మెదడును దాచేసుకోండి! | Hide the brain! | Sakshi
Sakshi News home page

మెదడును దాచేసుకోండి!

Published Sun, Mar 25 2018 2:35 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

Hide the brain! - Sakshi

మెమరీ కార్డు కానీ.. పెన్‌డ్రైవ్‌ కానీ కొన్నప్పుడు అది మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆ తర్వాత వాటిని సినిమాలు కానీ.. పాటలతో కానీ నింపేస్తే.. అందులో మన సమాచారం భద్రంగా ఉంటుంది. దీన్ని జీవితాంతం ఎలాగోలా దాచేసుకోవచ్చు. మరి చిన్నప్పటి నుంచి మన మెదడులో ఎంత సమాచారం చేరి ఉంటుంది. మరి ఈ సమాచారం జీవితాంతం దాచుకోవచ్చా.. అదెలా సాధ్యం మనం చనిపోయినప్పుడే ఆ మెదడు కూడా చనిపోతుంది. మరి ఆ సమాచారం.. ఇంకెక్కడి సమాచారం మనతోపాటే గాల్లో కలిసిపోతుంది.

అయితే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ కంపెనీ మాత్రం మీ మెదడును చాలా జాగ్రత్తగా దాచేస్తామని చెబుతోంది. భవిష్యత్తులో ఏదైనా కొత్త సాంకేతికత వచ్చినప్పుడు ఆ మెదడులోని సమాచారాన్ని కంప్యూటర్‌లోకి ఎక్కిస్తామంటోంది. మన మెదడులోని నాడులను, నెట్‌వర్క్‌ను అధ్యయనం చేసి అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తామని నెట్‌కాం అనే ఈ కంపెనీ స్పష్టం చేస్తోంది. అయితే ఇందులో ఓ తిరకాసు పెట్టింది ఆ కంపెనీ. ఏంటంటే మన మెదడును వారు తీసుకుని భద్రపరచాలంటే మనం చనిపోకముందే తీసుకుంటుందట. అమ్మో అదేంటి చనిపోయాక తీసుకోవచ్చు కదా అంటే సమాచారం‘బతికి’ఉండాలట. బతికి ఉండగానే మెదడులోకి ఎంబామింగ్‌ రసాయనాలు పంపి తాజాగా ఉంచుతారట. ఇప్పటికే ఓ పంది మెదడును ఈ ప్రక్రియతో భద్రపరిచారట. మరి ఎవరు మొదట తమ మెదడును భద్రపరుచుకుంటారో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement