
మాజీ అధ్యక్షుడికి కేన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మెదడు కేన్సర్తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తనకు రేడియేషన్, కెమోథెరపీ మూడు వారాలకోసారి జరుగుతాయని ఆయన అన్నారు. వాస్తవానికి మొట్టమొదట ఎమ్మారై తీయించుకుని.. తనకు కేన్సర్ ఉందన్న విషయం తెలుసుకున్న తర్వాత మరికొద్ది వారాలు మాత్రమే బతుకుతానేమో అనుకున్నానని చెప్పారు.
అయితే.. ఇప్పుడు మాత్రం చాలా సాధారణంగానే ఉన్నానని, పూర్తిస్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, సరికొత్త సాహసాలు చేయడానికి ఎదురు చూస్తున్నానని జిమ్మీ కార్టర్ తెలిపారు.