Nevada
-
ట్రంప్‌దే నెవడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జయకేతనం ఎగరవేసిన ట్రంప్ తన మెజారిటీని మరింత పెంచుకుంటున్నారు. ఏడు కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ఒకటైన నెవడాను కూడా శనివారం తన ఖాతాలో వేసుకున్నారు. అక్కడి 6 ఎలక్టోరల్ ఓట్లతో కలిపి ఆయన మొత్తం ఓట్లు 301కి పెరిగాయి. నెవడా 20 ఏళ్ల తర్వాత డెమొక్రాట్ల చేజారడం విశేషం. 11 ఓట్లున్న అరిజోనాలో ఫలితం వెలువడాల్సి ఉంది. అక్కడా 83 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా ట్రంప్ 5 శాతానికి పైగా ఆధిక్యంలో ఉన్నారు. హారిస్‌కు 226 ఓట్లుకు రావడం తెలిసిందే. రిపబ్లికన్లు నాలుగేళ్ల తర్వాత సెనేట్‌లో కూడా మెజారిటీ సాధించడం తెలిసిందే. వారికి 52 సీట్లు రాగా డెమొక్రాట్లు 44కే పరిమితమయ్యారు. 2 సీట్లు స్వతంత్రులకు దక్కగా మరో రెండింట్లో ఫలితాలు వెలువడాల్సి ఉంది. ప్రతినిధుల సభ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ల ఆధిపత్యమే సాగుతోంది. 435 స్థానాలకు గాను ఇప్పటిదాకా రిపబ్లికన్లు 212 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 సీట్లు వస్తే వారు మెజారిటీ మార్కు చేరుకుంటారు. డెమొక్రాట్లకు 200 స్థానాలు దక్కాయి. -
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
USA: రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు బీభత్సం
వాషింగ్టన్: అమెరికాలో రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. కాలిఫోర్నియా, నెవాడల్లో వేలాది ఎకరాలను కార్చిచ్చు మంటలు దహించివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల గవర్నర్లు అత్యవరస్థితి ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినో కౌంటీలో ఒక్కరోజులోనే 20,553 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను కార్చిచ్చుకాల్చి బూడిద చేసింది.మంటల భయంతో చాలా మంది కార్చిచ్చు ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు. కార్చిచ్చు ప్రభావంతో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదువుతోంది. ఆదివారం(సెప్టెంబర్ 8) రాత్రికి రాత్రే కార్చిచ్చు భారీగా విస్తరించింది. కార్చిచ్చును అదుపు చేసేందుకు వందలకొద్ది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడంతో గవర్నర్ గవిన్ న్యూసమ్ అత్యవసర స్థితి ప్రకటించారు. కార్చిచ్చును అరికట్టేందుకు అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది, నిధులు, పరికరాలను అందజేశారు. గ్రీన్ వ్యాలీ, సీడర్ గ్లెన్, లేక్యారో హెడ్, క్రిస్ట్లైన్, వ్యాలీ ఆఫ్ ఎన్క్యాచ్మెంట్లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.బేస్‌లైన్, అల్పిన్ స్ట్రీట్ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగు పడడం వల్ల కార్చిచ్చు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత గాలి తోడవడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం మూడు వేల ఎకరాలు, శనివారం ఏడు వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది. మరోవైపు నెవాడ రాష్ట్రంలో కూడా కార్చిచ్చుల కారణంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్ జోయి లాంబర్డో ప్రకటించారు. ఇదీ చదవండి.. మూడేళ్ల చిన్నారిని రక్షించడంలోడ్రోన్ సాయం -
మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?
తూర్పు సీయరా నెవడా, కాలిఫోర్నియాలో ‘బాడీ’ అనే ఘోస్ట్ టౌన్ ని ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది సందర్శిస్తుంటారు. 7,395 అడుగుల (2,254 మీటర్లు) ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక నగరం.. ఎన్నో మిస్టీరియస్ కథనాలతో నేటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడి అందాలను కళ్లతో ఆస్వాదించాలే తప్ప కంటికి ఇంపైన వస్తువును ‘బాగుంది కదా’ అని తీసుకుని బ్యాగ్‌లో వేసుకున్నామో బొందితో కైలాసం ఖాయం. ఆ క్షణం నుంచే.. అక్కడున్న అతీంద్రయశక్తుల వేట మొదలవుతుందట.1859లో.. గి బోడే అనే వ్యక్తి.. తన స్నేహితులతో కలసి.. సీయరా పర్వతాలకు తూర్పువైపు వెళ్లినప్పుడు.. మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. అక్కడ బంగారు గని ఉందని గుర్తించిన ఆ స్నేహితులంతా.. ఎవరికీ తెలియకుండా ఆ స్థలాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే తిరిగి తమతమ స్వస్థలాలకు బయలుదేరారు.అయితే బోడే తన స్వస్థలమైన మోనోవిల్కు వెళ్తుంటే.. దారిలో మంచు తుఫానులో చిక్కి మరణించాడు. దాంతో అతడి స్నేహితులంతా ఆ బంగారు గనులున్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. అయితే బోర్డ్ మీద పేరు రాసే వ్యక్తి.. బోడేకి బదులుగా బాడీ అని రాయడంతో అదే పేరు స్థిరపడిపోయింది. కాలక్రమేణా ఆ గని గురించి తెలుసుకున్నవారి సంఖ్య పెరగడంతో.. 1876 నాటికి.. అక్కడ భారీ స్థాయిలో బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. మైనింగ్ కంపెనీలు, హైడ్రో–ఎలక్ట్రికల్ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందసాగింది.తదనుగుణంగా అక్కడ స్థిరపడేవారి సంఖ్య కూడా పెరగసాగింది. సుమారు 10 వేల మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతరప్రాంతాల నుంచీ రాకపోకలు పెరగడంతో రైల్వే మార్గం కూడా ఏర్పడింది. 1880 నాటికి, బాడీలో ఎన్నో వ్యాపారాలు వెలశాయి. అక్కడి ‘చైనా టౌన్’ అనే ఓ పెద్ద భవనంలో మొత్తం చైనీయులే ఉండేవారట. తమ దేశానికి చెందిన వస్తువుల్ని అక్కడి స్థానికులకు అమ్మేవారట. అయితే బాడీ టౌన్ మొత్తంలో క్రైమ్‌రేట్ విపరీతంగా ఉండేదట. హత్యలు, జూదం, వ్యభిచారం, దోపిడీలు, తుపాకీ కాల్పులు ఇలా వీధికో అఘాయిత్యం నమోదయ్యేదట.1882 ప్రాంతంలో బతుకు తెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లాల్సి వచ్చిందట, దాంతో ఆ ఇంటి చిన్నారి ‘‘వీడ్కోలు దేవా.. మేము బాడీకి వెళ్తున్నాం’’ అని ఏడుస్తూ గట్టిగా ప్రార్థించిందట. దాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు బాడీలో ఎలాంటి భయానక వాతావరణం ఉండేదో? అక్కడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామన్న నమ్మకం ఎవరికీ ఉండేదికాదట.అన్యాయాలు, అహింసలతో కొందరు చనిపోతే.. తీవ్రమైన మంచు కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరేమో మైనింగ్ ప్రమాదాల్లో అసువులుబాశారు. ఇదిలా ఉంటే.. 1892లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టమూ వాటిల్లింది. గనులు ఖాళీ కావడంతో.. 1917 నాటికి రైల్వే మార్గాన్ని కూడా నిలిపివేశారు. 1932లో మరొక భారీ పెద్ద అగ్నిప్రమాదం జరిగేసరికి.. పట్టణమంతా ఖాళీ అయ్యింది. అలా ప్రకృతితో మమేకమైన బాడీ.. ఇప్పుడు మాత్రం ఎన్నో వ్యథలను వినిపిస్తోంది.బాడీ పట్టణాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవంటారు పర్యాటకులు. కొండ కోనల్లో, విశాలమైన గడ్డి మైదానాల్లో .. చెల్లాచెదురుగా పడున్న వాహనాలు.. నాటి కట్టడాలు, గుర్రపు బండ్లు వంటివన్నీ చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌లా ఆకట్టుకుంటాయి. ఇక్కడ మొత్తం 168 భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. సమీపంలోని శ్మశానవాటికలో 150 మంది ఖననాలు కనిపిస్తాయి. అయితే.. బాడీ టౌన్ లో పగటి పూట కూడా విచిత్రమైన అలికిడులు భయపెడతాయట.ఆ పురాతన ఇళ్లల్లో నిద్ర చేయడానికి సాహసించిన ఎందరో పర్యాటకులు అక్కడి అతీంద్రియశక్తులేవో తమకు ఊపిరి ఆడకుండా చేశాయని, కనిపించని రూపాలేవో వణికించాయని తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. మరోవైపు ‘ఒ కెయిన్ హౌస్’ అనే ఇంట్లో ఒక చైనా మహిళ.. దయ్యంగా తిరుగుతుందని స్థానికుల నమ్మకం. అలాగే శ్మశానవాటికలో ‘ఎవెలిన్’ అనే మూడేళ్ల పాప ముసిముసి నవ్వులు వినిపిస్తాయనీ చెబుతుంటారు. ఎవెలిన్ మరణ వివరాలు 1897 రికార్డ్స్‌లో ఉన్నాయి.ఇక్కడికి వచ్చిన ఎందరో పర్యాటకులు ఇక్కడ దొరికిన సీసాలను, చిన్న చిన్న బొమ్మలను తమ వెంట తీసుకెళ్లి ప్రమాదాలను కొనితెచ్చున్నారట. తీసుకెళ్లిన ప్రతి వస్తువు ఒక లేఖతో పాటు బాడీకి తిరిగి రావడమే ట్విస్ట్. ‘‘ఈ వస్తువును దొంగిలించినందుకు లేదా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి’ అని రాసిన ఎన్నో అజ్ఞాత లేఖల్లో.. బాడీలోని వస్తువుల్ని వెంట తీసుకుని వెళ్లడం వల్ల వాళ్లు ఎదుర్కొన్న సమస్యలను రాశారా బాధితులు.కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడి.. తిరిగి ఆ వస్తువుల్ని బాడీకి పంపించేశారట. అందుకే తెలిసినవారు ఎవ్వరూ ఇక్కడి వస్తువుల్ని బ్యాగ్‌లో వేసుకోరు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న అతీంద్రియశక్తులు ఏంటీ? ఇక్కడి వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే ఎందుకు వారిని వెంటాడుతున్నాయి? అనేది నేటికీ మిస్టరీయే! – సంహిత నిమ్మనఇవి చదవండి: Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో.. -
అమెరికాలో హెలికాప్టర్ కూలి... ఆరుగురి దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో నైజీరియాకు ప్రముఖ ఏక్సెస్ బ్యాంకు సీఈవో, ఆయన భార్య, కొడుకు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పామ్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం రాత్రి 8.45 గంటలకు బయలుదేరిన యూరోకాప్టర్ ఈసీ 120 రకం హెలికాప్టర్ నెవడాలోని బౌల్డర్ సిటీకి వెళుతుండగా మొజావ్ ఎడారిలోని ఇంటర్‌స్టేట్ 15 రహదారి సమీపంలో 10.30 గంటల సమయంలో కూలిపోయింది. ఘటనలో అందులో ఉన్న యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ వింగ్వే(57), ఆయన భార్య, కొడుకుతోపాటు మొత్తం ఆరుగురూ మృత్యువాతపడ్డారు. నైజీరియాలోని రెండు అతిపెద్ద బ్యాంకుల్లో ఏక్సెస్ బ్యాంకు ఒకటి. -
US presidential election 2024: మరో ప్రైమరీలో ట్రంప్ గెలుపు
లాస్‌వెగాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మరో రాష్ట్రంలో గెలుపు సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి ట్రంప్ అవకాశాలు మెరుగవుతున్నాయి. గురువారం నెవడా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడుతున్న మరో నేత నిక్కీ హేలీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. నెవడాలోని మొత్తం 26 మంది డెలిగేట్లు ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా బరిలో నిలవాలంటే మొత్తం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. ఇప్పటిదాకా ట్రంప్ 62 మంది, నిక్కీ హేలీ 17 మంది డెలిగేట్ల మద్దతు కూడగట్టారు. -
బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్‌కు హాజరై చిక్కుకుపోయిన 70వేల మంది
బర్నింగ్‌మ్యాన్ ఫెస్టివల్.. ఇది అమెరికాలోని ఎడారిలో నిర్వహించే అతిపెద్ద ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ నిర్వహించే క్రమంలో 70 వేల మంది ఎడారిలో చిక్కుకుపోయారు. ఎడారిలో అతి భారీ వర్షం కురవడంతో వేల సంఖ్యలో ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు.. వర్షం కారణంగా ఎడారి అంతా బురద మయంగా మారడంతో ఎవరూ కూడా అక్కడ నుంచి బయటపడలేని పరిస్థితులు తలెత్తాయి. నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారి వర్షం కారణంగా పూర్తిగా చిత్తడిగా మారిపోయి అంతా బురద మయం అయిపోయింది. దాంతో ఆ ఫెస్టివల్‌కు హాజరైన సుమారు 70వేలకు పైగా ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. కొన్ని మైళ్ల దూరం వరకూ ఎటువైపు చూసినా బురదే కనిపిస్తోంది. నడుస్తుంటే కాళ్లు బురదలో కూరుపోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ వాహనాలకు అనుమతి నిరాకరించడంతో సందర్శకులు అక్కడే ఆహారం, నీరు సమర్చుకుని పొడిగా ఉన్న ప్రదేశంలో తలదాచుకోవాలని అధికారులు తెలిపారు. గత నెల 27వ తేదీన బర్నింగ్ మ్యాన్ ఫెప్టివల్ మొదలు కాగా, ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హరికేన్ తాకింది. దాంతో భారీ వర్షం కురిసి ఆ ప్రాంతం బురద మయంగా మారిపోయింది. ఒక్కరాత్రిలోనే నెలలకు పైగా కురవాల్సిన వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా స్తంభించిపోయింది. కొంతమంది బురదలోనే అక్కడ నుంచి బయటపడేందకు యత్సిస్తున్నా పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. -
శ్రీమతి ఆలోచన.. దుస్తులే సందేశం
‘ప్రపంచ పటంలో నా దేశాన్ని నాదైన ప్రత్యేకతతో చూపాలి’ అని బాల్యం నుంచి కలగన్న అమ్మాయి నవదీప్ కౌర్. శ్రీమతి అయి, ఓ బిడ్డకు తల్లైన 32 ఏళ్ల నవదీప్ కౌర్ తన ప్రయత్నాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూనే తనదైన ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా చాటింది. సంకల్పం ఉంటే ఎవరైనా తమ కలలను సాధించవచ్చని నిరూపించింది. ఇటీవల అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ‘మిసెస్ వరల్డ్–2022’ పోటీలు జరిగాయి. ఈ పోటీలో వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ దుస్తుల ద్వారా వారి మాతృదేశ, సంప్రదాయ, ఆధ్యాత్మిక అంశాలను హైలైట్ అవాలనేది ప్రధానాంశం. బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ ఎంట్రీ విజేతల విభాగంలో నవదీప్కౌర్ విజేతగా నిలిచింది. భారతదేశం నుంచి ఒడిశాలోని రూర్కెలా ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్రీమతి నవదీప్ కౌర్ ధరించిన దుస్తులు చూసిన ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు తమలోని శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. పాము ముఖాన్ని పోలి ఉండే భారీ తలపాగా, పొడవాటి బంగారు బూట్లు, చేతి ఉపకరణాలతో సహా ఈ దుస్తుల డిజైన్‌లో అనేక పాము అంశాలు ఇమిడి ఉన్నాయి. నాగుపామును పోలిన ఆభరణాలు భుజాలపైన అలంకరించారు. కొత్తదనం, ఐశ్వర్యానికి సూచికగా ఆమె ధరించిన ఈ దుస్తులు మనిషిలోని మూలాధార చక్రం నుండి వెన్నెముక వరకు సూచించే కుండలినీ శక్తి కదలికలను సూచికగా ఈ డిజైన్‌ను తీసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత అవాంట్ – గార్డె ఫ్యాషన్ హౌజ్‌లోని కళాకారిణి అగీ జాస్మిన్ ఈ దుస్తులను డిజైన్ చేసింది. వీటిని ధరించిన నవదీప్ కౌర్ ఫొటోలు, వీడియోలు చూపరులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. దేశ ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచం ముందుకు దుస్తుల ద్వారా తీసుకువచ్చిన నవదీప్ కౌర్ అందరి అభినందనలు అందుకుంటోంది. -
ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట!
బంగారానికి పసిడి, సువర్ణం, సురభి, కాంచనం, హిరణ్యం.. వంటి అనేక పేర్లున్నాయి. ఏ పేరుతో పిలిచినా పుత్తడి లోహం మాత్రం చాలా విలువైనది. అంత విలువైన బంగారంతో తయారుచేసిన కనకాభరణాలంటే మోజు పడనివారంటూ ఉండరేమో! బంగారం ఆకర్షణీయంగా ఉండటమేకాకుండా విలువకూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇక మనదేశంలో ఐతే బంగారాన్నిఏకంగా ఆస్తిగా భావిస్తారు. ఇంత విలువైన బంగారం గనుల నుంచి లభ్యమౌతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఐతే ప్రపంచంలోనే అత్యధికం బంగారం ఏక్కడ లభ్యమౌతుంది? అక్కడ ఎంత బంగారం వెలికితీస్తున్నారో? దాని విలువ ఎంతుంటుందో?.. ఎప్పుడైనా ఆలోచించారా! ఆ విశేషాలు మీ కోసం.. అతిపెద్ద గోల్డ్ మైన్.. ప్రపంచదేశాలకు ఎగుమతి.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గనుల నుంచి బంగారం లభ్యమవుతున్నా.. అత్యధిక బంగారాన్ని మాత్రం నెవాడా బంగారం గని నుంచే లభ్యమవుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్. అమెరికాలోని నెవాడా సిటీలో ఈ బంగారం గని ఉంది. ఈ బంగారం గని సంవత్సరానికి లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇక్కడి నుంచి బంగారం ఎగుమతి అవుతుంది. అంటే ఈ బంగారం గని ద్వారా ఏటా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో అంచనా వేయండి. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. ఇప్పటివరకు ఎంత బంగారం తవ్వారంటే.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ఆధారంగా ‘స్టాటిస్టా’ రూపొందించిన జాబితా ప్రకారం నెవాడా బంగారం గని నుంచి ప్రతీ ఏట 1 లక్ష 70 వేల కిలోల వరకు బంగారం తవ్వబడుతుంది. దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం ఎగుమతి అవుతుందట. 1835 నుండి 2017 వరకు నెవాడా దాదాపుగా 20,59,31,000 ట్రాయ్ ఔన్సుల బంగారాన్ని ఉత్పత్తి చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మొత్తం ప్రపంచ జనాభాలో 5 శాతం ఇక్కడే ఉన్నారని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఏదిఏమైనా పసుపు రంగులో మెరిసిపోయే బంగారం చూడటానికే కాదు... దాని విశేషాలు వినడానికి కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి కదా!! చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
హిమాలయాలకు భారీ భూకంప ముప్పు
న్యూఢిల్లీ: భారతదేశానికి పెట్టని కోటలా ఉన్న హిమాలయాలకు భారీ భూకంపాల ముప్పు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. హిమాలయాల శ్రేణిలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని చెప్పింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్‌కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణుతో కూడిన బృందం ఈ విషయాలను వెల్లడించింది. ‘అరుణాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకూ వ్యాపించి ఉన్న హిమాలయాల శ్రేణిలో గతంలోనూ భారీ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. మా పరిశోధనలో తేలిన ప్రకారం మన తరంలోనే రాబోయే భారీ భూకంపాన్ని చూసే అవకాశం ఉంది. ఎంత లేదన్నా 100 సంవత్సరాల్లోపే పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వెస్నౌస్కీ చెప్పారు. -
పశ్చిమం వైపు ట్రంప్ చూపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపు కోసం ఆరాటపడుతున్న ట్రంప్ పశ్చిమ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి సారించారు. నెవాడా, కాలిఫోర్నియా, అరిజోనా తదితర రాష్ట్రాల్లో వరస పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా నెవాడా రాష్ట్రంలో పట్టుబిగించాలని చూస్తున్నారు. 2004 నుంచి ఈ రాష్ట్రం రిపబ్లికన్ అభ్యర్థికి మద్దతుగా నిలవడం లేదు. అందుకే ఈసారి నెవాడాలో ట్రంప్ ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే 45 లక్షల డాలర్లు ఖర్చు చేసిన ట్రంప్ మరో 55 లక్షల డాలర్లను కేవలం ఈ రాష్ట్రానికి కేటాయించారు. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కూడా ఇప్పటివరకు 45 లక్షల డాలర్లు ఖర్చు పెట్టారు. మరో 25 లక్షల డాలర్లు కేటాయించారు. అరిజోనాను కోల్పోతే ఎలక్టోరల్ ఓట్లు 270 సాధించడం కష్టమేనని విశ్లేషకుల అంచనా. దీంతో ట్రంప్ అరిజోనాలో మళ్లీ పర్యటించనున్నారు. -
ఆగస్టులో అపరిమిత సెక్స్ ఫెస్టివల్
న్యూయార్క్ : ‘కామి కాలేనివాడు మోక్షగామి కాలేడు’ అన్న భారతీయ వివాదాస్పద సాధువు రజనీష్ సూత్రాన్ని ఆచరించాలనుకున్నారేమోగానీ ‘వంద మంది అమ్మాయిలతో అపరిమిత సెక్స్ ’ అంటూ నిర్వహకులు ఇస్తున్న పిలుపు నేడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమెరికాలోని నేవెడ రాష్ట్రంలో ‘సెక్స్ ఐలాండ్’ పేరిట ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వేడుకలకు అప్పుడే టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లు సహా 30 మంది టక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్ ఆరువేల డాలర్లు. నాలుగు రోజులపాటు ఈ సెక్స్ వేడుకల్లో టెక్కెట్లు కొనుక్కొని వచ్చే పురుష పుంగవులు ప్రతి రోజు ఇద్దరు అందమైన అమ్మాయిలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమే కాకుండా, ఎలక్ట్రానిక్ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో క్రీడించవచ్చు. హెలికాప్టర్ విహారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. గతేడాది ఈ సెక్స్ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. ‘డ్రగ్స్ అండ్ ఫ్రెండ్లీ వెకేషన్’గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యథేశ్చగా సరఫరా చేశారట. విషయం తెలిసే కాబోలు, సెక్స్ వేడుకల రోజుల్లో దాడులు నిర్వహిస్తామని, డ్రగ్స్ చట్టాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ‘అమెరికాస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్తోని విదేశీ పర్యాటకులు దొరికినట్లయితే వారిని అదుపులోకి తీసుకొని సమీపంలోని వలసదారుల కేంద్రానికి తరలించి వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని కూడా హెచ్చరించారు. అంతేకాదు, సెక్స్‌కు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినా అసలు వేడుకలే జరగకుండా అడ్డుకుంటామని అమెరికా పోలీసులు కూడా నిర్వాహకులను హెచ్చరించారు. 18 ఏళ్ల ప్రాయంలోని వారిని సెక్స్‌కు అనుమతిస్తే కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అమెరికాలో పరిమితంగా వ్యభిచారానికి అనుమతించిన ఏకైక రాష్ట్రం నేవడ. అందుకనే నిర్వాహకులు ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. మొదటి సెక్స్ ఫెస్టివల్ గతేడాది కొలంబియాలోని కార్టెజెనా అనే ప్రైవేటు దీవిలో నిర్వహించాలనుకున్నారు. వేడుకలపై గొడవ మొదలవడంతో దక్షిణ అమెరికా ప్రభుత్వం వాటిని అడ్డుకుంది. దాంతో వ్యభిచారం చట్టబద్ధమైన వెనిజులాలోని ఇస్లా మార్గరిటలో జరిగింది. ఈ సారి కూడా ‘ఆర్గ్ హాలీడే’ అనే పొర్న్ వీడియో సంస్థతో కలసి ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అమెరికా పోలీసులు, డ్రగ్స్ విభాగం హెచ్చరికలకు భయపడరాదని ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ వారు తెలిపారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు నడుస్తాయని, తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లేదని వారు చెప్పారు. తమ అమ్మాయిలెవరికి సుఖ రోగాలు లేవని, అందరికి ముందుగానే వైద్య పరీక్షలు చేయించామని, తమ అమ్మాయిలు కండోమ్స్‌కు కట్టుబడి ఉంటారని తెలిపారు. -
అమెరికాలో కుప్పకూలిన విమానం
-
అమెరికాలో కుప్పకూలిన విమానం
నెవెడా: అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఉత్తర నెవెడాలో ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోవడంతో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రోగిని ఉతాహ్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానం కాసినో సమీపంలోని ప్రైవేటు మైనింగ్ కంపెనీకి చెందిన పార్కింగ్ ప్రదేశంలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రోగితో పాటు విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిపోయివుంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం రెనోకు చెందిన అమెరికన్ మిడ్ ఫ్లైట్ సంస్థకు చెందినది. ప్రమాదంపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తామని మిడ్ ఫ్లైట్ సంస్థ తెలిపింది. అయితే మృతుల పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
కన్యత్వం వేలం వెనుక కన్నీటిగాథ
-
కన్యత్వం వేలం వెనుక కన్నీటిగాథ
నెవెడా: తన కుటుంబం కోసం ఓ అమెరికా యువతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తనవాళ్లను కాపాడుకునేందుకు కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. 21 ఏళ్ల కేథరిన్ స్టోన్ అనే యువతి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నెవెడాలో చట్టబద్దంగా పనిచేస్తున్న వేశ్యాగృహం 'కిట్ కాట్ రాంచ్'లో ఆమె తన కన్యత్వాన్ని వేలానికి పెట్టింది. ఆమె నిర్ణయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అత్యధికంగా 4 లక్షల డాలర్లు(సుమారు రూ. 2.6 కోట్లు) బిడ్ వచ్చింది. లాయర్ కావాలనున్న కేథరిన్ స్టోన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కన్నీటి గాథ ఉంది. సీటెల్ లో సంతోషంగా జీవిస్తున్న ఆమె కుటుంబాన్ని అగ్నిప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. 2014, డిసెంబర్ లో జరిగిన ఎలక్ట్రిక్ అగ్నిప్రమాదం ఆమె కుటుంబాన్ని రోడ్డున పడేసింది. తమ ఇంటికి బీమా లేకపోవడంతో వారికి ఎటువంటి నష్టపరిహారం రాలేదు. దీంతో కేథరిన్ కుటుంబం 8 నెలల పాటు బంధువుల ఇంట్లో తలదాచుకుంది. ఎలాగైనా తన కుటుంబానికి ఆసరాగా నిలబడాలనుకున్న ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాలేజీ ఫీజు కోసం ఓ యువతి 2008లో తన కన్యత్వాన్ని వేలం పెట్టిందన్న విషయం తెలుసుకుని ఆ దిశగా అడుగులు వేసింది. కేథరీన్ కన్నీటి గాథను 'దిజ్ ఈజ్ ద లైఫ్' పేరిట సీఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది. నెవెడాలో వ్యభిచారం చట్టబద్దమని తెలుసుకుని కిట్ కాట్ రాంచ్ యజమాని డెన్నిస్ హొఫ్ ను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించినట్టు కేథరీన్ తెలిపింది. తన కుటుంబ పరిస్థితి గురించి వివరించడంతో తనకు సాయం చేసేందుకు డెన్నిస్ ఒప్పుకున్నారని వెల్లడించింది. తర్వాత తన తల్లితో పాటు వెళ్లి డెన్నిస్ ను కలిసింది. మే నెలలో నెవెడాకు కేథరీన్ వచ్చింది. సర్వం కోల్పోయి రోడ్డున పడిన తన వాళ్లకు ఊతం ఇవ్వడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని కేథరీన్ స్పష్టం చేసింది. వేలానికి మరన్ని బిడ్స్ వస్తాయన్న ఆశాభావంతో ఉంది. కాగా, చాలా మంది కేథరీన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆమెను పరుష పదజాలంతో తిట్టిపోశారు. సానుభూతిపరులు మాత్రం ఆమె అడ్డుకోవద్దని అంటున్నారు. -
ప్రకృతి వి‘చిత్రం’
నెవడాలోని ఈ వాతావరణ విచిత్రాన్ని రాల్ఫ్ మేడెర్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. నెవడాలోని మోరాన్ పాయింట్ వద్ద తీసిన ఫొటో ఇది. వేసవి ముగిసే తరుణంలో అధిక ఉష్ణోగ్రతలు వాతావరణంలోని తేవుతో కలసి, స్థానిక తుపానులకు దారితీస్తాయి.. అలాంటి తుపాను వచ్చే ముందు ఇలా ఆకాశంలో మబ్బులు, మెరుపులు కనిపిస్తాయి. ‘పుర్రె’కో బుద్ధి! వెల్వియిన్ గార్డెన్ సిటీకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ జెర్మీ గిబ్స్కు తన ఇంటి పరిసరాలను సృజనాత్మకంగా తీర్చిదిద్దడమంటే మహా సరదా. అందుకే గార్డెన్‌లోని మొక్కలను ఇలా రకరకాల జంతువుల చేతులు, మనిషి పుర్రె ఆకృతిలో కత్తిరించి తన ఇంటికే కొత్త అందాన్ని తీసుకొస్తున్నాడు. గత 20 ఏళ్లుగా ఇలా విభిన్న ఆకృతుల్లో తన ఇంటి పరిసరాలను రూపొందిస్తున్న ఈ డాక్టర్ అందరినీ తన అరుదైన కళతో అబ్బురపరుస్తున్నాడు. ఆకాశంలో ఆలయం.. అపార్ట్‌మెంట్లపైన పెంట్ హౌస్‌లు కట్టుకోవడం మనం చూశాం. చైనాలో మాత్రం ఇలా ఏకంగా ఆలయాన్నే కట్టేశారు. షెంజెన్ నాన్ఫాంగ్ జిల్లాలో 21 అంతస్తులున్న ఓ ఆకాశహర్మ్యంపైన నిర్మితమైన ఆలయమిది. అయితే, ఇది ఎవరో ప్రైవేటు వ్యక్తులకు చెందినదని భావిస్తున్నారు. చైనాలో ఈ మధ్య అక్రమంగా రూఫ్‌టాప్ నిర్మాణాలు కట్టడం ఎక్కువైపోయింది. ఇది కూడా అలాంటి బాపతేనని అనుమానిస్తున్నారు. పాతవాటితో ప్రజలకు పాఠం.. జర్మనీలో విద్యుత్‌ను వేస్ట్ చేయడం బాగా ఎక్కువైపోయిందట. దీంతో ఆ దేశానికి చెందిన రాల్ఫ్ స్కీమర్బెర్గ్ అనే ఆర్టిస్ట్ ప్రజలకు దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ఇగ్లూను నిర్మించారు. ఇగ్లూను మంచుతో తయారుచేస్తారన్నది మనకు తెలిసిందే. దీన్ని చేయడానికి మాత్రం ఆయన 322 పాత ఫ్రిడ్జ్‌లను వాడారు. పైగా.. ఇవి ఎంత విద్యుత్‌ను ఖర్చు పెడుతున్నాయన్న విషయాన్ని తెలియజేయడానికి బయటో కరెంట్ మీటర్‌ను కూడా పెట్టారు.