సాక్షి మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన | good response for sakshi mock eamcet | Sakshi
Sakshi News home page

సాక్షి మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన

Published Tue, Apr 19 2016 3:22 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

సాక్షి మీడియా గ్రూప్, అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సాక్షి మాక్ ఎంసెట్-2016’కు విశేష స్పందన లభించింది.

తెలంగాణ, ఏపీలో నిర్వహించిన పరీక్షకు వేలాది మంది హాజరు
సాక్షి, హైదరాబాద్:
సాక్షి మీడియా గ్రూప్, అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సాక్షి మాక్ ఎంసెట్-2016’కు విశేష స్పందన లభించింది. తెలంగాణ వ్యాప్తంగా 24 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా, అందులో 14 హైదరాబాద్‌లో ఉన్నాయి. వేల మంది విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు ఒకేసారి పరీక్ష నిర్వహించారు.

ఈ నమూనా ఎంసెట్‌కు సెంచూరియన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఎంసెట్‌కు ముందు తమ టాలెంట్‌ని అంచనా వేసేందుకు అవకాశం కల్పించిన సాక్షి మీడియా గ్రూప్‌నకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వేల మంది హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ కీని అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement