న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు.
ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్‌లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment