ఏపీలో ఉచిత ఎంసెట్‌ మాక్‌ టెస్ట్‌ | Adimulapu Suresh Release EAMCET Mock Test Poster | Sakshi
Sakshi News home page

ఏపీలో ఉచిత ఎంసెట్ మాక్ పరీక్ష

Published Mon, Jul 6 2020 6:11 PM | Last Updated on Mon, Jul 6 2020 11:25 PM

Adimulapu Suresh Release EAMCET Mock Test Poster - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, అమరావతి: ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ టెస్ట్‌ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్‌ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. (సర్కారు స్కూళ్లకు ‘కార్పొరేట్‌’ లుక్కు..!)

మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement