అమెరికాలో కుప్పకూలిన విమానం | four killed in crash of air-ambulance flight in northern Nevada | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 20 2016 11:20 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఉత్తర నెవెడాలో ఎయిర్‌ అంబులెన్స్‌ విమానం కూలిపోవడంతో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రోగిని ఉతాహ్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానం కాసినో సమీపంలోని ప్రైవేటు మైనింగ్‌ కంపెనీకి చెందిన పార్కింగ్‌ ప్రదేశంలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రోగితో పాటు విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement