
ఇంటర్ విద్యకు కాంట్రాక్టు సెగ
► 16 రోజులుగా విధులు బహిష్కరించిన కాంట్రాక్టు లెక్చరర్లు
► దగ్గర పడుతున్న పరీక్షలు విద్యార్థుల్లో ఆందోళన
నర్సీపట్నం/పాడేరు: కాంట్రాక్టు లెక్చరర్ల సమ్మె ప్రభావం ఇం టర్ విద్యార్థులపై పడింది. పదేళ్ల క్రితం కాంట్రాక్టు ప్రాతిపదికన విధుల్లో చేరిన లెక్చరర్లు అప్పటి నుంచి నేటికీ అదే విధానంలో కొనసాగుతున్నారు. తమను పర్మినెంట్ చేయాలని గతంలో పలుమార్లు వీరంతా ఆందోâýæన చేపట్టిన సమయంలో నేతలు ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలు కాలేదు. చివర కు తాడో పేడో తేల్చుకోవాలని భావించిన లెక్చరర్లు ఎట్టకేలకు ఈ నెల 2 నుంచి సమ్మె నోటీసు ఇచ్చి విధులు బహిష్కరించా రు.
16 రోజులుగా వివి ధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వ కళాశాలల్లో ఇటువంటి పరిస్థితి నెల కొన్న నేపథ్యంలో తరగతులు అన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలు, మార్చి 1 నుంచి థియరీ పబ్లిక్ పరీక్షలు జరగనున్నా యి. ఈ దశలో లెక్చరర్లంతా సమ్మె చేపట్టడంతో ఏం చేయాలో పాలుపోక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. కనీసం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు లేదు.
స్తంభించిన తరగతులు
జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 36 ఉన్నాయి. ఈ కళాశాలల్లో 18 వేల మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. 138 ప్రభుత్వ లెక్చరర్లు, 305 కాంట్రాక్టు లెక్చరర్లు పని చేస్తూ విద్యాబోధన కొనసాగిస్తున్నారు. కొ న్ని కళాశాలల్లో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన వారంతా కాంట్రాక్టు లెక్చరర్లతోనే కొనసాగిస్తున్నారు. కళాశాల ల కు రాకుండా ఆందోâýæన కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాడోపేడో తేల్చుకుంటాం
గతంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు లెక్చరర్లందర్నీ పర్మినెం ట్ చేసి, జీతాలు పెంచాలి. దీనిపై అప్పటికే ఆందోâýæనలు చేయడంతో ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. దీన్ని తక్షణమే పరిష్కరిం చని పక్షంలో విధుల్లో చేరే ప్రసక్తి లేదు.
–శర్మ, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
విద్యాబోధన కుంటుపడుతోంది
కాంట్రాక్టు లెక్చరర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల తరగతుల నిర్వహణ కష్టంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే దీని ప్రభావం విద్యాబోధనపై పడే అవకాశం ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని తక్షణమే వీరి సమస్యలను పరిష్కరించాలి.
–జి. చిన్నారావు, జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్