Former US president
-
Donald Trump: చనిపోయాననే అనుకున్నా
మిల్వాయుకీ (డెలావెర్): ప్రాణాంతకమైన దాడికి గురైన క్షణాలను అమెరికా మాజీ అధ్యక్షుడు గుర్తు చేసుకున్నారు. ‘‘ఆ సమయంలో నేను చనిపోయాననే అనుకున్నా. కేవలం అదృష్టమో, దైవమో నన్ను కాపాడాయి’’ అని చెప్పుకొచ్చారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా 20 ఏళ్ల దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడటం తెలిసిందే. 78 ఏళ్ల ట్రంప్ కుడి చెవికి తూటా గాయంతో త్రుటిలో బయటపడ్డారు. తనను రిపబ్లికన్ అధ్యక్ష అభ్యరి్థగా అధికారికంగా ప్రకటించే మూడు రోజుల పార్టీ జాతీయ సదస్సుకు వెళ్తూ ఆయన న్యూయార్క్ పోస్ట్ వార్తా సంస్థతో మాట్లాడారు. సరిగ్గా కాల్పులు జరిగిన సమయంలోనే కుడివైపుకు తల తిప్పడం వల్లే బతికి బయటపడ్డానన్నారు. దీన్ని నమ్మశక్యం కాని అనుభవంగా అభివరి్ణంచారు. ‘‘గాయం తర్వాత పిడికిలి పైకెత్తి ఫైట్ అంటూ నేను నినదిస్తున్న ఫొటోను అంతా ఐకానిక్ ఫొటోగా అంటున్నారు. అలాంటి ఫొటో కావాలంటే మామూలుగానైతే చనిపోవాల్సిందే’’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. కాల్పుల తర్వాత కూడా ప్రసంగం కొనసాగించాలనే అనుకున్నట్టు వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ తనకు ఫోన్ చేసి క్షేమం కనుక్కున్న తీరును అభినందించారు. ఈ సందర్భంగా ట్రంప్ కుడి చెవికి బ్యాండేజీ ధరించి కని్పంచారు. రిపబ్లికన్ సదస్సుకు భారీ భద్రత రిపబ్లికన్ల మూడు రోజుల జాతీయ సదస్సు మిల్వాయుకీలో సోమవారం మొదలైంది. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో సదస్సుకు కనీవినీ ఎరగని స్థాయిలో వేలాది మంది సిబ్బందితో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలి్పంచారు.పోలీసును బెదిరించాడు!ట్రంప్‌పై దాడికి దిగిన క్రూక్స్ కదలికల్ని కాల్పులకు ముందే ఓ పోలీసు అధికారి పసిగట్టాడు. క్రూక్స్ నక్కిన గోడౌన్పైకి ఎక్కి అతన్ని సమీపించబోగా తుపాకీతో బెదిరించాడు. దాంతో ఆ పోలీసు కిందికి దిగేశాడు. అదే సమయంలో ట్రంప్‌పై క్రూక్స్ తూటాల వర్షం కురిపించాడు. స్కూలు రోజుల నుంచీ ముభావేక్రూక్స్ స్కూలు రోజుల నుంచీ ఒంటరిగా, ముభావంగానే ఉండేవాడని తోటి విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ‘‘క్రూక్స్‌కు పెద్దగా మిత్రులు కూడా లేరు. తోటి విద్యార్థులంతా అతన్ని బాగా ఏడిపించేవారు. రైఫిల్ గురి పెట్టడం చేతగాక స్కూల్ షూటింగ్ టీమ్‌లోకి ఎంపిక కాలేకపోయాడు’’ అన్నారు.జగన్నాథుడే కాపాడాడు: ఇస్కాన్ప్రాణాంతక దాడి నుంచి ట్రంప్‌ను పురీ జగన్నాథుడే కాపాడాడని ఇస్కాన్ పేర్కొంది. 48 ఏళ్ల కింద న్యూయార్క్‌లో తొలి జగన్నాథ రథయాత్ర విజయవంతం కావడంలో ఆయన ఎంతో సాయపడ్డారని చెప్పింది.పోలీసుల తప్పిదమే: ఎఫ్‌బీఐ ట్రంప్‌పై దాడి ఉదంతంపై దర్యాప్తు ముమ్మరమైంది. దీనిపై ఉన్నత స్థాయి స్వతంత్ర విచారణకు బైడెన్ ఆదేశించడం తెలిసిందే. దేశీయ ఉగ్రవాద చర్యగా దీనిపై ఎఫ్‌బీఐ విచారణ చేపట్టింది. దుండగుడు థామస్ మాథ్యూ క్రూక్స్ ఒంటరిగానే ఈ ఘాతుకానికి తెగబడ్డట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచి్చంది. భద్రతా లోపానికి స్థానిక పోలీసు విభాగానిదే బాధ్యత అని సీక్రెట్ సర్వీస్ విభాగం వాదిస్తోంది. క్రూక్స్ మాటు వేసిన గోడౌన్ తమ భద్రతా పరిధికి ఆవల ఉందని పేర్కొంది. కనుక అదంతా స్థానిక పోలీసుల బాధ్యతేనని వివరించింది. -
ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
న్యూయార్క్: నీలిచిత్రాల తార స్టార్మీ డేనియల్‌తో సంబంధం విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఆమెకు తన లాయర్ ద్వారా అనైతిక మార్గంలో నగదు పంపించిన(హష్ మనీ) కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. జడ్జీలు, సాక్షులపై వ్యాఖ్యానాలు చేయొద్దని, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టొద్దన్న గ్యాగ్ ఉత్తర్వులను మళ్లీ ఉల్లంఘించినందుకు 1,000 డాలర్ల జరిమానాను న్యాయస్థానం విధించింది. మరోసారి ఉల్లంఘిస్తే జైల్లో పడేస్తామని సోమవారం జడ్జి జువాన్ ఎం.మెర్చాన్ హెచ్చరించారు. ఇప్పటికే తొమ్మిదిసార్లు ఉల్లంఘించినందుకు గత వారమే ట్రంప్‌నకు 9,000 డాలర్ల జరిమానా విధించడం విదితమే. -
ట్రంప్‌కు 3 వేల కోట్ల జరిమానా
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రెండోసారి అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్న ఆయనకు కొత్త కష్టాలు వచి్చపడుతున్నాయి. తప్పుడు ఆర్థిక పత్రాలతో బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ట్రంప్‌కు శుక్రవారం 364 మిలియన్ డాలర్ల (రూ.3,020 కోట్లు) జరిమానా విధించింది. తన ఆదాయం, ఆస్తుల విలువను వాస్తవ విలువ కంటే కాగితాలపై అధికంగా చూపించి, బ్యాంకులు, బీమా సంస్థల నుంచి చౌకగా రుణాలు, బీమా పొందడంతోపాటు ఇతరత్రా ఆర్థికంగా లాభపడినట్లు ట్రంప్‌పై ఆరోపణలు వచ్చాయి. బ్యాంకులు, బీమా సంస్థలను మోసగించినట్లు కేసు నమోదైంది. న్యూయార్క్ అటారీ్న, జనరల్ డెమొక్రటిక్ పార్టీ నేత జేమ్స్ కోర్టులో దావా వేశారు. దీనిపై న్యాయస్థానం రెండున్నర నెలలపాటు విచారణ జరిపింది. ట్రంప్‌పై వచి్చన అభియోగాలు నిజమేనని తేలి్చంది. ట్రంప్ నిర్వాకం వల్ల బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపోయినట్లు గుర్తించింది. ఈ కేసులో ట్రంప్‌నకు 355 మిలియన్ డాలర్లు, ఆయన ఇద్దరు కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు 4 మిలియన్ డాలర్ల చొప్పున, ట్రంప్ మాజీ చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్‌కు ఒక మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ న్యూయార్క్ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అంటే ట్రంప్ మొత్తం 364 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థలోనూ ఆయన డైరెక్టర్ లేదా ఆఫీసర్‌గా ఉండకూడదని న్యాయమూర్తి ఆదేశించారు. ఇది సివిల్ కేసు కావడంతో ట్రంప్‌కు జైలు శిక్ష విధించడం లేదని స్పష్టం చేశారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేస్తామని ట్రంప్ తరఫు న్యాయవాదులు చెప్పారు. -
US presidential election 2024: మరో ప్రైమరీలో ట్రంప్ గెలుపు
లాస్‌వెగాస్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. మరో రాష్ట్రంలో గెలుపు సొంతం చేసుకున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడడానికి ట్రంప్ అవకాశాలు మెరుగవుతున్నాయి. గురువారం నెవడా రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికలో ఆయన విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడుతున్న మరో నేత నిక్కీ హేలీ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. నెవడాలోని మొత్తం 26 మంది డెలిగేట్లు ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా బరిలో నిలవాలంటే మొత్తం 1,215 మంది డెలిగేట్ల మద్దతు అవసరం. ఇప్పటిదాకా ట్రంప్ 62 మంది, నిక్కీ హేలీ 17 మంది డెలిగేట్ల మద్దతు కూడగట్టారు. -
డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్
పోర్ట్‌ల్యాండ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆయనకు దారులు క్రమంగా మూసుకుపోతున్నాయి. కొలరాడో రాష్ట్రంలో అధ్యక్ష అభ్యరి్థత్వానికి(ప్రైమరీ ఎన్నికలో) పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడని 2021 జనవరి 6న జరిగిన క్యాపిటల్ హిల్‌పై దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కొలరాడో రాష్ట్ర ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. తాజాగా మెనె రాష్ట్రంలోనూ ట్రంప్‌నకు పరాభవం ఎదురైంది. రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో పోటీ చేయకుండా బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు మెనె రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి షెన్నా బెల్లోస్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశారు. ఈ ఉత్తర్వుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ట్రంప్‌నకు కలి్పంచారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మెనె రాష్ట్రంలో ప్రైమరీ ఎన్నికలో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అప్పీళ్లు దాఖలు చేశారు. ఆయనకు ఇక్కడి నుంచి ప్రైమరీలో పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న షెన్నా బెల్లోస్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థి పేరును ఒక రాష్ట్రంలో ఇలా బ్యాలెట్ నుంచి తొలగించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
USA presidential election 2024: ట్రంప్‌కు షాక్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి షాక్ తగిలింది. 2024 నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడేందుకు ఆయన అనర్హుడంటూ కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2021లో కాపిటల్ హిల్‌పై జరిగిన దాడి ఉదంతంలో ఆయన పాత్ర ఉందని తేలి్చంది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ (సెక్షన్ 3) ప్రకారం ట్రంప్‌ను దోషిగా నిర్ధారించింది. దీని ప్రకారం ప్రభుత్వంపై, ప్రభుత్వ సంస్థలు, భవనాలపై దాడిలో పాల్గొనే అధికారులు భవిష్యత్తులో ప్రభుత్వ పదవులు చేపట్టడానికి అనర్హులు. కాకపోతే అధ్యక్ష అభ్యరి్థని ఈ సెక్షన్ కింద పోటీకి అనర్హుడిగా ప్రకటించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి! ఈ తీర్పు కొలరాడో రాష్ట్రం వరకే వర్తిస్తుంది. తీర్పు నేపథ్యంలో కొలరాడోలో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎన్నిక (ప్రైమరీ)లో ట్రంప్ పోటీ చేయకుండా కోర్టు అనర్హత వేటు వేసింది. ప్రైమరీ బ్యాలెట్ పేపర్ల నుంచి ఆయన పేరును తొలగించాలని ఆదేశించింది. ‘‘కాపిటల్ భవనంపై దాడికి తన మద్దతుదారులను ట్రంప్ స్వయంగా పురిగొల్పారు. అక్రమ పద్ధతుల్లో, హింసాత్మకంగా అధికార మారి్పడిని అడ్డుకోజూశారు. తద్వారా దేశ ప్రజల తీర్పునే అపహ్యాసం చేశారు. కనుక సెక్షన్ 3 ప్రకారం దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు ఆయన అనర్హుడు’’ అంటూ ఏడుగురు జడ్జిల ధర్మాసనం 4–3 మెజారిటీతో తీర్పు చెప్పింది. ఆశలపై నీళ్లు!: మరోసారి అధ్యక్షుడు కావాలన్న 77 ఏళ్ల ట్రంప్ కలలకు కొలరాడో కోర్టు తీర్పు గట్టి ఎదురు దెబ్బేనని భావిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వ రేసులో ఇప్పటికే ఆయన అందరి కంటే ముందున్నారు. కొలరాడో కోర్టుది తప్పుడు తీర్పంటూ ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తనను ఏదోలా అడ్డుకునేందుకు న్యాయవ్యవస్థను కూడా అడ్డగోలుగా వాడుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ట్రంప్ లాయర్లు ప్రకటించారు. కొలరాడో కోర్టు కూడా తన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు జనవరి 4 దాకా గడువిచి్చంది. అప్పటిదాకా తీర్పు అమలుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయ భవితవ్యాన్ని సుప్రీంకోర్టులోనే తేలనుంది. అయితే, ఒకట్రెండు నెలల్లో రాష్ట్రాలవారీగా ప్రైమరీలు మొదలవుతున్న నేపథ్యంలో ఆలోగా సుప్రీంకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించకపోతే ట్రంప్ పరిస్థితి ఏమిటన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కొలరాడోలో మార్చి 5న జరగనున్న ప్రైమరీకి అధ్యక్ష అభ్యర్థుల బ్యాలెట్ పత్రాల ఖరారుకు జనవరి ఐదో తేదే తుది గడువు! అంతేగాక కాపిటల్ భవనంపై దాడి ఉదంతానికి సంబంధించి ఇంకా పలు రాష్ట్రాల్లో ట్రంప్ కేసులు ఎదుర్కొంటున్నారు. అక్కడా ఇలాంటి తీర్పే వస్తే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ మరింతగా చిక్కుల్లో పడనుంది. ఈ పరిణామాలపై స్పందించేందుకు డెమొక్రటిక్ పార్టీ నిరాకరించింది. వివేక్ రామస్వామి అండ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థత్వానికి ట్రంప్‌తో పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి కూడా కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును తీవ్రంగా తప్పుబట్టడం విశేషం. ఈ విషయంలో ట్రంప్‌కు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఈ తీర్పు కారణంగా కొలరాడో రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ పోటీ పడలేకపోతే తాను కూడా అక్కడ పోటీ చేయబోనని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులెవరూ కూడా కొలరాడో ప్రైమరీలో బరిలో దిగొద్దని 38 ఏళ్ల వివేక్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. -
US presidential election 2020 Case: ట్రంప్ అరెస్ట్.. విడుదల
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్ షాట్ తీశారు. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్ షాట్ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్ రెండు లక్షల డాలర్ల బెయిల్ బాండ్‌పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు. ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్ షాట్ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్ షాట్ ఫొటోను ట్రంప్ తన సొంత ‘ట్రూత్ సోషల్’తోపాటు ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్ మగ్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు. -
ట్రంప్ నోట మళ్లీ భారత్‌పై పన్ను మాట
వాషింగ్టన్: భారత్‌లో కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా ఉన్నాయంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష పగ్గాలు మళ్లీ చేపడితే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తాననని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారత్‌లో ట్యాక్సులు మరీ ఎక్కువ. హార్లీ డేవిడ్ సన్లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు వేస్తోంది. అక్కడ 100 శాతం, 150, 200 శాతం వరకు పన్నులున్నాయి. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి పన్నులు విధించకూడదా? అది సరికాదు. మనం కూడా పన్నులు వసూలు చేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తా’అని ఆయన హెచ్చరించారు. -
ఒబామా వ్యాఖ్యలపై సీతారామన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు. ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్‌లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. -
US presidential election 2024: ట్రంప్ కేసు దారెటు!?
అవినీతి అక్రమాలకు పాల్పడి, న్యాయస్థానంలో నేర విచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా అపకీర్తిని మూటగట్టుకున్న డొనాల్డ్ ట్రంప్ మళ్లీ దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున తానే బరిలో ఉంటానని సంకేతాలిస్తున్నారు. అసలు అది సాధ్యమేనా అన్న చర్చ ప్రపంచమంతటా సాగుతోంది. ట్రంప్‌పై నమోదైన హష్ మనీ చెల్లింపుల కేసులో ఇకపై ఏం జరగవచ్చన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రంప్‌పై కోర్టులో విచారణ ప్రారంభం కావడానికి చాలా సమయం పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతకంటే ముందే కేసులను కొట్టివేయించేందుకు ట్రంప్ న్యాయబృందం ప్రయత్నాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండొచ్చన్నది ఆసక్తికరంగా మారింది... గాగ్ ఆర్డర్ ఇస్తారా? ► డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్రమైన అభియోగాలు వచ్చాయని, అవి నిరూపితమైతే ఆయనకు గరిష్ట స్థాయిలో జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ► న్యాయమూర్తులపై ట్రంప్ అవాకులు చెవాకులు పేలుతున్నారు. న్యూయార్క్ సుప్రీంకోర్టు జడ్జి జువాన్ మెర్చాన్, మన్‌హట్టన్ జిల్లా అటార్నీ అల్విన్ బ్రాగ్పై విరుచుకుపడ్డారు. ► ట్రంప్ మంగళవారం మన్‌హట్టన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హంగామా సృష్టించారు. ఇదంతా న్యాయస్థానానికి చికాకు తెప్పించింది. ► సమాజంలో హింసను ప్రేరేపించే, అశాంతిని సృష్టించే, ప్రజల భద్రతకు భంగం కలిగించే వ్యాఖ్యలకు, ప్రవర్తనకు దూరంగా ఉండాలని ట్రంప్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మెర్చాన్ హితవు పలికారు. ► ఇది జరిగిన ఐదు గంటల తర్వాత ట్రంప్ నోరు పారేసుకున్నారు. జువాన్ మెర్చాన్, అల్విన్ బ్రాగ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. ► మెర్చాన్, ఆయన భార్య, ఆయన కుటుంబం తనను ద్వేషిస్తోందని ఆరోపించారు. ఇక అల్విన్ బ్రాగ్ ఒక విఫలమైన జిల్లా అటార్నీ అని ఆక్షేపించారు. ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అల్విన్ బ్రాగ్ ఒక జంతువు, మానసిక రోగి అని ట్రంప్ మండిపడ్డారు. ► ట్రంప్ నోటికి తాళం వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జువాన్ మెర్చాన్ గాగ్ ఆర్డర్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ► గాగ్ ఆర్డర్ జారీ చేస్తే కేసుల గురించి ట్రంప్ గానీ, ఆయన న్యాయబృందం గానీ ఎక్కడా బహిరంగంగా చర్చించకూడదు. ► గాగ్ ఆర్డర్‌ను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించి కేసు నమోదు చేస్తారు. ట్రంప్‌కు 1,000 డాలర్ల జరిమానా లేదా 30 రోజుల జైలు శిక్ష.. లేదా రెండు శిక్షలూ విధించే అవకాశం ఉంటుంది. సాక్ష్యాలు అందాక ఏం చేస్తారో? ► ట్రంప్ హష్ మనీ చెల్లించిన కేసులో మన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం గత ఐదేళ్లుగా విచారణ కొనసాగిస్తోంది. ► చెల్లింపుల వ్యవహారాన్ని ట్రంప్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని, 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ఇది ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అల్విన్బ్రాగ్ చెబుతున్నారు. ► దర్యాప్తులో భాగంగా తాము సేకరించిన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూటర్లు ట్రంప్ న్యాయ బృందానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘డిస్కవరీ’ అంటారు. ► ఇది 35 రోజుల్లోగా పూర్తికావాలి. కానీ, అల్విన్ బ్రాగ్ నేతృత్వంలోని ప్రాసిక్యూటర్ల బృందానికి 65 రోజుల సమయం.. అంటే జూన్ 8 దాకా గడువు ఇచ్చారు. సాక్ష్యాలు చేతికి అందాక ట్రంప్ న్యాయవాదులు ఎలాంటి ఎత్తుగడ వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ పోటీ ఖాయమేనా? ► ట్రంప్ లాయర్ల తీర్మానాలపై డిసెంబర్ 4న కోర్టు తీర్పు వెలువడనుంది. ► తీర్మానాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ట్రంప్‌పై అసలైన విచారణ ప్రారంభమవుతుంది. ► వచ్చే ఏడాది జనవరి నుంచి విచారణ చేపట్టాలని తాము కోర్టును కోరుతామని ప్రాసిక్యూటర్లు చెప్పారు. ► మార్చి నుంచి జూన్ వరకూ అమెరికాలో వసంత కాలం. అప్పుడైతే బాగుంటుందని ట్రంప్ లాయర్లు అభిప్రాయపడుతున్నారు. ► విచారణ మొదలయ్యే నాటికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రైమరీ ఎన్నికల్లో ప్రజలు పార్టీల తరపున పోటీ చేసే నామినీలకు ఓటు వేస్తారు. ► ట్రంప్‌పై విచారణ పూర్తయ్యి, తుది తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. కొత్త అధ్యక్షుడు కొలువుతీరుతాడు. ► 2024లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నిక్షేపంగా పోటీ చేయొచ్చు. ఏ చట్టమూ ఆయనను అడ్డుకోలేదు. ► రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి పోటీ చేయడానికి ట్రంప్ ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ► ఒకవేళ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్‌ను కోర్టు దోషిగా తేల్చి, శిక్ష ఖరారు చేస్తే పదవి నుంచి దిగిపోవడమో లేక కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాల్లో పోరాడడమో చేయాల్సి ఉంటుంది. తీర్మానం ప్రవేశపెడతారా? ► ట్రంప్‌ను అన్ని కేసుల నుంచి నిర్దోషిగా బయటకు తీసుకువస్తామని ఆయన తరపు లాయర్లు ఇప్పటికే తేల్చిచెప్పారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ► చట్టప్రకారం చూస్తే విచారణ ప్రారంభం కావడానికి ముందు కేసులన్నింటినీ పునఃపరిశీలించి, ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టును అభ్యర్థించే వెసులుబాటు ఉంది. ఈ మేరకు కోర్టులో తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ► కేసులను పూర్తిగా కొట్టివేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రంప్ బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయస్థానం సానుకూలంగా స్పందిస్తే ట్రంప్‌కు విముక్తి లభించినట్లే. అయితే, ఇదంతా ఆయన లాయర్ల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ► ట్రంప్ కేసులను విచారిస్తున్న జడ్జిని విధుల నుంచి తొలగించాలని, విచారణ వేదికను మన్‌హట్టన్ నుంచి సమీపంలోని స్టాటెన్ ఐలాండ్‌కు మార్చాలని కోరుతూ కూడా తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు వీలుంది. మన్హట్టన్లో ట్రంప్ అభిమానులు పెద్దగా లేరు. అక్కడ విచారణ జరపడం సమంజసం కాదని ఆయన వాదిస్తున్నారు. ► మామూలుగా అయితే 45 రోజుల్లోగా తీర్మానం ప్రవేశపెట్టాలి. ట్రంప్ బృందానికి జడ్జి మెర్చాన్ ఆగస్టు 8 దాకా గడువు ఇచ్చారు. అంటే నాలుగు నెలలు. ట్రంప్ లాయర్ల తీర్మానంపై ప్రాసిక్యూటర్లు స్పందించడానికి సెప్టెంబర్ 19వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్దేశించారు. ► తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలూ కచ్చితంగా వాడుకుంటామని, ప్రతి చిన్న అంశాన్ని కూడా సూక్ష్మస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రంప్ న్యాయవాది జోయ్ టాకోపినా చెప్పారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
బైడెన్ అసమర్థ పాలనలో... అమెరికా సర్వభ్రష్టం
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో తాను పూర్తిగా అమాయకుడినని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ కేసులో తనపై దాఖలైన క్రిమినల్ అభియోగాలకు సంబంధించి మంగళవారం ఆయన న్యూయార్క్‌లో మన్హాటన్ జ్యూరీ ముందు విచారణకు హాజరవడం తెలిసిందే. అనంతరం ఫ్లోరిడాలో తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించారు. వామపక్ష అతివాద ఉన్మాదులు దేశాన్ని సర్వనాశనం దిశగా తీసుకెళ్తున్నారంటూ అధ్యక్షుడు జో బైడెన్, ఆయన మద్దతుదారులపై నిప్పులు చెరిగారు. చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడిలా ఎన్నికల ప్రక్రియనూ ముందుగానే ప్రభావితం చేయజూస్తున్నారని ఆరోపించారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వబోమని హెచ్చరించారు. ‘‘బైడెన్ దేశ చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడు. ఆయనకు ముందున్న ఐదుగురు అత్యంత అసమర్థ అధ్యక్షుల వైఫల్యాన్నింటినీ కలగలిపినా బైడెన్ పాలనా వైఫల్యాల్లో పదో వంతుకు కూడా తూగవు. అంతటి దారుణ పాలనతో అమెరికాను అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టిస్తూ విఫల రాజ్యంగా మారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. ‘‘ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. డాలర్ శరవేగంగా పతనమవుతోంది. గత 200 ఏళ్ల అమెరికా చరిత్రలో అత్యంత దారుణ పరాజయమిది! ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికా ఇంకెంత మాత్రమూ సూపర్ పవర్ కాదు. సర్వనాశనం దిశగా పయనిస్తోంది’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. నేనుంటేనా...! బైడెన్ అసమర్థత వల్ల నమ్మశక్యం కాని రీతిలో చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా చేతులు కలిపాయని ట్రంప్ ఆరోపించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి అత్యంత వినాశకర సంకీర్ణంగా రూపొందాయి. ఎన్నో దేశాలు అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ బాహాటంగా హెచ్చరికలు చేస్తున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పూర్తిస్థాయి అణ్వాయుధ ప్రయోగాలతో కూడిన మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు. బైడెన్ హయాంలోనే జరిగి తీరుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘నేనుంటే వీటిలో దేన్నీ జరగనిచ్చేవాన్ని కాదు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే జరిగేది కాదు. ఎన్నో లక్షల ప్రాణాలు పోయేవి కాదు. అందమైన ఉక్రెయిన్ పట్టణాలు నేలమట్టమయ్యేవి కాదు’’ అని ట్రంప్ అన్నారు. అదే నా తప్పిదం... వినాశక శక్తుల బారినుంచి దేశాన్ని సాహసోపేతంగా కాపాడటమే తాను చేసిన ఏకైక తప్పిదమంటూ బైడెన్, ఆయన మద్దతుదారులపై ట్రంప్ నిప్పులు చెరిగారు. తనపై కేసు విషయంలో మన్హాటన్ జిల్లా అటార్నీ ఆల్విన్ బ్రాగ్‌తో పాటు దాన్ని పర్యవేక్షిస్తున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జువాన్ ఎం.మెర్చన్పైనా విరుచుకుపడ్డారు. వారిద్దరూ డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘అంతేకాదు, వారిద్దరికీ నేనంటే విపరీతమైన ద్వేషం. జువాన్ భార్యకు, కుటుంబానికీ నేనంటే అసహ్యమే. ఆయన కూతురు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కోసం పని చేస్తోంది’’ అన్నారు. ఎవరేం చేసినా తనను కుంగదీయలేరని, అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మార్చి చూపిస్తానని చెప్పుకొచ్చారు. -
నేడు కోర్టుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: హష్ మనీ చెల్లింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (76) మంగళవారం మన్హటన్ గ్రాండ్ జ్యూరీ ముందు హాజరు కానున్నారు. పోర్న్ చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌తో తన అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు చేసిన చెల్లింపుల కేసులో ట్రంప్‌పై నేరాభియోగాలు మోపుతూ జ్యూరీ గత గురువారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఒక క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షునిగా ట్రంప్ నిలిచారు. మంగళవారం విచారణ తంతు 10 నుంచి 15 నిమిషాల్లో ముగుస్తుందని చెబుతున్నారు. ట్రంప్‌పై ఏయే అభియోగాలు మోపిందీ ఆయనకు చదివి వినిపిస్తారు. అనంతరం ట్రంప్ ఫ్లోరిడా వెళ్లి మంగళవారం రాత్రి మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం ఇప్పటికే ప్రకటించింది. ఈ కేసును విచారిస్తున్న ప్రాసిక్యూటర్‌తో పాటు జడ్జిపైనా ట్రంప్ ఆరోపణలతో విరుచుకుపడ్డారు! ‘‘ఈ కేసు కేవలం నాపై కక్షపూరిత చర్యే. దీన్ని విచారిస్తున్న జడ్జికి నేనంటే అమిత ద్వేషం. కేసును దర్యాప్తు చేస్తున్న జిల్లా అటార్నీ ప్రత్యర్థి డెమొక్రటిక్ పార్టీకి చెందినవాడు. ఏరికోరి నన్ను ద్వేషించే జడ్జినే విచారణకు ఎంచుకున్నారు’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. క్రిమినల్ విచారణకు దారితీయగల పలు ఇతర అభియోగాలను కూడా ట్రంప్ ఇప్పటికే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్కరోజులో ఆపేవాణ్ని: ట్రంప్
వాషింగ్టన్: 2020 ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా–ఉక్రెయిన్ల యుద్ధం జరిగి ఉండేదే కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా, అసలు ఈ యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు. ఇటీవల ఫాక్స్ న్యూస్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా రష్యా–ఉక్రెయిన్ సంక్షోభానికి 24 గంటల్లోనే ముగింపు పలికి ఉండేవాడినని చెప్పుకున్నారు. ‘‘2024 దాకా యుద్ధం కొనసాగితే, నేను మళ్లీ అధ్యక్షుడినైతే ఒక్క రోజులోనే శాంతి ఒప్పందం కుదురుస్తా. నాకు, పుతిన్‌కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య శాంతి చర్చలు చాలా ఈజీ వ్యవహారం. సంక్షోభం ఇలాగే కొనసాగితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటికి మూడో ప్రపంచయుద్దానికి దారితీసి, అణుయుద్ధంగా మారే ప్రమాదముంది. రెండు ప్రపంచ యుద్ధాలు మూర్ఖుల కారణంగా స్వల్ప కారణాలతోనే జరిగాయి’’ అన్నారు. -
కెన్నెడీ హత్య.. మరిన్ని డాక్యుమెంట్లు బహిర్గతం
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ హత్యకు సంబంధించి 13 వేల పై చిలుకు డాక్యుమెంట్లను వైట్‌హౌస్ తాజాగా బయట పెట్టింది. దీంతో ఆ ఉదంతానికి సంబంధించి 97 శాతానికి పైగా సమాచారం జనానికి ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చినట్టేనని ప్రకటించింది. అయితే మరో 515 డాక్యుమెంట్లను పూర్తిగా, 2,545 డాక్యుమెంట్లను పాక్షికంగా గోప్యంగానే ఉంచనుంది! వాటిని 2023 జూన్ దాకా విడుదల చేయబోమని ప్రకటించింది. హత్యకు సంబంధించిన అతి కీలకమైన విషయాలు వాటిలోనే ఉండొచ్చని భావిస్తున్నారు. హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తి 1963 నవంబర్ 22న కెన్నెడీని డాలస్‌లో కాల్చి చంపడం తెలిసిందే. దీని వెనక పెద్ద కుట్ర ఉందంటారు. హార్వే కొన్నేళ్లపాటు సోవియట్ యూనియన్‌లో ఉండొచ్చిన వ్యక్తి కావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ కెన్నెడీని చంపించి ఉంటుందని, రహస్యాన్ని శాశ్వతంగా సమాధి చేసేందుకు హార్వేను పోలీసులు కాల్చి చంపారని ఊహాగానాలున్నాయి. -
హైదరాబాద్‌లో ట్రంప్ హౌసింగ్
పుణే: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంపెనీ దేశీయంగా మూడు నుంచి ఐదు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనుంది. ట్రంప్ రియల్టీ కంపెనీ ట్రంప్ ఆర్గనైజేషన్ 2023లో హైఎండ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, లూధియానాలలో మూడు నుంచి ఐదు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనుంది. ఇందుకు దశాబ్ద కాలంగా కల్పేష్ మెహతా ప్రమోట్ చేసిన ఢిల్లీ కంపెనీ ట్రైబెకా డెవలపర్స్‌తో కొనసాగుతున్న ప్రత్యేక లైసెన్సింగ్ ఒప్పందాన్ని వినియోగించుకోనుంది. ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీల ఏర్పాటుకు ట్రైబెకా రూ. 2,500 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు మెహతా ఇక్కడ జరిగిన ఒక సదస్సు సందర్భంగా వెల్లడించారు. సదస్సుకు ట్రంప్ ఆర్గనైజేషన్ వైస్‌ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జూనియర్ హాజరయ్యారు. ఇద్ద రూ వార్టన్లో కలసి చదువుకోవడం గమనార్హం! 8 ప్రాజెక్టులకు ఓకే రానున్న 12 నెలల కాలంలో రూ. 5,000 కోట్ల విలువైన 7–8 ప్రాజెక్టులు చేపట్టేందుకు సంతకాలు చేసినట్లు మెహతా వెల్లడించారు. వీటిలో సగం నిధులను మూడు ట్రంప్ బ్రాండ్ ప్రాజెక్టులకు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ముంబై, పుణే, ఢిల్లీ ఎన్సీఆర్తోపాటు బెంగళూరు, హైదరాబాద్ వంటి కొత్త నగరాలవైపు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చండీగఢ్, లూధియానాలలో డెవలపర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రైబెకా సీఈవో హర్షవర్ధన్ ప్రసాద్ తెలియజేశారు. ఇప్పటికే నాలుగు దేశీయంగా ఇప్పటికే నాలుగు ట్రంప్ బ్రాండ్ ప్రాపర్టీలు ఏర్పాటయ్యాయి. తద్వారా యూఎస్ వెలుపల ట్రంప్ కంపెనీకి ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. నాలుగు ప్రాజెక్టులు విక్రయానికి వీలైన 2.6 మిలియన్ చదరపు అడుగుల(ఎస్‌క్యూఎఫ్‌టీ) ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో 0.27 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ పంచ్‌శీల్ బిల్డర్స్(పుణే), 0.56 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ మాక్రోటెక్ డెవలపర్స్(ముంబై) దాదాపు విక్రయంకాగా.. 1.36 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ ఎం3ఎం గ్రూప్(గురుగ్రామ్) దాదాపు సిద్ధమైనట్లు మెహతా పేర్కొన్నారు. ఇక మరో 0.42 మిలియన్ ఎస్‌క్యూఎఫ్‌టీ యూనిమార్క్ గ్రూప్(కోల్‌కతా) నిర్మాణంలో ఉన్నట్లు తెలియజేశారు. -
భారత్‌లో కోవిడ్ సంక్షోభంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: కోవిడ్ మహమ్మారితో భారత్ సర్వనాశనమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత భారత్‌లో కరోనా వైరస్ పరిస్థితుల గురించి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇదే తొలిసారి. ప్రజారోగ్యం విషయంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్‌ను ఉదాహరణగా ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు చైనాయే కారణమని మరోసారి ట్రంప్ విరుచుకుపడ్డారు. వైరస్ వ్యాప్తికి బాద్యత వహిస్తున్న చైనా అమెరికాకు 10 ట్రిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వాస్తవానికి ప్రపంచానికి చైనా ఇంతకంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని, కానీ దాని సామర్థ్యం ఇంతేనని అన్నారు. అయితే అమెరికాకు చెల్లించాల్సింది చాలా ఉంది. చైనా చేసిన చర్యల వల్ల అనేక దేశాలు నాశనమయ్యాయని ఆరోపించారు. ఇది ప్రమాదవశాత్తు లేదా అసమర్థత వల్ల జరిగిందని భావిస్తున్నానన్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగినా.. ఎలా జరిగినా చాలా దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అన్నారు. వారు ఎప్పటికీ కోలుకోలేరని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశం(అమెరికా) చాలా తీవ్రంగా నష్టపోయింది. కానీ ఇతర దేశాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. భారత్‌నే తీసుకుంటే ఆ దేశంలో ఎన్నడూలేని విధంగా ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు భారత్‌లో ఏం జరుగుతుందో చూడండి. భారతదేశం ఎంతగా శ్రమిస్తోందో చూడండి. భారతీయులు ఎప్పుడూ బయటపడటం కోసం చూస్తున్నారు. భారత్ ఇప్పుడిప్పుడే సర్వనాశనం అయ్యింది.. వాస్తవంగా ప్రతి దేశం కూడా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఇది ఎక్కడ నుంచి, ఎలా వచ్చింది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఈ విషయం నాకు తెలుసని నేను అనుకుంటున్నాను. అయితే చైనా ఇందుకు సాయం చేయాలి. అప్పుడే భారతీయ ఆర్థిక వ్యవస్థ, అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి’’ అని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్ తొలిసారిగా 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇది వుహాన్ ల్యాబ్ నుంచే లీకయ్యిందని ట్రంప్ మరోసారిఆరోపించారు. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారికి ప్రపంచవ్యాప్తంగా 17.75 కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. 38.35 లక్షల మంది మరణించారు. ఏప్రిల్ నుంచి భారత్‌లో రెండో దశవ్యాప్తి కొనసాగుతోంది. ఆక్సిజన్, బెడ్స్ కొరత సమస్యను ఎదుర్కొన్న భారత్ ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతుంది. చదవండి:‘హలో.. హిల్లరీ క్లింటన్‌ను ఉరి తీశారా?’ FaceBook : జుకర్‌బర్గ్‌కి ఎసరు పెట్టిన ట్రంప్ -
ఒబామా నివాసానికి పేలుడు పదార్థాలు
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016 ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నివాసాలకు గుర్తుతెలియని దుండగులు పేలుడు పదార్థాలు పంపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. అయితే బుధవారం వాటిని యూఎస్ సీక్రెట్ సర్వీస్ మధ్యలోనే అడ్డగించి పేల్చివేసింది. రోజువారీ బట్వాడా చేయడానికి ముందు పార్సిల్స్‌ను తనిఖీచేస్తుండగా ఒబామా, హిల్లరీ పేరిట వచ్చిన ప్యాకేజీల్లో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామని సీక్రెట్ సర్వీస్ తెలిపింది. అవి వారికి చేరడానికి మందే పేల్చివేశామని, ఒబామా, హిల్లరీకి ఎలాంటి ముప్పులేదని స్పష్టంచేసింది. ఒబామా పేరిట వచ్చిన ప్యాకేజీని వాషింగ్టన్లో, హిల్లరీ చిరునామాతో వచ్చిన ప్యాకేజీని న్యూయార్క్‌లో గుర్తించారు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్ పూర్తిస్థాయి విచారణ ప్రారంభించింది. ఇదిలా ఉండగా, అనుమానాస్పద ప్యాకేజీ కనిపించడంతో న్యూయార్క్‌లోని బ్యూరో భవనాన్ని ఖాళీచేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ వెల్లడించింది. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు బాంబు నిర్వీర్య బృందాలు, అధికారులను పంపినట్లు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలన్నింటిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఎన్ఎన్ అధ్యక్షుడు జెఫ్ జుకర్ చెప్పారు. అనుమానాస్పద పేలుడు పదార్థాలు బయటపడటంపై అధ్యక్షుడు ట్రంప్‌కు వివరించినట్లు శ్వేతసౌధం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒబామా, హిల్లరీపై దాడులకు జరిగిన ప్రయత్నాలను శ్వేతసౌధం ఖండించింది. ఇలాంటి వాటికి బాధ్యులైన వారిని చట్ట పరిధిలో శిక్షిస్తామని తెలిపింది. -
మాజీ అధ్యక్షుడికి కేన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మెదడు కేన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తనకు రేడియేషన్, కెమోథెరపీ మూడు వారాలకోసారి జరుగుతాయని ఆయన అన్నారు. వాస్తవానికి మొట్టమొదట ఎమ్మారై తీయించుకుని.. తనకు కేన్సర్ ఉందన్న విషయం తెలుసుకున్న తర్వాత మరికొద్ది వారాలు మాత్రమే బతుకుతానేమో అనుకున్నానని చెప్పారు. అయితే.. ఇప్పుడు మాత్రం చాలా సాధారణంగానే ఉన్నానని, పూర్తిస్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, సరికొత్త సాహసాలు చేయడానికి ఎదురు చూస్తున్నానని జిమ్మీ కార్టర్ తెలిపారు. -
ఆస్పత్రిలో చేరిన జార్జి బుష్
హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ తరపు ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యులు ఆయనను పరీక్షిస్తున్నారని తెలిపారు. గతేడాది జనవరిలో ఇదే ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఆయన చికిత్స పొందారు. 90 ఏళ్ల జార్జి బుష్ ప్రస్తుతం టెక్సాస్ లో నివసిస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఆయన వీల్ చైర్ కే పరిమితమయ్యారు. నవంబర్ లో జరిగిన టెక్సాస్ ఏఅండ్‌ఎమ్ యూనివర్సిటీ కార్యక్రమానికి వీల్ చైర్ లోనే వచ్చారు.