MOCK Test
-
ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లకు ఇక నెక్ట్స్
సాక్షి, అమరావతి: దేశంలో వైద్య విద్యలో నాణ్యతను పెంచడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) సంస్కరణలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంబీబీఎస్ తుది సంవత్సరం విద్యార్థులకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్ట్స్) నిర్వహించనుంది. ఈ ఏడాది ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటున్న విద్యార్థులతోనే నెక్ట్స్ ప్రారంభించనున్నారు. దీనిని స్టెప్–1, స్టెప్–2గా రెండు పరీక్షలుగా నిర్వహిస్తారు. ఎంబీబీఎస్ పాస్‌కు, మెడికల్ ప్రాక్టీస్‌కు లైసెన్స్, రిజిస్ట్రేషన్‌కు ఈ పరీక్ష ఉతీ్తర్ణత తప్పనిసరి. దీంతో పాటు పీజీ మెడికల్ సీటులో ప్రవేశాలకూ ఈ అర్హతే ఆధారం కానుంది. విదేశాల్లో చదివిన వారికి కూడా ఈ పరీక్ష ద్వారానే గుర్తింపు ఇస్తారు. ఈ క్రమంలో విద్యార్థుల్లో నెక్ట్స్‌పై అవగాహన కల్పించడం కోసం వచ్చే నెల 28న స్టెప్–1 మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ మాక్ టెస్ట్‌కు దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటలు దరఖాస్తుకు చివరి గడువు. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో మాక్ టెస్టు నిర్వహిస్తారు. https://www.aiimsexams.ac.in/ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉంచారు. జనరల్/ఓబీసీ విద్యార్థులు రూ. 2 వేలు, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ. వెయ్యి దరఖాస్తు రుసుము చెల్లించాలి. వికలాంగులకు దరఖాస్తు రుసుము మినహాయించారు. మూడు స్టేజ్లలో మాక్ దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. మూడు రోజులు స్టెప్–1 స్టెప్–1 పరీక్షను మూడు రోజులు నిర్వహించాలని ఎన్ఎంసీ ప్రతిపాదించింది. పూర్తిగా మల్టిపుల్ చాయిస్(ఎంసీక్యూ) విధానంలో స్టెప్–1లో ఆరు పేపర్లు ఉంటాయి. రోజుకు రెండు సబ్జెక్టుల చొప్పున రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. స్టెప్–1 అనంతరం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రాక్టికల్స్‌లో ఉత్తీ ర్ణులవ్వాలి. వీరికి హౌస్ సర్జన్ చేయడానికి అర్హత ఉంటుంది. హౌస్ సర్జన్ అనంతరం స్టెప్–2 పరీక్ష ఉంటుంది. స్టెప్–1లోని ఆరు సబ్జెక్ట్లతో పాటు ఆర్థోపెడిక్స్, ఫిజికల్ మెడిసిన్ రీహబిలిటేషన్ (పీఎంఆర్)లో ఎవల్యూషన్ మెథడ్‌లో క్లినికల్ ప్రాక్టికల్స్ ఉంటాయి. -
ఉల్లాసంగా సాక్షి నీట్ మాక్ టెస్ట్ (పోటోలు)
-
అగ్రికల్చర్ టెస్టుకూ అదే ఉత్సాహం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం నిర్వహించనున్న ఏపీఈఏపీ సెట్‌కు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు రెండో రోజూ విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. సాక్షి మీడియా గ్రూప్, నారాయణ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు శివారు వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆన్లైన్ మాక్ ఎంసెట్ అగ్రికల్చర్ కంప్యూటర్ పరీక్షను నిర్వహించారు. వివిధ జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీఈఏపీ సెట్ ఆన్లైన్ పరీక్షా విధానంపై విద్యార్థులకు అవగాహన కలిగేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ప్రశ్నల సరళి కూడా మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల వారీగా సిలబస్‌కు దగ్గరగా ఏపీఈఏపీ సెట్ తరహాలో ఇచ్చారు. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను పూరించడంతోపాటు తమలోని సబ్జెక్టు సామర్థ్యాన్ని అంచనా వేసుకుని, ఏ స్థాయిలో ర్యాంకు సాధించగలమో తెలుసుకునేందుకు ఈ టెస్టు ఉపయోగపడిందని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యే విధానాలపై అవగాహన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏపీఈఏపీసెట్ ఎలా జరుగుతుందోనన్న అనుమానాలు పటాపంచలయ్యాయని సంతోషంగా చెప్పారు. సాక్షి మీడియా గ్రూపునకు కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్ నుంచి ప్రశ్నలు ఉన్నాయి మాక్ ఎంసెట్ అగ్రి కల్చర్ టెస్టులో బైపీసీ విభాగం నుంచి అధికంగా మేము చదివిన అంశాల నుంచి ప్రశ్నలు ఉన్నాయి. మాక్ టెస్టు కేవలం ప్రాక్టీసు కోసమే కాకుండా వాస్తవానికి దగ్గరగా ఉంది. ఏపీఈఏపీ సెట్‌కు హాజరయ్యేందుకు ఎంతో ప్రయోజనం చేకూరింది. ‘సాక్షి’ కృషి ఎంతో బాగుంది. – పి.కావ్యశ్రీ, విద్యార్థిని ఆన్లైన్ టెస్ట్‌కు హాజరుకావడం ఇదే తొలిసారి ఆన్లైన్లో పరీక్షకు హాజరు కావడం ఇదే తొలిసారి. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్లైన్ నిర్వహణ ఎంతో బాగుంది. ఏపీఈఏపీ సెట్లో మంచి ర్యాంకు సాధించడంలో మాక్టెస్టు ఒక ప్రాక్టీసులా ఉపయోగపడింది. ఈ సెట్‌తోపాటు నీట్ పరీక్షకు హాజరు కానున్నాను. – షేక్ షాయిస్తా, విద్యార్థిని ఆన్లైన్ టెస్టుపై ఆందోళన తొలగింది ఆన్లైన్ టెస్టుపై ఇప్పటి వరకు సరైన అవగాహన లేకపోవడంతో కొంచెం ఆందోళనగా ఉండేది. సాక్షి మాక్ ఎంసెట్ ఆన్లైన్ టెస్టుతో ఆ టెన్షన్ మాయమైంది. ఈ పరీక్షతో ఆత్మ విశ్వాసం పెరిగింది. ఇది మంచి ప్రాక్టీసు పరీక్షలా ఉపయోగడుతుంది. థాంక్యూ ‘సాక్షి’ – పి.సరయు, విద్యార్థిని ప్రశ్నల సరళి భేష్ ‘సాక్షి’ నిర్వహించిన మాక్ ఎంసెట్‌కు చేసిన ఏర్పాట్లు ప్రభుత్వం జరిపే ఏపీ ఈఏపీ సెట్‌ను తలపించాయి. కచ్చితమైన సమయాన్ని కేటాయించడంతోపాటు సమయపాలన పాటించారు. ప్రశ్నల సరళిని పరిశీలిస్తే కాలేజీలో లెక్చరర్లు చెప్పిన అంశాలు వీటిలో ఉన్నాయి. చాలా బాగుంది. – పి.గిరిజ, విద్యార్థిని -
జేఈఈ అడ్వాన్స్డ్: విజయానికి యాభై రోజులు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్‌లో చేరడం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కల! తమ స్వప్నం సాకారం దిశగా కసరత్తును ముమ్మరం చేయాల్సిన కీలక సమయం ఆసన్నమైంది! ఎందుకంటే.. జేఈఈ అడ్వాన్స్డ్–2021 తేదీ ఖరారైంది. అక్టోబర్ 3వ తేదీన పరీక్ష జరుగనుంది. అంటే.. పరీక్షకు ఇంకా యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయంలో తమ ప్రిపరేషన్‌కు పదును పెడుతూ.. ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి. అప్పుడే అడ్వాన్స్‌డ్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో సక్సెస్ సాధించేందుకు నిపుణుల ప్రిపరేషన్ గైడెన్స్... విద్యార్థులు ఇంటర్లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్ కోసం కృషి చేస్తుంటారు. వాస్తవానికి పరీక్షకు నెల రోజులు ముందు సాగించే ప్రిపరేషన్ అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. రెండేళ్ల నుంచీ చదువుతున్నాం కదా.. అనే ధీమా ఎంతమాత్రం సరికాదని సూచిస్తున్నారు. ప్రస్తుతం సబ్జెక్ట్ వారీ ప్రిపరేషన్ షెడ్యూల్ రూపకల్పన మొదలు.. పరీక్ష రోజు వ్యవహరించాల్సిన తీరు వరకూ.. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అత్యంత శ్రద్ధతో, ఏకాగ్రతతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ యాభై రోజుల్లో సాగించే ప్రిపరేషన్ ఐఐటీలకు దారి చూపుతుందని గుర్తించాలి. రివిజన్‌కు ప్రాధాన్యం ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థులు వీలైనంత ఎక్కువ సమయం పునశ్చరణకు కేటాయించాలి. 2019తో పోల్చుకుంటే గత ఏడాది, ఈ ఏడాది అడ్వాన్స్డ్ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే.. అడ్వాన్స్డ్ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయమే లభించింది. కాబట్టి ఇప్పటికే సీరియస్ అభ్యర్థులంతా సిలబస్ అంశాల ప్రిపరేషన్ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్‌కు అధిక సమయం కేటాయించడం మేలు. ప్రతి సబ్జెక్ట్–ప్రతి రోజూ ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్ పరంగా.. విద్యార్థులు ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేసేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజూ తమ ప్రిపరేషన్ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని.. పరీక్షలో అడిగే మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)కు కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం నాలుగు గంటల సమయం కేటాయించుకోవాలి. ► ఆయా సబ్జెక్ట్‌కు కేటాయించిన నాలుగు గంటల్లో.. మూడు లేదా మూడున్నర గంటలు రివిజన్, ప్రాక్టీస్ చేయాలి. మిగతా సమయాన్ని ఆ రోజు అప్పటివరకు చదివిన సదరు సబ్జెక్ట్ అంశాల స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తద్వారా సదరు టాపిక్‌లో తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కు పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉందని భావిస్తే.. వాటిలోని ముఖ్యాంశాల(కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు)పై దృష్టి పెట్టాలి. వీలైతే పూర్తి అభ్యసనం.. లేదంటే.. ముఖ్య ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు, సినాప్సిస్కు సమయం కేటాయించాలి. కచ్చితత్వం ఆయా సిలబస్ టాపిక్స్‌పై విద్యార్థులు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. సదరు అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. పూర్తి కచ్చితత్వంతో సమాధానాలు సాధించేలా పట్టు బిగించాలి. అందుకోసం సంబంధిత టాపిక్ నుంచి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయాలి. పలు ప్రశ్నలకు పొరపాటు సమాధానాలు ఇచ్చామని భావిస్తే.. సదరు టాపిక్ కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలి. పాత ప్రశ్న పత్రాలు ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను ఎక్కువగా సాధన చేయాలి. ఫలితంగా సబ్జెక్ట్ నైపుణ్యాలు మెరుగవుతాయి. పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రతి ఏటా ప్రశ్నల శైలిలో మార్పు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. 25 నుంచి 30 వరకూ.. ప్రీవియస్, మోడల్ కొశ్చన్ పేపర్స్‌ను ప్రాక్టీస్ చేస్తే.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు విజయానికి చేరువయ్యేందుకు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావడం. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షకు ముందు పది రోజుల సమయాన్ని వీలైనంత మేరకు మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు కేటాయించాలి. వీటి ఫలితాల ఆధారంగా తమ సామర్థ్యాల విషయంలో అవగాహన పొందాలి. ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు అడ్వాన్స్డ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, సిద్ధాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. అడ్వాన్స్‌డ్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా కాకుండా.. కాన్సెప్ట్ ఆధారితంగా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కాన్సెప్ట్‌లను అవపోసన పడితే.. పరీక్షలో ప్రశ్నలు పరోక్షంగా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రశ్నల సరళి, మార్కింగ్ పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, మార్కింగ్ విధానాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ పూర్తి చేసుకుని.. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. సబ్జెక్ట్ వారీగా.. ఇలా ► మ్యాథమెటిక్స్: కోఆర్డినేట్ జామెట్రీ, త్రికోణమితి, డిఫరెన్షియల్ కాలిక్యులస్, ఇంటిగ్రల్ కాలిక్యులస్, మాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, కాంప్లెక్స్ నెంబర్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► కెమిస్ట్రీ: కెమికల్ బాండింగ్, ఆల్కైల్ హలైడ్; ఆల్కహాల్ అండ్ ఈథర్, కార్బొనైల్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్ అండ్ న్యూక్లియర్ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్ అండ్ థర్మో కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఫిజిక్స్: ఎలక్ట్రో డైనమిక్స్; మెకానిక్స్; హీట్ అండ్ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రిసిటీపై ఎక్కువ దృష్టిపెట్టాలి. మెయిన్‌కు హాజరవుతుంటే జేఈఈ–మెయిన్ మూడు సెషన్లలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు జేఈఈ–మెయిన్ 4వ సెషన్‌కు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు ఈ నెల(ఆగస్టు) 26, 27, 31 తేదీల్లో, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనున్నాయి. ► వీటికి హాజరయ్యే విద్యార్థులకు మెయిన్ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. కాబట్టి ప్రస్తుత సమయంలో వీలైనంత మేరకు అడ్వాన్స్‌డ్‌ను దృష్టిలో పెట్టుకొని మెయిన్ పరీక్షకు ప్రిపరేషన్ సాగించాలి. మెయిన్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇక పూర్తి సమయాన్ని అడ్వాన్స్డ్ రివిజన్‌కు కేటాయించాలి. వారం రోజుల ముందు అడ్వాన్స్డ్ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రాక్టీస్ టెస్టులు, మోడల్టెస్టులు, గ్రాండ్ టెస్ట్‌ల సాధనకు కేటాయించాలి. ఈ సమయంలో కొత్త అంశాలు చదువుదాం.. వాటికి వెయిటేజీ ఎక్కువ ఉంది అనే భావన ఏ మాత్రం సరికాదు. పరీక్ష రోజు కీలకం ► ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. ఎన్ని సంవత్సరాలు కృషి చేసినా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ విజయంలో అత్యంత కీలకంగా మారుతుంది. ► పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం ఆసాంతం చదివేందుకు కనీసం 10 నుంచి పదిహేను నిమిషాలు కేటాయించాలి. ► దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి. ► పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలపాటు గుర్తించిన సమాధానాలు రివ్యూ చేసుకోవాలి. ► సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే.. మార్క్ ఫర్ రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి.. చివరలో సమీక్షించుకోవాలి. అడ్వాన్స్డ్.. ముఖ్యాంశాలు ► ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్ ఓరియెంటెడ్ కొశ్చన్స్ సాధన చేయాలి. ► ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. ► వీలైనంత మేరకు మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ► అన్ని సబ్జెక్ట్‌లలో అన్ని టాపిక్స్‌లో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ► పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా మోడల్ టెస్టులు, మాక్ టెస్ట్‌లకు సమయం కేటాయించాలి. ► పరీక్ష రోజు.. కేంద్రంలోకి అనుమతించే సమయానికంటే గంట ముందుగా చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ► పరీక్షకు ముందు ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి. ► పరీక్ష హాల్లో.. పరీక్ష సమయంలో కంప్యూటర్ స్క్రీన్‌పై అందుబాటులో ఉండే కౌంట్‌డౌన్ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి. ► మొదటి పేపర్ పూర్తయిన తర్వాత దాని గురించి మర్చిపోయి రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి. విజయ సాధనాలు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే.. ప్రిపరేషన్ సమయంలోనే ఆయా టాపిక్స్‌ను అప్లికేషన్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రిపరేషన్ సమయంలోనే సింగిల్ కరెక్ట్ కొశ్చన్స్; మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్; పేరాగ్రాఫ్ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా.. పరీక్షలో ఏమైనా మార్పులు జరిగినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. – ఆర్.కేదారేశ్వర్, జేఈఈ పోటీ పరీక్షల నిపుణులు -
ఏపీలో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్
సాక్షి, అమరావతి: ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్లైన్లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్ టెస్ట్ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. (సర్కారు స్కూళ్లకు ‘కార్పొరేట్’ లుక్కు..!) మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. -
ఎస్సై, గ్రూప్-2 నమూనా పరీక్ష 27న
సిద్దిపేట రూరల్: పీఆర్ రెడ్డి పబ్లిషర్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక పవిత్ర జూనియర్ కళాశాలలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఎస్ఐ, గ్రూప్2 నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెంకటేష్‌చారి, నర్సింలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అసక్తి గల అభ్యర్ధులు శనివారం సాయంత్రంలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు సెల్ నం. 9550927467, 9676202069లో సంప్రదించాలని సూచించారు. కానిస్టేబుల్ నమూనా పరీక్ష పట్టణంలోని విజేత కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉదయం 10.30లకు కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె. దాక్షాయిణి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాల కోసం సెల్ నం. 9989862806, 7661996167లో సంప్రదించాలన్నారు. -
సాక్షి మాక్ ఎంసెట్‌కు విశేష స్పందన
తెలంగాణ, ఏపీలో నిర్వహించిన పరీక్షకు వేలాది మంది హాజరు సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్, అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘సాక్షి మాక్ ఎంసెట్-2016’కు విశేష స్పందన లభించింది. తెలంగాణ వ్యాప్తంగా 24 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా, అందులో 14 హైదరాబాద్‌లో ఉన్నాయి. వేల మంది విద్యార్థులు తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు వరకు ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాలకు ఒకేసారి పరీక్ష నిర్వహించారు. ఈ నమూనా ఎంసెట్‌కు సెంచూరియన్ యూనివర్సిటీ అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఎంసెట్‌కు ముందు తమ టాలెంట్‌ని అంచనా వేసేందుకు అవకాశం కల్పించిన సాక్షి మీడియా గ్రూప్‌నకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వేల మంది హాజరై తమ ప్రతిభను పరీక్షించుకున్నారు. సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ వెబ్సైట్లో ప్రిలిమినరీ కీని అందుబాటులో ఉంచారు. -
కొత్త సిలబస్‌తో 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్
ఎప్పటికప్పుడు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తోన్న సాక్షిఎడ్యుకేషన్.కామ్ మరో అడుగు ముందుకేసి ఎంసెట్ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో కొత్త సిలబస్‌కు అనుగుణంగా నిపుణులతో రూపొందించిన పూర్తి స్థాయి స్డడీ మెటీరియల్ తో పాటు ప్రిపరేషన్ గెడైన్స్, క్విక్ రివ్యూస్, బిట్ బ్యాంక్, మాక్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్ వంటి సమగ్ర సమాచారం లభిస్తోంది. ఇప్పుడే 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్ లో లాగాన్ అయి ఎంసెట్‌లో మంచి ఫలితాలు పొందండి.