విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగిస్తే మంచి మార్కులు | Preparation on eamcet, inter, jee exams for chemistry subject | Sakshi
Sakshi News home page

విశ్లేషణాత్మక ప్రిపరేషన్ సాగిస్తే మంచి మార్కులు

Published Thu, Nov 7 2013 2:01 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Preparation on eamcet, inter, jee exams for chemistry subject

మిగతా సబ్జెక్ట్‌లతో పోల్చితే ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్స్, ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల్లో చక్కని స్కోరింగ్ సబ్జెక్ట్.. కెమిస్ట్రీ. ప్రశ్నలకు తక్కువ సమయంలో సులభంగా సవూధానమిచ్చే అవకాశం  ఉండడమే దీనికి కారణం. ప్రాథమిక భావనల (బేసిక్ కాన్సెప్ట్)పై అవగాహనతోపాటు.. నిర్దేశించిన సిలబస్‌ను విశ్లేషణాత్మకంగా ప్రిపేరైతే ఇందులో మెరుగైన మార్కులు సాధించవచ్చు..

 

 పి. విజయ్ కిశోర్ సీనియర్ ఫ్యాకల్టీ,

 డా॥ఆర్‌కేస్ ఐఐటీ అకాడమీ,హైదరాబాద్.

 

 జేఈఈ:

 కెమిస్ట్రీకి సంబంధించి సిలబస్‌ను స్థూలంగా మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి.. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒక విషయం గమనించాలి.. సిలబస్‌ను మూడు విభాగాలకు పేర్కొన్నా.. ఆ మూడు విభాగాలకు  అంతర్గత సంబంధం (ఇంటర్ కనెక్టెడ్) ఉంటుంది. ఉదాహరణకు రిడాక్స్ రియాక్షన్స్ మీద పట్టు.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి ప్రిపరేషన్, ప్రాపర్టీస్‌లో ఉపయోగపడుతుంది. గత పోటీ పరీక్షలను పరిశీలిస్తే..ఈ మూడు విభాగాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక అంశంపై మాత్రమే దృష్టి కేంద్రీక రించడం సహేతుకం కాదు.

 

 కీలక చాప్టర్లు:

 పీరియాడిక్ టేబుల్

 కెమికల్ బాండింగ్

 మోల్ కాన్సెప్ట్ (కాన్సన్‌ట్రేషన్స్ కలిపి)

 రిడాక్స్ రియాక్షన్స్

 క్వాలిటేటివ్ అనాలిసిస్

 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ

 

 ఈ చాపర్ట్‌లపై పట్టు..మిగతా చాప్టర్లను కూలంకశంగా ప్రిపేరయ్యేందుకు దోహదపడుతుంది. కీలకమైన చాప్టర్.. పీరియాడిక్ టేబుల్. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో ఈ అధ్యాయం లేనప్పటికీ..దీన్ని అవగాహన చేసుకోకుండా కెమిస్ట్రీలోని మిగతా అంశాలను అర్థం చేసుకోవడం కష్టం.

 

 ఫిజికల్ కెమిస్ట్రీ:

 ఈ విభాగానికి సంబంధించి గతంలో పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను పరిశీలిస్తే.. విద్యార్థి మ్యాథమెటికల్ సామర్థ్యాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉండడం లేదు. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. విశ్లేషణాత్మకంగా ప్రిపరేషన్ సాగించాలి. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి:

 నేర్చుకున్న సూత్రాలను నోట్స్ రూపంలో పొందుపరుచుకోవాలి. వీటిని విభిన్న పద్ధతుల్లో ఏవిధంగా అన్వయం చేసుకోవచ్చో పరిశీలించాలి. 

 ఒక టాపిక్ పూర్తయిన వెంటనే.. దానికి సంబంధించి వివిధ పుస్తకాల్లో ఉన్న విభిన్న రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.

 ప్రతి టాపిక్‌కు సంబంధించి కనీసం మూడు ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి.

 గతంలో ఐఐటీ-జేఈఈ పరీక్షలో అడిగిన ప్రశ్నల్లోంచి దాదాపు 15-20 శాతం ప్రశ్నలు ఏఐఈఈఈ పరీక్షల్లో రావడం గమనార్హం.

 

 

 ఆర్గానిక్ కెమిస్ట్రీ:

 గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగానికి సంబంధించి సులువుగా సమాధానం గుర్తించగల స్టీరియో ఐసోమరిజమ్ తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టుతోపాటు విస్తృత స్థాయిలో ప్రిపేర్ కావడం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి. ఇందులో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్ చాలా కీలకమైంది. ఈ అంశంపై పట్టు సాధిస్తే.. మిగతా అంశాలను అవగాహన చేసుకోవడం ఏమంత కష్టం కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి కీలక అంశం.. చదవడమేకాకుండా ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి:

 చాప్టర్ల వారీగా రియాక్షన్స్‌ను నోట్ చేసుకోవాలి.

 ప్రతి రియాక్షన్‌కు సంబంధించి దాని విశ్లేషణ, వ్యవస్థ, ఉత్పత్తులు, కావల్సిన నిబంధలను ఒక క్రమ పద్ధతిలో రాసుకోవాలి.

 రోజూ ఒక టాపిక్‌లోని కన్జర్వేషన్స్‌ను ప్రాక్టీస్ చేయాలి.

 ప్రిపరేషన్‌లో సబ్జెక్టివ్ వ ర్క్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యతనివ్వాలి.

 ఎంసెట్/జేఈఈ/ఏఐఈఈఈ గత ప్రశ్నపత్రాలను బాగా ప్రాక్టీస్ చేయాలి.

 

 ఇనార్గానిక్ కెమిస్ట్రీ:

 కెమిస్ట్రీలో.. ఇనార్గానిక్ కెమిస్ట్రీ పరిధి విస్తృతం. కాబట్టి అధిక శాతం మంది విద్యార్థులు ఈ అంశాన్ని కష్టమైందిగా భావిస్తారు. వాస్తవానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, రిడాక్స్ రియాక్షన్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ అంశాలపై పట్టుతో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఈ విభాగం నుంచి కాన్సెప్ట్ బేస్డ్ (ప్రాథమిక భావనల ఆధారంగా), స్ట్రక్చర్స్ ఆధారిత ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాకుండా కోఆర్డినేషన్ కెమిస్ట్రీకి ప్రాధాన్యత పెరిగింది. ఈ అంశంపై తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ నేరుగా (స్ట్రయిట్ ఫార్వర్డ్ కొశ్చన్స్)నే ఉండడం గమనించాల్సిన అంశం. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి మెటలర్జీ, ట్రాన్సిస్టన్ ఎలిమెంట్స్, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కీలక అంశాలు. ఇందులో మెరుగైన స్కోర్‌కు చేయాల్సినవి:

 నిర్దేశించిన సిలబస్‌ను అనుసరిస్తూ.. రిప్రెజెంటేటివ్ ఎలిమెంట్స్‌కు సంబంధించి నోట్స్ రూపొందించుకోవాలి.

 కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు ఎక్కువ సమయం వెచ్చించాలి

 మెటలర్జీ, క్వాంటిటేటివ్ అనాలిసిస్‌కు సంబంధించి ఫ్లో చార్ట్స్ రూపొందించుకోవడం మంచిది.

 ప్రిపరేషన్‌లో ఇనార్గానిక్ కెమిస్ట్రీకి కనీసం రోజుకు ఒక గంటైనా కేటాయించాలి.

 

 కీలక అంశం:

 ప్రిపరేషన్‌లో పాటించాల్సిన కీలక అంశం.. నిర్దేశించిన సిలబస్ మేరకే పరిమితం కావడం. సిలబస్‌ను దాటి ఎట్టి పరిస్థితుల్లోను వేరే అంశాలను ప్రాక్టీస్ చేయవద్దు. ప్రిపేర్ అవుతున్న అంశానికి సంబంధించిన ప్రాథమిక భావన (బేసిక్ కాన్సెప్ట్)పై పట్టు సాధించాలి. తద్వారా సదరు అంశంపై పరిపూర్ణత సాధించడంతోపాటు ప్రశ్నను ఏవిధంగా అడిగినా సమాధానం ఇచ్చే సామర్థ్యం అలవడుతుంది. అంతేకాకుండా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకే తరహా ప్రశ్నలను కాకుండా విభిన్నమైన ప్రశ్నలను ఎంచుకోవాలి.

 

 జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2013: అంశాల వారీగా మార్కులు

 టాపిక్      మార్కులు

 ట్రాన్సిషన్ ఎలిమెంట్స్

 అండ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ      10

 గ్యాసెస్ స్టేట్      10

 క్వాలిటేటివ్ అనాలిసిస్  10

 పి-బ్లాక్    9

 ఆరోమాటిక్ కాంపౌండ్   9

 బయోకెమిస్ట్రీ      8

 కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ధేర్ డేరివేటివ్స్     7

 కెమికల్ కైనటిక్స్ 6

 ఎలక్ట్రో కెమిస్ట్రీ     6

 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ-2    6

 మెటలర్జీ    5

 కాలిగేటివ్ ప్రాపర్టీస్      4

 జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ-1     4

 కెమికల్ ఈక్విలిబ్రియం  3

 కెమికల్ బాండింగ్       3

 ఆయానిక్ ఈక్విలిబ్రియం       3

 అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ 3

 హైడ్రోకార్బన్      3

 కార్బనల్ కాంపౌండ్స్    3

 రియాక్షన్స్ మెకానిజమ్ 2

 థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ   2

 సాలిడ్ స్టేట్ 2

 సర్ఫేస్ కెమిస్ట్రీ    2

 

 

 ఎంసెట్

 ఎంసెట్ కెమిస్ట్రీలో ఇంటర్మీడియెట్ ద్వితీయ  సంవత్సరం నుంచి 20 నుంచి 23 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్ స్ట్రీమ్ మధ్య పెద్ద తేడా ఉండదు. ఇంజనీరింగ్‌లో ప్రాబ్లమ్ బేస్డ్ కొశ్చన్స్ మెడికల్‌తో పోల్చితే 4-5 ఎక్కువగా ఉంటాయి.

 కెమిస్ట్రీలోని మొత్తం మూడు విభాగాల్లో (ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ) ఆర్గానిక్ కెమిస్ట్రీ కీలకమైంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోనే అధిక శాతం అంతర్గత సంబంధం గల అంశాలుంటాయి. ఉదాహరణకు గ్రూప్‌లలోని మూలకాల  ధర్మాలు దాదాపుగా ఒకే మాదిరిగా ఉంటా  యి. ఇలాంటి అంశాల విషయంలో కాంపౌండ్  తయారీ ధర్మాలు, రసాయనిక చర్యలను (ఫ్లోరిన్, క్లోరిన్, ఓజోన్ తదితర)ను టేబుల్ విధానంలో రూపొందించుకోవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ప్రతిచర్యల క్రమం,ఫ్లోచార్ట్స్,మూల కాలు-తయారీ పద్ధతులు-ధర్మాలను వరుస క్రమంలో రివిజన్ చేయడం లాభిస్తుంది. ఆల్కహాల్స్, ఎమైన్స్, ఫినోల్స్, నేమ్డ్ రియాక్షన్స్ చాప్టర్లలోని ఆర్డర్ ఆఫ్ యాసిడ్స్, బేసిక్ స్ట్రెంగ్త్ అంశాలను సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్, ఇంటర్ కన్వర్షన్స్ రూపంలో ప్రాక్టీస్ చేయాలి.

 ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం ఫార్ములాల ఆధారంగా ఉంటుంది. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, సాలిడ్ స్టేట్, కెమికల్ కైనమెటిక్స్, ఈక్విలిబ్రియుం వంటి అంశాల నుంచి 10 నుంచి 12 ప్రశ్నలు రావచ్చు. మ్యాథమెటిక్స్, న్యూమరికల్స్ సంబంధితంగా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీ విషయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫార్ములాల ధర్మాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సులభంగా ఉంటుంది. ప్రతి ఫార్ములాకు సంబంధించి ప్రొఫైల్ తయూరు చేసుకుని వాటిని పరిశీలించాలి.

 కెమిస్ట్రీలో మిగతావిభాగాలతో పోల్చితే.. కొంత క్లిష్టమైన విభాగం ఇనార్గానిక్ కెమిస్ట్రీ.  ఇందులో మూలకాల ధర్మాలను ఒకదానితో మరొకటి బేరీజు వేస్తూ చదవాలి. అన్ని గ్రూపుల్లోని మూలకాల ధర్మాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటారుు. దీనివల్ల క్లిష్టమైన ఫార్ములాలను కూడా సులువుగా గుర్తుంచుకోవచ్చు. వివిధ మూలకాలు, కాంపౌండ్స్ తయారీ, ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్స్ తదితర విధానాలను టేబుల్ రూపంలో మలచుకుని ప్రిపరేషన్ సాగిస్తే సులువుగా జ్ఞప్తికి వస్తాయి.

 

 ఎక్కువ దృష్టి సారించాల్సిన టాపిక్స్:

 అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియూడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యూలర్, స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్/గ్యాసెస్, సొల్యూషన్స్, స్టైకోమెట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, పి బ్లాక్ ఎలిమెంట్స్- గ్రూపు 13-17, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రో కార్బన్స్, థర్మోడైనమిక్స్, ఆల్కైన్స్ అండ్ అరోమాటిక్ హైడ్రో కార్బన్స్, హాలో ఆల్కేన్స్ అండ్ హాలో అరేన్స్, ఆల్కహాల్స్/ ఫినాల్స్, ఈథర్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్.

 

 ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ)

 ఇంటర్మీడియెట్ సెకండియర్:

 కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి.

 ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్.

 కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని దశలవారీగా రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.

 

 ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్:

 ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీలో ప్రధానంగా దీర్ఘ సమాధాన ప్రశ్నలు కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పాఠాల నుంచి వస్తాయి. కాబట్టి వీటిని బాగా చదవాలి.

 ఎక్కువ సంఖ్యలో అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉన్న సబ్జెక్ట్ కెమిస్ట్రీ. వీటిల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి తెలుగు అకాడెమీ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకాన్ని ప్రతి రోజూ చదువుతూ, ముఖ్యమైన పాయింట్లను అండర్‌లైన్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ప్రశ్న వచ్చినా రాయగలమనే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.

 హైడ్రోజన్ స్పెక్ట్రా, బోర్ ఫాస్టులేట్స్, బోర్న్ హేబర్ సైకిల్, పీరియాడిక్ ప్రాపర్టీస్, ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కీన్‌‌స, ఎసిటలీన్ అతి ముఖ్యమైన ప్రశ్నలు. ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్న మరొక విభాగం ఆర్గానిక్ కెమిస్ట్రీ. కాబట్టి ప్రతి రోజూ దీన్ని ఔపోసన పట్టాలి. అదేవిధంగా హైడ్రో కార్బన్ నేమ్‌డ్ రియాక్షన్స్ వంటి చాప్టర్లను పరీక్షకు ముందు అనేకసార్లు చదవాలి.

 ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ యాసిడ్స్ అండ్ బేసెస్, కెమికల్ కైనటిక్స్, ఈక్విలిబ్రియం, కెమికల్ ఎనర్జిటిక్స్ మొదలైన టాపిక్స్ ముఖ్యమైనవి. వీటి నుంచి ఎంసెట్‌లో కూడా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ఈ చాప్టర్లపై ఎక్కువ దృష్టి సారించి సంబంధిత ఫార్ములాలు, ముఖ్యమైన పాయింట్లను ఒక చోట రాసుకుని ప్రతి రోజూ చదవాలి.

 జనరల్ కెమిస్ట్రీలో స్టాచియోమెట్రీ, అటామిక్ స్ట్రక్చర్‌ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిల్లో ఉండే సమస్యలను సాధన చేయడంతోపాటు సినాప్సిస్‌ను రూపొందించుకుని చదవడం చేయాలి.

 పబ్లిక్ పరీక్షల కోసం ప్రతి రోజూ కనీసం గంటసేపైనా కెమిస్ట్రీని చదవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement