వాషింగ్టన్: అమెరికాలో రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. కాలిఫోర్నియా, నెవాడల్లో వేలాది ఎకరాలను కార్చిచ్చు మంటలు దహించివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల గవర్నర్లు అత్యవరస్థితి ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కౌంటీలో ఒక్కరోజులోనే 20,553 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను కార్చిచ్చుకాల్చి బూడిద చేసింది.
మంటల భయంతో చాలా మంది కార్చిచ్చు ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు. కార్చిచ్చు ప్రభావంతో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదువుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 8) రాత్రికి రాత్రే కార్చిచ్చు భారీగా విస్తరించింది. కార్చిచ్చును అదుపు చేసేందుకు వందలకొద్ది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది.
కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడంతో గవర్నర్ గవిన్ న్యూసమ్ అత్యవసర స్థితి ప్రకటించారు. కార్చిచ్చును అరికట్టేందుకు అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది, నిధులు, పరికరాలను అందజేశారు. గ్రీన్ వ్యాలీ, సీడర్ గ్లెన్, లేక్‌యారో హెడ్, క్రిస్ట్‌లైన్, వ్యాలీ ఆఫ్ ఎన్‌క్యాచ్‌మెంట్‌లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
బేస్‌లైన్, అల్పిన్ స్ట్రీట్ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగు పడడం వల్ల కార్చిచ్చు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత గాలి తోడవడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం మూడు వేల ఎకరాలు, శనివారం ఏడు వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది. మరోవైపు నెవాడ రాష్ట్రంలో కూడా కార్చిచ్చుల కారణంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్ జోయి లాంబర్డో ప్రకటించారు.
ఇదీ చదవండి.. మూడేళ్ల చిన్నారిని రక్షించడంలోడ్రోన్ సాయం
Comments
Please login to add a commentAdd a comment