హోటల్స్‌లో ఫుడ్‌పై అదనపు ట్యాక్స్‌ లేదు.. | no gst on hotel food, says union minister nirmala sitharaman | Sakshi
Sakshi News home page

హోటల్స్‌లో ఫుడ్‌పై అదనపు ట్యాక్స్‌ లేదు..

Published Sun, Jul 2 2017 8:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

హోటల్స్‌లో ఫుడ్‌పై అదనపు ట్యాక్స్‌ లేదు..

హోటల్స్‌లో ఫుడ్‌పై అదనపు ట్యాక్స్‌ లేదు..

- కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌
చెన్నై‌:
హోటళ్లలో ఆహార పదార్థాలకు జీఎస్టీ ద్వారా అదనంగా పన్నులేవీ విధించలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఆదివారం చెన్నైలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. పాత పన్నుకు సమానంగా కొత్త పన్నును విధించామని, అందువల్ల వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.

ఒక్కో వస్తువుకు, సేవలకు ఏమేర పన్ను విధించాలో జీఎస్టీ కౌన్సిల్‌ స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించిందని మంత్రి నిర్మల గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న పన్ను కంటే తక్కువ పన్ను విధింపునకే తాము ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement