మెదడులాంటి చిప్.. కంప్యూటర్ కన్నా పవర్‌ఫుల్! | Brain inspired circuit board 9000 times faster than an average computer | Sakshi
Sakshi News home page

మెదడులాంటి చిప్.. కంప్యూటర్ కన్నా పవర్‌ఫుల్!

Published Mon, May 5 2014 2:32 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

మెదడులాంటి చిప్.. కంప్యూటర్ కన్నా పవర్‌ఫుల్! - Sakshi

మెదడులాంటి చిప్.. కంప్యూటర్ కన్నా పవర్‌ఫుల్!

మనిషి మెదడు గొప్పా? కంప్యూటర్ గొప్పా? అంటే ఇప్పటికి మాత్రం మెదడే పవర్‌ఫుల్. అందుకే మెదడును మోడల్‌గా తీసుకుని అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ‘న్యూరోగ్రిడ్’ అనే ఈ సర్క్యూట్ బోర్డును తయారు చేశారు. ఐపాడ్ సైజులో ఉన్న ఈ బోర్డులో 16 న్యూరోకోర్ చిప్‌లు ఉన్నాయి. మెదడులో 10 లక్షల నాడీకణాలు, వందల కోట్ల సర్క్యూట్ల అంత వేగంగా ఈ చిప్‌లు పనిచేస్తాయట. అందువల్ల.. ఈ బోర్డు కంప్యూటర్ కన్నా 40 వేల రెట్లు తక్కువ విద్యుత్‌తోనే, ఏకంగా 9 వేల రెట్లు వేగంగా పనిచేస్తుందట. ప్రస్తుతానికి దీని ధర 40 వేల డాలర్లు. కానీ పెద్ద ఎత్తున తయారు చేస్తే 400 డాలర్లకే అందించవచ్చని చెబుతున్నారు.

 

రోబోటిక్స్, కంప్యూటింగ్ రంగాల్లో కీలక మార్పులకు ఇది నాంది పలకనుందట. పక్షవాత రోగుల మెదడులో ఈ చిప్‌లను అమరిస్తే కృత్రిమ అవయవాలకు తగిన ఆదేశాలు ఇస్తూ.. అవి సహజ అవయవాలంత చురుకుగా పనిచేసేలా చేస్తాయట.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement