ఆస్పత్రిలో చేరిన జార్జి బుష్
హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్ డబ్ల్యూ బుష్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో ఆయనను హూస్టన్ మెథడిస్ట్ ఆస్పత్రిలో చేర్చామని బుష్ తరపు ప్రతినిధి జిమ్ మెక్గ్రాత్ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్యులు ఆయనను పరీక్షిస్తున్నారని తెలిపారు.
గతేడాది జనవరిలో ఇదే ఆస్పత్రిలో రెండు నెలల పాటు ఆయన చికిత్స పొందారు. 90 ఏళ్ల జార్జి బుష్ ప్రస్తుతం టెక్సాస్ లో నివసిస్తున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఆయన వీల్ చైర్ కే పరిమితమయ్యారు. నవంబర్ లో జరిగిన టెక్సాస్ ఏఅండ్ఎమ్ యూనివర్సిటీ కార్యక్రమానికి వీల్ చైర్ లోనే వచ్చారు.