ప్రాక్టికిల్స్
ఇంటర్, డిగ్రీ ప్రయోగాల నిర్వహణలో నిర్లక్ష్యం
ప్రయోగాత్మక పద్ధతిలో బోధిస్తే ఎలాంటి విద్యార్థులకైనా సులువుగా అవగాహన ఏర్పడుతుంది. అంతేకాదు... పరిశోధనల రంగం వైపు విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందించేందుకు ప్రయోగాలు దోహదం చేస్తారుు. అలాంటి ప్రయోగాలు జిల్లాలో ప్రాక్టి‘కిల్స్’గా మారుతున్నారుు. జిల్లాలో విద్యాశాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ఇంటర్మీడియట్‌లో గానీ... డిగ్రీలో గానీ ఎవరూ ‘ప్రాక్టికల్’గా ఆలోచించడం లేదు. ప్రయోగశాలలు, పరికరాల కొరత.. వసతుల లేమి.. తక్కువగా ఉన్న సైన్స్ విద్యార్థుల సంఖ్య వెరసి ప్రయోగశాలలు నిష్ర్పయోజనంగా మారడంపై ‘సాక్షి’ ఫోకస్..
ఎంసెట్‌లో ప్రవేశాలకు ఇంటర్ వార్షిక పరీక్షల మార్కుల వెయిటేజీ ఉంది. ఇందులోనూ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత కీలకం... మార్కులు ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాక్టికల్స్‌పై ఏళ్లకేళ్లుగా చిన్నచూపే మిగులుతోంది. పలు కళాశాలల్లో ప్రయోగశాలలు (ల్యాబ్‌ల), పరికరాల కొరత పీడిస్తుండగా... వసతుల లేమి వేధిస్తోంది. మరికొన్ని కాలేజీల్లో సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో తూతూమంత్రంగా ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. సర్కారుతోపాటు ప్రైవేట్ కాలేజీల్లోనూ ఇదే తంతు కొనసాగుతుండడం గమనార్హం. సంవత్సర పరీక్షలు సమీపిస్తేనే ప్రయోగాలు చేరుుంచడం జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులకు అలవాటుగా మారింది. ఫిబ్రవరి 12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నారుు. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాలు కలిపి 16,183 మంది ఎంపీసీ... 8,689 మంది బీపీసీ... మొత్తం 24,872 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నిష్ర్పయోజనంగా మారిన ప్రయోగాలపై ‘సాక్షి’ ఫోకస్....
ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహణలో నిర్లక్ష్యం
విద్యారణ్యపురి : ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ గ్రూప్‌కు సంబంధించి సైన్స్ విద్యార్థులకు బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది. సబ్జెక్టుల వారీగా ప్రథమ సంవత్సరంలో కొన్ని ప్రాక్టికల్స్ చేరుుంచాలి. కానీ, ఎక్కువ శాతం ప్రభుత్వ కాలేజిల్లో విద్యార్థులకు ప్రాక్టిల్స్ చేయించడం లేదు. మొత్తం సెకండియర్‌లోనే చేయిస్తున్నారు. అదీ... వార్షిక పరీక్షలు సమయానికి రెండు మూడు నెలల ముందు ఒక్కో సబ్జెక్టులో ముఖ్యమైన ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎక్కువ శాతం ల్యాబ్స్ ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ ఫీజులతోప్రయోగ పరికరాలు, కెమికల్స్‌ను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పలు ప్రభు త్వ కాలేజీల్లో పరికరాలు కొనుగోలు చేశారు... ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని కాలేజీల్లో సరియైన వసతులు లేక ప్రాక్టికల్స్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా... ఈ ఏడాది 30 కళాశాలల్లోనే ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం, ల్యాబ్ వసతులు సరిగా లేకపోవడంతో 13 కాలేజీలకు చెందిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
ఎక్కడెక్కడ.. ఎలా....
హసన్‌పర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కొంత కాలం హైస్కూల్‌లోనే నడిపారు. ఇప్పుడు కొత్తభవనం అందుబాటులోకి వచ్చింది. కానీ, ల్యాబ్ వసతి లేదు... పరికరాలు లేవు. ఈ మేరకు ఆ కాలేజీ సైన్స్ విద్యార్థులకు హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తీసుకొచ్చి ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. ఇలా సుమారు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతోంది.
గీసుకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని సైన్స్ విద్యార్థులకు సరిపడా వసతులు లేవు. దీంతో సంగెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు.
జనగామ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్‌లోనే కొనసాగుతోంది. సైన్స్ గ్రూప్‌లో తక్కువ మంది విద్యార్థులుండడంతో తరగతి గదిలోనే వీలునుబట్టి విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయిస్తుంటారు. పరీక్షలకు మాత్రం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను కేంద్రంగా కేటాయించారు.
మో‘ఢల్’ స్కూళ్లు...
జిల్లాలో 29 మోడల్ స్కూళ్లల్లో ఇంటర్ విద్యార్థులు ఉండగా... ల్యాబ్ సౌకర్యాలు అంతంతమాత్రమే. కొన్నింటిలో ప్రధానంగా విద్యుత్, నీటి సౌకర్యం లేదు. మరి కొన్నింటిలో సైన్స్ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ ఏడాది ఆరు మోడల్ స్కూళ్ల (ములుగు ఘనపూర్, బచ్చన్నపేట, డోర్నకల్, చెన్నారావుపేట, గీసుకొండ, కేసముద్రం)ను ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలుగా కేటాయించారు.
ఎరుుడెడ్...
జిల్లాలో ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు ఏడు ఉండగా... నాలుగింటిని ప్రాక్టికల్స్ పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణం.
‘ప్రైవేట్’లో అక్టోబర్, నవంబర్‌లోనే..
జిల్లాలో 242 ప్రైవేట్ జూనియర్ కాలేజీలున్నాయి. ఇందులో ఎక్కువ శాతం కాలేజీల్లో ల్యాబ్ పరికరాలు ఉన్నారుు. కానీ... పరీక్షలు సమీపిస్తున్న సమయంలో అక్టోబర్, నవంబర్‌లో కొంతమేర ప్రాక్టికల్స్‌ను చేయిస్తున్నారు.
డిగ్రీ కళాశాలల్లో.... ఫిబ్రవరి 10 నుంచి ప్రాక్టికల్స్
జిల్లాలో 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా.... కొన్నింటిలో ల్యాబ్ వసతులు లేక సైన్స్ గ్రూప్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జ్ఞానం అందకుండా పోతోంది. రంగశారుుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే కొనసాగుతోంది. బీఎస్సీ సైన్స్ విద్యార్థులు 16 మంది మాత్రమే ఉన్నారు. వీరికి హన్మకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. మరిపెడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా జూనియర్ కాలేజీలోనే నడుస్తోంది. ఇక్కడ కొన్ని గదుల్లో, మరో చోట కొన్ని గదుల్లో డిగ్రీ తరగతులు నిర్వహిస్తున్నారు. బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం కలిపి 60 మంది విద్యార్థుల వరకు ఉన్నారు. వీరికి ల్యాబ్ వసతి లేదు. తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని కొన్ని గదుల్లో నడిపిస్తున్నారు. సైన్స్‌లో 30మంది విద్యార్థుల వరకే ఉన్నారు. ల్యాబ్ వసతి లేదు. పరకాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా జూనియర్ కళాశాలలోనే అసౌకర్యాల నడుమ షిఫ్ట్ సిస్టంలో కొనసాగిస్తున్నారు. 50 మంది విద్యార్థుల వరకు సైన్స్ విద్యార్థులున్నారు. సమస్యల నడుమ ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలలోనే పాలిటెక్నిక్‌ను కూడా కొనసాగిస్తుండడం కారణం.