ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్
హైదరాబాద్: తన మాట వినలేదని ముగ్గురు మెడిసిన్ విద్యార్థులకు ఓ ప్రొఫెసర్ ప్రాక్టికల్స్‌లో కోత విధించినట్లు బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ నిర్వాకం వల్ల ఓ విద్యార్ధిని సూపర్‌స్పెషాలిటీ సీటును కోల్పోయింది. దీంతో బాధితులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ కళాశాలలోని ముగ్గురు విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురైంది. వారికి థియరీ మార్కుల్లో మంచి పర్సెంటేజీ సాధిం చినా... ప్రాక్టికల్స్‌కొచ్చేసరికి అనుత్తీర్ణులయ్యారు.
300 మార్కులకు కేవలం 127 మార్కులే వేశారు. ఇందులో ఓ విద్యార్థినికి జాతీయస్థాయి సూపర్ స్పెషాలిటీ పరీక్షలో సీఎంసీ వెల్లూర్‌లో డీఎం న్యూరాలజీ విభాగంలో ఏపీ నుంచి ఈమె ఒక్కరికే సీటొచ్చింది. కానీ సీటును కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై హెల్త్‌వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డా.రవిరాజుకు ఫిర్యాదు చేశారు.
మాట వినలేదని మార్కుల్లో కోత
Published Tue, Jul 14 2015 1:29 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
Advertisement
Advertisement