తెలంగాణ, ఏపీల్లోనూ నిర్వహణ.. 25వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీల్లోని లక్షలాది మంది ఇంజనీరింగ్, మెడికల్ ఔత్సాహిక విద్యార్థులకు ప్రయోజనం కల్పించేలా ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మాక్ ఎంసెట్ జరుగనుంది. ఇరు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ఈ మాక్ ఎంసెట్ జరుగుతుంది. ఈ పరీక్షకు ప్రశ్నపత్రాలను విశేష అనుభవం కలిగిన నిపుణుల బృందం రూపొందిస్తున్నందున విద్యార్థులు తమ సామర్థ్యాన్ని అంచనావేసుకుని ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలవుతుంది. దాంతోపాటు రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా అత్యధిక ప్రతిభ చూపిన మొదటి 10 ర్యాంకర్లకు నగదు బహుమతులు ఉంటాయి. ఈ మాక్ ఎంసెట్‌కు దరఖాస్తులను ఈ నెల 25వ తేదీ నుంచి అన్ని ‘సాక్షి’ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. దరఖాస్తు ఫారం ఖరీదు రూ. 75తో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను వెంటతీసుకుని వస్తే వెంటనే హాల్‌టికెట్ పొందవచ్చు. ఏప్రిల్ 2వ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ జూనియర్ కాలేజీల నిర్వాహకులు ఏకమొత్తంగా ఈ మాక్ ఎంసెట్‌కు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే... 9666421880 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు. దరఖాస్తు ఫారాలు లభించే కేంద్రాలు, పరీక్షా కేంద్రాల వివరాలతో త్వరలో ‘సాక్షి’ పత్రికలో ప్రకటన ఇవ్వడం జరుగుతుంది.
ఏప్రిల్ 12న సాక్షి మాక్ ఎంసెట్
Published Sun, Feb 8 2015 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement