లాస్‌వెగాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మరో రాష్ట్రంలో గెలుపు సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి ట్రంప్ అవకాశాలు మెరుగవుతున్నాయి. గురువారం నెవడా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయం సాధించారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడుతున్న మరో నేత నిక్కీ హేలీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. నెవడాలోని మొత్తం 26 మంది డెలిగేట్లు ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా బరిలో నిలవాలంటే మొత్తం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. ఇప్పటిదాకా ట్రంప్ 62 మంది, నిక్కీ హేలీ 17 మంది డెలిగేట్ల మద్దతు కూడగట్టారు.
Comments
Please login to add a commentAdd a comment