అమెరికాలో భారీ భూకంపం | Strong Earthquake Strikes California In America, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారీ భూకంపం

Published Fri, Dec 6 2024 7:07 AM | Last Updated on Fri, Dec 6 2024 9:51 AM

Strong Earthquake Strikes California In America

కాలిఫోర్నియా:అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం(డిసెంబర్‌5) ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై ఏడుగా నమోదైంది. ఫెర్నడెల్‌ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోగ్రఫికల్‌ సర్వే విభాగం వెల్లడించింది.

తీర ప్రాంతంలో భారీ భూకంపం రావడంతో అమెరికా సునామీ కేంద్రం ముందస్తు చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్‌ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.

ఉత్తర దిశలో వచ్చన భూ ప్రకంపనలు దక్షిణ ప్రాంతంలోని శాన్‌ఫ్రాన్సిస్కో దాకా వచ్చాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంత సేపు అటుఇటు ఊగిపోయారు. భూకంపం ముగిసిన తర్వాత కూడా అనంతర ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ప్రాణ,ఆస్తి నష్టాలు ఏమైనా సంభవించాయా అనేది తెలియాల్సి ఉంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement