retaliatory action
-
ట్రంప్ నోట మళ్లీ భారత్‌పై పన్ను మాట
వాషింగ్టన్: భారత్‌లో కొన్ని ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా ఉన్నాయంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష పగ్గాలు మళ్లీ చేపడితే భారత్‌పై ప్రతీకార పన్ను విధిస్తాననని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఫాక్స్ బిజినెస్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘భారత్‌లో ట్యాక్సులు మరీ ఎక్కువ. హార్లీ డేవిడ్ సన్లాంటి అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీగా పన్నులు వేస్తోంది. అక్కడ 100 శాతం, 150, 200 శాతం వరకు పన్నులున్నాయి. మనం మాత్రం వారి ఉత్పత్తులకు ఎలాంటి పన్నులు విధించకూడదా? అది సరికాదు. మనం కూడా పన్నులు వసూలు చేయాల్సిందే. 2024 అధ్యక్ష ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే భారత్‌పై పరస్పర సమానమైన ప్రతీకార పన్ను విధిస్తా’అని ఆయన హెచ్చరించారు. -
రష్యా ప్రతీకార దాడులు
కీవ్/లండన్: నల్ల సముద్రంలో తమ కీలక యుద్ధనౌక మాస్క్వాను కోల్పోయిన రష్యా తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతోంది. శనివారం ఉక్రెయిన్‌పై క్షిపణి దాడులను ఉధృతం చేసింది. తీర్పు ప్రాంతంతోపాటు రాజధాని కీవ్‌పై దృష్టి పెట్టింది. కీవ్ పరిసరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. కీవ్ చుట్టుపక్కల ఇప్పటివరకు 1,000కి పైగా మరణించారని ఉక్రెయిన్ చెప్పింది. యుద్ధంలో 3,000 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని, 10,000 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. గత 24 గంటల్లో 8 ప్రాంతాలపై రష్యా విరుచుకుపడినట్లు చెప్పింది. తూర్పున డొనెట్స్క్, లుహాన్స్క్, ఖర్కీవ్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డినిప్రోపెట్రోవ్స్క్, పొల్టావా, కిరోవోహ్రాడ్, దక్షిణాన మైకోలైవ్, ఖేర్సన్‌పై దాడులకు పాల్పడినట్లు వెల్లడించింది. కీవ్ సమీపంలోని డార్నియిట్స్కీపై భారీగా దాడులు జరిగాయి. ఎస్‌యూ–35 ఎయిర్‌క్రాఫ్ట్ బాంబుల వర్షం కురిపించింది. ఖర్కీవ్‌పై రాకెట్ దాడుల్లో ఏడు నెలల చిన్నారి సహా ఏడుగురు మరణించారు. ఒలెగ్జాండ్రియాలోని ఎయిర్‌ఫీల్డ్‌పై శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిని ప్రయోగించిందని నగర మేయర్ చెప్పారు. లుహాన్స్క్లో దాడుల్లో ఒకరు మరణించారు. సెవెరోండోన్టెస్క్, లీసీచాన్‌స్క్‌లో దాడుల్లో గ్యాస్ పైప్లైన్లు దెబ్బతిన్నాయి. ఒక చమురు శుద్ధి కర్మాగారం ధ్వంసమయ్యింది. రష్యాకు పరాభవం తప్పదు: జెలెన్స్కీ రష్యా దాడుల నుంచి దేశ ప్రజలను కాపాడుకొనేందుకు చేయాల్సిందంతా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ఆక్రమణదారులకు పరాభవం తప్పదన్నారు. తమ దేశం ఎన్నటికీ రష్యా వశం కాబోదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు చాలవు రష్యాపై విధించిన ఆంక్షలు చాలవని జెలెన్స్కీ అన్నారు. రష్యా చమురును నిషేధించాలని ప్రపంచ దేశాలను కోరారు. యుద్ధం ఆగాలంటే అన్ని దేశాలు రష్యాతో ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని చెప్పారు. ► మారియూపోల్ పునర్నిర్మాణానికి సాయమందిస్తానని ఉక్రెయిన్ కుబేరుడు రినాట్ అఖ్మెటోవ్ ప్రకటించారు. దేశంలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ ‘మెటిన్‌వెస్ట్’ యజమాని అయిన అఖ్మెటోవ్కు మారియూపోల్‌లో రెండు ఉక్కు పరిశ్రమలున్నాయి. ► సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో వందలాది మంది రష్యాకు అనుకూలంగా భారీ ప్రదర్శన చేపట్టారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని సూచించే ‘జెడ్’ అక్షరమున్న టీ షర్టులు ధరించారు. పుతిన్ చిత్రాలతో కూడిన ప్లకార్డులను చేబూనారు. ఐరాస మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే తీర్మానానికి మద్దతుగా సెర్బియా ఓటేయడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించని ఒకే ఒక్క యూరప్ దేశం సెర్బియా. యూకే ప్రధాని, మంత్రులపై రష్యా నిషేధం ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆయన మంత్రివర్గ సహచరులతో పాటు పలువురు నేతలపై నిషేధం విధిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో యూకే ప్రభుత్వం రష్యాపై ఆంక్షలు విధించినందుకు ప్రతిచర్యగా ఈ నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నిషేధానికి గురైన వారిలో భారత సంతతికి చెందిన ఆర్థిక మంత్రి రిషి సునక్, హోంమంత్రి ప్రీతీ పటేల్ కూడా ఉన్నారు. రష్యా ప్రభుత్వం ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఇలాంటి నిషేధమే విధించింది. -
కశ్మీర్లో పాక్ దుస్సాహసం
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం సరిహద్దుల వెంట పలు చోట్ల భారత భద్రత బలగాలు, పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఆ కాల్పుల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జవాన్లు, ఎనిమిది మంది పౌరులు గాయపడ్డారు. పాక్ కాల్పులకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో 8 మంది పాక్ జవాన్లు చనిపోయారు. దాదాపు 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉడి, గురెజ్ సెక్టార్ల మధ్య పాకిస్తాన్ మోర్టార్లు, ఇతర ఆయుధాలను ఉపయోగించిందని, పౌర ఆవాసాలు లక్ష్యంగా కాల్పులు జరిపిందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. భారత్ ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు భారీగా నష్టం జరిగిందని, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ సైన్యానికి చెందిన మౌలిక వసతుల ప్రాంతాలు ధ్వంసమయ్యాయని వివరించారు. కొన్ని ఆయుధ కేంద్రాలు, ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించేందుకు ఉపయోగించే స్థావరాలు ధ్వంసమయ్యాయన్నారు. కల్నల్ కాలియా తెలిపిన వివరాల మేరకు... పాక్ కాల్పుల్లో చనిపోయిన వారిలో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్, నలుగురు ఆర్మీ జవాన్లు, ఆరుగురు పౌరులు ఉన్నారు. 8 మంది పౌరులతో పాటు నలుగురు జవాన్లు గాయపడ్డారు. నియంత్రణ రేఖ వెంట ఉడి, దావర్, కేరన్, నౌగమ్, గురెజ్ సహా పలు సెక్టార్లలలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. హజీపీర్ సెక్టార్లో పాక్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేశ్ దోవల్ చనిపోయారు. ఒక జవాను గాయపడ్డారు. కమల్‌కోటే సెక్టార్లో ఇద్దరు పౌరులు, బాలాకోట్ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. ఉడి సెక్టార్‌లోని నంబ్లా ప్రాంతంలో పాక్ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించే కుయత్నాన్ని తిప్పికొట్టామని కల్నల్ కాలియా వెల్లడించారు. ‘కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్లో ఎల్ఓసీ వెంట అనుమానాస్పద కదలికలను మన బలగాలు గుర్తించాయి. అది ఉగ్రవాదుల చొరబాటుగా గుర్తించి, వెంటనే స్పందించి, వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి’ అని వివరించారు. ఈ వారంలో ఇది రెండో చొరబాటు యత్నమని, మాచిల్ సెక్టార్లో ఈనెల 7న రాత్రి కూడా ఒక చొరబాటు యత్నాన్ని అడ్డుకుని, ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చామన్నారు. పూంఛ్‌లోని పలు ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులకు, మోర్టార్ షెల్లింగ్నకు పాల్పడిందని, భారత బలగాలు వాటికి దీటుగా స్పందించాయని జమ్మూలో రక్షణ శాఖ అధికారి తెలిపారు. ‘పాక్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోవల్ ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌కు చెందినవారు. 2004లో బీఎస్ఎఫ్లో చేరారు. ఆయనకు తండ్రి, భార్య, తొమ్మిదేళ్ల కూతురు ఉన్నారు. దేశ రక్షణలో ఆయన వీర మరణం పొందారు’ అని ఢిల్లీలోని బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్ లొకేషన్లో ఎస్ఐ రాకేశ్ దోవల్‌తో పాటు విధుల్లో ఉన్న కాన్స్టేబుల్ వాసు రాజాకు గాయాలయ్యాయని, ఆయన చికిత్స పొందుతున్నారని వివరించారు. -
అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు
న్యూఢిల్లీ: టారిఫ్యేతర ఆంక్షలు విధిస్తూ, భారత్ నుంచి ఎగుమతులకు అవరోధాలు సృష్టిస్తున్న దేశాల పేర్లు చెప్పాలని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. అలాంటి దేశాలపై కచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ ఈ విషయాలు తెలిపారు. ఏ ఒక్కరి విషయంలోనో కాకుండా అందరికీ ప్రయోజనాలు కలిగేలా సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలన్నది తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ‘ఏ దేశమైనా మీ ఎగుమతులపై టారిఫ్యేతర ఆంక్షలు విధించడం గానీ.. ఇతరత్రా అవరోధాలు గానీ సృష్టించడం గానీ చేస్తుంటే ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది. ఆయా దేశాలపై అదే తరహా వాణిజ్యపరమైన ఆంక్షలతో తగు చర్యలు తీసుకుంటుంది‘ అని గోయల్ తెలిపారు. వాస్తవ పరిస్థితులు మీరే చెప్పండి .. ‘మా అధికారులు నాకు చెప్పేవన్నీ.. అంతా బాగానే ఉందనే అభిప్రాయం కలిగేలా ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే కచ్చితంగా అలా ఉన్నట్లు అనిపించడం లేదు. కాబట్టి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా.. సమస్యలేమైనా ఉన్నాయా.. వాస్తవ పరిస్థితులను మీరే ప్రభుత్వానికి తెలియ జేయండి. నేను, మా అధికారులు మీకు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటాం‘ అని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యలోటును కట్టడి చేయాలి: ఐఎంఎఫ్ ఇదిలావుండగా, భారత్ ద్రవ్యలోటును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. వ్యయాల హేతుబద్ధీకరణ, ఆదాయం పెంపు మార్గాల ద్వారా ఇది సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఫిక్కీ న్యూఢిల్లీలో నిర్వహించిన 92వ వార్షిక సదస్సులో ఆమె మాట్లాడారు. గడచిన కొద్ది త్రైమాసికాలుగా చూస్తే, ప్రైవేటు రంగం డిమాండ్ మందగమనంలో ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే పెట్టుబడుల్లో బలహీనత కొనసాగితే, దీర్ఘకాలంలో అది వృద్ధితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. బజాజ్ వ్యాఖ్యలకు కౌంటర్! ప్రభుత్వ విధానాలను విమర్శించే దమ్మెవరికీ లేకుండా పోయిందని, భయాందోళనలకు గురి చేసే వాతావరణం నెలకొందని పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై గోయల్ స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, తమ ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తుందని, అందరి అభిప్రాయాలనూ వింటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో.. ప్రజలు, పరిశ్రమవర్గాల నుంచి మరింతగా తెలుసుకోవాలనుకుంటోందని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. -
ట్రేడ్ వార్: అమెరికాకు మరో గట్టి షాక్
లండన్: ఏకపక్ష నిర్ణయాలతో ట్రేడ్‌వార్ అందోళన రేపుతున్న అమెరికాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుసగా ఒక్కోదేశం అమెరికా టాక్స్ విధింపులను తిప్పికొట్టే చర్యలకు దిగుతున్నాయి. ఇప్పటికే భారతదేశం అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సుంకాలను పెంచుతామని ట్రంప్ తొలుత ప్రతిపాదించినప్పుడే తాము కూడా ప్రతీకార చర్యలు చేపడతామని హెచ్చరించిన యూరోపియన్ యూనియన్ ఇపుడు అన్నంత పనీ చేసింది. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. 3.2 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ వస్తువులపై టారిఫ్‌లను శుక్రవారం నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. విస్కీ, పొగాకు, హార్లీ డేవిడ్ సన్ బైక్స్, కాన్‌బెర్రీ, పీనట్ బటర్‌లాంటి అమెరికా ఉత్పత్తులపై 25శాతం దిగుమతి సుంకాన్ని పెంచింది. దీంతోపాటు పాదరక్షలు, కొన్నిరకాల దుస్తులు, వాషింగ్ మెషీన్లు తదితర ఎంపిక చేసిన కొన్ని అంశాలపై 50శాతంకాదా టాక్స్‌ను పెంచింది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్-క్లాడే జంకర్ గురువారం రాత్రి ఐరిష్ పార్లమెంటులో మాట్లాడుతూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు చెప్పారు. సుంకం విధింపులతో అమెరికా చట్టవిరుద్ధంగా, చరిత్రకువిరుద్ధగా పోతోందని వాఖ్యానించారు. అమెరికా యుఎస్ సుంకాల నేపథ్యంలో తమ ప్రతిస్పందన స్పష్టంగా ఉంటుందున్నారు. అటు భారత్ అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ పెంచిన సుంకాలు అమల్లోకి రానున్నాయి. కాగా ఉక్కు దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలను భారీగా పెంచి వాణిజ్య యుద్ధానికి తెర లేపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఇతర దేశాలను కూడా బెదిరిస్తున్నారు. ఈ సుంకాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతీకార చర్యలకు దిగితే యూరప్ దేశాలకు చెందిన కార్లపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ప్రతీకారం తప్పదు
♦ ఆ స్థాయిలో పాక్ పాశవికత: భారత ఆర్మీ ♦ సైనికుల తలలు నరకడంపై పాక్‌కు తీవ్ర నిరసన తెలిపిన భారత డీజీఎంఓ ♦ స్పష్టమైన ఆధారాలు చూపండి: పాకిస్తాన్ ♦ గాజులు తీసేసి ప్రభుత్వం ఏదోకటి చేయాలి: కాంగ్రెస్ న్యూఢిల్లీ/బెంగళూరు: జమ్మూ–కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ ఇద్దరు సైనికుల తలలు నరకడంపై భారత్ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపింది. ఇది అత్యంత క్రూరమైన, అమానవీయ ఘటనగా పేర్కొంది. ప్రతీకారం తీర్చుకునేందుకు అర్హమైన రీతిలో పాక్ వ్యవహరించిందని భారత్ ఆర్మీ మంగళవారం స్పష్టం చేసింది. ఆ మేరకు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ డీజీఎంఓకు భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్(డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ భారత్ ఆందోళనను తెలియచేశారు. ‘అన్ని మానవీయ విలువల్ని అతిక్రమించి.. క్రూరమైన, పాశవిక చర్యకు పాల్పడ్డారని పాక్ డీజీఎంఓకు భారత డీజీఎంఓ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రతీకార చర్య తప్పదన్న రీతిలో పాక్ వ్యవహరించిందని కూడా స్పష్టం చేశార’ని ఒక ప్రకటనలో ఆర్మీ తెలిపింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో నియంత్రణ రేఖ వెంట బోర్డర్ యాక్షన్ టీం(బీఏటీ) శిక్షణ కేంద్రాలు ఉండడంపై ఆందోళన తెలియచేసినట్లు ఆర్మీ వెల్లడించింది. భారత సైనికుల్ని హత్య చేసిన ప్రాంతానికి సమీపంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ పోస్టు ఈ దుశ్చర్యకు సాయపడిందన్న విషయాన్ని కూడా హాట్‌లైన్ సంభాషణల్లో పాక్ దృష్టికి డీజీఎంవో తీసుకెళ్లారు. ఈ హేయమైన చర్యకు తగిన జవాబు ఇస్తామని ఇంతకుముందే భారత ఆర్మీ ప్రకటించింది. మరోవైపు తాజా ఘటనపై మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఎల్వోసీ వెంట ఎస్ఓపీస్ను సమీక్షిస్తాం పాక్ బలగాల దాడి నేపథ్యంలో సరిహద్దు రేఖ వెంట స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్(ఎస్ఓపీస్)ను భారత ఆర్మీ, బీఎస్‌ఎఫ్‌లు సమీక్షించనున్నాయి. అయితే ఈ విషయమై ఇప్పుడే అధికారికంగా మాట్లాడనని... విధివిధానాల మార్పులో ఎలాంటి సందేహం లేదని, బీఎస్ఎఫ్ అదనపు డీజీ కమల్ ఎన్ చౌబే చెప్పారు. ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడలేదు: పాక్ ఆర్మీ భారత సైనికుల తలలు నరికినట్లు స్పష్టమైన ఆధారాలు చూపాలని పాకిస్తాన్ ఆర్మీ డిమాండ్ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, భారత సైనికుల తలలు నరికారన్న భారత్ ఆరోపణల్ని పాక్ డీజీఎంఓ తోసిపుచ్చారని ఆ దేశ ఆర్మీ తెలిపింది. కశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఆందోళనల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నంగా పాకిస్తాన్ కొట్టిపడేసింది. ‘గన్ కీ బాత్’ ప్రారంభించండి: శివసేన కేంద్ర ప్రభుత్వంపై మిత్రపక్షం శివసేన మండిపడింది. పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు ‘మన్ కీ బాత్’ని ఆపి ‘గన్ కీ బాత్’ని ప్రారంభించాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ప్రధాని మోదీకి సూచించారు. మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత రాందాస్ కదమ్ మాట్లాడుతూ.. ‘మనం ఒక సర్జికల్ దాడి చేశాక.. దాని కంటే పది రెట్లు ఎక్కువగా మన సైనికుల్ని పాకిస్తాన్ చంపింది. ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో ప్రధాని ఆలోచించాలి. ఎన్నికలపై కాదు.. సరిహద్దుల్లో భద్రతపై దృష్టి పెట్టాల’న్నారు. తగినరీతిలో బుద్ధిచెపుతాం: వెంకయ్య పాకిస్తాన్‌ను దుష్టదేశంగా కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభివర్ణించారు. పాకిస్తాన్ చర్యలకు భారత్ తగిన రీతిలో బుద్ది చెబుతుందని పేర్కొన్నారు. ‘మేం చాలా దృఢనిశ్చయంతో ఉన్నాం. సాధ్యమైనదంతా చేస్తాం. ప్రభుత్వం ఆ పనిలోనే ఉంది. దాని గురించి త్వరలో మీరు వింటారు’ అని విలేకరులతో పేర్కొన్నారు. కశ్మీర్ లోయతో పాటు, నియంత్రణ రేఖ వెంట పరిస్థితిపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా చర్చించారు. అదును చూసి దెబ్బకొట్టాలి: ఆర్మీ భారత సైనికుల హత్య అనంతర పరిణామాల్ని పాక్ ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత ఆర్మీ వైస్ చీఫ్ శరత్‌చంద్ పేర్కొన్నారు. అదును చూసి పాక్‌కు సమాధానం ఇవ్వాలన్నారు. ఆర్మీ తీసుకునే చర్యల్ని చెప్పదల్చుకోలేదని, మాటలకు బదులు ఎప్పుడు ఎలా బదులివ్వాలన్న దానిపై దృష్టిపెట్టాలని చెప్పారు. ‘పాక్ సైన్యం మన భూభాగంలోకి వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటనకు వారు బాధ్యత వహించడంతోపాటు.. పరిణామాల్ని ఎదుర్కోవాలి’ అని శరత్‌చంద్ చెప్పారు. భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే తగిన విధంగా ప్రతిస్పందిస్తామని పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది. ఆర్మీకి స్వేచ్ఛనివ్వండి: ఆంటోనీ జమ్మూ కశ్మీర్లో ఇద్దరు సైనికుల హత్యపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. జాతీయ భద్రతపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి విధానం లేదని కాంగ్రెస్ విమర్శించింది. ‘మన దేశ సరిహద్దుల్లో ఇద్దరు సైనికుల్ని పాకిస్తాన్ హత్య చేస్తే... ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల గెలుపు సంబరాల కోసం విజయ్ పర్వ్‌ను బీజేపీ నిర్వహించడం సిగ్గుచేటు. ప్రభుత్వం తొడుక్కున్న గాజులను తీసేసి ఏదొ ఒకటి చేయాలి’ అని కాంగ్రెస్ ప్రతినిధి కపిల్ సిబల్ ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో భారత సైనికుల తలల్ని పాక్ ఆర్మీ నరికినప్పుడు.. నాటి ప్రధాని మన్మోహన్‌కు గాజులు పంపుతానని సుష్మా స్వరాజ్ చెప్పిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ సిబల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ శాఖకు పూర్తి స్థాయి మంత్రి ఉంటే సీమాంతర ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు ఒక విధానాన్ని ఖరారు చేయవచ్చన్నారు. పాకిస్తాన్‌పై సరైన చర్య చేపట్టేందుకు ఆర్మీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ సూచించారు. యూపీఏ హయాంలో ఇలాంటి సంఘటన ఒక్కటే జరిగిందని, అయితే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మూడుసార్లు సైనికుల తలలు నరికిన సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు.