
ప్రాణం తీసిన ప్రాక్టికల్స్
వికారాబాద్ రూరల్: కాలేజీలోని ల్యాబ్‌లో ప్రాక్టికల్ చేస్తుండగా అస్వస్థతకు గురైన ఓ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం వెలుగుచూసింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారానికి చెందిన రాజ్‌కుమార్ కూతురు శిరీష(20) పట్టణంలోని ఎస్‌ఏపీ డిగ్రీ కళాశాలలో మైక్రోబయోలజీ రెండో సంవత్సరం చదువుతుంది.
శుక్రవారం కాలేజీలో ప్రాక్టికల్స్‌లో భాగంగా విద్యార్థిని రసాయనాలతో ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తుండగా రసాయనాలు ముక్కులోకి వెళ్లడంతో శిరీష అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వైద్యం కోసం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో విద్యార్థిని శనివారం మృతి చెందింది.