Union minister Nirmala Sitharaman
-
ఒబామా వ్యాఖ్యలపై సీతారామన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు. ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్‌లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు. -
కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం భేటీ అయ్యారు. టీటీడీకి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. గతంలో వుడా(విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చెల్లించిన రూ.219 కోట్లను వడ్డీతోసహా రీఫండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రీఫండ్ చేయాలని కేంద్రాన్ని విజయసాయిరెడ్డి కోరారు. చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు -
హోటల్స్‌లో ఫుడ్‌పై అదనపు ట్యాక్స్ లేదు..
- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నై: హోటళ్లలో ఆహార పదార్థాలకు జీఎస్టీ ద్వారా అదనంగా పన్నులేవీ విధించలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆదివారం చెన్నైలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. పాత పన్నుకు సమానంగా కొత్త పన్నును విధించామని, అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఒక్కో వస్తువుకు, సేవలకు ఏమేర పన్ను విధించాలో జీఎస్టీ కౌన్సిల్ స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించిందని మంత్రి నిర్మల గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను కంటే తక్కువ పన్ను విధింపునకే తాము ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొన్నారు. -
వీసా ఆందోళనలు : రంగంలోకి మంత్రి
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాపై రేకెత్తిన ఆందోళనల నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగనున్నారు. అమెరికా వీసా విధానంపై టెక్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్తో త్వరలోనే మంత్రి భేటీ కానున్నట్టు సోమవారం తెలిపారు. అమెరికా ఇటీవల హెచ్-1బీ వీసాలో సవరణలు చేపట్టడానికి తీసుకొచ్చిన బిల్లు ఇండియన్ ఐటీ ఇండస్ట్రిపై ప్రభావం చూపనుందని తెలిపారు. మన టెకీస్ అక్కడ పనిచేస్తున్నారన్నారు. ఈ విషయంపై అమెరికా అథారిటీలపై నిరంతరం టచ్‌లో ఉంటున్నామని మంత్రి చెప్పారు. ''హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించడం కచ్చితంగా భారత్‌పై ప్రభావం చూపనుంది. ఈ విషయంపై పార్లమెంటరీ సమావేశాలనంతరం నాస్కామ్తో చర్చిస్తాం. అమెరికాలో ఎక్కువగా పేరులోకి వచ్చిన దేశీయ కంపెనీలు, ఆ వాతారణంలో ఎలా పనిచేస్తున్నాయనే దానిపై వారితో సంప్రదింపులు జరుపుతాం. ఎలాంటి వ్యూహాలను వారు అమలుచేస్తున్నారో కూడా తెలుసుకుంటాం'' అని చెప్పారు. నాస్కామ్ ప్రత్యేక బృందం సైతం ఈ నెల 22-24 మధ్యలో అమెరికాకు వెళ్లనుంది. కొత్తగా ఏర్పడిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వర్గాలతో, సెనేటర్లతో సమావేశం కానుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన అనంతరం దేశీయ ఐటీ కంపెనీల్లో ఆందోళనలు రేపుతూ హెచ్-1బీ వీసా విధానంలో మార్పులను ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రకారం హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రెట్టింపు కానుంది. విదేశీ ఉద్యోగులకు వీసా జారీలు కఠినతరం కానున్నాయి. దీంతో దేశీయ ఐటీ కంపెనీలపై నిర్వహణ వ్యయాల భారం భారీగా పడనుంది. -
విశాఖ-చెన్నై కారిడార్‌పై అధ్యయనం పూర్తి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించి ఏడీబీ (ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విదేశీ ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఏడీబీ అధ్యయనం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఐఐఎఫ్‌టీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థలను కాకినాడ ఎక్స్పోర్ట్ జోన్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. ఎన్ఐడీ-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను విజయవాడలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభించామన్నారు. విదేశీ ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలను పూర్తి పారదర్శకతతో నిర్వహించడానికే డాష్‌బోర్డ్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. డెరైక్టర్ జన రల్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ దీన్ని నిర్వహిస్తుంద ని వివరించారు. -
మెదక్ నిమ్జ్ ద్వారా రూ.17,300 కోట్ల పెట్టుబడులు
లోక్‌సభలో నిర్మలా సీతారామన్ సాక్షి, న్యూఢిల్లీ: మెదక్‌లో ప్రతిపాదిత జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్)కి 2016 జనవరి 22న కేంద్రం తుది ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు జవాబిస్తూ.. ‘తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం నిమ్జ్ చివరి విడత విస్తరణలోగా రూ.17,300 కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.77 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది’ అని వివరించారు. మొత్తం 12,635 ఎకరాల స్థలం ఈ నిమ్జ్‌కు అవసరం కాగా, తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ 3,501 ఎకరాల స్థలాన్ని సేకరించిందని చెప్పారు. రాష్ట్రంలో రూ.33 వేల కోట్ల ఎగుమతులు తెలంగాణలోని సెజ్‌ల ద్వారా 2015-16లో డిసెంబర్ నాటికి రూ.32,966.19 కోట్ల మేర ఎగుమతులు జరిగాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 37,107 కోట్లుగా ఉంది. కాగా, ఉమ్మడి ఏపీలో 2013-14లో రూ.33,291 కోట్ల విలువైన ఎగుమతులుండగా, 2014-15లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో రూ. 7,887 కోట్లుగా ఉంది. 2015-16లో డిసెంబర్ వరకు రూ. 7,599 కోట్లుగా ఉండటం గమనార్హం. -
మంత్రి చెప్పినా పలకని ధర
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పినా పొగాకుకు మద్దతు ధర అమలు కావడం లేదు. గత వారంలో కేంద్రమంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలో ఒక్కో గ్రేడ్‌కు సగటున ఎంత ధర ఇవ్వాలో నిర్ణయించారు. దీని ప్రకారం నాణ్యమైన పొగాకు (ఏ గ్రేడ్)కు రూ.114 తగ్గకుండా ఇవ్వాలని సూచించగా రూ.100 కూడా రావడం లేదు. మిడిల్ గ్రేడ్ పొగాకుకు రూ.102లకు తగ్గకుండా ధర వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చినా రూ.80 నుంచి రూ. 90 మధ్యనే నడుస్తోంది. ఇక లోగ్రేడ్ విషయానికి వస్తే కిలోకు రూ.67 ఇస్తామని చెప్పగా రూ.50 నుంచి రూ. 60 మధ్యనే నడుస్తోంది. జిల్లాలో సగటున రూ.99 ధర వచ్చే బాధ్యత మాదని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకూ సగటు ధర రూ.93 కూడా దాటడం లేదు. ప్రస్తుతం పొగాకు బోర్డు వేలం కేంద్రాలకు వస్తున్న పొగాకులో 50 నుంచి 60 శాతం మంచి నాణ్యత ఉన్న పొగాకు వస్తోంది. నాణ్యమైన పొగాకు వస్తుంటేనే సగటు ధర రూ.93 దాటడం లేదని, లో గ్రేడ్ పొగాకు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో ఉత్పత్తైన పొగాకులో 75 శాతం వరకూ మీడియం - లో గ్రేడ్ పొగాకే వచ్చింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు తమ వద్ద పొగాకును బోర్డు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బోర్డు మాత్రం దీనికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. గత ఏడాది ఈ ప్రాంతంలో 213 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తయితే సగటు ధర రూ.116 పలికింది. ఈ ఏడాది అది వంద రూపాయలలోపే ఉండటంతో ఒక్కో బ్యారన్‌కు రెండు లక్షల రూపాయల వరకూ రైతు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. విస్తీర్ణం తగ్గింపుపై ఆగ్రహం వచ్చే ఏడాది పొగాకు పంట లక్ష్యం తగ్గింపుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పాగాకు బోర్డు కర్ణాటకపై ప్రేమ చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌పై శీతకన్ను వేసిందని రైతులు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో నాలుగు మిలియన్ కేజీల లక్ష్యాన్ని తగ్గించిన పొగాకు బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 52 మిలియన్ కేజీల లక్ష్యాన్ని తగ్గించింది. సుమారు 30 శాతం ఏరియాలో పంటను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దక్షిణ తేలిక నేలలు 58 మిలియన్ కిలోలకుగాను ఎనిమిది మిలియన్ కిలోలు, నల్లరేగడి నేలల్లో 47 మిలియన్ కిలోలకు గాను 10 మిలియన్ కిలోలు లక్ష్యం తగ్గించారు. జిల్లాలో సుమారు లక్షన్నర ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. ఈ ఏడాది లక్ష్యం తగ్గించడం వల్ల సుమారు 30 వేల ఎకరాల్లో పొగాకు పంటను తగ్గించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఈ 30 వేల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంట ఏది వేయాలనే సందిగ్ధత ఉంది. పొగాకు వేసే ప్రాంతమంతా వర్షాధారం కావడంతో శనగ, మిర్చి తదితర పంటలు పండే అవకాశం లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం పట్ల రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
పొగాకు కొనుగోళ్లు జరపాల్సిందే
♦ ట్రేడర్లతో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ♦ నిల్వల కొనుగోళ్లపై మంత్రితో భేటీ అయిన రాష్ట్ర బృందం సాక్షి, న్యూఢిల్లీ : పొగాకు పంటకు మద్దతు ధరలేక, కొనేవారు లేక తీవ్ర ఇక్కట్లలో ఉన్నామని పొగాకు రైతులు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వద్ద మొరపెట్టుకున్నారు. పలువురు పొగాకు బోర్డు సభ్యులు, రైతులు, కొనుగోలుదారులు, సిగరెట్ తయారీ కంపెనీల ప్రతినిధులు, ఎగుమతిదారులు మంగళవారం నిర్మలాసీతారామన్‌తో సమావేశమయ్యారు. పొగాకు నిల్వలను కొనుగోలు చేయాలని, గత ఏడాది కొనుగోలు చేసిన సగటు ధరకు గానీ, మూడేళ్ల సగటు ధర గానీ చెల్లించాలని కోరారు. నిర్ధేశిత మొత్తంలో పొగాకు అవసరమని చెప్పిన తరువాత ఇప్పుడు కొనుగోలు చేయకపోవడం సరికాదని వాపోయారు. ఈ నేపథ్యంలో నిర్మలాసీతారామన్ కొనుగోలుదారులను గట్టిగా నిలదీసినట్టు సమాచారం. సమావేశం అనంతరం వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొగాకు కొనుగోళ్లు, ధరపై జులై 4న గుంటూరులో జరిగే సమావేశంలో తుది నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఓటుకు కోట్లు కేసు నిందితుడు రేవంత్ రెడ్డికి బెయిల్ రావడం సంతోషకరమని పుల్లారావు అన్నారు. -
‘ప్రత్యేక హోదా ఎప్పుడొస్తుందో చెప్పలేం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. అయితే ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేం’ అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి ఉందని, అయినప్పటికీ పలు కారణాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందన్నారు. విజయవాడలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్న బెంగాల్, కేరళ, ఏపీలకు అదనంగా 14వ ఆర్థిక సంఘం నిధులిస్తున్నామన్నారు. హోదా రాకపోవడం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతాయనేది నిజమేనన్నారు. విశాఖపట్నం-కాకినాడ, గన్నవరం-కంకిపాడు, శ్రీకాళహస్తి-ఏర్పేడు పారిశ్రామికవాడల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను నెలకొల్పుతున్నామన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా ఈ సంవత్సరం నుంచే అది ఏర్పాటవుతుందన్నారు. -
2020 నాటికి ఎగుమతులు 900 బిలియన్ డాలర్లు!
మోదీ ప్రభుత్వ లక్ష్యం ఇది.. • ఎగుమతులను రెట్టింపు చేసేలా తొలి విదేశీ వాణిజ్య విధానం ఆవిష్కరణ • కొత్త మార్కెట్ల అన్వేషణకు వ్యూహాలు న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వ మొట్టమొదటి విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ) భారీ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. 2020 నాటికి ఈ పరిమాణం 900 బిలియన్ డాలర్లుగా ఉండాలన్న ధ్యేయంతో ఉన్నట్లు విధానం స్పష్టం చేసింది. 2013-14లో భారత వ్యాపార ఎగుమతులు 312 బిలియన్ డాలర్లు. సేవల రంగాన్ని కూడా కలుపుకుంటే ఈ విలువ దాదాపు 466 బిలియన్ డాలర్లు ఉంది. 2014-15 ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే స్థాయిలో ఎగుమతులు నమోదుకావచ్చని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఐదేళ్లకు (2015-2020) సంబంధించి బుధవారం తాజా విధానాన్ని విడుదల చేసింది. లక్ష్యాలను సాధించే క్రమంలో వాణిజ్య విధానాన్ని ఇకపై రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుంది. ఇప్పటి వరకూ వార్షికంగా ఈ సమీక్ష జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వాణిజ్యంలో భారత్ వాటా కేవలం 2 శాతం. ఈ రేటును 3.5 శాతానికి పెంచాలన్నది లక్ష్యమని వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ తెలిపారు. ఈ దిశలో కొత్త మార్కెట్ల అన్వేషణకు దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రపంచ స్థాయిలో భారత వాణిజ్య వాటా పెంపు లక్ష్యంగా ట్రేడ్ కౌన్సిల్ అండ్ నేషనల్ కమిటీసహా పలు సంస్థల ఏర్పాటును వాణిజ్య విధానం ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. 3 శాతం వడ్డీ సబ్సిడీ పథకం పునరుద్ధరణ డిమాండ్‌పై ఆయన సమాధానం ఇస్తూ, దీని అమలుకు వాణిజ్య మంత్రిత్వశాఖ త్వరలో కేబినెట్ ఆమోదాన్ని కోరనున్నట్లు తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు అనుసంధానం.. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో అనుసంధానం ద్వారా.. భారీ ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా ఎఫ్‌టీపీని రూపొందించినట్లు విధాన ప్రకటన కార్యక్రమం సందర్భంగా వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు, ప్రత్యేక ఆర్థిక జోన్లకు(ఎస్ఈజెడ్) తమ ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు కల్పిస్తున్నదని తెలిపారు. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధికి భారీ స్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. రాష్ర్ట ప్రభుత్వాలతో కలిసి ఒక వ్యవస్థాగత ఫ్రేమ్‌వర్క్ ద్వారా దేశ ఎగుమతుల వృద్ధికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్(ఈపీఎం)ను ఆవిష్కరించనున్నట్లు ఎఫ్టీపీ సూచించింది. రక్షణ, ఫార్మా, పర్యావరణ సానుకూల ఉత్పత్తులు.. అలాగే విలువ ఆధారిత ఎగుమతులపై కొత్త పాలసీ దృష్టి పెడుతుందని తెలిపారు. తయారీ, కేపిటల్ గూడ్స్ ఉత్పత్తి వృద్ధికీ పాలసీలో చర్యలు తీసుకున్నామన్నారు. ఈ-కామర్స్ కంపెనీల ఎగుమతి ప్రొడక్టులకు కూడా ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని, ఇది ఉపాధి అవకాశాల సృష్టికి దోహదపడుతుందని తెలిపారు. 2 కొత్త స్కీమ్‌లు..: ఎగుమతుల పెంపు లక్ష్యంగా... గతంలో ఉన్న పలు ‘క్లిష్ట విధానాల’ స్థానంలో కొత్తగా రెండు పథకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎంఈఐఎస్), సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎస్ఈఐఎస్) పథకాలను తాజాగా ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ పథకాల అన్ని ప్రయోజనాలను ఎస్‌ఈజెడ్‌లలోని యూనిట్లకు కూడా అందించనున్నట్లు తెలిపారు. ఎస్ఈఐఎస్ భారత్‌లోని ‘సర్వీస్ ప్రొవైడర్లకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఎంఈఐఎస్ కింద ప్రాసెస్డ్, ప్యాకేజ్డ్ అగ్రికల్చరల్, ఆహార వస్తువులు, వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులకు ప్రయోజనం కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలు ఎగుమతుల సబ్సిడీలను తొలగించాలని కోరుతున్నట్లు పేర్కొన్న మంత్రి, దీనికి కట్టుబడి ఉంటూనే ఎగుమతుల వృద్ధి వ్యూహాలను కేంద్రం రూపొందిస్తోందన్నారు. యోగా, హస్త కళల వంటి భారత సాంప్రదాయక అంశాలు, తత్సంబంధ సేవలను కూడా ‘సేవా సంబంధ’ ఎగుమతుల కేటగిరీలో చేర్చాలని ఎఫ్టీపీ పేర్కొంది. మిశ్రమ స్పందన... తాజా విధానంపై సంబంధిత వర్గాల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య(ఎఫ్ఐఈఓ) డెరైక్టర్ జనరల్, సీఈఓ అజయ్ షాహీ మాట్లాడుతూ... గతానికన్నా భిన్నంగా సానుకూలంగా విధానం ఉందన్నారు. తాజా సమస్యలను ఈ విధానం గుర్తించి, అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నించిందని అన్నారు. కాగా,ఇది కొత్త సీసాలో పాత సారాను తలపిస్తోం దని వాణిజ్య నిపుణులు, బిజి నెస్ స్టడీస్ అకాడమీ డెరైక్టర్ అరుణ్ గోయల్ అన్నారు. వైజాగ్, భీమవరంకు ప్రత్యేక హోదా.. తాజా పాలసీ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, భీమవరంను ‘టౌన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ’ జాబితాలో చేర్చారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోకి ఎగుమతి ఆధారిత యూనిట్లకు పలు ఆర్థిక పరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్రత్యేక హోదా 21 నగరాలు, పట్టణాలకు ఉంది. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 23కు చేరింది.