వాషింగ్టన్: భారత్‌లో కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా ఉన్నాయంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష పగ్గాలు మళ్లీ చేపడితే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తాననని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘భారత్‌లో ట్యాక్సులు మరీ ఎక్కువ. హార్లీ డేవిడ్ సన్‌లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు వేస్తోంది. అక్కడ 100 శాతం, 150, 200 శాతం వరకు పన్నులున్నాయి. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి పన్నులు విధించకూడదా? అది సరికాదు. మనం కూడా పన్నులు వసూలు చేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తా’అని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment