంగార్డులు 2వేల మంది వరకు ఉంటారు. వీక్లీ ఆఫ్ అమలు కావాలంటే మరో 2వేల మంది సిబ్బందిని నియమించాలి. నెలకు 360 గంటలు విధుల్లో... ఒక కానిస్టేబుల్ 24 గంటలు విధుల్లో ఉంటే... మరో 24 గంటల పాటు విశ్రాంతిలో ఉంటాడు. అంటే నెలలో అతడు 360 గంటల పాటు విధులు నిర్వహించినట్లు అవుతుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు నెలలో సుమారు 208 గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ లెక్కన పోలీసులు ఇతర విభాగాల ఉద్యోగుల కంటే 152 గంటలు అధికంగా పని చేస్తున్నారు. తక్కువ పనిగంటలు పనిచేస్తున్న వారికి వీక్లీ ఆఫ్‌లు ఉన్నాయి. అదే ఎక్కువ గంటలు పని చేస్తున్న పోలీసులకు మాత్రం ఇంకా వీక్లీఆఫ్‌లు మొదలు కాకపోవడం గమనార్హం. -
ప్రాక్టికల్స్, పరిశోధనల మేళవింపు.. నిట్- సూరత్కల్
మై క్యాంపస్ లైఫ్ అరేబియా సముద్రపు అలల గలగలలతో అలరారే అందమైన చిన్న పట్టణం.. కర్ణాటకలోని సూరత్కల్. చిన్ని కృష్ణుని ముగ్ధమోహన రూపానికి నెలవైన ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడిపి, శ్రీ మంజునాధుడు కొలువైన ధర్మస్థలకు దగ్గరలో ఉన్న ఈ ఊరు.. అత్యున్నత విద్యకు పెట్టింది పేరు. ఇంజనీరింగ్ విద్యను అందించడంలో దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ).. సూరత్కల్లోనే కొలువుదీరింది. దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు ఎన్ఐటీల్లో వరంగల్ తర్వాత ఎక్కువమంది తెలుగు విద్యార్థులు చేరుతున్న ఎన్ఐటీ ఇదే. సూరత్కల్లోని నిట్‌లో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ సెకండియర్ చదువుతున్న ఎంఎస్. మేరీ మనీషా.. తన క్యాంపస్ లైఫ్‌ను మనతో పంచుకుంటున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. అమ్మానాన్నల ప్రోత్సాహంతో మాది హైదరాబాద్. అమ్మానాన్న ఇద్దరూ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అన్నయ్య యూఎస్‌లో ఎంఎస్ చేస్తున్నాడు. నేను ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ వరకు హైదరాబాద్‌లోనే విద్యనభ్యసించాను. పదో తరగతిలో 94 శాతం మార్కులు, ఇంటర్మీడియెట్‌లో 98 శాతం మార్కులు వచ్చాయి. ఎంసెట్‌లో 2000 ర్యాంకు, జేఈఈ మెయిన్‌లో 7000 ర్యాంకు సాధించాను. మొదటి నుంచి నాకు సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్లంటే ఆసక్తి. చాలామంది ‘అవి అబ్బాయిలు తీసుకునే బ్రాంచ్‌లు.. అమ్మాయివి నీకెందుకు’ అనేవారు. అయినా నా ఆసక్తికి తోడు అమ్మానాన్నల ప్రోత్సాహంతో సివిల్ ఇంజనీరింగ్ లో చేరాను. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్‌లో ఎన్ఐటీ - సూరత్కల్ను ఎంచుకున్నాను. దినచర్య ఇలా క్యాంపస్‌లో ప్రతిరోజూ ఉదయం 7.55 గంటలకు దినచర్య మొదలవుతుంది. మొదటి పీరియడ్ 7.55 నుంచి 8.50 వరకు ఉంటుంది. రెండో పీరియడ్ 9.00 గంటలకు ప్రారంభమవుతుంది. పీరియడ్ వ్యవధి 50 నిమిషాలు. ప్రతి పీరియడ్ మధ్యలో 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ చేస్తాం. తర్వాత ఉంటే ఒక పీరియడ్.. లేదంటే సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం స్నాక్స్, టీ ఇస్తారు. రాత్రి 8 గంటలకు డిన్నర్. అన్ని రకాల టిఫిన్స్ క్యాంటీన్లో దొరుకుతాయి. మన తెలుగు విద్యార్థులు ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ, పూరీ, పరోటా, దోశ, చపాతీ వంటివన్నీ ఉంటాయి. అల్పాహారం బాగుంటుంది కానీ భోజనం కొంచెం చప్పగా ఉంటుంది. ఎక్కువ మంది విద్యార్థులు.. ఇళ్ల నుంచి పచ్చళ్లు తెచ్చుకుని భోజనాన్ని ఇష్టంగా లాగిస్తుంటారు. నెలకోసారి గ్రాండ్ డిన్నర్ ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని రకాల ఆహార పదార్థాలు (వెజ్, నాన్‌వెజ్, ఫ్రూట్స్, స్వీట్స్, ఐస్‌క్రీమ్స్) అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులు.. ఎంతో ఫ్రెండ్లీ క్యాంపస్ వాతావరణం చాలా బాగుంటుంది. పశ్చిమ కనుమల్లో పడమటి తీరాన.. అరేబియా సముద్రానికి అతిదగ్గరలోనే క్యాంపస్ ఉంది. ఇక్కడ ర్యాగింగ్ అసలు లేదు. ఇన్స్టిట్యూట్కు ‘జీరో ర్యాగింగ్’ అవార్డు కూడా వచ్చింది. నేను మొదటిసారి క్యాంపస్‌లో అడుగుపెట్టాక.. జానియర్స్ అందరికీ సీనియర్స్ వెల్కం పార్టీ ఇచ్చారు. ఇందులో భాగంగా పేరు, ఎక్కడ నుంచి వచ్చారు? ఏ బ్రాంచ్ వంటి వివరాలు అడిగారు. విద్యార్థులంతా ఎంతో స్నేహంగా ఉంటారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిస్తారు. అదృష్టవశాత్తూ ఎంటెక్, పీహెచ్డీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లోనే ఉంటారు. వీరు జూనియర్స్‌కు ఎంతో సహాయం చేస్తారు. సబ్జెక్టుల పరంగా ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తారు. అధునాతన సదుపాయాలతో క్యాంపస్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే.. మొత్తం 250 ఎకరాల్లో విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులతో కూడిన లేబొరేటరీలు, సకల సౌకర్యాలతో లైబ్రరీ, క్రీడా మైదానం, షాపింగ్ కాంప్లెక్స్, ఏటీఎం, విద్యార్థులకు, అధ్యాపకులకు వసతి.. ఇలా చదువుకోవడానికి కావాల్సిన చక్కటి వాతావరణం, సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నతవిద్యనభ్యసించిన అనుభవజ్ఞులు, నిష్ణాతులైన ఫ్యాకల్టీ క్యాంపస్‌లోనే ఉండటం ఎంతో ఉపయుక్తం. మాకొచ్చే ఎలాంటి సందేహాలనైనా వారు ఇట్టే నివృత్తి చేస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట ఎన్ఐటీలు జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థలన్న విషయం తెలిసిందే కదా! కాబట్టి ఆ స్థాయికి తగినట్టు బోధన ఉంటుంది. బోధనలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను వినియోగిస్తారు. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేస్తారు. ఇండస్ట్రీ ఓరియెంటేషన్‌తో క్లాసులు నిర్వహిస్తారు. ప్రపంచంలో, దేశంలో పేరొందిన శాస్త్రవేత్తలు, విద్యావేత్తలను క్యాంపస్‌కు తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తారు. ఇటీవల ఇస్రో చైర్మన్ కె.రాధాకృష్ణన్ క్యాంపస్‌ను సందర్శించారు. ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. దీన్ని ఇంజనీర్ అని వ్యవహరిస్తారు. అంతేకాకుండా కోర్సులో భాగంగా ప్రతి ఏటా మార్చిలో ఇండస్ట్రియల్ ట్రిప్, జనవరిలో క్లాస్ ట్రిప్‌లు ఉంటాయి. వీటిల్లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తాం. తద్వారా ప్రాక్టికల్ నైపుణ్యాలను అలవర్చుకుంటాం. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ చదువుతున్న బ్రాంచ్ ఆధారంగా ఏడాదికి పది సబ్జెక్టులు ఉంటాయి. సబ్జెక్టును బట్టి రెండు లేదా మూడు క్రెడిట్స్ ఉంటాయి. మొత్తం నాలుగేళ్ల కోర్సులో 90 నుంచి 100 వరకు క్రెడిట్స్ ఉంటాయి. నేను ఫస్టియర్‌లో 10 పాయింట్లకు 7.8 సీజీపీఏ సాధించాను. ఇన్స్టిట్యూట్లో మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఫస్టియర్‌లో 90 శాతం మార్కులు సాధించినవారికి ప్రతి నెలా రూ.1000 స్కాలర్షిప్ అందిస్తారు. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తారు. క్యాంపస్.. మినీ ఇండియా ఎన్ఐటీ - సూరత్కల్ను మినీ ఇండియాగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఇక్కడ దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ)లో వచ్చే ర్యాంకు ఆధారంగా బీటెక్‌లో ఉన్న మొత్తం సీట్లలో సగం సీట్లను హోంస్టేటా కోటాలో కర్ణాటక విద్యార్థులకు కేటాయిస్తారు. మిగతా సగం సీట్లను ఇతర రాష్ర్ట విద్యార్థులతో భర్తీ చేస్తారు. వీరిలో దాదాపు సగం మంది మన తెలుగువారే. మినీ ఇండియా అని ఎందుకన్నానంటే.. క్యాంపస్‌లో ఉగాది, గణేశ్ చతుర్ధి, హోళీ, దుర్గాపూజ, శ్రీరామ నవమి, దాండియా, జన్మాష్టమి ఇలా అన్ని పండుగలను నిర్వహిస్తారు. అన్నింటిలోకి హోళిని రంగ రంగ వైభవంగా జరుపుకుంటాం. పండుగలే కాకుండా ప్రతి ఏటా మార్చిలో కల్చరల్ ఫెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. దీన్ని ఇన్సిడెంట్ అంటారు. సాధారణంగా ఏ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు.. ఆ రాష్ట్రాల విద్యార్థులతో కలిసి తిరుగుతుంటారు. మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఇంగ్లిష్‌ను ఉపయోగిస్తాం. సైంటిస్టునవుతా బీటెక్ పూర్తయ్యాక విదేశాల్లో ఎంఎస్ చేస్తాను. తర్వాత పీహెచ్డీ కూడా పూర్తి చేసి సైంటిస్ట్ కావాలనేది నా లక్ష్యం. -
చిట్టి
థియరీలో డిస్టింక్షన్ కొడుతున్న మీ పిల్లలు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ అవుతున్నారని చింతిస్తున్నారా..! ఇక ఆ బెంగ అవసరం లేదు. మనిషి సృష్టించిన మరమనిషి మనలోకి వచ్చేశాడు. బోటనీ పాఠమైనా.. ఫిజిక్స్ ఫిక్షనయినా.. మేథమెటిక్ మ్యాజిక్ అయినా.., ప్రాక్టికల్‌గా చూస్తేనే పిల్లల మస్తిష్కంలో ఫిక్సయిపోతుంది. రోబో గురు సహాయంతో అపారజ్ఞానాన్ని సంపాదించుకునే అపూర్వ అవకాశం లభిస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ప్రయోగాల్లో యంత్రుడు మంత్రదండంలా ఉపయోగపడుతున్నాడు. రోబోటిక్స్.., ఆ రోబోలు చూపే ట్రిక్స్ యువత ఉపాధికి బాటలు వేస్తున్నాయి. విద్యా వ్యవస్థలో సంపాదించిన జ్ఞానానికి.. ఉపాధి రంగంలో అవసరమైన పరిజ్ఞానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రోబో ల్యాబ్‌లు తగ్గించేస్తున్నాయి. టీచర్ చెప్పే పాఠాలతో కుస్తీ పట్టకండలా.. బట్టీపట్టి నేర్చుకుంటే పరీక్షల్లో మార్కులొస్తాయి కానీ.. సంపూర్ణ జ్ఞానం రాదు. ఇదే కొనసాగితే ఉద్యోగాన్వేషణలో సాటివారికి సిసలైన పోటీ ఇవ్వలేని స్థితికి చేరుకుంటాం. ప్రస్తుతం విద్యార్థుల్లో 90 శాతం మందికి ఇదే అనుభవం ఎదురవుతోంది. ఇలాంటి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ ముందుకొస్తున్నాయి రోబోలు. పాఠశాల స్థాయి నుంచి గ్రాడ్యుయేషన్ లెవల్ వరకు పాఠాలకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్థుల ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచడానికి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నాయి. మొదట గృహ, పారిశ్రామిక రంగాల వినియోగంపై దృష్టి సారించిన రోబోటిక్స్ సంస్థలు. ఇప్పుడు ‘చదువుతూ నేర్చుకోవాలి.. నేర్చుకుంటూ చదువుకోవాలి’ అనే నినాదంతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ప్రాక్టికల్‌గా పాఠాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతి అంశాన్ని ప్రాక్టికల్‌గా వివరించేందుకు అధ్యాపకులు కూడా వీటిపై ఆధారపడుతున్నారు. భవిష్యత్ బంగారం రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్.. ఇలా అన్ని రంగాలతోనూ రోబోటిక్స్ ముడిపడి ఉంది. భవిష్యత్‌లో పరిశోధకులుగా, వివిధ ఉత్పాదక సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు రోబోటిక్స్ పరిజ్ఞానం తప్పనిసరి. అందుకే పాఠశాలలు, కళాశాలల్లో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ ఏర్పాటు అత్యవసరం. తద్వారా అధ్యాపకులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతికతపై అవగాహన కలుగుతుంది. విజ్ఞానం తప్పనిసరి రోబోటిక్స్ పరిజ్ఞానం విద్యార్థులు, అధ్యాపకులకు తప్పనిసరి అని జే రోబోటిక్స్ సంస్థ ఎండీ సుధీర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లో అన్ని రంగాల్లోనూ రోబోటిక్స్ వేళ్లూనుకుంటుందని ఆయన తెలిపారు. శిక్షణ ఇలా.. రోబోట్పైనే ఎలా ప్రోగ్రామ్ చేయాలనే దానిపై రోబోగురు సాఫ్ట్వేర్ ద్వారా మొదట విద్యార్థులు నేర్చుకుంటారు. ఆ తర్వాత ఇదే ప్రోగ్రామ్‌ను ఒక వైర్ ద్వారా రోబోట్పైనా డంప్ చేస్తారు. అప్పుడు రియల్‌టైమ్‌లో రోబో కదులుతుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ సాల్వింగ్ సిల్క్స్, అనలెటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. రియల్ టైమ్‌లో రోబో కదులుతున్నప్పుడు ఎదురైన సమస్యలను విద్యార్థులు గుర్తిస్తారు. ఆ సమస్య సాధనకు మళ్లీ ప్రోగ్రామింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో అవగాహన శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్ల సొంత ఐడియాతోనే విద్యార్థులు ప్రాజెక్టు చేస్తారు. ఇలా చేయడం వల్ల టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. ఇందుకోసం ఓమ్నీ రోబో, విజ్మో జూనియర్, డోసెలైక్స్, డొసెలైక్స్ సీనియర్, రోబో రూకా, అసాల్టర్ రోబోలను ఉపయోగిస్తారు. -
సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం
‘చిన్ననాటి నుంచి బెస్ట్ ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదవాలనే ఆశయం.. దానికోసం ఎనిమిదో తరగతి నుంచే కృషి... వీటికి కుటుంబ సభ్యుల తోడ్పాటు.. ప్రోత్సాహం తోడవడం.. తాజా విజయానికి ప్రధాన కారణాలు’ అంటున్నాడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన చింతకింది సాయిచేతన్. ఐఐటీ-ముంబైలో సీఎస్ఈ పూర్తి చేసి తర్వాత సివిల్ సర్వీసెస్‌లో విజయంతో ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యం అంటున్న చింతకింది సాయిచేతన్ సక్సెస్ స్పీక్స్.. స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ముత్పూర్ గ్రామం. అమ్మానాన్న ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నాన్న సురేందర్ రెడ్డి అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. అమ్మ నిర్మల లాలాపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈ విజయంలో అమ్మ, నాన్నల తోడ్పాటు ఎంతగానో ఉంది. చిన్ననాటి నుంచే ఇంజనీరింగ్‌పై దృష్టి: ఇంజనీరింగ్ చదవాలి.. అది కూడా అత్యున్నత ఇన్స్టిట్యూట్లో చదవాలి అనే కోరిక చిన్ననాటి నుంచే ఉంది. అందుకు మార్గం ఐఐటీలే అని తెలిసింది. బాబాయి జితేందర్ రెడ్డి ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. బంధువుల్లోనూ చాలామంది ఐఐటీల్లో చదివారు. ఆదే స్ఫూర్తితో ఐఐటీల్లోనే ఇంజనీరింగ్ సీటు సాధించాలనే పట్టుదల పెరిగింది. అందుకే ఎనిమిదో తరగతి నుంచే ఐఐటీకి ఫౌండేషన్ కోర్సులో చేరాను. ప్రిపరేషన్.. ప్రణాళికబద్ధంగా: ఐఐటీకి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ మాత్రం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో మొదలుపెట్టాను. క్లాస్‌రూం సెషన్స్, స్టడీ అవర్స్, సెల్ఫ్ స్టడీ అన్నీ కలిపి రోజుకు 11-12 గంటలు చదివేలా ప్రణాళిక రూపొందిం చుకున్నా. జేఈఈ పరీక్షలో అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా చదివాను. అన్ని సబ్జెక్ట్‌లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. వాస్తవానికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే కొంత క్లిష్టంగా ఉండేది. అయితే దీనికోసం ప్రత్యేకించి సమయం కేటాయించకుండా మిగతా సబ్జెక్ట్‌ల మాదిరిగానే చదివాను. అందుబాటులోని సమయంలోనే పరిపూర్ణ అవగాహన సాధించేందుకు కృషి చేశాను. బేరీజు వేసుకుంటూ: జేఈఈలో ప్రశ్నలన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచే ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్‌ను.. ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ చదివాను. బోర్డ్ సిలబస్‌లో లేని, ఎన్సీఈఆర్టీలో మాత్రమే ఉన్న అంశాలకు ప్రత్యేక సమయం కేటాయించాను. ఏ విషయాన్నయినా ఒక్కసారి చదివితే మెదడులో నిక్షిప్తమవుతుంది. అది బాగా అడ్వాంటేజ్‌గా మారింది. మా బ్యాచ్ నుంచి ఐపీఈ సిలబస్ మారింది. దాదాపు ఎన్సీఈఆర్టీ సిలబస్ మాదిరిగానే ఉంది. కాబట్టి ప్రత్యేకించి చదవాల్సిన అంశాలు చాలా తక్కువగా ఉండడం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రాక్టీస్ + అప్లికేషన్ ఓరియెంటేషన్: చదవడం ఎంత ముఖ్యమో... చదివిన అంశాలను ప్రాక్టీస్ చేయడమూ అంతే ముఖ్యం. అందుకే ప్రతి రోజు చదివిన అంశాలను కచ్చితంగా ప్రాక్టీస్ చేయడం హాబీగా చేసుకున్నాను. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ వరకు ప్రతి అంశాన్ని అప్లికేషన్ ఓరియెంటేషన్‌లో చదవడం లాభించింది. వీటితోపాటు ప్రతి రోజు చదివిన అంశాలకు సంబంధించి సొంత నోట్స్ రాసుకోవడం రివిజన్ సమయంలో బాగా ఉపయోగపడింది. తద్వారా ఈ విజయం సాధ్యమైంది. ఐఐటీ టు ఐఏఎస్: ప్రస్తుతం వచ్చిన ర్యాంక్‌తో ఐఐటీ-ముంబైలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో చేరతాను. నాలుగేళ్ల ఈ కోర్సు పూర్తయ్యాక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరై ఐఏఎస్ సాధించాలని.. తద్వారా ప్రజలకు సేవ చేయడమే భవిష్యత్తు లక్ష్యంగా నిర్ణయించుకున్నాను. ఒత్తిడి లేకుండా.. లక్ష్యంపైనే దృష్టి: జేఈఈ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కాకూడదు. ఏదైనా ఒక నిర్దిష్టమైన అంశాన్ని చదువుతూ ఒత్తిడికి గురైతే.. వెంటనే దాన్ని వదిలేసి సులువుగా, ఇష్టంగా ఉన్న అంశం చదవడం మేలు. అంతేకాకుండా ఒత్తిడికి లోనైతే లక్ష్యంపై నుంచి దృష్టి మళ్లే ప్రమాదం ఉంది. సబ్జెక్ట్ ఏదైనా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమాత్రం విస్మరించకూడదు. మానసిక సంసిద్ధత, ఆత్మవిశ్వాసం ఆయుధాలుగా అడుగులు వేస్తే విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. అకడెమిక్ ప్రొఫైల్: 2012లో పదోతరగతి ఉత్తీర్ణత (9.8 జీపీఏ) 2014లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత (983 మార్కులు) ఎంసెట్-2014లో 10వ ర్యాంకు బిట్‌శాట్-2014 స్కోర్ 398 జేఈఈ-మెయిన్ మార్కులు - 340 జేఈఈ-అడ్వాన్స్డ్ మార్కులు- 320 -
విదేశీ విద్య
బోధన, పరిశోధన రంగాల్లో మెరుగైన విద్యను అందించడంలో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు ప్రపంచంలోనే ముందు వరుసలో నిలుస్తున్నాయి. తరగతి గది బోధనతోపాటు కావాల్సిన స్కిల్స్ పెంపొందించుకునేలా.. ప్రాక్టికల్స్‌కు పెద్దపీట వేయు డం ఇక్కడి విద్యా విధానంలోని ప్రత్యేకత. స్టడీ అబ్రాడ్‌లో అమెరికా తర్వాత భారతీయుులకు బెస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తున్న ‘ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్’ పై ఫోకస్.. కోర్సులు: ముఖ్యంగా ఏవియేషన్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఫిజియోథెరపీ, మెడిసిన్ అండ్ లైఫ్ సెన్సైస్‌లో ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఫోరెన్సిక్ అండ్ ఎనలిటికల్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులు; ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్, స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, మెడికల్ రేడియాలజీ కోర్సులు మంచి ఆదరణ పొందుతున్నాయి. కోర్సులు... అర్హతలు: స్కూల్స్: ఆస్ట్రేలియాలో స్కూల్ విద్యకు స్కూళ్లను బట్టి వేర్వేరు అర్హతలు ఉన్నాయి. అకడమిక్ ప్రతిభ, సామర్థ్యం ఆధారంగా ఎంపిక ఉంటుంది. అండర్గ్రాడ్యుయేట్ కోర్సులు: ఆస్ట్రేలియా సీనియర్ సెకండరీ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (మనదేశంలో 10+2/ఇంటర్మీడియెట్) ఉత్తీర్ణత. కొన్నిటికి ప్రత్యేక అర్హతలు తప్పనిసరి. పీజీ కోర్సులు: ఈ కోర్సుల్లో చేరాలంటే.. సంబంధిత డిగ్రీ లేదా పని అనుభవం, పరిశోధన సామర్థ్యం ఉండాలి. ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్టార్లో సర్టిఫికెట్, డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటారుు. ఈ కోర్సులకు నిర్దేశించిన అర్హతలతోపాటు పని అనుభవం ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా, అసోసియేట్ డిగ్రీ, అడ్వాన్స్డ్ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్స్ బై కోర్సు వర్క్ ఉంటారుు. పోస్ట్‌గ్రాడ్యుయేట్ రీసెర్చ్‌లో భాగంగా.. మాస్టర్స్ బై రీసెర్చ్ డిగ్రీ, డాక్టోరల్ డిగ్రీ ఉంటాయి. వీటితోపాటు ఆయా కోర్సులకు అనుగుణంగా జీఆర్ఈ/టోఫెల్/ జీమ్యాట్/ఐఈఎల్టీఎస్ స్కోర్లు తప్పనిసరి. ప్రవేశం: ఆస్ట్రేలియాలో ఏటా రెండుసార్లు ఫిబ్రవరి/మార్చి, సెప్టెంబర్/నవంబర్లలో అకడెమిక్ సెషన్ మొదలవుతుంది. ప్రవేశించదలచుకున్న సెషన్‌కు కనీసం ఏడాది ముందుగా అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించాలి. అడ్మిషన్ ఖరారైన వెంటనే వీసా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి. ఇందుకోసం సంబంధిత ఇన్స్టిట్యూట్ జారీచేసే లెటర్ ఆఫ్ ఆఫర్ లేదా ఎలక్ట్రానిక్ ఎన్రోల్మెంట్ లెటర్ ఆధారంగా ఆస్ట్రేలియా ఎంబసీను సంప్రదించాలి. దరఖాస్తు: విద్యార్థులు నేరుగా ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్ల నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి సంబంధిత చిరునామాకు పంపాలి. సాధారణంగా హైస్కూల్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు సర్టిఫికెట్లు... రిఫరెన్స్ లెటర్, పర్సనల్ లెటర్‌ను జత చేయాలి. ఇప్పటికే ఉద్యోగం చేస్తూ స్టడీ లీవ్‌ను వినియోగించుకునేవారు తప్పనిసరిగా తమ యజమానిచ్చే రిఫరెన్స్ లెటర్‌ను చూపించాలి. పీహెచ్డీ, లేదా మాస్టర్స్ డిగ్రీ బై రీసెర్చ్‌కి దరఖాస్తు చేసే అభ్యర్థులు.. తాము రీసెర్చ్ చేయదలచిన అంశానికి గల ప్రాముఖ్యత, తమకున్న ఆసక్తి తదితర వివరాలతో రీసెర్చ్ ప్రపోజల్‌ను మూడు నుంచి ఐదు పేజీలలో రాసి దరఖాస్తుకు జత చేయాలి. వీసా: ఆస్ట్రేలియాలో మూణ్నెల్ల కంటే ఎక్కువ కాలవ్యవధి ఉన్న కోర్సులనభ్యసించాలనుకునేవారు విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఆ దేశ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అండ్ సిటిజన్‌షిప్(డీఐఏసీ) మంజూరు చేస్తుంది. విద్యార్థి చేరిన కోర్సు... కామన్వెల్త్ రిజిస్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కోర్సెస్ ఫర్ ఓవర్సీస్ స్టూడెంట్స్(సీఆర్ఐసీఓఎస్)లో నమోదై ఉంటేనే వీసా దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారు. వీసా కోసం ఐఈఎల్‌టీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా టోఫెల్, పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రముఖ యూనివర్సిటీలు: ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ ఉపయోగకరమైన వెబ్సైట్లు www.studyinaustralia.gov.au www.aei.gov.au www.immi.gov.au www.studiesinaustralia.com www.india.embassy.gov.au -
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల నుంచి ఏప్రిల్ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు సభ్యులు, విద్య, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, పోస్టల్, వైద్య శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, కన్వీనర్ ఎల్.జె.జయశ్రీ మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు 164 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ జరుగుతుందని తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు రాత పరీక్షలు 111 పరీక్షా కేం ద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. 34 పరీక్షా పత్రాల స్టోరేజ్ కేం ద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించినట్లు వెల్లడించారు.